లూపస్ - Lupus in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 10, 2018

March 06, 2020

లూపస్
లూపస్

లూపస్ అంటే ఏమిటి?

శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు మరియు కణజాలం మీద వ్యక్తి యొక్క సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు ఆటోఇమ్యూన్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది, దీని వలన గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్ళు, మూత్రపిండాలు, రక్త నాళాలు మరియు మెదడు వంటి వివిధ అవయవాలు మరియు శరీర వ్యవస్థలకు హాని కలుగుతుంది. ల్యూపస్ అనేది ఒక రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి, ఇది అనేక రకాలుగా ఉంటుంది:

  • సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్ (SLE, Systemic lupus erythematosus)
  • డిస్కోయిడ్ లూపస్ (Discoid lupus)
  • సబ్- అక్యూట్ క్యూటేనియస్ ల్యూపస్ (Sub-acute cutaneous lupus)
  • డ్రగ్-ఇండ్యూసెడ్  లూపస్ (Drug-induced lupus)
  • నియోనాటల్ లూపస్ (Neonatal lupus)

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లూపస్ యొక్క లక్షణాలు, గమనింపదగినవిగా ఉన్నపుడు, ఫ్లేర్ (flare) పిలువబడతాయి మరియు అవి తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు. లక్షణాలు వేవ్-నమూనా (wave-pattern, అల లాగా)ను కలిగి ఉంటాయి అంటే - లక్షణాలు కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉండకపోవచ్చు (remission, ఉపశమనం) మరియు తరువాత మళ్ళి కొన్ని రోజుల పాటు లక్షణాలు ఉండవచ్చు (exacerbation, ప్రకోపించడం). లూపస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ మారుతూ  ఉన్నప్పటికీ, కొన్ని సాధారణ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:

  • అలసట లేదా తీవ్రంగా నీరసం అనిపించడం
  • జ్వరం
  • జుట్టు రాలుట
  • సూర్యకాంతికి సున్నితత్వం
  • నోటిలో పుండ్లు
  • కీళ్ళు లేదా కండరాల నొప్పి లేదా వాపు
  • గాఢంగా శ్వాస తీసుకున్నపుడు ఛాతీ నొప్పి
  • చేతి వేళ్లు లేదా కాలి వేళ్ళు లేత గోధుమ రంగు లేదా ఊదారంగులోకి మారిపోతాయి
  • ఎర్రని దద్దుర్లు, సాధారణంగా ముఖంపై కనిపిస్తాయి వాటిని "సీతాకోకచిలుక రాష్ (butterfly rash)" అని పిలుస్తారు
  • కాళ్ళు లేదా కళ్ళు లేదా వివిధ గ్రంధుల (glands) పై వాపు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

లూపస్ కి కారణం ఇంకా తెలియలేదు. లూపస్ యొక్క ప్రధాన కారణం ఆటోఇమ్యూనిటీ అని భావిస్తారు.

దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

ల్యూపస్ యొక్క రోగ నిర్ధారణ చాలా కష్టం మరియు నిర్ధారణకి చాలా సమయం పడుతుంది (చాలా నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకు పట్టవచ్చు) దీనిని తరచుగా ఇతర వ్యాధులుగా పొరపాటు పడతాము. రోగ నిర్ధారణకు ముందు, వైద్యులు పూర్తి ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకుంటారు మరియు  సూక్ష్మమైన సంకేతాలను పరిశీలించడానికి శారీరక పరీక్ష నిర్వహిస్తారు. రోగ నిర్ధారణకు సహాయపడే వివిధ పరీక్షలు:

  • వివిధ రక్త పరీక్షలు
  • మైక్రోస్కోప్ ద్వారా చర్మ నమూనాను (sample) పరిశీలించడం (స్కిన్ బయాప్సీ)
  • మైక్రోస్కోప్ ద్వారా మూత్రపిండాల నుండి సేకరించిన కణజాల నమూనాను పరిశీలించడం (కిడ్నీ బయాప్సీ)

లూపస్ కు ఎటువంటి శాశ్వత నివారణ లేదు, చికిత్స యొక్క లక్ష్యం ఫ్లేర్ (flare) ను నివారించడం లేదా చికిత్స చేయడం, మరియు అవయవాలకు మరింత నష్టం కలగడాన్ని నివారించడం.

ల్యూపస్ యొక్క ఈ లక్షణాలను తగ్గించడంలో మందులు సహాయం చేయగలవు :

  • ఫ్లేర్ (flare) ను నివారించడం లేదా తగ్గించడం
  • కీళ్ళ నష్టాన్ని నివారించడం లేదా తగ్గించడం
  • వాపు మరియు నొప్పి తగ్గించడం
  • రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం
  • హార్మోన్లను సంతుల్యం చేయడం

ల్యూపస్ తో ముడిపడి ఉండే ఇతర సమస్యలకు (సంక్రమణలు, అధిక కొలెస్ట్రాల్ లేదా అధిక రక్తపోటు) కూడా చికిత్స చేయాలి, ఎందుకంటే అవి సమస్యను తీవ్రతరం చేస్తాయి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Lupus.
  2. Office on Women's Health. [Internet]. U.S. Department of Health and Human Services. Lupus.
  3. Lupus Foundation of America. [Internet]. Washington, D.C.,United States; What is lupus?.
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Systemic Lupus Erythematosus (SLE).
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Lupus.

లూపస్ కొరకు మందులు

Medicines listed below are available for లూపస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.