మూత్రపిండ సంక్రమణం (ఇన్ఫెక్షన్) - Kidney Infection in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 23, 2018

March 06, 2020

మూత్రపిండ సంక్రమణం
మూత్రపిండ సంక్రమణం

మూత్రపిండ సంక్రమణ వ్యాధి అంటే ఏమిటి?

మూత్రపిండాల్లోనికి (బాక్టీరియా) సూక్ష్మ క్రిముల చొరబాటునే “మూత్రపిండ సంక్రమణ వ్యాధి” అంటారు. తొలుత సూక్ష్మ క్రిములు మూత్రాశయంలో ప్రవేశించి, తర్వాత  మూత్రపిండాలకు వ్యాపిస్తాయి. ఈ వ్యాధిని “పిలేనోఫ్రిటిస్” అని కూడా పిలుస్తారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కిడ్నీ ఇన్ఫెక్షన్లు సాధారణంగా వస్తూ ఉంటాయి మరియు ఈ వ్యాధిలో క్రింది లక్షణాలను గమనించవచ్చు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కిడ్నీ అంటువ్యాధులు సాధారణంగా బ్యాక్టీరియా వలన సంభవిస్తాయి మరియు అరుదుగా, మూత్రపిండ సంక్రమణకు చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా సంభవిస్తాయి. స్త్రీలల్లో పాయువు మరియు మూత్రమార్గద్వారం ఒకదానికొకటి దగ్గరగా ఉండటం వలన, బ్యాక్టీరియా మూత్రాశయం చేరడం సులభతరం అవుతుంది గనుకనే మూత్రపిండ సంక్రమణ ప్రమాదం పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు మూత్రపిండ సంక్రమణ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది , ఎందుకంటే గర్భంలోని శిశువు మూత్రనాళంపై ఒత్తిడిని ఉంచుతుంది మరియు మూత్రం యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. మూత్రపిండాల సంక్రమణకు (అంటువ్యాధికి) ప్రధాన కారణాలు కిందివిధంగా ఉన్నాయి:

  • మూత్ర నాళంలో కిడ్నీ రాళ్లు.
  • విస్తరించిన ప్రోస్టేట్ లేదా దానికి సోకిన సంక్రమణం.
  • ఇరుకైపోయిన మూత్రనాళం (ureter) వంటి నిర్మాణాత్మక రుగ్మత.
  • వెనక్కు మళ్లే మూత్రం:మూత్రాశయం నుండి మూత్రపిండానికి తిరిగి ప్రవచించే మూత్రం.
  • మూత్రాశయం అసంపూర్తిగా ఖాళీ అవడం.
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ.
  • పిత్తాశయంలో నరాలకు దెబా తగలడం.
  • మూత్ర కాథెటర్ ను వాడటం.

మూత్రపిండాల అంటురోగాలకు కారణమైన అతిసాధారణ బాక్టీరియం E. కోలి .

మూత్రపిండ సంక్రమణను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మూత్రపిండాల సంక్రమణకు సకాలంలో రోగ నిర్ధారణ మరియు చికిత్స అవసరం. ఈవ్యాధికి చికిత్స ఆలస్యం అయినట్లయితే ప్రాణాంతకమైనదిగా మారవచ్చు.

  • మూత్రంలో చీము, రక్తం మరియు బాక్టీరియాను గుర్తించడానికి మూత్ర పరీక్ష.
  • బాక్టీరియా రకం తెలుసుకోవడానికి మూత్ర సంస్కృతి పరీక్ష (urine culture).
  • మూత్రపిండంలో రాళ్ళు లేదా నిర్మాణాత్మక అసాధారణతలు తనిఖీకి అల్ట్రాసౌండ్ మరియు CT స్కాన్ పరీక్షలు.
  • ఏ అడ్డంకులు లేవని నిర్ధారించుకోవడానికి సిస్టోయూరిత్రోగ్రామ్ (cystourethrogram) ను ఖాళీ చేయడం.
  • మూత్ర వ్యవస్థ యొక్క నిర్మాణం, పనితీరును పరిశీలించడానికి DMSA scintigraphy (dimercaptosuccinic acied) పరీక్ష

మూత్రపిండ సంక్రమణ వ్యాధికి క్రింది చికిత్స విధానం సూచించబడింది:

  • జ్వరాన్ని నియంత్రించడానికి యాంటిపైరెటిక్ మందుల్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి . తీవ్రమైన సంక్రమణ సందర్భంలో, ఇంట్రావీనస్ (సిరలోకి) యాంటీబయాటిక్స్ మరియు ద్రవాలను నిర్వహించడానికి ఆసుపత్రిలో చేరడం అవసరం అవుతుంది.
  • తరచుగా అంటురోగాలకు, అంతర్లీన కారణాన్ని కనుగొనడానికి ఒక యూరాలజస్ట్ ను సంప్రదించడం మంచిది.
  • నిర్మాణాత్మక అసాధారణతను సరిచేయడానికి శస్త్రచికిత్స సూచించబడుతుంది.

నీళ్ళు దండిగా తాగడం వంటి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా మీరు మూత్రపిండాల అంటువ్యాధులను నివారించవచ్చు. జననేంద్రియాలపై  డీయోడొరెంట్లను చల్లడాన్ని మానుకోవడం, ప్రతి మలవిసర్జన తర్వాత శుబ్రపరిచేటపుడు ముందు నుండి వెనుకకు తుడవడం, ఉద్దీపన కల్గిన వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లడంవంటి చర్యల ద్వారా మూత్రపిండ సంక్రమణల్నినివారించొచ్చు. వ్యాధి లక్షణాలు ఇంకా తలెత్తే సందర్భంలో, మీ డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం, దీనివల్ల కాగల ప్రమాదాల్ని నివారించుకోవచ్చు.



వనరులు

  1. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Kidney Infection (Pyelonephritis)
  2. Science Direct (Elsevier) [Internet]; Prevention and treatment of complicated urinary tract infection Volume 27, Issue 4, December 2016, Pages 186-189
  3. Leelavathi Venkatesh et al. Acute Pyelonephritis - Correlation of Clinical Parameter with Radiological Imaging Abnormalities. J Clin Diagn Res. 2017 Jun; 11(6): TC15–TC18. PMID: 28764263
  4. Petra Lüthje, Annelie Brauner. Novel Strategies in the Prevention and Treatment of Urinary Tract Infections. Pathogens. 2016 Mar; 5(1): 13. PMID: 26828523
  5. Kunin CM. Does kidney infection cause renal failure? Kunin CM.. Annu Rev Med. 1985;36:165-76. PMID: 3888049

మూత్రపిండ సంక్రమణం (ఇన్ఫెక్షన్) వైద్యులు

Dr. Anvesh Parmar Dr. Anvesh Parmar Nephrology
12 Years of Experience
DR. SUDHA C P DR. SUDHA C P Nephrology
36 Years of Experience
Dr. Mohammed A Rafey Dr. Mohammed A Rafey Nephrology
25 Years of Experience
Dr. Soundararajan Periyasamy Dr. Soundararajan Periyasamy Nephrology
30 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మూత్రపిండ సంక్రమణం (ఇన్ఫెక్షన్) కొరకు మందులు

Medicines listed below are available for మూత్రపిండ సంక్రమణం (ఇన్ఫెక్షన్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.