మాంసకృత్తులు (ప్రోటీన్లు) అనేవి మానవ శరీరం యొక్క సరైన కార్యాచరణకు కావలసిన పోషకాలు. మాంసకృత్తులు శక్తి యొక్క ప్రధాన వనరుగా పనిచేస్తాయి మరియు జీవన  నిర్మాణానికి సోపానాల్ని (building blocks) ఏర్పరుస్తాయి. నిర్మాణాత్మకంగా, ప్రోటీన్లు అనేవి పెద్దవైన మరియు సంక్లిష్టమైన సేంద్రీయ అణువులు. కణజాలం పెరుగుదల మరియు మరమ్మతు కోసం ఈ అణువులు శరీరానికి అవసరం.

మాంసం, కోడి మాంసం, గుడ్లు, సముద్రాహారం (సీఫుడ్), కాయ గింజలు, ఎండు గింజలు, సోయా ఉత్పత్తులు, పాలు మరియు పాల ఉత్పత్తులు, బీన్స్ మరియు బఠాణీలు మాంసకృత్తులకు అత్యంత శ్రీమంత వనరులు, ఇవన్నీ సహజంగా తినడానికి లభిస్తాయి.

మరోవైపు ప్రోటీన్ పొడులు శరీరం యొక్క ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి మనం తీసుకోగల ఒక అనుబంధకాహారం. ఇవి ప్రధానంగా సోయా, బఠానీలు మరియు పాలవిరుగుడు (మజ్జిగ విరిగిన నీళ్ళు) వంటి అధిక ప్రోటీన్ మూలాల నుండి తయారు చేయబడతాయి. ఆహారపు అలవాట్లను బట్టి, ప్రోటీన్ యొక్క అత్యంత విస్తారమైన వనరులైన మాంసం లేదా సముద్రంలో లభించే చేపలు తదితర సముద్రాహారాల్ని (సీఫుడ్లను) మనుషుల్లో అందరూ తినరు.  ఇటువంటి సందర్భాల్లో, ప్రోటీన్లను సరైన మొత్తాల్లో తీసుకోవడం ఒకింత సవాలే అవుతుంది, అలా మాంసాహారాన్ని తిననివారికి ప్రోటీన్ పౌడర్ ఒక వరం అనే నిరూపించవచ్చు.

వీటి ప్రయోజనాల గురించి మరియు ప్రోటీన్ పౌడర్ సేవనం యొక్క అనేక ఇతర ప్రయోజనాలు గురించి తెలుసుకోవడానికి, మరియు మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

(మరింత చదువు:  ప్రోటీన్ ప్రయోజనాలు)

 1. ప్రోటీన్ పౌడర్ యొక్క వనరులు - Sources of protein powder in Telugu
 2. ప్రోటీన్ పౌడర్ ప్రయోజనాలు - Protein powder benefits in Telugu
 3. ఇంట్లోనే తయారైన మాంసకృత్తుల పొడి (ప్రోటీన్ పౌడర్) - Homemade protein powder in Telugu
 4. ప్రోటీన్ పౌడర్ మోతాదు - Protein powder dosage in Telugu
 5. ప్రొటీన్ పౌడర్ దుష్ప్రభావాలు - Side effects of protein powder in Telugu
 6. ఉపసంహారం - Takeaway in Telugu
పురుషులు మరియు మహిళల్లో కండరాలు, బరువు పెరుగుదలకు ప్రోటీన్ పౌడర్ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు వైద్యులు

మార్కెట్లో లభించే ప్రోటీన్ పొడులు వివిధ వనరుల నుండి తీసుకోబడతాయి. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఈ పొడులను తిరిగి మార్పులు-చేర్పులతో సవరించబడతాయి.  నేడు సర్వసాధారణంగా ఉపయోగించే ప్రోటీన్ పొడుల ప్రధాన వనరులు క్రింద ఇవ్వబడ్డాయి.

1. పాలచక్కెరలు (లాక్టోస్) కలిగిన ప్రోటీన్ పౌడర్ :

ఈ ప్రోటీన్ పొడులు పాలు లేదా పాల ఉత్పత్తుల నుండి లభిస్తాయి మరియు కార్బోహైడ్రేట్ పాలచక్కెరల్ని (లాక్టోస్ను) కలిగి ఉంటాయి.

 • వెయ్ ప్రోటీన్ పౌడర్: ప్రోటీన్ పౌడర్ యొక్క అత్యంత సాధారణ మూలం పాలవిరుగుడు ద్రవం, అంటే పాలను పేరబెట్టిన తర్వాత పైన ఏర్పడే తేట ద్రవం, దీన్నే  ‘వెయ్ ప్రోటీన్ పౌడర్’ అనికూడా వ్యవహరిస్తారు. పేరైన పాలపైన ఏర్పడే తేట ద్రవం నుండే ఈ అనుబంధకాహారాన్ని (సప్లిమెంట్ను) తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది పాలలోని ప్రోటీన్ పొడిని పాలలో ఎక్కువగా కరుగుతుంది మరియు మానవ శరీరంలో సులభంగా శోషించదగినది. దీనికి సాధారణంగా అత్యంత ఎక్కువగా ఇష్టపడే జిమ్ ప్రోటీన్ పొడిగా ముద్ర పడిపోయింది.
 • కేసిన్ ప్రోటీన్ పౌడర్: కేసేన్ అనేది పాలలో కనిపించే ఓ ప్రోటీన్, ఇది చాలా నెమ్మదిగా మానవ శరీరంలో జీర్ణమవుతుంది. దీన్ని తరచుగా ప్రోటీన్ యొక్క ఒక 'ఉన్నత' మూలంగా విస్తృతంగా చెప్పబడింది, అయితే దీని ప్రభావం పాలవిరుగుడు పొడిని పోలి ఉంటుంది.

2. పాలచక్కెరలు (లాక్టోస్) లేని ప్రోటీన్ పౌడర్:

ఈ ప్రోటీన్ పొడులు ఎక్కువగా వృక్ష ఆధారిత (plant-based) ఉత్పత్తులు, ఇవి పాల పదార్థాలను కల్గిఉండవు, కాబట్టి వీటిలో పాలచక్కెర (లాక్టోస్) ఉండదు. ఈ రకమైన ప్రోటీన్ పొడులను తరచూ శాకాహారి ప్రోటీన్ పొడులుగా సూచిస్తారు.

 • సోయా ప్రోటీన్ పౌడర్: ఇది సోయాబీన్ మొక్క నుండి పొందిన ప్రోటీన్ పౌడర్ రకం. సోయాబీన్ తగినంత మొత్తంలో ప్రోటీన్ను కలిగి ఉన్నట్లు కనుక్కోబడింది. మొక్క ఆధారితమైన ఈ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్కు మంచి వనరుగా భావిస్తారు.
 • పీ (బఠాణీ) ప్రోటీన్ పౌడర్: ప్రోటీన్ యొక్క మరొక ప్రసిద్ధ మొక్క-ఆధారిత మూలం ‘పీ ప్రోటీన్ పౌడర్’ అంటే బఠాణీ ప్రోటీన్ పొడి. ఇది సాధారణంగా పాలు మరియు జిగట (గ్లూటెన్) పదార్థాలు లేకుండా ఉపయోగించబడుతుంది.
 • దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) ప్రోటీన్ పౌడర్: దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) మాంసకృత్తులకు (ప్రోటీన్) మంచి మూలం, అందుకే బ్రౌన్ బియ్యం ప్రోటీన్ పౌడర్ శాకాహారులు మరియు పాలు పాలఉత్పత్తులు తిననివారికి బాగా ఇష్టమై ప్రాచుర్యం పొందింది. శరీరంపై దంపుడు బియ్యం ప్రోటీన్ పౌడర్ యొక్క ప్రభావాలు కాసైన్ లేదా పాలవిరుగుల ప్రోటీన్ పొడుల మాదిరిగానే ఉంటాయి.

3. గుడ్డు మాంసకృత్తుల పొడి (ఎగ్ ప్రోటీన్ పౌడర్):

గుడ్డు యొక్క తెల్లసొనల (లేక శ్వేతసొనల-egg whites) నుండి ఈ రకమైన గుడ్డు మాంసకృత్తుల పొడి (ఎగ్ ప్రోటీన్ పౌడర్) తయారవుతుంది. గుడ్డులో తెల్లసొనలోని నీటిని   తొలగించి (నిర్జలీకరణము చేసి) చూర్ణంగా చేస్తారు. ఈ గుడ్డు ప్రోటీన్ పొడి మాంసకృత్తులతో పాటు అన్ని అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది.

ప్రోటీన్ పొడి యొక్క ప్రయోజనాలు విస్తారమైనవి, అందువల్లనే అన్ని వయసులవారికి ఇది ఒక ఇష్టమైన అనుబంధకంగా మారింది. ప్రోటీన్ పౌడర్ తీసుకోవడంవల్ల ప్రధాన ప్రయోజనం ఏమంటే ఈ అనుబంధక పదార్ధాలసేవనంచే శరీర ద్రవ్యరాశి పెరుగుతుందని గుర్తించబడింది. ప్రోటీన్ పౌడర్ వినియోగం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు కొన్ని కింద కనబరుస్తున్నాం.

 • బరువు పెరగడానికి సహాయపడుతుంది: ముఖ్యంగా బరువు తక్కువగా (శరీర ద్రవ్యరాశి సూచిక-BMI) ఉన్న వ్యక్తులలో, వారి బరువును పెంచే ప్రయోజనాలకు ప్రోటీన్ పౌడర్ బాగా ఉపకరిస్తుందని  ప్రసిద్ధి చెందింది. కొవ్వు నిల్వలను పెంచకుండా ఇది కండరాల ద్రవ్యరాశిని పెంచుతుంది, మీరు ఆరోగ్యకరమైన బరువును పొందే భరోసానిస్తుందిది.
 • బరువు కోల్పోవడానికి తోడ్పడుతుంది: ఒక నిపుణుడి మార్గదర్శకత్వంలో ఈ ప్రోటీన్ పౌడర్ను తీసుకుంటే మీ బరువు నష్టం ఆహారాలకు ఒక అద్భుతమైన అదనపు అనుబంధక ఆహారంగా ఈ మాంసకృత్తుల పొడి సహాయపడుతుంది.  ఉంటుంది. దీన్ని సేవించినపుడు వ్యక్తి తక్కువగా తినడానికి దోహదపడేలాగున ఇది కడుపులో ఎక్కువసేపు నిల్చి ఉంటుంది మరియు ఆకలిబాధను కూడా నివారిస్తుంది.
 • కండరాల నిర్మాణానికి: ఇటీవలి అధ్యయనాల ప్రకారం, శరీర కండర నిర్మాణానికి తీవ్రమైన శిక్షణతో పాటు ప్రోటీన్ పౌడర్ యొక్క సేవనం శరీరానికి కండరాల ద్రవ్యరాశిని కల్పించేందుకు సహాయపడుతుంది, అదేసమయంలో మీ శరీరంలో తీర్చిదిద్దిన కండర నిర్మాణం మీ సొంతమవుతుంది.
 • మహిళలకు ప్రయోజనాలు: ప్రోటీన్ పౌడర్ వివిధ పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లుతో నిండి ఉంటుంది, దీనివల్ల ఇది పోషక లోపాన్ని నివారిస్తుంది, ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు శరీరంలో బలాన్ని, శక్తివంతమైన కండరాల నిర్మాణాన్ని (toned muscles) నిర్వహిస్తుంది. పాలవిరుగుడు ప్రోటీన్ పౌడర్ సేవనం కూడా కాల్షియం మరియు విటమిన్ డిలను అందిస్తుంది మరియు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
 • రక్తపోటును తగ్గిస్తుంది: లాక్టోకినిన్ల ఉనికి కారణంగా పాలవిరుగుడు ప్రోటీన్ పొడి రక్తపోటును తగ్గిస్తుందని నిరూపితమైంది. అయితే, మీరు గాని ‘హైపర్ టెన్సివ్’ వ్యక్తి అయితే, ప్రోటీన్ పౌడర్ సేవించడానికి ముందు మీరు  మీ డాక్టర్తో మాట్లాడటం మంచిది.

బరువు కోల్పోయేందుకు ప్రోటీన్ పౌడర్ - Protein powder for weight loss in Telugu

బరువు నష్టం నిపుణులు బరువు కోల్పోవడంలో ప్రభావవంతమైన ఫలితాలను అభిలషిస్తున్నవారికి ప్రోటీన్ పౌడర్ సేవనాన్ని సిఫార్సు చేస్తున్నారు. ప్రోటీన్ పౌడర్ యొక్క తగినంత మోతాదుసేవనంవల్ల పొట్టలో సంపూర్ణత్వం భావాన్ని (కడుపు నిండిన భావాన్ని) సాధించటానికి సహాయపడుతుంది. ఇది వ్యక్తి ఎక్కువగా తినడాన్ని, ఇంకా చిరుతిండ్లను మితం మించి తినడం నుండి నిరోధిస్తుంది. కావలసిన బరువు తగ్గించే లక్ష్యం సాధించడానికి మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.

అధిక బరువు ఉన్న వ్యక్తులలో కొవ్వు పదార్ధాలను తగ్గించేందుకు మరియు బరువు తగ్గడంలో పాలవిరుగుడు ప్రోటీన్ పౌడర్ సేవనం సహాయపడగలదని అధ్యయనాలు కనుగొన్నాయి.

కండరాల నిర్మాణానికి ప్రోటీన్ పౌడర్ - Protein powder for muscle building in Telugu

జిమ్ కు వెళ్లే ఔత్సాహికులకు మరియు అథ్లెటిక్కులకు ప్రోటీన్ పౌడర్ అనేది చాలా అవసరమైన వాటిలో ఒకటి. కండరనిర్మాణ అపేక్ష గలవారిలో కండరాలను నిర్మించడానికి అవసరమైన పదార్ధం ఈ ప్రోటీన్ పొడి. శక్తి శిక్షణలో పాల్గొనే ఔత్సాహికుల శరీరంలో కండరాల నిర్మాణాన్ని నిర్వహించడానికి ప్రోటీన్ పొడి చేసే సహాయం చాలా ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు.

ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రోటీన్ పొడి అనుబంధకాల సేవనంవల్ల హెవీ లిఫ్టింగ్ తోపాటు భారీ వ్యాయామాలు చేసే ఆరోగ్యవంతులైన వ్యక్తుల కండరాల శక్తిని మరియు గాత్రాన్ని గణనీయంగా పెంచుతాయి.

బరువు పెరగడానికి ప్రోటీన్ పౌడర్ - Protein powder for weight gain in Telugu

బరువు తక్కువగా ఉన్న వ్యక్తులకు లేదా తక్కువ శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) (శరీర రకం మరియు ఎత్తు ప్రకారం తక్కువ శరీర ద్రవ్యరాశి గలవారికి) గల వ్యక్తులు బరువు పెరగడానికి ప్రోటీన్ పొడులు ప్రభావవంతంగా పని చేస్తాయి. కేవలం కేలరీల సంఖ్యను పెంచడం ద్వారా బరువు పెరగడమనేది సంభవించదు. శరీరంలో కేవలం కొవ్వులు పెరగడానికి బదులుగా పుష్టికరమైన కండరాల నిర్మాణం కావడం జరగాలి. ప్రోటీన్ పౌడర్ సేవనం బరువు పెరిగే ప్రక్రియలో దోహదపడే ఓ సమర్థవంతమైన సాధనం.

ఇతర వనరుల కంటే ప్రోటీన్ పొడి షేక్ సేవనం నుండి గరిష్ట కేలరీలను పొందడమనేది బరువు పెరగడానికి ఉన్న ఉత్తమ పద్ధతుల్లో ఒకటి. సోయా మరియు బఠానీ ప్రోటీన్ పొడులు వంటి మొక్క-ఆధారిత ప్రోటీన్లు సాధారణంగా సమర్థవంతమైన బరువు పెరుగుదలకు సిఫార్సు చేయబడతాయి.

రక్తపోటుకు ప్రోటీన్ పౌడర్ - Protein powder for blood pressure in Telugu

మాంసకృత్తుల పొడి (ప్రోటీన్ పౌడర్), ప్రత్యేకించి పాలవిరుగుడు ప్రోటీన్ పొడి, ని సేవించడంవల్ల రక్తపోటు తగ్గుతుంది. పాలవిరుగుడు ప్రోటీన్ పొడిలో ఉండే లాక్టోకినిన్లు అని పిలువబడే జీవక్రియాశీలక పాదార్థాలు హైపోటాన్సివ్ (రక్తపోటు తగ్గించే) ఏజెంట్ల వలె పని చేస్తాయి. ఇది అధిక రక్తపోటు వలన వచ్చే గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

లాక్టోకినిన్లనబడే జీవక్రియాశీలక పదార్థాల ఉనికి కారణంగా పాలవిరుగుడు ప్రోటీన్ పొడి రక్తపోటును తగ్గించే హైపోటెన్సివ్ (hypotensive) గా అధిక రక్తపోటు రోగులలో రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. అయినప్పటికీ, అధిక రక్తపోటు ఉన్నవారు ప్రోటీన్ పౌడర్ యొక్క సరైన మోతాదుకు సంబంధించి నిపుణ వైద్యునితో సంప్రదించడం ముఖ్యం.

పురుషులకు ప్రోటీన్ పౌడర్ - Protein powder for men in Telugu

దెబ్బతిన్న కండరాల కణాలు మరియు కణజాలాన్ని మరమత్తు చేయడంలో మాంసకృత్తులు (ప్రోటీన్స్) సహాయపడతాయి. ఇది కండరాలను పొందడంలో కూడా సహాయపడుతుంది. తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాల గాయాల నుండి తిరిగి కోలుకోవడానికి ప్రోటీన్ పౌడర్ షేక్స్ ను సేవించవచ్చు. బలం మరియు కండరాల నిర్మాణాన్ని పొందడం కోసం శిక్షణ పొందుతున్న పురుషులు తాము తీవ్ర వ్యాయామం చేసిన తర్వాత ప్రోటీన్ పౌడర్ షేక్ లను తాగేందుకు ఇష్టపడతారు.

పురుషులకు చాలా తరచుగా సిఫార్సు చేయబడిన ప్రోటీన్ పౌడర్ ఏదంటే పాలవిరుగుడు ప్రొటీన్ పొడి, ఎందుకంటే పాలవిరుగుడు ప్రోటీన్ పౌడర్ పురుషులకు కండరాలు పొందడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, పాలవిరుగుడు ప్రోటీన్లలో కండరాలను పెంపొందించే ప్రక్రియను వేగవంతం చేయగల కార్బోహైడ్రేట్లనుకూడా ఇది కలిగి ఉంటుంది.

సోయా (soy) ప్రోటీన్ పౌడర్ను పురుషులు ఉపయోగించడం జరుగుతుంది. సోయా ప్రోటీన్ పొడి నైట్రిక్ ఆక్సైడ్లను సమృద్ధిగా కల్గి ఉంటుంది, కాబట్టి, పెరుగుదలకు తోడ్పడే హార్మోన్ విడుదలను ప్రోత్సహించడం ద్వారా కండరాల రికవరీ ప్రక్రియను ఇది పెంచుతుంది.

(మరింత చదువు: కండరాల తిమ్మిరి నిర్వహణ)

మహిళలకు ప్రోటీన్ పౌడర్ - Protein powder for women in Telugu

ఆధునిక కాలంలో మహిళలు తమ శరీరాన్ని ఆరోగ్యాంగా మరియు దృఢంగా ఉంచుకోవడంలో ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. మహిళలకు ప్రోటీన్ పొడులు అదనపు బరువును తగ్గించుకోవడానికి, శక్తిని పొందేందుకు మరియు అవసరమైన కండరాల స్థాయిని సాధించడానికి సమర్థవంతమైన మార్గంగా చెప్పవచ్చు. ప్రోటీన్ పొడులు ఇతర చిరుతిండ్లకు (స్నాక్స్ కు) ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. మహిళలు తప్పనిసరిగా ఏవైనా ఆహార లోపాలను నివారించడానికి అవసరమైన పోషక స్థాయిలు తమ శరీరానికి అందేలా చూసుకోవాలి. కాబట్టి మహిళలకు ప్రోటీన్ పొడులు అన్ని విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర అవసరమైన పోషకాలను సాధారణంగా మహిళలకి అందజేయడానికి ప్యాక్ చేయబడతాయి.

మహిళలకు అత్యంత అనుకూలమైన ప్రోటీన్ పౌడర్ కాల్షియం మరియు విటమిన్ డి కలిగిన పాలవిరుగుడు ప్రోటీన్ పౌడర్ (whey protein powder). ఈ పాలవిరుగుడు ప్రోటీన్ పౌడర్ మహిళలకు కండర కణజాలం మరమత్తులో సహాయపడుతుంది, అయితే కాల్షియం మరియు విటమిన్ డి ఆరోగ్యకరమైన ఎముకల నిర్వహణకు అవసరం. అంతేకాకుండా, ఈ పొడిలో కొవ్వు పదార్ధం తక్కువగా ఉంటుంది, ఇది సమర్థవంతంగా బరువు తగ్గడానికి మరియు సన్నని కండర ద్రవ్యరాశిని పొందడంలో సహాయపడుతుంది.

అవసరమైన విటమిన్లను కలిగిఉన్న పాలవిరుగుడు మాంసకృత్తుల పొడి (వెయ్ ప్రోటీన్ పౌడర్), మహిళలకు అమితంగా సిఫార్సు చేయబడిన ప్రోటీన్ పౌడర్.

పదార్థాల సరైన మిశ్రమంతో ఇంట్లోనే మాంసకృత్తుల పొడిని (ప్రోటీన్ పొడిని) తయారు చేయడం చాలా సులభం. ఇంటిలోనే తయారుచేయబడిన ప్రోటీన్ పొడులు ఎలాంటి  కృత్రిమ స్వీటెనర్లను మరియు ప్రిజర్వేటర్లను (artificial sweeteners and preservatives) కలిగి ఉండవు కాబట్టి వాటి దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. ఇంట్లోనే తయారు చేసుకునే మాంసకృత్తుల పొడి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఆ పొడిలో మనకు ఇష్టమైన పోషకాల్ని, సువాసనలను చేర్చుకుని రుచికరంగా తయారు చేసుకోవచ్చు.  .

ఇంట్లోనే మాంసకృత్తుల (ప్రోటీన్) పొడిని తయారు చేసుకోవడమెలా?

ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని ఓ వంటకంలా తయారు చేసుకోవడం చాలా సులభం. క్రింద ఇవ్వబడిన వివరమైన ప్రక్రియను అనుసరించడం ద్వారా మీరు  కూడా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ను తయారు చేసుకోవచ్చు.

ఇంట్లో ప్రోటీన్ పౌడర్ ను తయారు చేయటం కోసం కావలసినవ పదార్దాలు

 • 3 కప్పులు (240 గ్రాములు) కొవ్వుల్లేని తక్షణ పాలపొడి, 3 కప్పుల పొడిని వేర్వేరుగానే ఉంచండి  
 • 1 కప్పు (80 గ్రాములు) తక్షణ డ్రై (ఎండిన) వోట్స్
 • 1 కప్ (142 గ్రాముల) బాదం పప్పులు
 • మీరు ఎంపిక చేసుకున్న ఏదైనా సువాసన

మాంసకృత్తుల పొడిని ఇంట్లోనే తయారు చేసుకునే విధానం

 1. తక్షణ పాలపొడిని (instant dry milk)  1 కప్పు, 1 కప్ వోట్స్, 1 కప్పు బాదం పప్పుల్ని ఒక బ్లెండర్లోకి తీసుకుని కలపాలి. బ్లెండర్లోనే మృదువుగా రుబ్బుకోవాలి.
 2. ఇపుడు మిగిలిన తక్షణ పాలపొడిని కూడా బ్లెండర్లోకి  జోడించండి మరియు పూర్తిగా మిళితం అయ్యేంతవరకూ మెత్తని పిండిగా రుబ్బండి.
 3. ఒక గాలి చొరని (airtight) కంటైనర్ లోకి మిశ్రమాన్ని వంచుకుని మూతను బిగుతుగా  పెట్టండి.
 4. మీరు 2 వారాలలోగానే ఈ మాంసకృత్తుల పొడిని (ప్రోటీన్ పొడిని) ఉపయోగించాలని అనుకుంటుంటే గదిలో ఉండే చల్లని ఉష్ణోగ్రత వద్దనే దాన్ని నిల్వ చేయండి.
 5. మీరు ఈ మాంసకృత్తుల పొడిని (ప్రోటీన్ పొడిని) సుదీర్ఘకాలంపాటు నిల్వచేయాలని అనుకుంటూంటే మిశ్రమంలోని గింజపదార్థం ఆమ్లత్వాన్ని పొందకుండా నిరోధించడానికి మిశ్రమాన్ని సరిగా భద్రపరచండి.

ఇంట్లో ప్రోటీన్ పౌడర్ ను ఎలా ఉపయోగించాలి

 • 1/2 కప్పు ప్రోటీన్ పౌడర్ను తీసుకోండి, మరో  బ్లెండర్లో 1 / 2-1 కప్ ద్రవాహారాన్ని (పాలు / వెచ్చని నీరు / పండ్లరసం) తీసుకుని అందులో ఈ పౌడర్ని కలపాలి.
 • పొడిలోని వోట్స్ బాగా  బొద్దుగా ఉబ్బడం కోసం 5-10 నిమిషాలు పాటు ఆ మిశ్రమాన్ని బ్లెండర్లోనే ఉండనివ్వండి.
 • ఇపుడు ఇంట్లో తయారైన ప్రోటీన్ పౌడర్ సేవించడానికి  సిద్ధంగా ఉంది.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

ప్రోటీన్ పౌడర్ యొక్క మోతాదు ప్రోటీన్ పౌడర్ యొక్క వినియోగంపై ఆధారపడి ఉంటుంది, ఇది శరీర ద్రవ్యరాశి రకం కావాల్సినది. మోతాదు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. అందువల్ల ప్రోటీన్ పౌడర్ యొక్క సరైన మోతాదుకు సంబంధించి ఒక వైద్యుడిని లేదా వైద్యుని సంప్రదించండి.

తగిన మోతాదుల్లో ప్రోటీన్ పౌడర్ను అనుబంధకంగా సేవించినపుడు అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఏది ఏమయినప్పటికీ, పర్యవేక్షణ లేని మరియు మితిమీరిన సేవనం తీవ్రమైన దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. నియంత్రణ లేని ప్రోటీన్ పొడి సేవనం వలన సర్వసాధారణంగా సంభవించే దుష్ప్రభావాలు క్రింద పేర్కొనబడ్డాయి.

 • జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది:
  పాల విరుగుడుకు సంబంధించిన ‘వెయ్ ప్రోటీన్ పౌడర్’ మరియు ‘కేసిన్ ప్రోటీన్ పౌడర్’ అనేవి రెండు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోటీన్ పౌడర్ పదార్ధాలు, ఇవి పాలు ఉత్పత్తులు. ఈ ప్రోటీన్ పొడుల్లో లాక్టోస్ (పాలచక్కెర) పుటుంది, పాలల్లో సహజంగా ఉండే కార్బోహైడ్రేట్ ఉంటుంది. పాలచక్కెరలకు అసహనం కల్గిన వ్యక్తులు, ఈ ప్రోటీన్ పొడులను ఉపయోగించకూడదు,  ఎందుకంటే అవి దుష్ప్రభావాలను కల్గిస్తాయి. ఈ ప్రోటీన్లను అధికంగా తీసుకోవడం కూడా అధిక ప్రేగుల కదలికలు, ఉబ్బరం , వికారం మరియు అతిసారం వంటి రుగ్మతలకు వాటికికారణమవుతుంది .
 • అనారోగ్యకరమైన బరువు పెరుగుదల:
  అధిక పరిమాణంలో తీసుకుంటే, ప్రోటీన్ మందులు కూడా కొవ్వు రూపంలో అవాంఛితమైన బరువు పెరుగుదలకు దారితీయవచ్చు. వ్యాయామం పాలన ప్రోటీన్ల సేవనకు సరిపోలాలి, లేదంటే ఉపయోగించబడని (unutilized) కేలరీలు కొవ్వులుగా మారిపోతాయి. శరీరంలో ఈ కొవ్వులు జమవటంవల్ల స్వల్ప కాలంలోనే అధిక బరువు పెరుగుటకు దారితీస్తుంది.
 • కిడ్నీ నష్టం:
  అమ్మోనియా అనేది ప్రోటీన్ జీవక్రియ ఫలితంగా ఉత్పత్తి చేయబడిన ఒక ఉప ఉత్పత్తి (బై-ప్రాడక్ట్). అమ్మోనియా యూరియాగా మార్చబడుతుంది, ఇది మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగించబడుతుంది. ప్రోటీన్ ను అధిక మొత్తంలో సేవించే ఒక వ్యక్తి ఎక్కువ మొత్తం యూరియాను కూడా విసర్జిస్తాడు. ఇది రక్తం నుండి పెద్ద మొత్తంలో యూరియాను ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని  మోపుతుంది. సుదీర్ఘ కాలంలో పెద్ద పరిమాణంలో తీసుకునే ప్రోటీన్ మూత్రపిండ (మూత్రపిండ-సంబంధిత) రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది.
 • రక్తపోటు అధికంగా తగ్గడం:
  అధిక రక్తపోటు వ్యాధికి మందులు తీసుకునేవాళ్ళు ఈ ప్రోటీన్ పొడి అనుబంధక  ఆహార పదార్ధాలను వాడటం ద్వారా వారి రక్తపోటు విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంది, కాబట్టి ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్లను తీసుకునే ముందు అలాంటివాళ్ళు వారి వైద్యుడిని సంప్రదించాలి. (మరింత చదువు: అధిక రక్తపోటు లక్షణాలు )
 • కాలేయాన్ని దెబ్బ తీస్తుంది:
  కార్బోహైడ్రేట్స్ లేకుండా కేవలం ప్రోటీన్ సప్లిమెంట్లతో కూడిన ఆహారం వ్యక్తిని కేటోసిస్ కు  గురయ్యేట్లు చేస్తుంది. కేటోసిస్ అనే పరిస్థితి శరీర జీవక్రియ శక్తి యొక్క ప్రధాన వనరుగా కొవ్వును ఉపయోగించుకునే ఒక స్థితి. ఈ పరిస్థితి రక్తంలో అధిక స్థాయిలో ఆమ్లత్వానికి దారితీస్తుంది. నిరంతరాయంగా ఆమ్లత్వంతో కూడుకొని ఉండే రక్తం కాలేయం పనితీరును బలహీనపరుస్తుందని కనుక్కోవడం జరిగింది.  ఇది తీవ్రమైన కాలేయవాపు-మంటను కలుగజేస్తుంది, ఫలితంగా తీవ్ర కాలేయ రుగ్మతలు సంభవించవచ్చు.
 • నిర్జలీకరణము:
  ప్రోటీన్ యొక్క అధిక మొత్తాలు (శరీరంలో) నిర్జలీకరణకు దారి తీస్తుంది. మాంసకృత్తుల్ని ఎక్కువగా తీసుకొంటున్నపుడు పెద్ద మొత్తంలో నీరు తాగడం కూడా చాలా అవసరం.
 • మొటిమలు:
  పాలు లేక పెరుగు విరిగిన నీళ్లు (వెయ్ ప్రోటీన్) IGF లేదా ఇన్సులిన్-వంటి పెరుగుదల కారక హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ హార్మోన్ ఫలితంగా జిడ్డు (sebum) ఉత్పత్తి అయ్యి మొటిమలు అభివృద్ధి చెందుతాయి
 • భారీలోహ విషప్రయోగం:
  కొన్ని భారీ లోహాలైన సీసం మరియు పాషాణాలు ప్రోటీన్ సప్లిమెంట్లలో చేర్చబడుతున్నాయి. ఈ లోహాలు శరీరంలో జమై, ఆపైన భారీలోహ విషపూరితానికి (for heavy metal poisoning) కారణం కావచ్చు. ఇటువంటి భయాల్ని నివారించడానికి, ఇంట్లోనే తయారైన ప్రోటీన్ పొడులను ఉపయోగించడం సురక్షితమైనది.
Shilajit Resin
₹845  ₹1299  34% OFF
BUY NOW

ప్రోటీన్ ఆహారంలో అనివార్యమైన భాగం, కానీ అధిక పరిమాణంలో ప్రొటెయిన్లను తీసుకోవడం మంచిది కాదు. అందువల్ల, వ్యక్తి తన ఆరోగ్య అవసరాలకు తగినంతగా ప్రోటీన్లను తీసుకొనేట్లు చూసుకోవాలి, కానీ అధికంగా సేవించకుండా ఉండేవిధంగా నిర్ధారించుకోవాలి. ప్రోటీన్ సప్లిమెంట్ల సేవనం మొదలుపెట్టే ముందు మీరు మీ వైద్యుడితో సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

Dr. Dhanamjaya D

Dr. Dhanamjaya D

Nutritionist
16 Years of Experience

Dt. Surbhi Upadhyay

Dt. Surbhi Upadhyay

Nutritionist
3 Years of Experience

Dt. Manjari Purwar

Dt. Manjari Purwar

Nutritionist
11 Years of Experience

Dt. Akanksha Mishra

Dt. Akanksha Mishra

Nutritionist
8 Years of Experience

వనరులు

 1. Jooyoung Kim, Chulhyun Lee, Joohyung Lee. Effect of timing of whey protein supplement on muscle damage markers after eccentric exercise. J Exerc Rehabil. 2017 Aug; 13(4): 436–440. PMID: 29114510
 2. Pasiakos SM, Lieberman HR, McLellan TM. Effects of protein supplements on muscle damage, soreness and recovery of muscle function and physical performance: a systematic review. Sports Med. 2014 May;44(5):655-70. PMID: 24435468
 3. Office of Disease Prevention and Health Promotion. Nutritional Goals for Age-Sex Groups Based on Dietary Reference Intakes and Dietary Guidelines Recommendations. [Internet]
 4. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. The hidden dangers of protein powders. Harvard University, Cambridge, Massachusetts.
 5. Kimball SR, Jefferson LS. Signaling pathways and molecular mechanisms through which branched-chain amino acids mediate translational control of protein synthesis. J Nutr. 2006 Jan;136(1 Suppl):227S-31S. PMID: 16365087
 6. Sheikholeslami Vatani D, Ahmadi Kani Golzar F. Changes in antioxidant status and cardiovascular risk factors of overweight young men after six weeks supplementation of whey protein isolate and resistance training. Appetite. 2012 Dec;59(3):673-8. PMID: 22889987
Read on app