బోన్ మెటాస్టాసిస్ - Bone Metastasis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 28, 2018

July 31, 2020

బోన్ మెటాస్టాసిస్
బోన్ మెటాస్టాసిస్

బోన్ మెటాస్టాసిస్ అంటే ఏమిటి?

ఎముక రోగకణ (బోన్ మెటాస్టాసిస్) వ్యాప్తి అంటే శరీరంలోని ఏ అవయవానికి రోగకారక కణితి (tumour) సోకిందో, ఆ గడ్డలోని రోగకాణాలు శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని ఎముకలకు వ్యాప్తి చెందడం. సాధారణంగా, రొమ్ము క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ ఎముకలకు విస్తరించే అవకాశం ఉంది. ఎముక రోగకణ వ్యాప్తి వ్యాధి బారిన పడే అత్యంత సాధారణమైన శరీర అవయవాలు వెన్నెముక, తొడ ఎముక మరియు కటి ఎముకలు. ఊపిరితిత్తులకు వ్యాధి కణాలు సోకినప్పుడు ఏవిధంగా వెంటనే తెలియకుండా వ్యాధి ముదిరిన తర్వాతనే  బయటపడుతుందో అలాగే ఎముకలకు ఈ రోగకారక గడ్డ కణాలు సోకినప్పుడు వెంటనే తెలియక ఆలస్యంగా “ముదిరిపోయిన వ్యాధి”గా పొడజూపుతుంది, మరి ఈ స్థితిలో ఈ వ్యాధి నయం కాదు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కొన్నిసార్లు, ఎముక రోగకణ వ్యాప్తి వ్యాధి ఎలాంటి సంకేతాలు లేదా వ్యాధి లక్షణాలను ఉత్పత్తి చేయదు. ఏవైనా లక్షణాలు పొడజూపినపుడు అవి సాధారణంగా వ్యాధి సోకిన ఎముకకు సంబంధించినవే అయ్యుంటాయి.

ఏమైనప్పటికీ, ఈ వ్యాధి శరీరంలోని ఏ ఎముకకి సోకినా, ఎముక రోగ కణ వ్యాధి యొక్క కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలేవంటే:

  1. ఎముక నొప్పి
  2. వ్యాధి సోకిన ఎముకలో విరుపు (ఫ్రాక్చర్)
  3. మల, మూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం (అంటే ఆపుకోలేక పోవడం)
  4. కాళ్ళు లేదా చేతుల్లో బలహీనత లేదా నొప్పి
  5. హైపర్కాల్సేమియా (ఎముకలు విరగడంవల్ల రక్తంలో కాల్షియం స్థాయి పెరగడం) ఇది కింది లక్షణాలను కలిగిస్తుంది

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

క్యాన్సర్ కణాలు రక్తంలోనికి లేదా శోషరసాలలోకి ప్రవేశించినపుడు అవి సుదూర అవయవాలకు వెళ్లి వాటిని బాధిస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు ఎముకలో ప్రవేశించి, ఎముక లోపల విపరీతంగా వృద్ధి చెందడం, మరింతగా వ్యాప్తి చెందడం ప్రారంభించవచ్చు. ఈ ప్రక్రియలో, ఈ కాన్సర్ కణాలు పరాన్నజీవులుగా మార్పు చెందుతాయి, అటుపై అవి ఎముకలోని పోషకాలను తినేయడం ప్రారంభించడం, దానివల్ల ఎముక పెళుసుబారడం జరుగుతుంది.

ఎముకలకు వ్యాప్తి చెందే అతి సాధారణ క్యాన్సర్లు ఇవీ:

ఈ వ్యాధి నిర్ధారణను ఎలా చేస్తారు, దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడిచే జరుపబడే సంపూర్ణమైన వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్ష ఈ ఎముక రోగకణ వ్యాధి సోకిన ఎముకను గుర్తించేందుకు వీలవుతుంది. ఎముక రోగకణ వ్యాప్తి వ్యాధి విషయంలో, రక్త పరీక్షలు అరుదుగా ఉపయోగించబడతాయి; ఇమేజింగ్ పద్ధతులు తుది రోగ నిర్ధారణలో సహాయపడతాయి. ఈ ఇమేజింగ్ పద్ధతులు ఏవంటే:

  • ఎక్స్-రే  (X-రే)
  • ఎముక స్కాన్
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
  • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI) స్కాన్
  • పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్

చికిత్స యొక్క లక్ష్యం నొప్పిని తగ్గించడం, ఎముక విరుగుళ్లను నివారించడం మరియు ఇతర ఎముకలకు మరింతగా విస్తరించడాన్ని నివారించడం.

ఎముక రోగకణ వ్యాధి కోసం ఉపయోగించే చికిత్సా పద్ధతులు:

  • కెమోథెరపీ ఎజెంట్లు - క్యాన్సర్ కణాలను కుంచింపజేయడానికి మందులు వాడతారు
  • హార్మోన్ చికిత్స - ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రించడానికి ఉపయోగించే ఆండ్రోజెన్ క్షీణత చికిత్స వంటి ప్రాధమిక కణితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది పారాథైరాయిడ్ హార్మోన్ వంటి హార్మోన్ల వినియోగాన్ని కలిగి ఉంటుంది, ఇది విరిగిన ఎముకల మరమత్తులో సహాయపడుతుంది
  • లక్ష్య చికిత్స
  • ఇమ్యునోథెరపీ- ఈ పద్ధతి క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడే ఇమ్యునోగ్లోబులిన్స్ అనబడే రోగనిరోధక వ్యవస్థ కణాలను ఉపయోగిస్తుంది.
  • బిస్ఫాస్ఫోనేట్స్ మందులు - ఈ మందులు ఎముక నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి, రక్త- కాల్షియం స్థాయిలను తగ్గించడం, ఎముకల విరుపులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం మరియు ఎముకలకు జరిగే నష్టాన్ని మందగింపజేసి ఆ ఎముక నష్టం నెమ్మదిగా జరిగేట్టు సాయపడుతుంది.
  • రేడియోధార్మిక చికిత్స - వ్యాధి సోకిన ఎముకలలోని క్యాన్సర్ కణాలను స్ట్రోంటియం -89 మరియు రేడియం -223 వంటి రేడియోఐసోటోప్లతో క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడుతుంది.



వనరులు

  1. American Cancer Society. Signs and symptoms of bone metastasis. [Internet]
  2. American Cancer Society. Treating Bone Metastases. [Internet]
  3. Julia Draznin Maltzman. Bone Metastasis Treatment with Medications. October 15, 2018; [Internet]
  4. Filipa Macedo et al. Bone Metastases: An Overview. Oncol Rev. 2017 Mar 3; 11(1): 321. PMID: 28584570
  5. Stuart Ralston, Ian Penman, Mark Strachan, Richard Hobson. Davidson's Principles and Practice of Medicine E-Book. 23rd Edition: Elsevier; 23rd April 2018. Page Count: 1440

బోన్ మెటాస్టాసిస్ కొరకు మందులు

Medicines listed below are available for బోన్ మెటాస్టాసిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹79.0

₹71.5

Showing 1 to 0 of 2 entries