వయసు పైబడడంతో వచ్చే మతిమరపు - Age-related Memory Loss in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 20, 2018

March 06, 2020

వయసు పైబడడంతో వచ్చే మతిమరపు
వయసు పైబడడంతో వచ్చే మతిమరపు

వయసు పైబడడంతో వచ్చే మతిమరపుఅంటే ఏమిటి?

వయసు పైబడిన వ్యక్తిలో నెమ్మదిగా ప్రతిస్పందించే ధోరణికనిపిస్తుంది - వారి కదలికలలో, ప్రతిచర్యలలో, పనుల్లో మరియు మాట్లాడడంలో అది కనిపిస్తుంది. వాటిలో సాధారణంగా కనిపించేది ఏమిటంటే, ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు సమాచారం గుర్తు తెచ్చుకోవడానికి తరచుగా అసమర్థతకి గురవుతారు. సమాచారం కొన్నిసార్లు తరువాత లేదా ఎప్పుడైనా గుర్తుచేసుకోవచ్చు లేదా ఎప్పటికి గుర్తుతెచ్చుకోలేరు. వయస్సు పెరిగే కొద్దీ, శరీరంలోకొన్ని భౌతికపరమైన మార్పులు జరుగుతాయి, వాటిలో ఒకటి మానసిక ప్రక్రియలను తగ్గించడం. తరచుగా కాదు కానీ, దానిని ప్రజలు పొరపాటుగా వయస్సు ఆధారిత మతిమరపు అని పరిగణలోకి తీసుకుంటారు. జ్ఞాపకశక్తి నష్టానికి సంబంధించి వృద్ధులు మనోవికాస ప్రక్రియలు, తేలికపాటి మనోవికాస బలహీనత లేదా చిత్తవైకల్యం (రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసే జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా సామర్థ్యం) ను తగ్గించడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వ్యక్తి యొక్క సమస్య మరియు తీవ్రతను బట్టి గమనించదగ్గ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • సమాచారాన్ని గుర్తుచేసుకోవడంలో అధిక ఆలస్యం లేదా పాక్షిక ఆలస్యం.
  • మాట్లాడేటప్పుడు సాధారణంగా ఉపయోగించే పదాలను మర్చిపోవడం.
  • సాధారణంగా ఉపయోగించే పదాల మధ్య గందరగోళం.
  • అదే అంశాల గురించి తరచుగా చర్చించడం లేదా ఒకే ప్రశ్నలను మళ్ళీ మళ్ళీ అడగడం.
  • సామాన్లను తప్పగా సర్దడం.
  • ఒక వ్యక్తినిమరొక వ్యక్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం.
  • రోజువారీ పనులనుపూర్తి చెయ్యడానికి అధిక సమయం తీసుకోవడం లేదా సూచనలను మళ్ళీ మళ్ళీ అనుసరించడం.
  • సుపరిచిత పరిసరాలను కూడా గుర్తించలేకపోవడం.

ప్రధాన కారణాలు ఏమిటి?

వయస్సు-సంబంధ జ్ఞాపకశక్తి తగ్గుదల యొక్క చాలా కారణాలు పెద్దమెదడు (cerebrum) యొక్క పనితీరు తగ్గిపోవడం వలన మాత్రమే కావచ్చు మరియు అవి ఈ క్రింది వీటిని కలిగి ఉండవచ్చు:

  • హిప్పోకాంపస్ (hippocampus) (భావోద్వేగాలను మరియు దీర్ఘ-కాల జ్ఞాపకాలను నియంత్రించే మెదడులోని ఒక చిన్న అవయవము) యొక్క క్షీణత.
  • హార్మోన్ల మార్పులు.
  • మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడం.

అయితే, కొన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయి, అవి:

  • మద్యపానం.
  • ఏదైనా మెదడు వ్యాధి.
  • విటమిన్ బి12 యొక్క లోపం.
  • థైరాయిడ్ లోపాలు.
  • కుంగుబాటు లేదా ఒత్తిడి వంటి భావోద్వేగ సమస్యలు.
  • తలకు తగిలిన గాయాలు.
  • నిద్ర మాత్రలు, కండరాల సడలింపు, యాంటిడిప్రెసెంట్స్, రక్తపోటు మరియు ఇతరు సమస్యలను నియంత్రించటానికి ఉపయోగించేమందులు, స్థితిభ్రాంతి (disorientation)లేదా గందరగోళానికి కారణమవుతాయి.

ఎలా నిర్ధారించాలిమరియు చికిత్స ఏమిటి?

సమస్యను విశ్లేషించడానికి వైద్యని సంప్రదింపు ముఖ్యం. ఈ వైద్య సంప్రదింపులు వైద్య చరిత్ర, నిద్ర పద్ధతులు, భావోద్వేగస్థితి మరియు కుటుంబ జీవితం తదితర  ప్రశ్నలను కలుపుకొని ఉంటాయి. మర్చిపోయే విషయాలు , జ్ఞాపకశక్తి తగ్గుదల యొక్క ప్రారంభ సమయం మరియు మరుపు యొక్క స్వభావం గురించి వివరాలు అడగబడతాయి. కొన్ని సందర్భాల్లో, నాడీమండల వైద్యుని (neuropsychologist) యొక్క అభిప్రాయం కూడా కోరవచ్చు.

ఈ పరిస్థితి, ఇది చాలా సందర్భాలలో చికిత్స చేయబడదు లేదా తిరగబడదు. ఉత్తమమైన సంరక్షణను కనుగొనడానికి ఈ పరిస్థితిని మరియు వ్యక్తినీ సమర్దవంతంగా నిర్వహించడం కీలకం.

చాలామంది వృద్ధులు వారి మానసిక అసమానతలను అర్ధం చేసుకుంటారు, మరియు వారికి ఇది చాలా ఒత్తిడితో కూడిన మరియు ఇబ్బందికరమైన అనుభవంగా ఉంటుంది, ప్రత్యేకంగా జీవితాలను సక్రమంగా నెరవేర్చిన వారికి. ఏదైనా పనిచేయడానికి ఇతరుల పై ఆధారపడటం మరియు స్వతంత్రంగా పనిచేయడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యక్తుల అవసరం ఏమిటి:

  • కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ.
  • నిరంతర సంరక్షణ కోసం ఒక ప్రణాళిక.
  • ఏదైనా ఆరోగ్య పరిస్థితులు లేదా ఇతర సమస్యలకు చికిత్స.
  • అందరితో కలిసేందుకు అవకాశం.
  • సమతుల్య ఆహార విధానం మరియు తగినంత నిద్ర.
  • సాధారణ మెదడు-ఉత్తేజపరిచే చర్యలు, అవి లక్షణాల యొక్క తీవ్రతను నివారించడానికి ఉపయోగపడతాయి, అవి:
    • పజిల్స్ మరియు క్రాస్వర్డ్లు.
    • పత్రికలు చదవడం.
    • మానసికంగా సవాలు చేసే కార్యకలాపాలు చేపట్టడం.



వనరులు

  1. National institute of aging. [internet]: US Department of Health and Human Services; Do Memory Problems Always Mean Alzheimer's Disease?
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Memory loss
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Alzheimer's Disease
  4. Clinical Trials. Treatment for Early Memory Loss. U.S. National Library of Medicine. Treatment for Early Memory Loss.
  5. Clinical Trials. Treatment for Early Memory Loss. U.S. National Library of Medicine. Treatment for Early Memory Loss.

వయసు పైబడడంతో వచ్చే మతిమరపు కొరకు మందులు

Medicines listed below are available for వయసు పైబడడంతో వచ్చే మతిమరపు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.