పంటి నొప్పి - Toothache in Telugu

Dr Razi AhsanBDS,MDS

February 06, 2019

March 06, 2020

పంటి నొప్పి
పంటి నొప్పి

సారాంశం

పంటి నొప్పి లేక దంతాల నొప్పి అనునది ప్రపంచవ్యాప్తముగా ఓరల్ (మౌఖిక) దంత వైద్య శిక్షణలో ఒక అత్యంత సాధారణ పరిస్థితిగా కనుగొనబడింది.  ఈ నిర్ధిష్టమైన పరిస్థితిలో, పంటిలో నొప్పి అనునది చెడ్డదైన మానసిక అనుభవం, ఇది కొంత ఉద్దీపనలతో ఆరంభ మవుతుంది మరియు కేంద్ర నాడీ మండలములోని ప్రత్యేకమైన కణాలకు పైగా ప్రసారం చేయబడుతుంది.  ఇది అసౌకర్యము యొక్క సెన్సేషన్, ఒత్తిడి మరియు వేదన కంటే ఎక్కువ లేక తక్కువగా ఉంటుంది. ఒక పంటి నొప్పి అనునది దంత వ్యాధుల వలన , దంత కుహరాలు లేక దంత గాయాల వలన ఏర్పడుతుంది. ఒక పంటినొప్పి అనునది ఒక రెండు విడతల చికిత్స, మొదటిది రోగ నిర్ధారణ మరియు రెండవది దాని యొక్క థెరపీ మరియు చికిత్స.  పంటి నొప్పి అనునది సాధారణముగా, ఓరల్ శుభ్రతను నిర్వహించడము మరియు మందులతో పాటు చేయవలసిన దంతవైద్య పధ్ధతులు చేయడము ద్వారా 2-3 రోజుల లోపల పరిష్కరించవచ్చు.  ఎక్కువగా చదవండి

పంటి నొప్పి యొక్క కారణాలు - Causes of Toothache in Telugu

పంటి నొప్పికి అనేక కారణాలు ఉంటాయి, అందులో ఒక కుహరము, గాయం, పంటి ఎనామిల్ కోత, పళ్లు నూరడం, దంత గడ్డలు, పంటి సూక్ష్మ గ్రాహ్యత, పంటి పగుళ్లు, దెబ్బతిన్న పూరకాలు మరియు పంటి చిగుళ్ల వ్యాధుల వలన నొప్పి ఏర్పడుతుంది.  స్వంతముగా రోగ నిర్ధారణ చేసుకోకూడదని మీకు అధికముగా సిఫార్సు చేయబడింది మరియు పంటి నొప్పి యొక్క వాస్తవ కారణమును నిర్ధారించడానికి డాక్టరు యొక్క సహాయమును తీసుకోవాలని రికమెండ్ చేయబడింది.  

  • పల్పల్ పంటినొప్పి
    ఇది పల్పల్ కణజాలము యొక్క స్పందన లాలాజలం లేక గాలిలోనికి ప్రదర్శించడము వలన ఇది ఏర్పడుతుంది.  ఈ విధమైన పంటి నొప్పి కారణ లోతైన దంత క్షయం, కోత,  పగులు లేక పంటి విభజన.  తీవ్రమైన పల్పల్ పంటినొప్పి యొక్క పరిధి తీపి, వేడి మరియు చలి ద్వారా అప్పుడప్పుడు ఏర్పడిన తీవ్రమైన సున్నితత్వం నుండి భరించలేని తీవ్రత గల ఆకసిక హింసాత్మక కంపన పంటి నొప్పి వరకు ఉంటుంది.
     
  •  చిగుళ్ల యొక్క పంటినొప్పి
    చిగుళ్ళ గాయాలు అనునవి పంటి నొప్పికి ప్రధాన కారణము, అవి గాయం, పంటికి సంబంధించిన నమిలే ఒత్తిడి, ప్రక్కనున్న పంటితో అదనపు సంబంధం కలిగిఉండడం అనునవి ప్రధాన కారణాలు.  ఇతర కారణాలుగా దంత చికిత్స అనగా శుభ్రపరచడం,  పంటి ఇంటర్ఫియరెన్స్, అధిక నింపడం మరియు లోతుగానింపడం,  పంటి కాంటాక్ట్ ప్రాంతముల మధ్య ఖాళీ, మొదలగునవి.  ఇది వీటి యొక్క ఫలితముగా కూడా ఏర్పడుతుంది, అవి పల్పల్ ఇన్ఫెక్షన్ యొక్క సీక్వెల్ మరియు ప్రక్కనే ఉన్న పళ్ల నుండి వాపు యొక్క పొడిగింపు, సైనస్ కుహరము మరియు ఎముక వ్యాప్తి  ఇన్ఫెక్షన్లు. చిగుళ్ల పంటి నొప్పి అనునది పళ్ళు కొరకడం లేక రాత్రి పూట కొరకడం లేక గట్టిగా బిగించడం అనునది కారణముగా పరిగణించబడడము కంటే అనేక పళ్ళు పాల్గొనడం వలన ఏర్పడింధని పరిశీలించబడుతుంది.  వెనుక పళ్ళ వైపు అధిక ఒత్తిడి కూడా ఎముకల మార్పిడి ఫలితము మరియు టిఎమ్ జె లో ప్రమాదకరమైన మార్పులు.  టిఎమ్ జె అనునది కణత ఎముక యొక్క కీళ్లు, ఇవి మాత్రమే ఏకైక కీళ్లు, ఇది మిగిలిన ముఖముకు క్రింది దవడను కలుపుతుంది.  టిఎమ్ జె కి కలిగే గాయాల ఫలితముగా కూడా పంటి నొప్పి ఏర్పడుతుంది.
     
  • పంటి పగులు
    ఇది పగులు లెక చీలిక వలన ఏర్పడుతుంది, ఇది పంటి యొక్క విభిన్న లేయర్లకు(పొరలకు) విస్తరిస్తుంది, అవి ఎనామిల్, దంత ధాతువు లేక గుజ్జు మరియు వాటి ప్రకారముగా లక్షణాలలో వ్యత్యాసముంటుంది.  దంత ధాతువు ప్రాంతములో ఉండే ద్రము యొక్క కదలిక వలన పంటి నొప్పి మారుతుంది, ఈ దంత ధాతువు ప్రాంతమును దంత ధాతువు నాళిక అని పిలుస్తారు.  ఈ ద్రవ కదలిక అనునది పళ్ళ నుండి మనము ఆహారమును తినేటప్పుడు ఏర్పడే ఒత్తిడిలో మార్పు వలన ప్రారంభమవుతుంది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

పంటి నొప్పి యొక్క నివారణ - Prevention of Toothache in Telugu

నోటి నుండి దంత క్షయం, పల్పల్ వ్యాధులు, చిగుళ్ల వ్యాధులు మొదలగునవి తగ్గడం ద్వారా పంటినొప్పిని నివారించవచ్ఛు.  ఇక్కడ కొన్ని స్వీయ-జాగ్రత్త పధ్ధతులు కలవు, వీటిని అనుసరించడం ద్వారా పంటి నొప్పిని నివారించవచ్చు.

  • రోజువారో ఆహారములో వినియోగించే సుక్రోజ్ (చక్కెర) యొక్క పరిమాణమునకు పరిమితిని విధించుట.
  • భోజనం మరియు తినుబండారాల మధ్య తగ్గించడం.
  • రోజుకి రెండు పూటలా పళ్ళను తోముట.
  • బ్యాక్తీరియోసైడల్ మౌత్ వాష్ అనగా క్లోరేక్సైడైన్ వంటివి ఉపయోగించుట.
  • సమయోచిత ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ మరియు జెల్ లను ఉపయోగించుట.
  • ఫైబర్ కలిగిన ఆహారమును తినుట.
  • ఆహారమును సక్రమముగా నమలాలి మరియు మ్రింగాలి.
  • చక్కెర లేని చ్యూయింగ్ గమ్ లను ఉపయోగించాలి.
  • మృదువైన పళ్ళ ఉపరితలం.
  • అన్ని కుహరాలు నింపబడి ఉండాలి.

పంటి నొప్పి యొక్క చికిత్స - Treatment of Toothache in Telugu

పంటినొప్పి యొక్క చికిత్స అనునది రోగ నిర్ధారణ పైన ఆధారపడి ఉంటుంది.   దంత వైద్యులు పంటి నొప్పి ఎందుకు ఏర్పడిందని కనుగొనే సమయములో ఇక్కడ ఇవ్వబడిన పధ్ధతులను అనుసరిస్తారు.  

  • చీమును ఎండీపోజేస్తారు: దంత వైద్యులు చీము మరియు రసాలు ఎండిపోయేలా పధ్ధతులను అనుసరిస్తారు.
  • ప్రత్యక్ష గుజ్జు క్యాపింగ్: వారు సాధారణముగా సూదరింగ్ ద్రావణము లేక కాల్షియమును గుజ్జు జనరేట్ కావడానికి అప్లై చేస్తారు, అయోడోపాం కాల్షియం పేస్ట్ అను దానిని దీని యొక్క ప్రయోజనము కొరకు ఉపయోగిస్తారు.
  • రూట్ కెనాల్ ట్రీట్ మెంట్: ఇది ఒక చాలా సాధారణమైన మరియు బాగా-తెలిసిన పధ్ధతి. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ లేక ఆర్ సిటి అనునది నష్టపోయిన మరియు సంక్రమించిన గుజ్జును తొలగిస్తుంది మరియు గుజ్జు కుహరములోపల గుట్టా-పెర్చా కోన్ లను స్థానములో ఉంచుతారు. అప్పుడు అది నింపబడుతుంది మరియు తరువాత క్యాప్పింగ్ జరుగుతుంది.  ఇది దంత వైద్యుల ద్వారా ప్రస్తుత కాలములో ఎంపిక చేయబడి మరియు అనుసరించబడుచున్న అత్యధిక సాంప్రదాయక చికిత్స. 
  • పన్ను పీకుట: చికిత్స ఎంపికలో చివరిది పన్ను తొలగించబడుట. వైద్యుల ప్రకారముగా, పంటిని రక్షించడానికి చేసిన అన్ని పధ్ధతులు విఫలము అయిపోయిన తరువాత మాత్రమే పన్ను తొలగించు పధ్ధతిని వైద్యులు సూచిస్తారు, లేకపోతే నీవు పంటిని తొలగించుకోవాల్సిన అవసరము ఉండదు.  మానవ శరీరములో ప్రతీ అవయవము తన యొక్క స్వంత ప్రాముఖ్యతను కలిగిఉంటుంది, అందువలన ఓరల్ పరిశుభ్రత అనునది నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలి.  ఒకవేళ ఒక వ్యక్తి పంటిని లేక పళ్ళను తొలగించుకోవలసి వస్తే బాధపడవధ్ధు, దంతవైధ్యములో వచ్చిన ఆధునిక అభివృద్ధితో పంటిని లేక పళ్ళని తొలగించడం సులభము మరియు నొప్పిలేకుండా జరుగుతుంది.  
  • మందులు: ఒకవేళ పంటినొప్పి ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఉదా. డైక్లోఫెనాక్ సోడియం (డైవోన్), ఎల్బుప్రొఫెన్, మొద.. కొన్ని సందర్భాలలో, యాంటీబయాటిక్స్ యొక్క పర్యవేక్షణ, అనగా అమోక్సిసిల్లిన్ మరియు అగ్మెంటిన్ అనునవి సూచించబడతాయి.
  • శస్త్ర చికిత్స: కొన్ని కేసులకి జింజివెక్టమీ మరియు జింజివోప్లాస్టీ, ఫ్లాఫ్ శస్త్ర చికిత్సలు మరియు అంటుకట్టు ప్లేస్మెంట్ అవసరమవుతాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW


వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Toothaches
  2. healthdirect Australia. Toothache and swelling. Australian government: Department of Health
  3. Tara Renton. Dental (Odontogenic) Pain. Rev Pain. 2011 Mar; 5(1): 2–7. PMID: 26527224
  4. Nidirect [Internet]. Government of Northern Ireland; Toothache
  5. Perth Children's Hospital, Government of Western Australia, Department of Health [Internet] Dental - Toothache

పంటి నొప్పి వైద్యులు

Dr. Parampreet Kohli Dr. Parampreet Kohli Dentistry
10 Years of Experience
Dr. Priya gupta Dr. Priya gupta Dentistry
2 Years of Experience
Dr. Shrishty Priya Dr. Shrishty Priya Dentistry
6 Years of Experience
Dr. Hanushri Bajaj Dr. Hanushri Bajaj Dentistry
3 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పంటి నొప్పి కొరకు మందులు

Medicines listed below are available for పంటి నొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.