గౌట్ - Gout in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 01, 2018

March 06, 2020

గౌట్
గౌట్

గౌట్ (కీళ్ళవాతము) అంటే ఏమిటి?
రక్తంలో అధిక స్థాయి యూరిక్ యాసిడ్ ఉన్న వ్యక్తుల్లో వాపుతో కూడిన అర్థిరైటిస్ ఉంటుంది , దీన్నే “కీళ్ళవాతం”గా పిలువడం జరుగుతుంది. ఇది తీవ్రమైన కీళ్ల నొప్పి మళ్ళీ మళ్ళీ రావడం, వాపు, మరియు కీళ్లు ఎరుపుదేలడం వంటి వ్యాధి లక్షణాలను కల్గి ఉంటుంది. కీళ్లవాపు ఆకస్మికంగా రాత్రిపూట దాపురించవచ్చు. కీళ్లలో యూరిక్ యాసిడ్ నిక్షేపాల కారణంగా సూది వంటి స్ఫటికాలు ఏర్పడతాయి, ఈ స్పటికాలు కారణంగానే కీళ్లలో ఆకస్మికంగా వాపు నొప్పి ఏర్పడుతుంది.

దీని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కీళ్లవాపు వ్యాధి సాధారణంగా పాదంలోని బొటనవేలుకీళ్లను బాధిస్తుంది. కీళ్ళవాతానికి సంబంధించిన కొన్ని సాధారణ చిహ్నాలు మరియు వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి:

  • కీళ్లలో పెడసరం (బిర్రు)తో పాటు తీవ్రమైన నొప్పి (ముఖ్యంగా మోకాలి, కాలి, మోచేయి, మరియు వేళ్లకు సంబంధించినకీళ్లలో) ఆకస్మికంగా దాడి చేస్తుంది.
  • వ్యాధిబాధిత భాగంలో వాపు మరియు ఎరుపుదేలడం, ఆ భాగంలో చర్మం వేడెక్కడం జరుగుతుంది.
  • చలితో కూడిన జ్వరం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గౌట్ ప్రధానంగా కలుగుతుంది:

  • మీ రక్తప్రసరణలో యూరిక్ యాసిడ్ జమవడం మరియు కీళ్లలో మూత్రం స్ఫటికాలు ఏర్పడతాయి
  • జన్యు మరియు పర్యావరణ కారకాల కలయిక
  • ప్యూరిన్ పదార్ధం ఎక్కువగుండే కొన్నిఆహారాలు
  • ఊబకాయం
  • అధిక మద్యపానం
  • సూడోగౌట్ (లేదా తీవ్రమైన కాల్షియం పైరోఫాస్ఫేట్తో కూడిన కీళ్లనొప్పి)

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు వ్యాధిలక్షణాల యొక్క వివరణాత్మక చరిత్రను రోగి నుండి అడిగి తెలుసుకుంటాడు మరియు భౌతిక పరీక్షను నిర్వహిస్తారు. రోగ నిర్ధారణకు సహాయపడటానికి కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తారు: ఆపరీక్షలేవంటే:

  • సీరం యూరిక్ యాసిడ్ స్థాయిలను నిర్ణయించడానికి రక్త పరీక్ష
  • ఎక్స్-రే
  • అల్ట్రాసౌండ్ స్కాన్: కీళ్ళ మధ్య ద్రవంలో తొలి క్రిస్టల్ నిర్మాణాన్ని గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్
  • మృదు కణజాలం మరియు ఎముకను పరిశీలించడానికి కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) లేదా మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) పరీక్ష.

కింది చర్యల ద్వారా కీళ్లవాతానికి చికిత్స చేయవచ్చు

  • తీవ్రంగా చెలరేగే కీళ్లమంట వలన కలిగే నొప్పి నిర్వహణ
    • శోథ నిరోధక నాన్-స్టీరాయ్ద్ (nonsteroidal medicines) మందుల్ని తీవ్రంగా చెలరేగి నొప్పించే కీళ్ళమంట/కీళ్ళనొప్పుల చికిత్సకు ఉపయోగిస్తారు, ఇబుప్రోఫెన్, స్టెరాయిడ్లు, మరియు శోథ నిరోధక ఔషధమైన కొల్చిసిన్  (colchicine)
  • భవిష్యత్ లో వచ్చే కీళ్ల మంటలను నివారించడంలో కింది చర్యలుపకరిస్తాయి
    • ఆహారం మరియు జీవనశైలిని మార్చడం
    • అదనపు బరువును తగ్గించుకోవడం
    • మద్యపానాన్ని మానుకోవడం
    • ప్యూరిన్-ఎక్కువగా ఉండే (ఎర్ర మాంసం లేదా అవయవ మాంసం) ఆహారాల్ని తినడం మానుకోవడం
    • హైపర్యురిసెమియాకు (రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువవడం)  సంబంధించిన ఔషధాలను మార్చడం లేదా ఆపడం (ఉదాహరణకు, మూత్రకారకాలైన మందులు)
  • యూరిక్ యాసిడ్ ను తగ్గించే ఏజెంట్ల ఉపయోగం
    • Allopurinol -అల్లోప్యూరినోల్
    • Febuxostat -ఫెబుక్సోస్టాట్
    • Pegloticase -పెగ్లోటికేస్  
  • స్వీయ నిర్వహణ విధానాలు 
    • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
    • తగినంత శారీరక శ్రమ చేయండి  



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Gout
  2. tional Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Gout
  3. Dinesh Khanna. et al. 2012 American College of Rheumatology Guidelines for Management of Gout Part I: Systematic Non-pharmacologic and Pharmacologic Therapeutic Approaches to Hyperuricemia. Arthritis Care Res (Hoboken). 2012 Oct; 64(10): 1431–1446. PMID: 23024028
  4. Newberry SJ. Diagnosis of Gout: A Systematic Review in Support of an American College of Physicians Clinical Practice Guideline.. Ann Intern Med. 2017 Jan 3;166(1):27-36. PMID: 27802505
  5. National Health Service [Internet] NHS inform; Scottish Government; Gout

గౌట్ కొరకు మందులు

Medicines listed below are available for గౌట్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.