పంటి ఇన్ఫెక్షన్లు - Teeth Infections in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 11, 2019

March 06, 2020

పంటి ఇన్ఫెక్షన్లు
పంటి ఇన్ఫెక్షన్లు

పంటి ఇన్ఫెక్షన్లు (దంతాల సంక్రమణలు) అంటే ఏమిటి?

పంటి ఇన్ఫెక్షన్ లేదా కురుపులు అంటే పళ్ళ యొక్క సంక్రమణం, అది పంటి మూలాల (root) వరకు వ్యాపిస్తుంది మరియు లోపల చీము ఏర్పడానికి దారితీస్తుంది. సంక్రమణ/ఇన్ఫెక్షన్ చాలా బాధాకరముగా/నొప్పిగా ఉంటుంది మరియు దంతవైద్యుని అవసరం కూడా ఉండవచ్చు. దంతాల చుట్టూ ఉన్న లిగమెంట్లు మరియు కణజాలాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తే దానిని పెరియోడొంటైటిస్ అని పిలుస్తారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పంటి సంక్రమణకు అత్యంత స్పష్టమైన సంకేతం నిరంతర పంటి నొప్పి, ఇది పంటి చిగుళ్ళ కింద ఉండే శోషరస కణుపు (లింప్ నోడ్లలో) లో వాపుకు దారితీస్తుంది. పంటి ఇన్ఫెక్షన్ యొక్క ఇతర లక్షణాలు:

  • ఏవైనా వేడి లేదా చల్లని ఆహార పదార్దాలకు సున్నితత్వం
  • జ్వరముగా ఉన్న భావన
  • కోరుకుతున్నపుడు మరియు నములుతున్నపుడు కఠినత మరియు నొప్పి 
  • నోటి నుండి చెడు వాసన

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దంత పరిశుభ్రత తక్కువగా ఉండడం/సరిగ్గా లేకపోవడం పంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. బ్యాక్టీరియా యొక్క స్రావాలు ఆమ్లతను (acid) ను కలిగి ఉంటాయి ఇది సంక్రమణకు బాధ్యత వహించే (కలిగించే) ఫలకం మరియు క్షయాలను ఏర్పరుస్తాయి. పంటి ఇన్ఫెక్షన్లకు మరో ప్రధాన కారణం తీపి మరియు పంచదార ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం, ఇది బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుంది.

నిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

పైన పేర్కొన్న సంకేతాలు మరియు లక్షణాలను గమనిస్తే, వెంటనే దంత వైద్యుని అపాయింట్మెంట్ (appointment) తీసుకోవాలి (సంప్రదించాలి). దంత వైద్యులు పంటి ఇన్ఫెక్షన్ యొక్క కారణాన్ని మరియు ఇతర పంటి చిగుళ్లకు చీము వ్యాపించిందా అని తనిఖీ చేస్తారు. అంటువ్యాధి/సంక్రమణ యొక్క పెరుగుదల మరియు వ్యాప్తిని గుర్తించడానికి కొన్ని ఇతర పరీక్షలను కూడా ఆదేశించవచ్చు. సంక్రమణను గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించే పరీక్షలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • సంక్రమణ ప్రదేశాన్ని గుర్తించడానికి ఎక్స్-రే
  • ఓపిజి (OPG) - సంక్రమణ వ్యాప్తిని గుర్తించడానికి దంతాలు మరియు దవడలను పూర్తిగా చూసేందుకు (పరిశీలించేందుకు)

సంక్రమణను నివారించడానికి అత్యంత సాధారణ మరియు ప్రాచీన పద్దతి ఆరోగ్యకరమైన దంత పరిశుభ్రతను పాటించడం. దంతవైద్యులు రోజుకి రెండుసార్లు బ్రష్ చేయాలని మరియు ఫలకం ఏర్పడకుండా ఉండడానికి లేదా సంక్రమణను నివారించడానికి క్రమముగా ప్లాస్సింగ్ (flossing) చెయ్యాలని సిఫారసు చేస్తారు.

అయితే, ఇన్ఫెక్షన్ సంభవించినప్పుడు లేదా వ్యాపిస్తున్నపుడు, యాంటీబయాటిక్స్ తో పాటుగా ఈ క్రింది చికిత్సా ప్రక్రియలు కూడా నిర్వహిస్తారు:

  • చీమును తీసివేయడం- చీము ఏర్పడినట్లయితే, దంతవైద్యులు నొప్పికి ఉపశమనం కలిగించడం కోసం పుండుని తెరిచి చీము తీసివేయవచ్చు.
  • రూట్ కెనాల్ ట్రీట్మెంట్ (Root Canal Treatment) - ఇన్ఫెక్షన్ చిగుళ్ళకి వ్యాపించినట్లయితే, దంతవైద్యులు రూట్ కెనాల్ చికిత్స చేసి ఏర్పడిన చీమును బయటకు తీసేస్తారు.
  • ప్రభావిత పంటిని తొలగించడం - ప్రభావిత పంటిని కాపాడటానికి రూట్ కెనాల్ చికిత్స కూడా సరిపోకపోతే, ఇది చివరి ఎంపికగా పరిగణించబడుతుంది.

ఈ ప్రక్రియలతో పాటుగా సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి దంతవైద్యులు కొన్ని యాంటీబయాటిక్లను కూడా సూచిస్తారు.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Dental abscess.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Tooth abscess
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Periodontitis
  4. Sanders JL, Houck RC. Dental Abscess. [Updated 2018 Dec 13]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  5. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Diabetes, Gum Disease, & Other Dental Problems.

పంటి ఇన్ఫెక్షన్లు వైద్యులు

Dr. Parampreet Kohli Dr. Parampreet Kohli Dentistry
10 Years of Experience
Dr. Priya gupta Dr. Priya gupta Dentistry
2 Years of Experience
Dr. Shrishty Priya Dr. Shrishty Priya Dentistry
6 Years of Experience
Dr. Hanushri Bajaj Dr. Hanushri Bajaj Dentistry
3 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పంటి ఇన్ఫెక్షన్లు కొరకు మందులు

Medicines listed below are available for పంటి ఇన్ఫెక్షన్లు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.