ఎముక చీలిక - Bone Spur in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

November 28, 2018

March 06, 2020

ఎముక చీలిక
ఎముక చీలిక

ఎముక చీలిక అంటే ఏమిటి?

ఎముక చీలిక అనేది ఎముక అంచులు, ఎముకలు ఒకదానితో ఒకటి కలిసే కీళ్ళలో పెరుగుతున్న ఒక చిన్న ఎముక (అస్థి). ఇలా ఎముక చీలికలు (చిన్న ఎముకలు) (bone spur)  వెన్నెముకలో కూడా పెరగవచ్చు. ఇలాంటి చిన్న ఎముకల పెరుగుదల వెన్నెముక లేదా ఈ వ్యాధికి గురైన కీలు (joint) పై ఒత్తిడిని పెంచుతుంది, తద్వారా ఇబ్బంది, నొప్పి కల్గుతుంది.

సాధారణంగా, మృదులాస్థి లేదా స్నాయువులకు (cartilage or tendons) సమీపంలో వాపు లేదా గాయం యొక్క ప్రాంతంలో చిన్న ఎముక (ఎముక స్పర్స్)లు అభివృద్ధి చెందుతాయి. ఎముక చీలిక (ఎముక స్పర్)ల అభివృద్ధికి శరీరంలోని సాధారణ ప్రదేశాలు:

  • కాలి మడమ ఎముక- కాలిపాదంలోని ఈ ప్రదేశాన్ని “మడమ స్పర్” అని కూడా పిలుస్తారు. కాలి మడమ ఎముక పై పెరిగే ఎముక చీలిక సాధారణంగా బాధాకరంగా ఉంటుంది
  • చేతులు- చేతి వేళ్ళ కదలికలకు ఇబ్బంది లేదా నష్టం కల్గిస్తూ వేళ్ళ కీళ్ళలో ఎముక చీలికలు (బోన్ స్పర్స్) పెరగొచ్చు.
  • భుజం- భుజంలో పెరిగే చీలిక ఎముక (bone spur) స్నాయువులు మరియు భుజముయొక్క తిరిగే ఎముక కండరాలను తాకినప్పుడు రాపిడి ఏర్పడి అక్కడి స్నాయువులు మరియు కండర బంధనాల వాపుకు దారి తీస్తుంది. తద్వారా భుజం యొక్క కదలికలు పరిమితమారిపోయి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది.
  • వెన్నెముక - వెన్నెముక కుంచించుకుపోవడం (narrowing o fspine) అనేది ఎముక చీలిక (bone spur) కారణంగానే దాపురిస్తుంది. వెన్నెముకలోని ఎముక చీలిక నరాల యొక్క సమాఘాతాని (impingement) కి దారి తీసి, ఆ కారణంగా కాళ్ళు నొప్పి, తిమ్మిరి మరియు కాళ్ళ బలహీనతకు దారితీస్తుంది.
  • తుంటి మరియు మోకాలు - ఈ ప్రదేశాల్లో ఏర్పడే ఎముక చీలిక (బోన్ స్పర్) చలన పరిధిని కుంఠితం చేసి ఈ ప్రాంతాల్లో నొప్పికి కారణం కావచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు వ్యాధి లక్షణాలు ఏమిటి?

కొన్నిసార్లు, ఎముక చీలిక ఎలాంటి వ్యాధి లక్షణాలతోను సంబంధం కలిగి ఉండకపోవచ్చు. కానీ, వ్యాధి లక్షణాలు పొడజూపినపుడు, ఆ లక్షణాలు అవి ఏర్పడే స్థానంపై ఆధారపడి ఉంటాయి. ఎముక చీలికల దగ్గరి కణజాలం, స్నాయువులు, నరములు లేదా చర్మం యొక్క మంట కారణంగా ఎముక చీలిక-బాధిత ప్రాంతంలో నొప్పి, తిమ్మిరి మరియు సున్నితత్వాన్ని కలిగిస్తుంది.

మడమ లో ఎముక చీలిక (ఎముక స్పర్స్) కారణంగా సున్నితత్వం మరియు వాపుతో పాటు, నడిచేటప్పుడు ఇబ్బంది కలిగించవచ్చు. ఎముక చీలిక మడమ దిగువన ఉంటే, కొన్నిసార్లు, మొత్తం మడిమ అంతా మంట కలగొచ్చు.

వెన్నెముకలోని ఎముక చీలీక నరాల యొక్క రాపిడికి (impingement) కారణం కావచ్చు, తద్వారా ఈ వెన్నెముక భాగంలో రక్తం సరఫరా చేసే నరం భాగంలో తిమ్మిరి, జలదరించటం, మరియు నొప్పి కల్గుతుంది. .

ఓ ఎముక చీలిక (bone spur) మౌనంగా ఉండి ఎలాంటి వ్యాధి లక్షణాలకు కారణం కాకపోయినపుడు, ఇతర కారణాలకు గాను తీయబడిన ఎక్స్ - రే (X- రే) పరీక్షల్లో ఈ ఎముక చీలిక చూపబడుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎముక చీలికలు (bone spurs) సాధారణంగా వాపు మరియు ఒత్తిడి కల్గించే ప్రదేశాలలో ఏర్పడతాయి.

ఎముకల/కీళ్ళ వాపు (ఆస్టియో ఆర్థరైటిస్), అనేది ఒక సాధారణ క్షీణతతో కూడిన కీళ్ల వ్యాధి. ఓ ఎముక చీలికే ఏర్పడటానికి అత్యంత సాధారణ కారణం ఈ కీళ్ళబాధ వ్యాధే.  ఇది వృద్ధులలో ఒక సాధారణ పరిస్థితి. మన వయస్సు పైబడడంతో శరీరంలోని ఉపాస్థి, మృదులాస్థి అరుగుదల-చిరుగుదలలకు గురవుతాయి. ఇది ఎముక ద్రవ్యరాశిని తగ్గిస్తుంది. ఈ నష్టాన్ని మరమ్మతు (రిపేర్) చేయడానికి,శరీరం ఎముక చీలికను (bone spur) అభివృద్ధి చేస్తుంది.

ఈ వ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

పరీక్ష సమయంలో, మీ డాక్టర్ నొప్పి యొక్క ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించడం కోసం  కీలు (joint area) సమీపంలో తాకి కానీ, నొక్కి కానీ చూడొచ్చు. డాక్టర్ అప్పుడు నొప్పి కల్గిన ఆ ప్రదేశం యొక్క X- రే ని తీసుకురమ్మని మిమ్మల్ని అడగొచ్చు. అవసరమైతే MRI స్కాన్, CT స్కాన్ మరియు మైలోయోగ్రమ్ వంటి ఇతర ఇమేజింగ్ పరీక్షల్ని కూడా డాక్టర్ నిర్వహిస్తారు.

రోగనిర్ధారణ చేస్తూ, నొప్పి మరియు వాపును నియంత్రించడానికి డాక్టర్ కొన్ని (ఓవర్ ది కౌంటర్) ఔషధాలను సూచించవచ్చు. ఈ నొప్పి కల్గిన ప్రాంతంలో (స్థానిక) చల్లదనాన్ని అద్దడం (కాపడం) ద్వారా నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించొచ్చు.  

మడమ చీలిక (heel spur) కోసం షూ ఇన్సర్ట్లు ప్రారంభంలో సూచించబడతాయి; ఇంకా నిరంతరం నొప్పి కొనసాగుతుంటే శస్త్రచికిత్స నుంచి ఉపశమనం పొందవచ్చు.

మీరు విశ్రాంతి తీసుకోవాలని సూచించబడవచ్చు. ఇంకా, భౌతిక చికిత్స, మరియు కార్యాచరణ మార్పు చేసుకోమని సూచింపబడవచ్చు. ఎముక చీలిక నరములగుండా తీవ్ర ఒత్తిడిని కల్గిస్తూ పెరుగుతున్నట్లైన శస్త్ర చికిత్స చేయించుకొమ్మని (డాక్టర్ చే) మీకు సూచించబడవచ్చు.

(మరింత సమాచారం: ఎముక నొప్పి కారణాలు)



వనరులు

  1. Oregon Health & Science University [Internet].Oregon; Foot and Ankle Video Resources.
  2. Oregon Health & Science University [Internet]. Oregon; Hand and Upper Extremity Video Resources.
  3. G. L. Gallucci et al. Extensor Tendons Rupture after Volar Plating of Distal Radius Fracture Related to a Dorsal Radial Metaphyseal Bone Spur. Published online 2018 Feb 28. PMID: 29682379
  4. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Plantar Fasciitis and Bone Spurs.
  5. National Institute of Arthritis and Musculoskeletal and Skin Diseases; [Internet]. U.S. National Library of Medicine. Osteoarthritis