గర్భం దాల్చడం ఒక స్త్రీ తన జీవితంలో అనుభవించే అతిముఖ్యమైన ఆనందాలలో ఒకటి. ఇంకా ఖచ్చితంగా తెలియకముందే, ఆమె మానసిక స్థితి మరియు శరీరంలో అసాధారణమైన మార్పులను గమనిస్తుంది, ఉదాహరణకు, ఋతుచక్రాలు సమయానికి రావు, త్వరగా అలసిపోతారు మరియు వికారంగా ఉంటుంది, ఇది అప్పుడు తను గర్భవతా? అనే సందేహాన్ని కలిగిస్తుంది- ఈ వ్యాసంలో, మేము వివిధ సంకేతాలు మరియు లక్షణాలు, శారీరక మార్పులు, ఆహారం, మీరు అనుసరించాల్సిన నిర్ధారణ పరీక్షలు మరియు మొదటి నెల గర్భవతిగా ఉన్నప్పుడు చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి వివరించాము.

  1. 1 వ నెల ప్రెగ్నన్సీ యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు - Common signs and symptoms for 1st-month pregnancy in Telugu
  2. గర్భం దాల్చిన మొదటి నెలలో శిశువు - Baby during 1 month of pregnancy in Telugu
  3. మొదటి నెల గర్భవతిగా ఉన్నపుడు ఏమి తినాలి - What to eat during the 1st month of pregnancy in Telugu
  4. మొదటి నెల గర్భంలో అనుసరించాల్సిన/చేయవలసిన వ్యాయామాలు - Exercises to follow during the first month of pregnancy in Telugu
  5. మొదటి నెల గర్భం కోసం చిట్కాలు - Tips for 1st-month pregnancy in Telugu

స్త్రీ గర్భం యొక్క మొదటి నెలలో, ఆమె వైవిధ్యమైన సంకేతాలు మరియు లక్షణాలను అనుభవించవచ్చు. ఈ సంకేతాలు ఋతుక్రమ లక్షణాలతో పోలి ఉన్నప్పటికీ, ఋతుక్రమ సమయం దాటిపోవడం (నెల తప్పడం) అనేది చాలా మంది మహిళలు ఆధారపడే సంకేతాలలో ఒకటి. ఈ సంకేతాలు ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటాయి మరియు వివిధ సమయాల్లో కూడా అనుభవించబడతాయి. కొందరు మొదటి వారంలోనే సంకేతాలను అనుభూతి చెందుతారు మరియు కొందరు గర్భం యొక్క మూడవ వారం తర్వాత వాటిని అనుభవించవచ్చు. మొదటి నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఈ  కింద ఇవ్వబడిన సంకేతాలు మరియు లక్షణాలు కలుగవచ్చు.

  1. ఋతుక్రమ సమయం దాటిపోవడం (నెల తప్పిపోవడం)- చాలా మంది ఋతుస్రావ సమయాన్నిదాటిపోయారని గమనిస్తారు లేదా ఇంప్లాంటేషన్ రక్తస్రావంతో పొరబడతారు. ఋతుక్రమ సమయం దాటిపోవడం చాలా మందిలో గుర్తించదగిన లక్షణం, అయితే, సాధారణంగా ఋతుక్రమాలు సక్రమంగా లేనివారికి, ఈ సంకేతం తప్పుదారి పట్టించగలదు. (మరింత చదవండి: గర్భధారణ సమయంలో ఋతుచక్రం)
  2. కొద్దిగా స్పాటింగ్- దీనిని ఇంప్లాంటేషన్ రక్తస్రావం అని కూడా పిలుస్తారు, గర్భం దాల్చిన 10-14 రోజుల తరువాత స్పాటింగ్ జరుగుతుంది. ఈ రక్తం చుక్కలు (స్పాటింగ్) సాధారణ రుతుస్రావ రక్తం కంటే తేలిక (లైట్) రంగులో ఉంటుంది మరియు రక్తస్రావం కూడా తక్కువగా ఉంటుంది, కాని అది కూడా ఋతుక్రమంగా పొరపాటు కలిగించవచ్చు.
  3. సున్నితమైన రొమ్ములు- సున్నితమైన రొమ్ములు కూడా ప్రీమెన్‌స్ట్రువల్ (ఋతుస్రావము ముందు) లక్షణాలతో (పిఎంఎస్) మళ్లీ గందరగోళానికి గురిచేస్తాయి, అయితే గర్భధారణ సమయంలో సున్నితత్వం ఋతుస్రావ సమయంలో ఉండే దానికంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో హార్మోన్ స్థాయిలు పెరగడం వలన అవి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి మరియు రొమ్ము కణజాలంలో మార్పులకు దారితీస్తాయి, ఇది రొమ్ములు వాచిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది స్పర్శకు అసాధారణమైన సున్నితంగా, నొప్పిగా మరియు ఇబ్బందిగా ఉంటుంది.
  4. మానసిక మార్పులు (మూడ్ స్వింగ్లు)- గర్భధారణ సమయంలో, మనస్థితి అనూహ్యముగా ఉంటుంది. స్త్రీ, తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతుందని గ్రహించవచ్చు. హార్మోన్ల స్థాయిలలో గణనీయమైన మార్పులు కలుగడం వలన అది వారి న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. న్యూరోట్రాన్స్మిటర్లు మానసిక స్థితిని నియంత్రించే మెదడు యొక్క  రసాయనాలు (కెమికల్స్).
  5. యోని స్రావాలు పెరగడం- ప్రెగ్నన్సీ యొక్క మొదటి వారంలో, అధికమైన మందపాటి లేదా తెల్లని యోని స్రావాన్ని (తెల్లబట్ట) అనుభవించవచ్చు, సాధారణంగా ఋతుస్రావం దాటిపోయిన సమయంలో ఇది ఏర్పడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల జరుగుతుంది, అది శ్లేష్మ (మ్యూకస్) స్రావానికి దారితీస్తుంది.
  6. అలసట- గర్భధారణ ప్రారంభంలో, అలసటగా అనిపించవచ్చు, ఇది తల్లి కాబోతున్నవారిలో సాధారణం. ఇది హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చు. సాధారణంగా 12 వారాల గర్భవతి అయ్యే వరకు ఇది ఉంటుంది.
  7. ఉదయపు అనారోగ్యం మరియు వికారం- సాధారణంగా, ఉదయపు అనారోగ్యంలో వాంతులు, వికారం, మైకము, తలనొప్పి మరియు గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది ఉదయం అనారోగ్యం అనే పేరుతో సంబంధం లేకుండా పగలు మరియు రాత్రి ఏ సమయంలోనైనా జరుగవచ్చు. ప్రతి స్త్రీలో, లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఇది మొదటి 4 వారాలలో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు సాధారణంగా రెండవ త్రైమాసికానికి చేరుకునే సమయానికి తగ్గిపోతుంది.
Antifungal Cream
₹629  ₹699  10% OFF
BUY NOW

మొదటి నెల మొదటి వారంలో, ఫలదీకరణ చెందిన అండం పిండంగా పెరుగుతుంది. గర్భం దాల్చిన 3 రోజుల తరువాత పిండం గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. దాదాపు ఒక వారం తరువాత, పిండం గర్భాశయ (యుటిరైన్) క్యావిటీలో అంటుకుంటుంది, తర్వాత గర్భధారణ సమయం అంతటా పిండం అక్కడే ఉంటుంది.

రెండవ వారంలో, పిండం పోషకాలను  తల్లి ద్వారా అందుకుంటుంది. బొడ్డు తాడు మరియు మాయ (ప్లాసెంటా) ఏర్పడటం ప్రారంభమైనప్పుడు ఇది జరుగుతుంది. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది.

మూడవ వారంలో, అవయవాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి. గుండె ఏర్పడుతుంది. నాడీ వ్యవస్థ వెన్నుపాము మరియు మెదడుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది.

నాల్గవ వారంలో, చేతులు మరియు కాళ్ళు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి; కంటి-సాకెట్లు ఏర్పడతాయి మరియు దాదాపు అన్ని అంతర్గత అవయవాల యొక్క మూలాధారాలు ఏర్పడడం పూర్తవుటుంది. పిండం యొక్క పరిమాణం ఇప్పుడు 4 మిమీ, దానిని బియ్యం గింజతో పోల్చవచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు అదనపు పోషకాలను మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని మనకు బాగా తెలుసు. అది మీ గురించి కాదు, ఈసారి మీ బిడ్డ గురించి. మొదటి నెల గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి తినాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విభాగంలో, మొదటి నెల గర్భధారణ సమయంలో మీరు మీ ఆహారంలో చేర్చగల వివిధ ఆహార పదార్దాల గురించి చర్చించబడింది. మిమ్మల్ని మరియు మీ బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి తినవలసిన ఆహారాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

  1. ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు: ఫోలిక్ ఆమ్లం న్యూరల్ ట్యూబ్ లోపాలను (neural tube defects [NTDs]) నివారించడంలో సహాయపడుతుంది - వెన్నుపాము (స్పినా బిఫిడా వంటివి) మరియు మెదడు (ఎనెన్స్‌ఫాలీ వంటివి) యొక్క తీవ్రమైన జనన లోపాలు. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. కాయధాన్యాలు, గుడ్లు, ఆకుకూరలు, బ్రోకలీ, బీట్రూట్, అరటిపండ్లు వంటివి  ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాలు.
  2. విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహారాలు: విటమిన్ బి 6 తీసుకోవడం వలన అది చాలా మంది గర్భిణీ స్త్రీలలో వికారం మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు నిర్ధారించాయి. హోల్‌గ్రేన్ గోధుమలు మరియు ఇతర తృణధాన్యాలు, విత్తనాలు మరియు గింజలు (నట్స్), అరటిపండ్లు వంటి పండ్లలో, చేపలు మరియు లీన్ మాంసాలలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది మరియు వాటిని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలి.
  3. మొదటి నెలలో తినవలసిన పండ్లు: కమలాలు మరియు మామిడి పండ్లు విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం యొక్క వనరులుగా ఉంటాయి, ఆప్రికాట్లు, పియర్ పండు మరియు దానిమ్మ వంటి పండ్లు ఇనుము, కాల్షియం, విటమిన్ కె, పొటాషియం మరియు ఫైబర్లను  పుష్కలంగా అందించగలవు. పండ్లు సాధారణ ఆహారం కంటే కూడా ఎక్కువగా అయోడిన్ యొక్క గొప్ప వనరులు.
  4. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తులలో కేసిన్ మరియు వెయ్ ప్రోటీన్ అనే అధిక-నాణ్యతగల (high-quality) ప్రోటీన్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు కాల్షియం యొక్క ఉత్తమ ఆహార వనరులు మరియు అధిక మొత్తంలో ఫాస్పరస్, వివిధ బి విటమిన్లు, మెగ్నీషియం మరియు జింక్ను అందిస్తాయి. గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్రారంభంలోనే పాలు తాగడం మరియు ఎక్కువ పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.
  5. మొదటి నెల ప్రెగ్నెన్సీలో గుడ్లు: గుడ్లు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం, ఇవి మీకు మరియు ప్రారంభ పెరుగుదల సమయంలో మీ బిడ్డకు చాలా అవసరం. గుడ్లలో రోగనిరోధక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన విటమిన్ డి మరియు విటమిన్ బి-12 కూడా ఉంటాయి. పచ్చి లేదా ఉడికించని గుడ్లు తినడం కాకుండా, గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినమని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది గుడ్డులో ఏదైనా హానికరమైన బ్యాక్టీరియా ఉంటే వాటిని తొలగిస్తుంది.
  6. మొదటి నెల గర్భధారణ సమయంలో ఇనుము అధికంగా ఉండే ఆహారాలు: డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బంగాళాదుంపలు, బ్రోకలీ, దుంపలు మరియు మొలకలు ఇనుములో సమృద్ధిగా ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి మరియు ఆరోగ్యకరమైన శిశువు పెరుగుదలకు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం అవసరం.
  7. మొదటి నెలలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు: గర్భిణీ స్త్రీలు తరచుగా మలబద్ధకం, విరేచనాలు లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడవల్సివుంటుంది. ఫైబర్ పరిమాణం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఇవన్నీ నివారించడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్దాలు ఆహారం యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి, మలబద్ధకం మరియు గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగకుండా నిరోధించడంలో కూడా సహాయపడతాయి. నారింజ, ఆపిల్, క్యారెట్లు, పట్టు తక్కువ పెట్టిన బియ్యం, వోట్స్, కాయధాన్యాలు, బాదం మరియు కొబ్బరికాయలు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు.
  8. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు: శిశువు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది చర్మం, కండరాలు, జుట్టు మరియు ఎముకలను ఏర్పరచడానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్‌గా పనిచేస్తుంది. గుడ్లు, మాంసం, చేపలు, కాయధాన్యాలు, సోయాబీన్స్, గింజలు (నట్స్), ధాన్యాలు అన్నింటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల, గర్భధారణ సమయ ప్రారంభం నుండే మీ ప్రోటీన్ తీసుకోవడంపై అదనపు శ్రద్ధ పెట్టాలి.

గర్భధారణ సమయంలో మరియు తరువాత మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం వ్యాయామం ఒక సులభమైన మార్గం. తక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలు, నడక, యోగా మరియు ఈత వంటివి ఏ దశలోనైనా సురక్షితమైనవిగా ఉంటాయి. వ్యాయామం బరువు పెరుగడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, బరువును మోయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది మరియు ప్రసవాన్ని కూడా సులభం చేస్తుంది. అయితే, వీటిలో దేనినైనా ఎంచుకునే ముందు ఒకసారి గైనకోలజిస్ట్ సంప్రదించడం ఎల్లప్పుడూ ముఖ్యం.

Nimbadi Churna
₹405  ₹450  10% OFF
BUY NOW

1 వ నెల గర్భంలో చేయవలసినవి

  1. గర్భ నిర్దారణ పరీక్ష సానుకూలంగా (పాజిటివ్) వచ్చిన  తర్వాత, ప్రినేటల్ పరీక్షల కోసం గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
  2. వైద్యులు సూచించినట్లుగా, మీరు గర్భధారణ నిర్ధారణ కోసం రక్త పరీక్ష, హెచ్‌సిజి పరీక్ష (hCG test) మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిల పరీక్షతో  సహా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
  3. మలబద్ధకంగా అనిపించవచ్చు కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం మంచిది.
  4. మీకు ప్రయోజనకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించండి (పైన చెప్పినవి).
  5. సరైన నిద్ర తీసుకోండి
  6. గైనకాలజిస్ట్‌ మిమ్మల్ని అనుమతించినట్లయితే మాత్రమే సెక్స్ చేయండి. మీ పిండం స్థానం కిందకి ఉండవచ్చు.
  7. గైనకాలజిస్ట్‌ సూచించిన విధంగా మీ ప్రినేటల్ సప్లిమెంట్లను జాగ్రత్తగా తీసుకోండి.
  8. వ్యాధికారక వస్తువులు మరియు పరిసరాల నుండి దూరంగా ఉండండి
  9. ధ్యానం చేయండి
  10. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి

1 వ నెల గర్భధారణలో చేయకూడనివి

  1. ఇద్దరి కోసం తినాలనే ఆలోచనతో అతిగా తినకండి
  2. ధూమపానం చేయవద్దు లేదా మద్యం తీసుకోవద్దు
  3. తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు
  4. పచ్చి మాంసం తినవద్దు
  5. కెఫిన్ ఎక్కువ తీసుకోవద్దు
  6. డ్రగ్స్ తీసుకోకండి
  7. గర్భధారణలో డెయిటింగ్ చేయకండి
  8. ఆవిరి మరియు అధిక వేడి నీటి స్నానం చేయవద్దు
  9. ఎటువంటి సూచించని మందులు తీసుకోకండి
  10. అధిక ఒత్తిడికి గురికావద్దు

వనరులు

  1. Noel M. Lee, Sumona Saha. Nausea and Vomiting of Pregnancy . Gastroenterol Clin North Am. 2011 Jun; 40(2): 309–vii. PMID: 21601782
  2. H. Danielewicz et al. Diet in pregnancy—more than food . Eur J Pediatr. 2017; 176(12): 1573–1579. PMID: 29101450
  3. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Stages of pregnancy.
  4. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Body changes and discomforts.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Fetal development
Read on app