హైపర్ థైరాయిడిజం - Hyperthyroidism in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

January 03, 2019

July 31, 2020

హైపర్ థైరాయిడిజం
హైపర్ థైరాయిడిజం

హైపర్ థైరాయిడిజం అంటే ఏమిటి?

థైరాయిడ్ మన మెడ యొక్క ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారపు గ్రంధి. దీని పని ఏమంటే జీవక్రియ, శక్తి ఉత్పత్తి మరియు మానసిక నియంత్రణకు కారణమయ్యే హార్మోన్లను ఉత్పత్తి చేయడమే. థైరాయిడ్ గ్రంథికి దాపురించే రుగ్మతలు శరీరంలోని బహుళ వ్యవస్థల యొక్క జీవక్రియకు భంగం కలిగిస్తాయి. థైరాయిడ్ గ్రంధి పనికి సంబంధించిన ప్రధాన సమస్యలేవంటే థైరాయిడ్ హార్మోన్లను అతి ఎక్కువగానే లేదా అతి తక్కువగా ఉత్పత్తి చేయడం. ఈ థైరాయిడ్ క్రియాలోప రుగ్మత పురుషులు కంటే మహిళల్లోనే చాలా సాధారణం.

హైపర్ థైరాయిడ్ వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అతి చురుకైన థైరాయిడ్ గ్రంథి అధిక థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది, ఇలాంటి పరిస్థితిని “హైపర్ థైరాయిడిజం”గా సూచించబడుతుంది. అతి చురుకైన థైరాయిడ్ సమస్య యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

ప్రధాన కారణాలు ఏమిటి?

హైపర్ థైరాయిడిజం యొక్క ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • గ్రేవ్స్ వ్యాధి.
  • థైరాయిడ్ గ్రంధిపై నూడిల్స్ (వేరు బుడిపెలు).
  • పెరిగిన అయోడిన్ గ్రాహ్యం.
  • పిట్యూటరీ గ్రంథి యొక్క క్యాన్సర్ కాని కణితులు.
  • వైరల్ సంక్రమణ వలన థైరాయిడ్ గ్రంధి యొక్క వాపు .
  • థైరాయిడ్ క్యాన్సర్.

థైరాయిడ్ ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఎలాంటి రకమైన థైరాయిడ్ సమస్యనయినా నిర్ధారణ చేసేందుకు క్రింది పరీక్షా విధానాలను ఉపయోగిస్తారు:

  • మెడ భౌతిక పరీక్ష.
  • రక్త పరిశోధనలు: థైరాయిడ్ ప్రేరేపణా (స్టిమ్యులేటింగ్) హార్మోన్ (TSH) యొక్క, T3 మరియు T4 స్థాయిలు తనిఖీ చేయడానికి.
  • అయోడిన్ గ్రాహ్య పరీక్షలు.
  • గ్రంధిపై బుడిపెల యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్.
  • గ్రంధిపై అసాధారణంగా సంభవించిన పెరుగుదల (abnormal growth on gland) యొక్క జీవాణుపరీక్ష (biopsy).

రక్త పరీక్షలో కనుక్కోబడిన గ్రంధి మరియు హార్మోన్ల స్థాయిల ప్రకారం థైరాయిడ్ రుగ్మతలకు చేసే చికిత్సలో తేడా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం రుగ్మతకు క్రింది చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

  • మందులు: రేడియోధార్మిక (radioactive) అయోడిన్, యాంటీ థైరాయిడ్ మందులు, మరియు శోథ నిరోధక మందులు.
  • శస్త్రచికిత్స ద్వారా రుగ్మతకు గురైన భాగాన్ని లేదా మొత్తం థైరాయిడ్ గ్రంధి తొలగింపు.

వైద్యుడిచేత క్రమమైన పరిశీలన మరియు చికిత్సానంతర పరీక్షలు (ఫాలో అప్స్) హైపర్ థైరాయిడిజం రుగ్మతను నయం చేసుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్లు, మాంసకృత్తులు, కాల్షియం, అయోడిన్ మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడంవల్ల మీరు థైరాయిడ్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. .

(మరింత సమాచారం: హైపోథైరాయిడిజం చికిత్స)



వనరులు

  1. L D K E Premwardhana and J. H. Lazarus. Management of thyroid disorders.. Postgrad Med J. 2006 Sep; 82(971): 552–558.
  2. Michael T Sheehan. Biochemical Testing of the Thyroid: TSH is the Best and, Oftentimes, Only Test Needed - A Review for Primary Care.. Clin Med Res. 2016 Jun; 14(2): 83–92
  3. Simone De Leo, Sun Y. Lee and Lewis E. Braverman . Hyperthyroidism. Lancet. 2016 Aug 27; 388(10047): 906–918.Published online 2016 Mar 30.
  4. Office on Women's Health. [Internet]. U.S. Department of Health and Human Services. Thyroid disease.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Thyroid Diseases.

హైపర్ థైరాయిడిజం వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 Years of Experience
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 Years of Experience
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 Years of Experience
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

హైపర్ థైరాయిడిజం కొరకు మందులు

Medicines listed below are available for హైపర్ థైరాయిడిజం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.