తమ శరీరంలో ఏర్పడ్డ అదనపు కొవ్వును కోల్పోవడం అనేది అందం మరియు ఆరోగ్యం గురించి ఆందోళన పడే ప్రతి ఒక్కరినీ కలవరపరిచే విషయమే. కొన్నిసార్లు, మీ ఎగువ శరీరంలో చేతులు లేదా ఉదరం వంటి భాగాల్లో అదనపు కొవ్వు లేదా సెల్యులైట్ అనే కొవ్వు పేరుకుని ఉండవచ్చు మరియు కొన్నిసార్లు, మీ దిగువ శరీరంలో తొడలు, తుంటిభాగం లేదా పిక్కల భాగంలో కొవ్వు ఉండవచ్చు. ఈ కొవ్వును వదిలించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు, వ్యాయామం, ఆహారంలో మార్పులు మరియు ఇంకా ఏమి కాదు? ఎన్నో చేస్తుంటారు.

తొడల్లో కొవ్వు జమవడమనేది 80 నుంచి 90 శాతం మంది మహిళల్లో సంభవిస్తుంది మరియు పురుషులలో ఈ తొందర చాలా తక్కువ. ఆడవారిలో తొడలు, తుంటిభాగం మరియు వక్షోజాలలో కొవ్వు నిల్వ చేసే ఎంజైమ్ లిపోప్రొటీన్ లిపేస్ యొక్క అధిక సాంద్రత కలిగి ఉండటమే దీనికి కారణం, పురుషుల్లో అయితే సాధారణంగా ఈ ఎంజైమ్ యొక్క సాంద్రత పొత్తికడుపు మరియు వెనుకభాగంలో ఎక్కువగా ఉంటుంది.  శరీరంలో కొవ్వు పేరుకుపోవడంపై ఎవ్వరైనా సరే శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది, కేవలం అందం దృష్ట్యానే కాకుండా లోపల దాగుండే కొన్న్ని ఆరోగ్య సమస్యల స్మరణ కోసం ఇది అగత్యం.

తొడ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడానికి జన్యు లేదా హార్మోన్ల కారణాలు, పేలవమైన ప్రసరణ, జీవనశైలి, ఆహారం, వ్యాయామాలు లేకపోవడం లేదా శరీర జీవక్రియ కావచ్చు, ఈ కారణాలన్నీ తొడ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రేరేపించే అంశాలు.

తొడభాగంలో  కొవ్వును వదిలించుకోవడానికి చాలామంది తరచూ శస్త్రచికిత్సను ఒక  ఎంపికగా చూస్తారు. ఈ వైద్య శస్త్రచికిత్సలు, ఇంజెక్షన్లు, విద్యుత్ ప్రవాహాలు (ఎలక్ట్రిక్ కర్రెంట్స్)  మొదలైన వాటి కోసం మహిళలు అంతులేని డబ్బు ఖర్చు చేస్తారు. అయితే తొడ కొవ్వు తగ్గడానికి సాధారణమైన గృహచిట్కాలు మనకు తెలిస్తే? వాటిని ఉపయోగించుకోకుండా ఉంటామా మనం? 

ఇక్కడ ఈ వ్యాసంలో, మీ తొడల నుండి అదనపు కొవ్వును కోల్పోవటానికి సహాయపడే సాధారణ ఇంటి చిట్కాలను మరియు కొన్ని వ్యాయామాలను మేము చర్చిస్తాము.

  1. తొడల్లో కొవ్వు తగ్గడానికి వ్యాయామాలు - Exercises to lose thigh fat in Telugu
  2. తొడల్లో కొవ్వు తగ్గడానికి గృహ చిట్కాలు - Home remedies to lose thigh fat in Telugu
  3. తొడల్లో కొవ్వు తగ్గడానికి గృహ చిట్కాలు - Tips to lose thigh fat at home in Telugu

కేలరీలు లేని ఆహారం తింటూ, అదే సమయంలో తగిన వ్యాయామాలు కూడా చేస్తూ మొత్తం శరీరం బరువును తగ్గించుకున్నపుడు మాత్రమే శరీరంలో కొవ్వు తగ్గడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడాన్ని పాటించడంతో పాటు వ్యాయామాలు కూడా చేయడం వల్ల వ్యక్తి శరీరంలోని మొత్తం కొవ్వును కోల్పోతారు. నిర్దిష్ట వ్యాయామాలు నిర్దిష్ట శరీర భాగాలను బలపర్చుకుని వాటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి.

తొడల్లో కొవ్వు తగ్గించడానికి గుంజిళ్ళు - Squats to reduce thigh fat in Telugu

స్క్వాట్స్ వ్యాయామాలు మీ శరీరం దిగువభాగం యొక్క పెద్ద కండరాలకు పని కల్పిస్తాయి, ఇది మీ సన్నని కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీకు సహాయపడుతుంది. మీకు ఎక్కువ కండరాలుంటే, ఎక్కువ కేలరీలు కరిగించొచ్చు (బర్న్ చేయవచ్చు). మీ స్వంత శరీర బరువును ఉపయోగించి లేదా తేలికపాటి నిరోధకతను ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో స్క్వాట్‌లను పూర్తి చేయడంవల్ల మీ తొడలను సన్నబరచుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి ఉదయం 20 స్క్వాట్లు చేయడం మీ తొడ కండరాలను బలంగా ఉంచడానికి ఓ గొప్ప ప్రారంభం. మీకు మంచి వ్యాయామం ఇవ్వడానికి 20 స్క్వాట్‌లు సరిపోవు అని మీకు అనిపిస్తే, మీరు మీరే సవాలు చేస్తున్నట్లు మీకు అనిపించే వరకు ఎక్కువ చేయండి. అతిగా వెళ్ళకుండా జాగ్రత్త వహించండి!

Weight Loss Juice
₹539  ₹599  10% OFF
BUY NOW

తొడల్లో కొవ్వు తగ్గడానికి యోగా - Yoga to lose thigh fat in Telugu

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు యోగా వ్యాయామాలు మీ తొడ కండరాలను మెరుగుపరుస్తాయి. ఉత్కాటాసనం (కుర్చీ భంగిమ), విరభద్రాసనం II (వారియర్ పోజ్ II), బడ్డా కోనాసనం (సీతాకోకచిలుక భంగిమ), మాలాసనం (garland pose) వంటి యోగ భంగిమలు మీ తొడలు మరియు తుంటికి మంచి సాగతీతనిస్తాయి మరియు ఈ శరీరభాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఇది తొడ కండరాలను బిగించి, బలవర్థకం (టోన్) చేయడానికి సహాయపడుతుంది. మీరు ఈ వ్యాయామాలను ఉదయం కనీసం 30 నిమిషాలపాటు చేయవచ్చు.

తొడల్లో కొవ్వును తగ్గించుకోవడానికి రన్నింగ్ మరియు జాగింగ్ - Running and jogging to reduce thigh fat in Telugu

ఈ విధానంతో, అంటే పరుగు మరియు నిలకడవేగంతో కూడిన పరుగుతో, మీరు బలాన్ని పెంచుకోవడానికి మరియు కొవ్వును తగ్గించుకోవడానికి పరుగుకు ప్రత్యామ్నాయంగా జాగింగ్ చేయచ్చు. ఉదాహరణకు, కొన్ని నిమిషాలు జాగింగ్ ప్రారంభించండి. తర్వాత, కొన్ని నిమిషాలపాటు జాగింగ్ కు ప్రత్యామ్నాయంగా పరుగు తీయండి. రెండు కార్యకలాపాల నూ  కనీసం 30 నిమిషాలపాటు చేయండి. కాలక్రమేణా, మీరు మీ మొత్తం వ్యాయామకాలం పొడుగునా ఈ విధానాన్నిఅమలు చేయగలరు, ఇది ఎక్కువ కేలరీలు మరియు కొవ్వును కరిగిస్తుంది.

తొడ కొవ్వు తగ్గడానికి నడవడం - Walking to lose thigh fat in Telugu

మీ అదనపు బరువు తగ్గడానికి మరియు తొడలను తగ్గించుకోవడానికి నడక ఖచ్చితంగా సహాయపడుతుంది. కొండ రహదారిలో నడవడం చాలా సహాయకంగా ఉంటుంది లేక ఎగుడుగా ఉండే రోడ్డులో నడవడం కూడా సహాయకరంగా ఉంటుంది. 5 కి.మీ వరకు నడవడం మీ లక్ష్యాన్ని మరింత వేగంగా సాధించడంలో సహాయపడుతుంది. 2000 వ సంవత్సరంలో చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం, దేహ ధారుఢ్యం పెరగడం మరియు తదుపరిగా బరువు తగ్గడం అనేది తొడ కొవ్వు తగ్గింపుతో సంబంధం కలిగి ఉంటుందని ఆరోపించింది. ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నిమిషాలు నడవండి.

తొడల్లో కొవ్వు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ - Apple cider vinegar to lose thigh fat in Telugu

శరీరం పిండి పదార్థాలను 40 శాతం వరకు కరిగించే (కాల్చే) రేటును పెంచడానికి ఆమ్ల ఆహారాలు సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి! మరియు మీరు వేగంగా పిండి పదార్థాలను కరిగిస్తే, మీ శరీరం త్వరగా కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది, కాబట్టి మీరు ఎంతో ఇష్టపడే ఆ సన్నని జీన్స్‌లోకిపుడు సరిపోతారు!

ఆపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా సౌరికామ్లం (ఎసిటిక్ యాసిడ్ను) కలిగి ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ ఖాళీని నెమ్మదిగా చేస్తుంది మరియు రక్తప్రవాహంలోకి చక్కెర విడుదలను తగ్గిస్తుంది. జర్నల్ ఆఫ్ బయోసైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీలో ప్రచురించిన పరిశోధనలో 12 వారాల వ్యవధిలో ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV) ఇచ్చిన అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఒక ఉత్తుత్తి (ప్లేసిబో) మాత్ర ఇచ్చిన వారి కంటే వారి శరీరము దిగువభాగం  నుండి ఎక్కువ బరువు, శరీర కొవ్వు మరియు కొన్నిఅంగుళాలు తగ్గిందని కనుగొన్నారు.

శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి పొందడానికి నిద్రపోయే ముందు అరగంట ముందు మీరు ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ వెనిగర్ మరియు ఒక కప్పు వెచ్చని తాగునీటి మిశ్రమాన్ని తీసుకోవచ్చు.

తొడల్లో కొవ్వు తగ్గించడానికి బాదం పప్పు - Almonds to reduce thigh fat in Telugu

కొన్ని బాదం పప్పుల ప్యాక్‌లు తీవ్రమైన కొవ్వును కరిగించేవిగా ఉంటాయి. అధిక బరువు ఉన్న వ్యక్తుల యొక్క ఒక అధ్యయనంలో 6 నెలలపాటు ప్రతిరోజూ 10-20 బాదంపప్పులు తినడం వల్ల బరువు మరియు బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ) లో 62 శాతం గొప్ప  తగ్గుదల సాధించింది. 2015 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజూ కేవలం 40 గ్రాముల బాదంపప్పు తినడం వల్ల పొట్ట కొవ్వు మరియు కాళ్ళ కొవ్వు తగ్గుతుంది.

వ్యాయామం లేక పని చేయడానికి ముందు మీరు బాదంపప్పు తినవచ్చు: అమైనో ఆమ్లం ఎల్-అర్జినిన్ మీకు ఎక్కువ కొవ్వు మరియు పిండి పదార్థాలను కాల్చడానికి సహాయపడుతుంది.

తొడ కొవ్వు తగ్గడానికి త్రిఫల చూర్ణం - Triphala churan for to lose thigh fat in Telugu

త్రిఫలా చూర్ణం బాగా గుర్తించబడిన మరియు అత్యంత ప్రభావవంతమైన బాహుమూలికలతో కూడిన ఆయుర్వేదం మందు (పాలిహెర్బల్ ఆయుర్వేద ఔషధం). త్రిఫలా చూర్ణం చికిత్స శరీర కొవ్వు, శరీర బరువు మరియు శక్తిని లోనికి తీసుకునే శాతాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది శరీరం విషాన్ని బయటకు పంపడానికి మరియు సంతృప్త కొవ్వులను జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మీరు నిద్రపోయే ముందు నేరుగా ఒక చెంచా త్రిఫల పౌడర్‌ను నీటితో తీసుకోవచ్చు లేదా ఒక చెంచా పొడిని రాత్రిపూట నానబెట్టుకుని, ఉదయాన్నే నీటిని వడగట్టుకుని ఆ నీటిని  త్రాగవచ్చు.

తొడల్లో కొవ్వు తగ్గడానికి బ్రాహ్మి - Brahmi to lose thigh fat in Telugu

బ్రాహ్మి లేదా సెంటెల్లా ఆసియాటికా సారం భారతదేశం మరియు ఆగ్నేయాసియాలో పెరిగిన ఒక జల మొక్క నుండి తీసుకోబడింది. ఇది ఎక్స్‌ట్రాసెల్యులర్ మాతృకలో ఫైబ్రోబ్లాస్టిక్ కార్యకలాపాలు మరియు కొల్లాజెన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది మరియు అడిపోసైట్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది శోషరస పారుదలని కూడా ప్రేరేపిస్తుంది మరియు వాపు-మంట నిరోధక (anti-inflammatory) చర్యను కలిగి ఉంటుంది.

సెల్యులైట్‌ను వ్యతిరేకించడంలో బ్రాహ్మి ఉపయోగపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి, ఎందుకంటే ఇది చర్మంలోని బంధన కణజాలాన్ని పునరుద్ధరించడానికి మరియు మైక్రో సర్క్యులేషన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, ఇది చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాక, గోతు కోలా అని కూడా పిలువబడే బ్రాహ్మి యాంటీ సెల్యులైట్ క్రీములలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ పదార్థం.

మీరు బ్రాహ్మి ఆకులను పేస్ట్ లాగా తయారు చేయడానికి వాటిని రుబ్బుకోవచ్చు మరియు మీరు దానిని పూయాల్సిన శరీరభాగాన్ని బట్టి నీటితో కలపవచ్చు. బాగా కలపండి మరియు సెల్యులైట్ చర్మం మీద నేరుగా పూయండి. ఈ ప్రాంతానికి కొన్ని నిమిషాలు మసాజ్ చేసి పేస్ట్ ను ఆరనివ్వండి. మీరు దీన్ని ఇలా పట్టులాగా వేశాక  రాత్రిపూట దాన్ని అలాగే వదిలి మరుసటి రోజు ఉదయం కడిగివేయడం మంచిది.

తొడల్లో కొవ్వును తగ్గించడానికి కెఫిన్ పూత (లేక పట్టు) - Caffeine scrub to reduce thigh fat in Telugu

కెఫిన్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు శరీర జీవక్రియ ద్వారా కరిగిపోయిన రక్తప్రవాహానికి కొవ్వును విడుదల చేయడానికి కొవ్వు కణాలను ప్రేరేపిస్తుంది. కెఫిన్ కొవ్వు కణాలను హరించడానికి, చర్మాన్ని బలవర్దకం (టోన్) చేయడానికి మరియు కొవ్వు సెల్యులైట్ రూపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా, కెఫిన్ మూత్రవిసర్జనకారి కావడంవల్ల కొవ్వు కణాల నుండి నీటిని తొలగించడానికి సహాయపడుతుంది, తద్వారా తొడల చుట్టుకొలతను తగ్గిస్తుంది. కెఫిన్ అడిపోస్ కొవ్వు కణాలపై పనిచేస్తుంది, లిపోలిసిస్‌కు అనుకూలంగా ఉంటుంది మరియు ట్రైగ్లిజరైడ్ లిపేస్ ఎంజైమ్‌ను క్రియాశీలం చేస్తుంది, ఇది ట్రైగ్లిజరైడ్లను ఉచిత కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్‌గా విచ్ఛిన్నం చేస్తుంది.

మీరు అర కప్పు కొబ్బరి నూనె, అర కప్పు కాఫీ గింజల పొడిని లేదా కాఫీ పౌడర్ను మరియు అర కప్పు ముడి చక్కెర తీసుకోవచ్చు. దీన్ని పట్టుగా మీ తొడల మీద పూయండి మరియు కనీసం 15 నిమిషాలపాటు ఉండేవిధంగా కొంత గుడ్డ లేదా ప్లాస్టిక్‌తో చుట్టండి. ఆ ప్రాంతాన్ని వెచ్చని నీటితో కడగాలి. మీరు మిశ్రమాన్ని నిల్వ చేయవచ్చు మరియు ప్రతి 3 రోజులకు 2-3 నెలలు దీనిని ఇలాగే ఉపయోగించవచ్చు.

తొడల్లో కొవ్వు తగ్గడానికి ఆర్టిచోక్ సారం - Artichoke extract to reduce thigh fat in Telugu

ఆర్టిచోక్ (Artichoke) అనేది ఒక కూరగాయ-గడ్డలాంటి కూరగాయ, ఇది ‘తిస్టిల్’ జాతి నుండి ఉద్భవించింది. ఇది చిన్న చిన్న పువ్వుల సమూహాన్ని కలిగి ఉండి, పుష్పించి వికసించడమనే  లక్షణాన్ని కల్గి ఉంటుంది. ఈ కూరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఈ కూరగాయ చెట్టులో పొటాషియం మరియు బయోటిన్, ఇంకా, నియాసిన్, రిబోఫ్లేవిన్ మరియు ఫోలిక్ యాసిడ్  ఉంటాయి. ఆర్టిచోక్ కాలేయంలోని కొవ్వు నిల్వల్ని సమీకరించటానికి మరియు దానిని నిర్విషీకరణ చేయడానికి మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహజ సహాయకారిగా ఉపయోగిస్తారు. అదనంగా, ఇది లిపోలిసిస్‌పై నిర్దిష్ట నియంత్రణను కలిగి ఉంటుంది, ఇది శక్తి-రవాణా ఎంజైమ్‌ల సంశ్లేషణకు అనుకూలంగా ఉంటుంది.

మీరు రోజుకు మూడుసార్లు ఆర్టిచోక్ నీటిని తీసుకోవచ్చు. ఆర్టిచోక్ నీటిని తయారు చేయడానికి, మీరు రెండు ఆర్టిచోక్లను నీటిలో ఉడకబెట్టి, ఒక సీసాలో వడకట్టవచ్చు. మీరు తీసుకునే ప్రతి ప్రధాన భోజనం తర్వాత మీరు ఈ నీటిని తాగవచ్చు.

తొడల్లో కొవ్వు తగ్గడానికి గ్రీన్ టీ - Green tea to lose thigh fat in Telugu

గ్రీన్ టీ శరీరంలో శక్తి మరియు కొవ్వు జీవక్రియను ప్రభావితం చేసే కాటెచిన్లను కలిగి ఉంటుంది. జీవనశైలిలో మార్పులు లేని స్త్రీ పురుషులలో కొవ్వు తగ్గింపుపై గ్రీన్ టీ సారం యొక్క ప్రభావాన్ని ఒక అధ్యయనం పరిశీలించింది. గ్రీన్ టీ శరీర కొవ్వు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తపోటును తగ్గిస్తుందని, తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని కనుగొనబడింది.

మోతాదు: ప్రతిరోజూ 2-3 కప్పుల గ్రీన్ టీ తాగడం మంచిది.

మీరు మీ తొడల్లోలేదా తుంటి భాగంలో అధిక కొవ్వుతో బాధపడుతుంటే, ఈ సమస్యను ఎదుర్కోవడంలో సహాయపడే చిట్కాల కోసం వెతుకుతూ ఉండవచ్చు. ఇంట్లో మీ తొడ కొవ్వును కోల్పోవటానికి మీరు తీసుకోగల కొన్ని చిట్కాలను ఈ వ్యాసం చర్చిస్తుంది. మీరు ఈ చిట్కాలను పాటిస్తే, మీరు తొడ కొవ్వును మాత్రమే కాకుండా, మీ మొత్తం శరీరం నుండి అదనపు కొవ్వును కోల్పోతారు.

తొడల్లో కొవ్వును వదిలించుకోవడానికి చర్మంపై రాసే క్రీములు - Topical creams to get rid of thigh fat in Telugu

శరీర కొవ్వును తగ్గించడానికి వేగవంతమైన మరియు సులభమైన మార్గంగా నిరూపించబడుతున్న వివిధ పైపూత  క్రీములున్నాయని తేలింది. కొవ్వు కణజాలాన్ని వదులు చేయడం ద్వారా లేదా వాటిని తాత్కాలికంగా నిర్జలీకరణం చేయడం ద్వారా పైపూత క్రీములు పనిచేస్తాయి. ఇది సహజ జీవక్రియను శక్తి వనరుగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.

కాబట్టి వినియోగించేసిన శక్తిని ఉపయోగించకుండా అవి నిల్వ చేసిన కొవ్వును ‘లిపోలిసిస్ ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం’ అనే ప్రక్రియ ద్వారా కాల్చేస్తాయి. కొవ్వును కరిగించే (బర్నింగ్) క్రీమ్ రక్తనాళవ్యాకోచాన్ని (వాసోడైలేషన్ను) కూడా ప్రారంభిస్తుంది, దీనివల్ల ఈ క్రీము రాసి మర్దన చేసిన ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

ఒక అధ్యయనంలో, శాస్త్రవేత్తలు 18 మంది ఆరోగ్యకరమైన ఆడవారి (వయస్సు 20-33) ప్రతి ఒక్కరి రెండు తొడలలో ఒక తొడకు  గ్లైసైర్రెటినిక్ ఆమ్లం కలిగి ఉన్న క్రీమ్‌ను రాయడం జరిగింది, ఆ తర్వాత, 4 వారాలు గడచిన తరువాత వాళ్ల తొడ నుండి సబ్కటానియస్ కొవ్వు కణజాలం (చర్మం కింద కొవ్వు) సగటు మొత్తంలో తగ్గుదలను కలిగి ఉండడం కనబడింది, గ్లైసైర్రెటినిక్ ఆమ్లం రాయని తొడ కన్నా ఆ ఆమ్లం రాసిన తొడలో కొవ్వు  తగ్గడం కన్పించింది.  

ఈ క్రీములలో చాలావరకు గ్లైసైర్రెటినిక్ ఆమ్లం, చేదు నారింజ సారం, కోకోవా, ఆండిరోబా, కెఫిన్ మరియు అమినోఫిలిన్ వంటి పదార్థాలు ఉంటాయి. మీరు రసాయన శాస్త్రవేత్త (chemist) నుండి క్రీమ్‌ను కొనుగోలు చేయవచ్చు, కానీ కొనేముందు, ఆ ఉత్పత్తిని ఉపయోగించడానికి ధృవీకరించబడినది, సురక్షితం అయినదీ అన్న విషయాన్ని ఖచితపరచుకోండి మరియు ఉత్పత్తులకు మద్దతు ఇచ్చే అధ్యయనాలూ ఉంటాయి, వాటినీ గమనించండి.

ఖనిజ ద్రావణంలో నానబెట్టబడిన చుట్టును ఉపయోగించి తొడ కొవ్వును తగ్గించడం - Mineral solution soaked wrap to lose thigh fat in Telugu

శరీరానికి చుట్ట (wrap) అంటే ప్రాథమికంగా ఒక షీట్ లేదా ప్లాస్టిక్షీట్ లేదా నారతో చేసిన దుప్పటివంటిదాన్ని శరీరం చుట్టూ లేదా శరీరంలోని నిర్దిష్ట భాగాలకు మూలికలతో లేదా సహజ పదార్ధాలతో వేసిన (పూత లేక పట్టు) పొర పైన చుట్టబడి ఉంటుంది. చుట్టబడిన ఈ చుట్ట ఒక అంగుళం కూడా కదలకుండా చెమట బాగా పట్టడానికి మీకు సహాయపడుతుంది, ఇది విషాన్ని బయటకు తీయడానికి మరియు ఆ చుట్టిన ప్రాంతం నుండి కొన్ని అంగుళాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, కాలు చొట్టూ చుట్టిన చుట్ట (wrap) చాలా గట్టిగా ఉండటం వలన రక్త ప్రసరణ నెమ్మదిగా ప్రసరిస్తూ ఉంటుంది, మైకము లేదా తేలికపాటి తలనొప్పి ఏర్పడుతుంది, కాబట్టి చుట్టును విప్పుకోవడం మంచిది.

తొడ కొవ్వును తొలగించడానికి మసాజ్ చేయండి - Massage to remove thigh fat in Telugu

మర్దన లేక మసాజ్ ప్రక్రియ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మం ఉపరితలాన్ని పొరలూడదీస్తుంది (exfoliates), తద్వారా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మీ శరీరం నుండి అదనపు కొవ్వును కోల్పోవటానికి మీరు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలోని కొవ్వు ఆమ్లాలు నేరుగా కణత్వచాలలో కలిసిపోతాయి మరియు కొవ్వుగా నిల్వ కాకుండా వెంటనే శక్తిగా మారుతాయి. మసాజ్ అనే మర్దనా ప్రక్రియ తొడలలో కొవ్వును తగ్గించడానికి శాస్త్రీయంగా నిరూపితమైన ఓ చికిత్సా పద్ధతి. ప్రతిరోజూ 10 నిమిషాలు వెచ్చని కొబ్బరి నూనెతో మీ తొడలను మసాజ్ చేయండి.

తొడల్లో కొవ్వు తగ్గడానికి పీచుపదార్థాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తినండి - Eat a diet rich in fibre and antioxidants to lose thigh fat in Telugu

పీచుపదార్థాలు (ఫైబర్), పోషకాలు మరియు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఒక అధ్యయనం ప్రకారం, శుద్ధి చేసిన ధాన్యాలను తినకుండా (వోట్స్ వంటి) తృణధాన్యాలను రోజువారీగా తమ నిత్య భోజనంలో తినే వ్యక్తులు, అదే మొత్తంలో తెల్లని పిండి పదార్థాలు తిన్న వ్యక్తుల కంటే 10 శాతం తక్కువ పొట్ట కొవ్వును కలిగి ఉంటారని తేలింది. అలాగే, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం కేలరీలను కొవ్వుగా మార్చకుండా నిరోధిస్తుంది.

ప్రతిరోజూ, రోజులో మీరు తినే భోజనాల్లో ఒక భోజనంలో పండ్లు మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకుని తినండి. మీరు మీ మధ్యాహ్న భోజనం లేదా రాత్రి విందుభోజనంలో  ఓట్స్, గంజి లేదా తృణ ధాన్యమైన గోధుమల (పొట్టుతో పాటు) భోజనం చేయవచ్చు.

తొడల్లో కొవ్వును తగ్గించుకోవడానికి నీటిని ఎక్కువగా తాగండి - Increase water intake to reduce thigh fat in Telugu

శరీరం నుండి విషాన్ని బయటకు పంపేందుకు నీరు సహాయపడుతుంది మరియు మెరుగైన లిపోలిసిస్తో సంబంధం కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువు ఉన్న మహిళల్లో కొవ్వు తగ్గింపు, శరీర బరువు తగ్గడం మరియు ఆకలిని అరికట్టడంలో పుష్కలంగా నీరు త్రాగటం అనేది ఒక పాత్ర పోషించిందని 2014 లో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

ప్రతిరోజూ కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగాలి. అదనపు ప్రయోజనాల కోసం మీరు నిమ్మరసం  మరియు తేనెతో కలిపిన వెచ్చని నీటిని తాగొచ్చు.

వనరులు

Read on app