అరిథ్మియా - Arrhythmia in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 27, 2018

March 06, 2020

అరిథ్మియా
అరిథ్మియా

అరిథ్మియా అంటే ఏమిటి?

అరిథ్మియా ఒక గుండె సమస్యను సూచిస్తుంది, ఇది క్రమము తప్పిన గుండె స్పందన లక్షణాలను కలిగి ఉంటుంది. పెద్దలలో, సాధారణ హృదయ స్పందన నిమిషానికి 60 నుండి 100 స్పందనల (beats) మధ్య ఉంటుంది. అరిథ్మియాలో, గుండె స్పందన అనేది సాధారణ రేటు కంటే వేగంగా లేదా నెమ్మదిగా లేదా క్రమరహితమైన స్పందనలతో ఉంటుంది. వివిధ రకాల అరిథ్మియాలు ఉంటాయి, వాటిలో చాలా సాధారణమైనది ఏట్రియాల్ ఫైబ్రిల్లషన్ (atrial fibrillation), దానిలో హృదయ స్పందన అనేది సాధారణం కన్నా క్రమరహితముగా మరియు వేగంగా ఉంటుంది.

హృదయ స్పందన సాధారణ కన్నా వేగంగా ఉంటే, దానిని టాచీకార్డియా (tachycardia) (> 100 నిమిషానికి కొట్టుకోవడం) అంటారు. హృదయ స్పందన సాధారణ రేటు కంటే నెమ్మదిగా ఉంటే, ఇది బ్రాడీకార్డియా (bradycardia) (<60 బీట్స్ నిమిషానికి) అని పిలుస్తారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వివిధ రకాల అరిథ్మియా యొక్క లక్షణాలు ఇంచుమించు ఒకే పోలికగా ఉండవచ్చు.

టారికార్డియా విషయంలో అరిథ్మియా లక్షణాలు:

బ్రాడీకార్డియా విషయంలో అరిథ్మియా లక్షణాలు:

  • గందరగోళం
  • దడ
  • చెమటలు
  • అలసట
  • వ్యాయామం లో కష్టం
  • శ్వాస ఆడకపోవుట

అరిథ్మియా యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

హృదయ కణజాలంలో అసాధారణ మార్పుల వల్ల అరిథ్మియా ఏర్పడవచ్చు. ఇది సాధారణంగా ఆకస్మికంగా సంభవించవచ్చులేదా కొంతమందిలో కారణం కూడా తెలియదు. అరిథ్మియా ఈ క్రింది వాటి వలన కలుగవచ్చు:

  • హృదయ కణజాలంలో అసాధారణ మార్పులు, గుండెకు రక్తా సరఫరాను తగ్గించడం, గుండె కణజాలం బిరుసుగా లేదా గాయాలు కావడం వంటివి.
  • ఒత్తిడి మరియు భావోద్వేగ ఒత్తిడి, రక్తపోటు పెంచుతుంది మరియు ఒత్తిడి హార్మోన్లు విడుదల చేసి అరిథ్మియాకు దారితీస్తాయి.
  • రక్తప్రవాహంలో ఎలెక్ట్రోలైట్స్, హార్మోన్లు లేదా ద్రవాల యొక్క అసమతుల్యత, గుండె స్పందన పై ప్రభావం చూపుతుంది.
  • హైపర్టెన్షన్ మందులు వంటి కొన్ని ఔషధాలను తీసుకోవడం వల్ల అరిథ్మియా ఏర్పడుతుంది.

వృద్ధాప్యం, కుటుంబ చరిత్ర మరియు జన్యుపరమైన విషయాలు వంటి కారకాలు అరిథ్మియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?

అరిథ్మియా వ్యాధి నిర్ధారణకు, వైద్యులు రోగి యొక్క కుటుంబ చరిత్ర, రోజువారీ శారీరక శ్రమ మరియు ఇతర కారకాల గురించి విచారణ చేస్తారు.

దాని తరువాత, భౌతిక పరీక్ష ఉంటుంది, దీనిలో వైద్యులు నాడి, హృదయ స్పందనను మరియు ఇతర వ్యాధుల సంకేతాలను చూసి అంచనా వేస్తారు.

ఇతర విశ్లేషణ పరీక్షల్లో ఇవి ఉంటాయి:

  • రక్త పరీక్షలు - ఎలెక్ట్రోలైట్స్, లిపిడ్లు, హార్మోన్ల స్థాయిలు అంచనా వేయడం కోసం.
  • ఎలెక్ట్రొకార్డియోగ్రామ్ (Electrocardiogram or ECG) - హృదయ స్పందన, దాని రేటు, లయ, మొదలైన వాటిని అంచనా వేయడానికి
  • ఎఖోకార్డియోగ్రఫీ (Echocardiography) (గుండె యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్)
  • శరీరంలో వివిధ ప్రాంతాల్లో అల్ట్రాసౌండ్ - ఇతర వ్యాధులు మినహాయించడానికి

అరిథ్మియా చికిత్సలో మంచి ఆరోగ్య పరిస్థితిని నిర్వహించడానికి జీవనశైలి మార్పులను కలిగి ఉంటుంది. హృదయ స్పందన రేటును స్థిరపర్చడానికి బీటా బ్లాకర్స్ (beta blockers) లేదా అడెనోసిన్స్ (adenosines) వంటి మందులు మరియు ఇతర రకాలైన రక్తాన్ని పల్చబరచే మందులను కూడా డాక్టర్ సూచించవచ్చు. తీవ్రమైన సందర్భాలలో, పేస్ మేకర్స్ (pacemakers) మరియు ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీఫిబ్రిలేటర్స్ (implantable cardioverter defibrillators) వంటి పరికరాలను హృదయ స్పందన నియంత్రించడానికి వాడవచ్చు.



వనరులు

  1. merican Heart Association, American Stroke Association [internet]: Texas, USA AHA: Common Tests for Arrhythmia
  2. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Arrhythmia
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Arrhythmia
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Arrhythmias
  5. Health On The Net. Heart arrhythmias. Australia; [internet]

అరిథ్మియా కొరకు మందులు

Medicines listed below are available for అరిథ్మియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.