మయోపియా (సమీప దృష్టి) - Myopia (Nearsightedness) in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 05, 2018

March 06, 2020

మయోపియా
మయోపియా

మయోపియా (సమీప దృష్టి) అంటే ఏమిటి?

సమీప దృష్టి (మైయోపియా లేక సమీప దృష్టి రుగ్మత) రుగ్మత అనేది మీరు సమీప వస్తువులను స్పష్టంగా చూడగల స్థితిలో ఉంటారు, కానీ దూరంలో ఉండే వస్తువుల్ని బాగా చూడలేరు, అస్పష్టంగా మాత్రం కనబడుతాయి. హ్రస్వదృష్టి మీకుంటే టెలివిజన్ స్క్రీన్, తెల్లబల్ల (వైట్బోర్డ్), మొదలైన వస్తువులను చూడటం మీకు సాధ్యం కాదు. హ్రస్వదృష్టి (మైయోపియా) ని తీవ్ర హ్రస్వదృష్టి (severe myopia) మరియు తక్కువ హ్రస్వదృష్టి  (తేలికపాటి హ్రస్వదృష్టి) గా వర్గీకరించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కింది సంకేతాలు మరియు లక్షణాలు సమీప దృష్టి ఉన్న వ్యక్తులలో గమనించబడతాయి:

  • పేలవమైన దూరదృష్టి
  • తలనొప్పులు
  • కళ్ళకు అలసట (కంటి పై భారం)

సమీప దృష్టికి ప్రధాన కారణాలు ఏమిటి?

సమీప దృష్టికి కారణాలు క్రింది విధంగా ఉంటాయి:

  • వారసత్వం: హ్రస్వ దృష్టిని పెంపొందించే ధోరణి వారసత్వంగా వస్తూ ఉంటుంది, కానీ మీ కళ్ళ మీద మీరు ఎంత ఒత్తిడిని ఇస్తున్నారన్నదానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.
  • దృష్టి సంబంధమైన ఒత్తిడి: కంప్యూటర్లో ఎక్కువ పని గంటలసేపు పని చేయడమో లేక అధ్యయనం-సంబంధిత ఒత్తిడి .
  • మధుమేహం వంటి వ్యాధులు: చక్కెరవ్యాధిలో రక్తంలో చక్కెర స్థాయిలు దృష్టిని దెబ్బ తీస్తాయి.
  • పర్యావరణ కారకాలు: వాతావరణంలో మార్పు మీ దృష్టిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు రాత్రిపూట మాత్రమే దూరదృష్టి అస్పష్టంగా ఉంటుంది, ఇది “రాత్రిపూట హ్రస్వదృష్టి”గా పిలువబడుతుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

హ్రస్వదృష్టిని నిర్ధారించేందుకు కంటి సంరక్షణ నిపుణులచే సమగ్ర కంటి పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో దృష్టి పరీక్ష మరియు కళ్ళ యొక్క భౌతిక పరీక్ష ఉంటాయి. ఈపరీక్షలో  కనుపాపల్ని ను విస్తృతం చేయటంలో భాగంగా కళ్ళను విస్తరించడం కోసం కంటి చుక్కలను కూడా ఉపయోగించుకోవచ్చు, ఇది పరీక్షను సులభతరం చేస్తుంది. ఇది రెటీనా మరియు కంటి నరాలను సమీపంగాను, ఖచ్చితంగాను పరీక్షించేందుకు వీలవుతుంది.

హ్రస్వదృష్టికి చేసే చికిత్సలో అత్యంత సాధారణంగా వాడబడే పద్ధతి దిద్దుబాటు గ్లాసెస్ (corrective glasses) లేదా కంటి లెన్సులు (eye lenses) కలిగి ఉంటుంది. ఉపయోగించదగ్గ ఇతర పద్ధతులు:

  • ఫోటోరేఫ్రాక్టివ్ కెరాటేక్టమీ (PRK) మరియు లేజర్-అసిస్టెడ్ ఇన్-సిట్ కెరాటోమిలస్సిస్ (లాసిక్) వంటి రిఫ్రాక్టివ్ శస్త్రచికిత్స.మీ కంటి దృష్టి దోషం స్థిరంగా ఉంటే (అంటే, మీ అద్దాలు సంఖ్య కొంతకాలం స్థిరంగా ఉండిన తర్వాత) రిఫ్రాక్టివ్ శస్త్రచికిత్స జరుగుతుంది, సాధారణంగా మీరు మీ ప్రారంభ 20 వ సంవత్సర వయసు దశలో ఉన్నప్పుడు మీ యొక్క పెరుగుదల పూర్తయిఉంటుంది. ఈ శస్త్రచికిత్సలు కార్నియ ఆకారాన్ని మార్చడం ద్వారా రెటీనాపై కాంతి యొక్క దృష్టిని మెరుగుపరుస్తాయి.
  • కార్నియల్ రిఫ్రాక్టివ్ థెరపీ (ఆర్తో-కె): ఇది ఒక శస్త్రచికిత్సేతర విధానం, ఇందులో మీరు మీ కార్నియాను మెరుగుపరుచుకునే దృఢమైన లెన్స్ ధరిస్తారు.
  • విజన్ థెరపీ: ఒత్తిడి సంబంధిత హ్రస్వదృష్టి ఉంటే అది ఉపయోగపడుతుంది. దృష్టిని మెరుగుపర్చడానికి కంటి వ్యాయామాలు సూచించబడతాయి మరియు అందువల్ల స్పష్టమైన సుదూర దృష్టిని తిరిగి పొందుతాయి.



వనరులు

  1. American Optometric Association. [Internet]: Missouri, United States; Myopia (Nearsightedness).
  2. National Eye Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Facts About Myopia
  3. American Academy of Ophthalmology [Internet] California, United States; Nearsightedness: What Is Myopia?
  4. National Health Portal [Internet] India; Myopia.
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Short-sightedness.

మయోపియా (సమీప దృష్టి) కొరకు మందులు

Medicines listed below are available for మయోపియా (సమీప దృష్టి). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.