దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా - Chronic Myelogenous Leukemia (CML) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

March 06, 2020

దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా
దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా

దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా అంటే ఏమిటి?

దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా (CML), లేక “దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా” అనేది రక్త కణాలు మరియు ఎముక మజ్జతో కూడుకున్న ఓ రకం క్యాన్సర్. ఎముక మజ్జ అనేది ఎముకల్లో మృదువైన భాగం, ఈ భాగంలోనే రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా అనేది ల్యుకేమియా రకాల్లో ఒక రకం. దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా వ్యాధిలో తెల్ల రక్త కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతుంటాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

  • దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియాతో ఉండే రోగులు వ్యాధి యొక్క దీర్ఘకాలిక దశలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
  • తదుపరి దశలో “వేగవంతమైన దశ” అని పిలిచే దశలో, రాత్రి చెమటలు, అలసట, బరువు నష్టం మరియు నిరంతర జ్వరం సాధారణ లక్షణాలుగా ఉంటాయి.
  • బ్లాస్టిక్ (త్రిస్తరజనిత) దశలో రోగి తీవ్రమైన రోగాలక్షణాల్ని కల్గివుంటాడు. నొప్పి, అంటువ్యాధులు మరియు నిరంతర రక్తస్రావం రోగి ఈ దశలో కలిగి ఉండడం జరుగుతుంది.
  • తెల్ల రక్త కణాల సంఖ్య మరియు నిర్మాణంలో అసాధారణత కారణంగా, ప్లీహాన్ని కూడా ఇది బాధిస్తుంది. ప్లీహము యొక్క విస్తరణ వలన ఒక వ్యక్తి ఎగువ ఉదరంలో నొప్పి ఉందని వైద్యుడికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంటుంది.

దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియాకు ప్రధాన కారణాలు ఏమిటి?

  • దురదృష్టవశాత్తూ, CML యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా గుర్తించబడలేదు.
  • రేడియేషన్కు అధికంగా బహిర్గతమవడం అనేది ఓ ప్రమాద కారకం.
  • ఈ క్యాన్సర్ “క్రోమోజోమ్ 22” యొక్క లోపంతో సంబంధం కలిగి ఉంటుంది, ఈ లోపం దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియాతో బాధపడుతున్న అధిక సంఖ్యాకుల్లో సాధారణంగా కనిపింస్తుంది. ఈ క్రోమోజోమ్ను “ఫిలడెల్ఫియా క్రోమోజోమ్” అని పిలుస్తారు.
  • దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా మధ్య వయస్కులలో సర్వసాధారణం, మరియు మహిళల కంటే ఎక్కువగా పురుషులనే ఇది బాధిస్తుంది.

దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియాను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

  • మీ వైద్యుడు చేసే ఒక ప్రాథమిక భౌతిక పరీక్ష ద్వారా మీ రక్తపోటు, గుండె స్పందన రేటు మరియు నాడి స్పందన రేటు వంటి ముఖ్యమైన పరిమితుల్ని తెలుసుకుంటారు. ప్లీహములో గాని లేదా శోషరసగ్రంథుల్లో ఏదైనా వాపు ఉంటె దాన్ని తనిఖీ చేయడం జరుగుతుంది.
  • రక్త కణాల సంఖ్య మరియు ఆ కణాల రూపంలో ఏదేని అసమానత్వం ఉంటె రక్త పరీక్ష ద్వారా వెల్లడవుతుంది.
  • “పాలిమరెస్ చైన్ రియాక్షన్ టెస్ట్” వంటి ప్రత్యేక పరీక్షల ద్వారా ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ కోసం తనిఖీ చేస్తారు.
  • ఎముక మజ్జ యొక్క జీవాణుపరీక్ష ప్రాణాపాయ స్థితి ఉందేమోనని తనిఖీ చేసేందుకు చేసే ఓ నిర్ధారణ పరీక్ష.
  • లోపభూయిష్ట జన్యువును కలిగి ఉన్న అన్ని కణాలను తొలగించడం కష్టం, కానీ చికిత్స ఈ కణాలను నాశనం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటుంది.
  • కెమోథెరపీ తో పాటు, దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా రోగులకోసమనే కొన్ని నిర్దిష్ట మందులు (targeted drugs for CML) ఉన్నాయి. ఒక నిర్ధిష్ట ముందును సేవించినపుడు రోగి ఏదైనా నిరోధకతను ఎదుర్కొంటే, మరొక ఔషధం సూచించబడుతుంది.
  • ఎముక మజ్జ మార్పిడి చికిత్స అనేది రోగి పూర్తి నివారణకు లభ్యతలో ఉన్న అతి దగ్గరి అవకాశం. దాత కణాలు ఎముక మజ్జలో కొత్త ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటును ప్రేరేపిస్తాయి.
  • మెరుగైన చికిత్సా విధానాలకు, ప్రత్యేకించి నిరోధకత కల్గిన దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా చికిత్స కోసం, పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, ఈ పరిస్థితికి లభ్యమవుతున్న రోగ నిరూపణ పేలవంగానే కొనసాగుతోంది.



వనరులు

  1. Saubele S, Silver RT. Management of chronic myeloid leukemia in blast crisis. Ann Hematol. 2015 Apr;94 Suppl 2:S159-65. PMID: 25814082
  2. Kaleem B, Shahab S, Ahmed N, Shamsi TS. Chronic Myeloid Leukemia--Prognostic Value of Mutations. Asian Pac J Cancer Prev. 2015;16(17):7415-23. PMID: 26625737
  3. Blood. Chronic myeloid leukemia (CML) with P190BCR-ABL: analysis of characteristics, outcomes, and prognostic significance. American Society of Hematology; Washington, DC; USA. [internet].
  4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Chronic Myelogenous Leukemia Treatment (PDQ®)–Health Professional Version
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Chronic Myeloid Leukemia

దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా కొరకు మందులు

Medicines listed below are available for దీర్ఘకాలిక మైలోజనస్ లుకేమియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.