వాపు - Swelling (Edema) in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

వాపు
వాపు

సారాంశం

ఎడేమా (నీరు చేరుట) అనునది ఒక పరిస్థితి, ఇందులో శరీరము యొక్క కణజాలములోనికి ద్రవము అధికముగా చేరుతుంది.   వాపు కణజాలం మీద చర్మము వెచ్చగా, మృదువుగా మారుటకు మరియు సాగు స్వభావము గలదిగా మారుటకు కారణమవుతుంది.  ఎడేమా సాధారణముగా చేతులు మరియు కాళ్లలో ఏర్పడుతుంది  (పెరిఫెరల్ ఎడేమా), అయితే, అదే విధముగా ఇది శరీరము యొక్క ఇతర భాగాలలో కూడా ఏర్పడుతుంది.  కళ్లు మరియు దాని చుట్టూ ఉన్న కణజాలం ఈ పరిస్థితులను కలిగిఉంటాయి, అనగా పాపిల్లెడెమా (సూక్ష్మాంకురం) మరియు మచ్చల ఎడేమా, జలోదర ఉదరం, పూర్తి శరీరం ఉబ్బడం, చర్మము మరియు రక్తనాళముల శోధములో శ్లేష్మ (మ్యూకస్) (సాధారణముగా గొంతు, ముఖము, పెదవులు మరియు నాలుక)  పొరలు, పల్మనరీ ఎడేమాలో ఊపిరితిత్తులు, మరియు సెరెబ్రల్ ఎడేమాలో మెదడు వంటి పరిస్థితులను కలిగి ఉంటుంది.  పెరిఫెరల్ ఎడేమా, ఇది చేతులు మరియు కాళ్లలో సంభవిస్తుంది, సాధారణముగా రక్త ప్రసరణ యొక్క లోపం (సిరలు లోపం) కారణముగా ఏర్పడుతుంది, స్తంభించిన గుండె వైఫల్యం, మూత్రపిండాల సమస్యలు, రక్త సీరం ప్రొటీన్ల తరుగుదల, కాలేయ వ్యాధి, ఊపిరితిత్తుల లోపాలు(రుగ్మతలు) మరియు శోషరస వ్యవస్థ దెబ్బతిన్నడము (లింపిడెమా).

ప్రస్తుతము ఉన్న ఆరోగ్య పరిస్థితి ఆధారముగా ఎడేమా శరీరము యొక్క ఒకవైపున లేక రెండు వైపులా పాల్గొంటుంది.  పెరిఫెరల్ ఎడేమా సాధారణముగా స్త్రీలలో గర్భదారణ సమయములో, ఋతు చక్రం లేక పీరియడ్స్, మరియు గర్భనిరోధక మాత్రలు నోటి ద్వారా చాలా కాలం పాటు ఉపయోగించడం వలన వస్తుంది.  దీర్ఘకాలం రక్తహీనత కలిగిన ప్రజలు మరియు థైరాయిడ్ గ్రంథి రుగ్మతలు కలిగిన ప్రజలలో సాధారణముగా ఏర్పడుతుంది.  కొన్ని రకాల మందులు, అనగా యాంటిడిప్రెషంట్స్, కాల్షియం చానల్ బ్లాకర్స్ (అధిక రక్తపోటు కొరకు) మరియు స్టెరాయిడ్స్, కూడా పరిధీయ (పెరిఫెరల్) ఎడేమా ఫలితముగా ఏర్పడతాయి.  ఆరోగ్య పరిస్థితి కారణముగా, ఎడేమా అనునది తక్కువ సమయము వరకు ఉంటుంది లేక చాలాకాలం పాటు కొనసాగుతుంది.  ఎడేమా యొక్క నిర్వహణలో ఉన్న కారణమునకు చికిత్స అనునది మొదటి స్టెప్.  ఇతర చర్యలు, స్టాకింగ్స్ యొక్క ఉపయోగం, బరువు-కోల్పోవడం, పడుకొని ఉన్నప్పుడు కృత్రిమ స్థానములో కాళ్లను ఉంచడం మరియు ఉప్పు-నిరోధిత ఆహారమును అనుసరించడం వంటి వాటిని కలిగిఉన్నాయి.

వాపు యొక్క లక్షణాలు - Symptoms of Swelling in Telugu

శరీరములో ఎడేమా ఎక్కువ అయ్యే కొద్దీ కొన్ని రకాల చిహ్నాలు మరియు లక్షణాలు అగుపిస్తాయి. వీటిలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:

  • కాలు లేదా ప్రభావిత శరీర భాగాలు వాపు వస్తాయి లేదా ఉబ్బుతాయి.
  • వాచిన చోటులో చర్మం యొక్క రంగు మారుతుంది.
  • ఎడేమాటస్ ప్రాంతములో గుంటలు లేక ఒక వ్రేలి ద్వారా ఒత్తిడిని అప్లై చేసినప్పుడు నొక్కు (సొట్ట) లను చూపిస్తాయి. (గుంటల ఎడేమా).  ఎక్కువ సందర్భాలలో, ఎడేమా అనునది లింలింపిడెమాలో కాకుండా గుంటలు, ఇవి క్యాన్సర్ వలన, రేడియేషన్ చికిత్స వలన శోషరస నోడ్స్ దెబ్బతినడం, మరియు థైరాయిడ్ రుగ్మతలు వలన ఏర్పడతాయి.
  • ప్రభావితమైన శరీర భాగం బరువుగా అనిపిస్తుంది మరియు కీళ్ళు కూడా పాల్గొనడం వలన కదిలించడానికి కష్టమవుతుంది.
  • వాచిన ప్రాంతం యొక్క చర్మం వెచ్చగా మరియు సాగు గుణముతో ఉంటుంది. సాధారణంగా చూస్తే ఎడేమాలో, దుస్తులు ధరించడానికి అసౌకర్యంగా ఉంటుంది.
  • సిర లేక అనారోగ్య సిరలలో క్లాట్ (గడ్డకట్టడం) వలన ఎడేమా ఏర్పడు సంధర్భాలలో, ప్రభావితమైన కాలు మృదువుగా మరియు బాధాకరముగా మారుతుంది.
  • ఆయాసం అనునది గుండె వైఫల్యం, మూత్ర పిండాల వ్యాధి, కాలేయ సమస్యలు లేక ఊపిరితిత్తుల రుగ్మతలు కారణముగా ఏర్పడిన ఎడేమా వ్యాధి సంబంధ లక్షణము.   
  • సాధారణ ఎడేమాలో బరువు పెరగడం అనేది సాధారణంగా ఉంటుంది.

వాపు యొక్క చికిత్స - Treatment of Swelling in Telugu

ఎడేమా యొక్క చికిత్స మరియు నిర్వహణ అనునది వ్యాధి యొక్క కారణము పైన ఆధారపడుతుంది మరియు క్రింది పధ్ధతులను అనుసరిస్తుంది:

  • ఒక ఎత్తైన స్థానములో కాళ్లను ఉంచడం, ప్రత్యేకముగా పడుకొని ఉన్న సమయములో మరియు కుదింపు స్టాకింగ్స్ (మేజోళ్లు) ను ఉపయోగించడము ఎడేమాని ప్రారంభ దశలలోనే తగ్గించవచ్చు.  ఫలకం (ప్లేక్) ఏర్పాటు (ఎథిరోస్క్లెరోసిస్) వలన గట్టి లేక ఇరుకైన కాళ్ల ధమనులను కలిగిన వారిలో స్టాకింగ్స్ నివారించబడతాయి ఇటువంటి సందర్భాలలో, క్లాట్ (గడ్డ కట్టడము) ఏర్పడటమును నివారించడానికి ఒక న్యుమాటిక్ కంప్రెసన్ పరికరం (గాలి కుదింపు పరికరం) అని పిలువబడే ఒక ఎలక్ట్రానిక్ పరికరమును ఉపయోగిస్తారు.  కాళ్ల పూతలు, కాలిన పుండ్లు లేక పెరిఫెరల్ రక్త నాళ వ్యాధులు గల ప్రజలకు ఒక న్యుమాటిక్ పరికరం అనునది సూచించబడుతుంది.   కఫ్స్ (సంకెళ్ళు లేక మణికట్టు దారాలు) అనునవి కాళ్ల చుట్టూ చుట్టబడతాయి మరియు గాలితో నింపబడతాయి.  ఇది కణజాలమును నలిపివేస్తుంది మరియు సిరల ద్వారా రక్తరక్త ప్రవాహమును ప్రోత్సహిస్తుంది, అది రక్తం గడ్డ కట్టుటను నివారిస్తుంది.
  • తరచుగా మూత్ర విసర్జన చేయడమును పెంచుట మరియు శరీరము నుండి అదనపు నీటిని ఎండిపోయేలా చేయుట, ఈ మందులు మూత్ర వర్ణకాలుగా తెలుపబడుతాయి, సిరల లోపము వలన స్తంభించిన గుండె వైఫల్యం కలిగినప్పుడు వీటిని ఉపయోగిస్తారు.
  • చర్మ సంరక్షణ అనునది ఎడేమా యొక్క ముఖ్యమైన అంశము, ఇది సిరలు లోపం కారణముగా ఏర్పడుతుంది.  మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ (తేమ సారాంశాలు) మరియు తేలికపాటి కార్టికోస్టెరాయిడ్ లేపనాలు అనునవి చర్మం ఎండిపోవడమును నివారిస్తాయి మరియు వాపు ఉన్న ప్రాంతము పైగా చర్మములో మంటను తగ్గిస్తాయి.
  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనునది యాంటికోయాగ్యులంట్స్ లేక క్లాట్-బర్సటర్ మందులు (హెపారిన్ లేక వార్ఫిన్) ఉపయోగించడము ద్వారా చికిత్స చేయబడతాయి, కాలిలో రక్తం గడ్డకట్టుటను కరిగించడానికి వీటిని ఉపయోగిస్తారు.  దీర్ఘ కాల సిరల లోపం మరియు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వలన బాధపడుచున్న వ్యక్తుల రక్తం గడ్డ కట్టుట ఏర్పాటును నివారించడానికి స్టాకింగ్స్ (మేజోళ్లు) మరియు బ్యాండేజ్ లు సహాయం చేస్తాయి.
  • లింపిడెమా, ఫిజియోథెరపీ, బాహ్య మర్దన, మరియు బ్యాండేజ్ లు అను వాటిని ప్రసరణను ఉత్తేజితం చేయడానికి ఉపయోగిస్తారు మరియు శోషరస నాళములో ఉన్న అడ్డంకులను తొలగించడము వలన ఇది ఎడేమాను తగ్గించడములో తరువాత సహాయపడుతుంది.   లింపిడెమాలో ఎడేమాను గణనీయమైన మేరకు తగ్గించడానికి ఒక న్యుమాటిక్ కంప్రెసన్ పరికరం అనునది చాలా సమర్థవంతముగా పనిచేస్తుంది.   లింపిడెమా అనునది విభిన్న శస్త్రచికిత్స ప్రమాణాలకు ప్రతిస్పందించడములో విఫలమయినప్పుడు,  బ్లాక్ చేయబడిన శోషరస నాళమును బైపాస్ సర్జరీ చేయుట, వైద్యపరంగా సర్జికల్ డిబల్కింగ్ అని పిలువబడే దీని ద్వారా నిర్వహిస్తారు.
  • మందు-ప్రేరేపిత ఎడేమా సందర్భములో, అధిక రక్తపోటు కొరకు ఉపయోగించే క్యాల్షియం చానల్ బ్లాకర్స్, అధిక రక్తపోటు సాధారణముగా ఎడేమాను రెండు కాళ్లలో ఏర్పరుస్తుంది. దీనికి బదులుగా,  ఇతర మందులు, అనగా యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ నిరోధకాలు లేక ఎసిఇ నిరోదకాలను ఉపయోగిస్తారు.
  • కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు మరియు ప్రేగు రుగ్మతలు కారణముగా ఎడేమా ఏర్పడుతుంది, ఇది ప్రొటీన్ కోల్పోవడమునకు దారితీస్తుంది, ప్రొటీన్ ఇంజెక్షన్ల ద్వారా దీనికి చికిత్స చేస్తారు, ప్రారంభ దశలో ఉప్పు మరియు నీటిని తీసుకోవడములో పరిమితులు, మరియు మూత్రవర్ణకాలు.
  • బరువు తగ్గుదల మరియు నిరంతర సానుకూల గాలి ఒత్తిడి పరికరం (సిపిఎపి) అనునవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు స్లీప్ ఆప్నియా (నిద్ర ఆయాసం) వలన కాళ్లలో ఏర్పడిన ఎడేమాను తగ్గించడానికి సహాయపడుతాయి.
  • తెలిసిన కారణము లేకపోవడము వలన కాళ్లలో ఏర్పడిన  (ఐడియోపాథిక్ ఎడేమా లేక అకారణ ఎడేమా) ఎడేమాను, ఇతర జీవనశైలి మార్పు చర్యలతో పాటు ఆల్డోస్టెరోన్ ఆంటాగోనిస్ట్స్ అని పిలువబడే మందులతో చికిత్స చేస్తారు.
  • గాయం ద్వార ఎడేమా ఏర్పడిన సందర్భాలలో, సిస్టమిక్ స్టెరాయిడ్స్ (దైహిక స్టెరాయిడ్లు), మరియు ట్రిసైక్లిక్ యాంటిడిప్రెస్సంట్ మందులను నొప్పి ఉపశమనము మరియు వాపు కొరకు ఉపయోగిస్తారు.

జీవనశైలి యాజమాన్యము

రోజువారీగా సులువైన చర్యలు ఎడేమాను నిర్వహించుకోవడంలో సహాయపడతాయి.

  • ఆహారములో ఉప్పు మరియు చక్కెరను తీసుకోవడము తగ్గించడము అనునది వాటర్ రిటెన్షన్ (నీటి నిలుపుదల) మరియు ఎడేమాను తగ్గించడానికి సహాయపడుతుంది.
  • నడవడం, మెల్లిగా పరుగెత్తడం, కాళ్లు లేవనెత్తుట మరియు ఇతర వ్యాయామాలు అనునవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి, మరియు తద్వారా ఎడేమాను తగ్గించడానికి సహాయపడతాయి.
  • రక్త ప్రసరణ మెరుపరచుకోవడానికి క్రమముగా వ్యాయామాలు చేయాలి మరియు ఈ వ్యాయామాలు గుండె వైపుగా రక్త ప్రవాహమును పెంచుతాయి.
  • బరువు పెరుగుదలను నివారించడానికి మరియు అదుపు చేయడానికి ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారం తినండి.
  • పొగత్రాగడం మరియు మద్యపాన వినియోగమును మానివేయండి.
  • ఎటువంటి వ్యాధుల అనుమానమును పారద్రోలడానికై, ప్రతి ఆరు నెలలకూ ఒకమారు సంపూర్ణంగా శారీరక పరీక్ష చేయించుకోండి. 


వనరులు

  1. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Causes and signs of edema. 2008 Nov 5 [Updated 2016 Dec 30].
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Foot, leg, and ankle swelling
  3. OMICS International [Internet]; Edema
  4. Huffman MD, Prabhakaran D. Heart failure: epidemiology and prevention in India. . Natl Med J India 2010; 23:283-8. PMID: 21250584
  5. Varma PP. Prevalence of chronic kidney disease in India - Where are we heading? . Indian J Nephrol 2015; 25:133–135. PMID: 26060360
  6. Natarjan K. Practical approach to pedal edema. Association of Physicians of India. Chapter 72. [Internet]
  7. Sabesan S, Vanamail P, Raju K, Jambulingam P. Lymphatic filariasis in India: Epidemiology and control measures. J Postgrad Med, 2010; 56:232-8. PMID: 20739779
  8. Ciocon JO, Fernandez BB, Ciocon DG. Leg edema:clinical clues to the differential diagnosis. Geriatrics 1993; 48:34–40, 45. PMID: 7695655
  9. National Health Service [internet]. UK; Swollen ankles, feet and legs (oedema)
  10. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Swelling
  11. Belcaro G, Cesarone MR, Shah SS, et al. Prevention of edema, flight microangiopathy and venous thrombosis in long flights with elastic stockings. A randomized trial: The LONFLIT 4 Concorde Edema-SSL Study. . Angiology. 2002 Nov;53(6):635-45. PMID: 12463616
  12. Ochalek K, Pacyga K, Curyło M, Frydrych-Szymonik A, Szygula Z. Risk Factors Related to Lower Limb Edema, Compression, and Physical Activity During Pregnancy: A Retrospective Study. Lymphat Res Biol. 2017 Jun;15(2):166-171. Epub 2017 Mar 27. PMID: 28346850
  13. National Health Service [Internet]. UK; Prevention - Lymphoedema.
  14. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Edema. Harvard University, Cambridge, Massachusetts.
  15. TRAYES KP, STUDDIFORD JS, PICKLE S, TULLY AS, Am Fam Physician. 2013 Jul 15;88(2):102-110. [Internet] American Academy of Family Physicians; Edema: Diagnosis and Management.
  16. Johns Hopkins Medicine [Internet]. The Johns Hopkins University, The Johns Hopkins Hospital, and Johns Hopkins Health System; DVT Prevention: Intermittent Pneumatic Compression Devices
  17. Aboussouan LS, Ricaurte B, Theerakittikul T. Noninvasive positive pressure ventilation for stable outpatients: CPAP and beyond. Cleveland Clinic Journal of Medicine. 2010 October;77(10):705-714. [Internet]
  18. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Lymphedema . Harvard University, Cambridge, Massachusetts.
  19. National Eczema Association [Internet]; Stasis Dermatitis

వాపు కొరకు మందులు

Medicines listed below are available for వాపు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.