మెన్స్ట్రువల్ కప్ స్త్రీల ఋతుక్రమ సమయంలో ఉపయోగించే  పరిశుభ్రత ఉత్పత్తుల్లో ఒకటి. ఇది చిన్నగా, సౌకర్యవంతముగా, ఫన్నెల్ ఆకారంలో ఉండే ఒక ప్లాస్టిక్ పరికరం, యోని లోకి అమరే విధంగా  రూపొందించబడుతుంది. ఇది ఋతుక్రమ రక్తాన్ని సేకరించేందుకు తయారు చేయబడింది. ఇతర పరిశుభ్రత పరికరాల కంటే ఇవి ప్రత్యేకమైనవి ఎంతుకంటే వీటిని పూర్తిగా పునర్వినియోగించవచ్చు (reusable).

ఒకసారి ఋతుక్రమ రక్తముతో పూర్తిగా నిండిపొతే, పరికరాన్ని సులభంగా బయటకు తీసివేసి, శుభ్రపరచి మరియు తిరిగి లోపల అమర్చవచ్చు. ఇది టాంపూన్లు లేదా సానిటరీ ప్యాడ్స్ కంటే చవుకైన ప్రత్యామ్న్యాయం. అయినప్పటికీ, వాటి ఉపయోగం గురించి అపోహలు ఉండడం మరియు వాటి గురించి అసలు తెలియక పోవడం వలన మెన్స్ట్రువల్ కప్పులు లేదా రబ్బరు కప్పులు పెద్దగా వ్యాప్తిలోకి రాలేదు.

ఈ వ్యాసం మీకు మెన్స్ట్రువల్ కప్పును ఎలా ఉపయోగించాలో మరియు దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుపుతుంది. మెన్స్ట్రువల్ కప్పు యొక్క  ప్రతికూలతలు లేదా ప్రమాదాలు అలాగే భారతదేశంలో దాని లభ్యత మరియు ధరలు కూడా ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.

  1. ఋతుస్రావం - Menstruation in Telugu
  2. మెన్స్ట్రువల్ కప్పులు - Menstrual cups in Telugu
  3. మెన్స్ట్రువల్ కప్పు ఉపయోగం - Menstrual cup use in Telugu
  4. మెన్స్ట్రువల్ కప్పును ఎలా ఉపయోగించాలి: ముఖ్యమైన పరిగణనలు - How to use a menstrual cup: Important considerations in Telugu
  5. మెన్స్ట్రువల్ కప్పును ఎప్ప్పుడు తొలగించాలి - When to remove a menstrual cup in Telugu
  6. మెన్స్ట్రువల్ కప్పును ఎలా తొలగించాలి? - How to remove a menstrual cup in Telugu
  7. భారతదేశంలో మెన్స్ట్రువల్ కప్పుల ధర - Menstrual cup price in India in Telugu
  8. మెన్స్ట్రువల్ కప్పు ప్రయోజనాలు - Menstrual cup advantages in Telugu
  9. మెన్స్ట్రువల్ కప్పుల ప్రతికూలతలు - Menstrual cups disadvantages in Telugu
  10. మెన్స్ట్రువల్ కప్పు ప్రమాదాలు - Menstrual cup dangers in Telugu

ఋతుస్రావం, సాధారణంగా ముట్టు అని కూడా పిలుస్తారు. స్త్రీల యోని నుండి రక్తస్రావంతో పాటు  శ్లేష్మ కణజాలం (mucosal tissue) విడుదల అయ్యే సమయాన్ని ఋతుస్రావం అని అంటారు. ఇది గర్భదారణ జరగకపోవడం వలన గర్భాశయ పొర లేదా ఎండోమెట్రియం యొక్క విచ్ఛేదనం/చీలిపోవడం కారణంగా సంభవిస్తుంది.

(మరింత సమాచారం: యోని రక్తస్రావం కారణాలు)

ఇది సగటున 2 నుంచి 7 రోజుల మధ్య ఉంటుంది మరియు వేరు వేరు స్త్రీలలో ఈ సమయం వేరు వేరుగా ఉంటుంది.

(మరింత సమాచారం: ఋతుక్రమ నొప్పి నివారణలు)

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

మెన్స్ట్రువల్ కప్పులు చిన్న కప్పు ఆకారపు పరికరములు, ఇవి ఋతుస్రావ రక్తాన్ని సేకరించేందుకు యోనిలోకి చొప్పించబడతాయి, అందుకే వీటికి ఆ పేరు. వీటిని సాధారణంగా పునర్వినియోగించవచ్చు  మరియు సిలికాన్ తో తయారు చేస్తారు. అవి యోని లోపల చక్కగా సరిపోతాయి మరియు ప్యాడ్ లేదా టాంపూన్ కంటే ఎక్కువ గంటలు వీటిని ఉంచవచ్చు, తద్వారా ఉపయోగానికి అనుకూలముగా ఉంటాయి.

వాటిమీద విరుద్ధమైన నమ్మకం ఉన్నప్పటికీ మెన్స్ట్రువల్ కప్పులను చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు. మెన్స్ట్రువల్ కప్పును ఉపయోగించడానికి ఈ ఇది క్రింది సూచనలు అనుసరించడం అవసరం:

  • ఏవైనా వజైనల్ ఇన్ఫెక్షన్ల (యోని అంటురోగాల) ప్రమాదాన్ని నివారించడానికి కప్పును లోపలికి చొప్పించేముందు  చేసే ముందు మీ చేతులను శుభ్రంగా కడగాలి.
  • మీ కాళ్లును చాపి సౌకర్యవంతంగా కూర్చుని మీ వేళ్లతో  మీ యోని ద్వారాన్ని (vagina opening) గుర్తించండి.
  • మెన్స్ట్రువల్ కప్పును తీసుకుని దాని అంచులలో లూబ్రికెంట్ ను రాయండి. యోని కోసం మాత్రమే తయారు చేయబడిన నీటి ఆధారిత లూబ్రికెంట్ ను మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి. నూనె ఆధారిత లూబ్రికెన్ట్, నూనె, లోషన్  లేదా ఇతర సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం వలన అవి కప్పు పనితీరుతో జోక్యం చేసుకోవచ్చు.
  • ఒకవేళ లూబ్రికెంట్ అందుబాటులో లేకపోతే, మీరు కేవలం నీటిని దాని అంచుల చుటూ రాయవచ్చు లేదా యోనిలోకి చొప్పించే ముందు చల్లటి కుళాయి నీటి కింద దానిని ఒకసారి ఉంచవచ్చు.
  • ఇప్పుడు, కప్పును సగానికి లేదా సి ఆకారంలోకి నొక్కండి.
  • నెమ్మదిగా మీ యోని ద్వారంలోకి కప్పును చొప్పించండి. మీ సెర్విక్స్ కు కొన్ని అంగుళాల  క్రింద మాత్రమే ఉండేలా దానిని అమర్చాలి.
  • కప్పును ఒకసారి లోపల పెట్టిన తర్వాత, మీరు యోని లోపల ఒకసారి దానిని తిప్పండి. ఇది ఎయిర్ టైట్ సీల్ ను ఏర్పరచటానికి సహాయం చేస్తుంది, మరియు కప్పును పట్టి ఉంచుతుంది. ఇది దాని అస్థిరతను (dislodgement) నిరోధించి మరియు  లీక్ ను కూడా నివారిస్తుంది.
  • కప్పును ఒకసారి సరిగ్గా చొప్పించిన తర్వాత, మీరు కప్పు యొక్క అనుభూతిని  చెందకపోవచ్చు. ఇది చిరాకుగా, నొప్పిగా లేదా నొక్కినట్లు ఉండకూడదు మరియు పూర్తిగా సౌకర్యవంతంగా ఉండాలి.
  • నిలబడడం, కూర్చొవడం, నడవడం మరియు ఇతర పనులను సులభంగా చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే, కప్ సరిగా అమర్చబడి ఉండదు లేదా అంతర్లీన వైద్య సమస్య ఉండవచ్చు.
  • పలు సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా, కప్ అసౌకర్యాన్ని కలిగిస్తే, మీకు వేరే సైజు లేదా వేరే రకమైన మెన్స్ట్రువల్ కప్పు అవసరం కావచ్చు. అసౌకర్యం తీవ్రంగా ఉంటే వెంటనే గైనకాలజిస్టు ను సంప్రదించడం మంచిది.
    (మరింత సమాచారం: యోని నొప్పి యొక్క కారణాలు)

మెన్స్ట్రువల్ కప్పును ఉపయోగించడం కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. ఇది కొంతమందికి విసుగు కలిగించే అనుభవం కావచ్చు. మీరు ఈ కింది విషయాలు పట్ల శ్రద్ధ వహించాలి:

  • సరైన  మెన్స్ట్రువల్ కప్పు కొనాలి
    అన్ని మెన్స్ట్రువల్ కప్పులు ఒకేలా ఉండవు. అందరి మహిళలకు సరిపోయే ఒకే ప్రత్యేక కప్ ఏది ఉండదు. మెన్స్ట్రువల్ కప్పు కొనడానికి ముందు, మీ శరీరం యొక్క నిర్మాణం గురించి మీకు బాగా తెలిసి ఉండాలి, ఇది కప్పు యొక్క సరైన సైజు మరియు కప్పు మెటీరియల్ ను ఎంచుకోవడంలో మీకు సహాయపడుతుంది.
    మీరు కొనుగోలు చేసే ముందు మీ వేళ్ల సహాయంతో మీ సెర్విక్స్ ను కొలవవచ్చు. కటిలోపల కండరాల యొక్క బలం కూడా దీనిలో పాత్ర పోషిస్తుంది. కటిలోపల కండరాలు  బలముగా/గట్టిగా ఉన్నవారికి గట్టిగా ఉండే మెన్స్ట్రువల్ కప్ అవసరం అవుతుంది, ఎందుకంటే సాధారణ లేదా మృదువైన కప్పు పక్కకు జరిగిపోవచ్చు. అయితే, సున్నితమైన చర్మం కలిగిన వారికి మరింత మృదువుగా మరియు సౌకర్యవంతమైన (flexible) కప్ అవసరం.
    మీరు ఉపయోగిస్తున్న మెన్స్ట్రువల్ కప్పు రకాన్ని గమనించడం కూడా ముఖ్యం. చాలా మెన్స్ట్రువల్ కప్పులు పునర్వినియోగించడానికి రూపొందించబడినవైనప్పటికీ, వాటిలో కొన్ని ఒకసారి వాడి పడేసేవి ఉంటాయి. అంటువ్యాధులను నివారించడానికి వాటిని అస్సలు తిరిగి ఉపయోగించరాదు.
    ఈ వైవిధ్యాలు ఉన్నప్పటికీ, చాలామంది మహిళలు వారికీ సరిపడే మరియు సౌకర్యంగా ఉండే సరైన మెన్స్ట్రువల్ కప్పు రకాన్ని కనుగొనగలరు.
  • కేవలం నీటి ఆధారిత లూబ్రికెంట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి (వాటి యొక్క ప్రత్యామ్న్యాయాల గురించి ఇప్పటికే చర్చించబడింది). కప్పు యొక్క మొత్తం ఉపరితలం అంతా లూబ్రికెంట్ వ్యాపించకుండా ఉపయోగించడం చాలా ముఖ్యం.
  • మెన్స్ట్రువల్ కప్పును మీ ఋతు సమయం కాని సమయంలో ఉపయోగించడానికి ప్రయత్నించరాదు
    మెన్స్ట్రువల్ కప్పులు ప్రత్యేకంగా ఋతుస్రావ సమయంలో ఉపయోగించడానికి మాత్రమే తయారు చేయబడ్డాయి. అవసరం లేకుండా ఉపయోగించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, బదులుగా హానికరం కావచ్చు. మీరు కప్పును కొనుగోలు చేస్తే మరియు మీ ఋతుక్రమ సమయం ఇంకా ప్రారంభం కాకపోతే, ఆ పరికరాన్ని ముందుగా పరీక్షించే కంటే మీ ఋతుక్రమ సమయం వరకు వేచి ఉండటం మంచిది.
    మెన్స్ట్రువల్ కప్పులు సాధారణ సమయం కన్నా ఋతుక్రమ సమయంలో తేలికగా అమరుతాయి, ఎందుకంటే యోని మరియు దాని ద్వారము ఋతుక్రమ సమయంలో ఎక్కువ లూబ్రికేటెడ్గా (జారుగా) ఉంటాయి  . కాబట్టి, సాధారణ సమయంలో మీరు కప్పును ప్రవేశపెట్టినప్పుడు ఎక్కువ ఇబ్బంది కలిగించవచ్చు. ఇది కూడా చికాకు కలిగించే అవకాశం ఉంది; అప్పుడు మీకు నిజంగా అవసరమైనప్పుడు దానిని ఉపయోగించడానికి  భయం కలుగవచ్చు.
    అంతేకాకుండా, ఋతుస్రావం సమయంలో మెన్స్ట్రువల్ కప్పును మరింత సులభంగా తొలగించవచ్చు, ఎందుకంటే అది రక్తంతో నిండి ఉంటుంది. ఋతుక్రమ సమయంలో కంటే సాధారణ రోజుల్లో మీ సెర్విక్స్ కొంచెం పైకి ఉండడం వలన దానిని తొలగించడానికి  కూడా ఎక్కువ సమయం పడుతుంది. సాధారణ రోజులలో కప్పు గట్టిగా అమర్చబడే ప్రమాదం ఉంటుంది అప్పుడు దానిని తొలగించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి, మెన్స్ట్రువల్ కప్పులను సాధారణ రోజులలో పరీక్షించకూడదని మరియు మీ ఋతుసమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాలని సిఫార్సు చేస్తారు.
  • కంగారు పడవద్దు
    ముఖ్యంగా మొట్టమొదటి సారి మెన్స్ట్రువల్ కప్పును ఉపయోగించేవారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
    మెన్స్ట్రువల్ కప్పు మీ సెర్విక్స్ లో  గట్టిగా అమరి ఉండడానికి మీరు దానిని ఉపయోగించేటప్పుడు ప్రశాంతంగా మరియు విశ్రాంతిగా ఉండాలి. దీని కోసం, మీరు కప్పును లోపలికి పెట్టడానికి కూర్చునే ముందు ఒక సరి స్నానం చేసి సేదతీరవచ్చు. ఈ పనులు మీ కటి కండరాలు సేదతీరేలా చేస్తాయి.
    ప్రతీ సమయాల్లో, మీరు ఒత్తిడికిలోనవకుండా ఉండడం  ముఖ్యం. ఒత్తిడి మీ కటి కండరాలను బిగుతుగా చేసి, కప్పును లోపలి చొప్పించడం మరియు తొలగించడాన్ని  చాలా కష్టంగా మరియు అసౌకర్యంగా చేస్తుంది.
    చాలామంది మహిళలు ఒక మెన్స్ట్రువల్ కప్పు మొదటిసారి చూసిన వెంటనే చాలా భయపడతారు మరియు యోని లోపల అంత పెద్దది సరిపోతుందా అని విస్మయం చెందుతారు. ఈ పరికరం పూర్తిగా ఫ్లెక్సిబుల్ (ఎలా కుదిరితే ఆలా సరిపోయేలా) గా ఉంటుంది మరియు యోనిలో దానికదే అమరుతుందని గుర్తుండచుకోండి.దాని పెద్ద పరిమాణం/సైజు ఋతుస్రావ రక్తం నిండడం కోసం.
  • ప్రయత్నిస్తూ ఉండండి
    మెన్స్ట్రువల్ కప్పును సరిగ్గా అమర్చడానికి  ప్రయత్నిస్తూ ఉండటం ముఖ్యం ఎందుకంటే ఈ ప్రక్రియకు కొంచెం సమయం అవసరం. మీరు కూర్చునే వేర్వేరు స్థానాలను/స్థితులను  ప్రయత్నించి మరియు మీకు ఏది అత్యంత సౌకర్యవంతముగా ఉందో నిర్దారించుకోవచ్చు. మీరు ప్రయత్నించే ప్రతిసారి యోనిలో తగినంతగా లూబ్రికేషన్ ఉందని గమనించుకోవడం చాలా ముఖ్యం.
Pushyanug Churna
₹450  ₹499  9% OFF
BUY NOW

మెన్స్ట్రువల్ కప్పు పూర్తిగా నిండినప్పుడు దానిని తీసివేవేయాలి మరియు తిరిగి లోపల అమర్చుకోవాలి. దీనిని యోనిలో 6 నుండి 12 గంటల వరకు ఉంచవచ్చు. అయితే, 12 గంటల సమయం మించకూడదు ఎందుకంటే కప్ ఆ సమయానికి నిండిపోయి ఉంటుంది. ఈ సమయం మించిపోవటం వలన లీక్ అయ్యే అవకాశం పెరుగుతుంది మరియు ఇది సంక్రమణకు మూలంగా కూడా మారవచ్చు. మెన్స్ట్రువల్ కప్పును ఒక రాత్రంతా సురక్షితంగా వదిలివేయవేయవచ్చు.

మీకు రక్త స్రావం భారీగా ఉంటే, లీక్ కావడాన్ని నివారించడానికి 6-8 గంటల్లో కప్పును తొలగించడం మంచిది. మీకు రక్త స్రావం సాధారణంగా  లేదా తక్కువగా ఉంటే, మీరు దానిని 12 గంటల పాటు ఉంచవచ్చు. ఇది మీ ఋతుక్రమము యొక్క రోజు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రారంభ రోజులలో అధిక రక్తస్రావం ఉంటుంది కాబట్టి, కప్పును తొలగించి దానిని తరుచుగా ఖాళీ చెయ్యడం అవసరం చివరి రోజుల్లో ఎక్కువ సార్లు బయటకు తీయవలసిన అవసరం ఉండదు. కానీ, మెన్స్ట్రువల్ కప్పులను కనీసం రోజుకు రెండుసార్లు ఖాళీ చేయాలి.

లోపకిలి అమర్చిన మాదిరిగానే, తొలగించే ప్రక్రియ కోసం మీ చేతులను శుభ్రంగా  కడగడం అవసరం. శుభ్రంగా కడిగిన చేతులను అప్పుడు యోనిలో పెట్టి కప్ యొక్క మొనను లేదా కాడను  గుర్తించాలి. మీ చేతి వేళ్ళు మరియు బొటన వేలితో కప్పు అంచుకు/బేస్ కు చేరే వరుకు కాడను లాగాలి. ఇప్పుడు, బేస్ను/అంచును కొద్దిగా నొక్కి సీల్ ను (బిగుసుకుని ఉన్న కప్పును) తీయవచ్చు  మరియు యోని నుండి కప్పును తొలగించవచ్చు. కప్పులోని పదార్దాలను (రక్తం, మ్యూకోసల్ కణజాలం) సింక్ లోకి పారబోయాలి.

మీ కప్ మళ్ళి ఉపయోగించరానిదైతే, మీరు ఒకసారి ఉపయోగించిన తర్వాత దానిని పాడేయాలి. లేకపోతే, మీరు దానిని నీటితో శుభ్రం చేసి మరియు మళ్ళి లోపల అమర్చడానికి ముందు  దానిని శుభ్రంగా తుడవాలి. దానిని సంరక్షించే స్థాయిని బట్టి, మెన్స్ట్రువల్ కప్పు 6 నెలల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది/వస్తుంది.

దాని పరిమిత వినియోగం కారణంగా  భారతదేశంలో మెన్స్ట్రువల్ కప్పును కనుగొనడం చాలా అరుదు. అయితే, మీరు మీ సమీపంలోని ఫార్మసీ వద్ద అందుబాటులో లేకపోతే వాటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో కొన్ని ఉత్తమ మెన్స్ట్రువల్ కప్పులు:

  • మూన్ కప్- రూ. 1577
  • వావ్ స్కిన్ - రూ. 699
  • షి కప్- రూ. 996
  • సిల్కీ కప్- రూ. 200
  • సిరోనా- రూ. 228
  • దివా కప్- రూ. 2674
  • రూబీ కప్- రూ. 1999

మూన్ కప్పు ఎక్కువ కాలం మన్నికైనదని మరియు స్థిరముగా ఉంటుందని కొందరు మహిళలు తెలిపారు మరియు అవి అధిక స్థాయి శారీరక శ్రమ చేసేవారికి, బలమైన పెల్విక్ కండరాలు కలిగి ఉండే వారికీ మరియు అథ్లెటిక్ మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటాయని కొందరు వినియోగదారులు సూచించారు.

Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

మెన్స్ట్రువల్ కప్పుల ఉపయోగం యొక్క కొన్ని ప్రయోజనాలు:

  • అవి దీర్ఘకాలంలో ప్యాడ్లు మరియు టాంపున్ల కంటే చౌకైనవి.
  • వాటిని తరచూగా మార్చవలసిన అవసరం లేదు మరియు ఎక్కువ గంటలు (10-12 గంటలు) ధరించవచ్చు/ఉంచుకోవచ్చు.
  • అవి పాడ్స్ కంటే ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. ఒకసారి లోపల చొప్పించిన తర్వాత, శరీరం దాని ఉనికిని కూడా అనుభూతి చెందలేదు. మరోవైపు, సానిటరీ ప్యాడ్లు కొన్నిసార్లు చికాకు కలిగించవచ్చు.
  • ఇది కదలికల వలన దాని స్థానం నుండి తొలగిపోదు కాబట్టి  అధిక స్థాయి శారీరక శ్రమ ఉన్న మహిళలు దీనిని సౌకర్యవంతముగా ఉపయోగించవచ్చు.
  • ప్రతిరోజు దానిని పారవేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణ హితమైనది.
  • ఇది మీ శరీరాన్ని గురించి మీరు మరింత బాగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది (ఇది చాలా ముఖ్యమైనది).
  • మెన్స్ట్రువల్ కప్పులో ధరించి ఉన్నపుడు సులభంగా మూత్రవిసర్జన చేయవచ్చు.
  • మీరు ప్యాడ్లలో సాధారణంగా అనుభవించే  "తడి" భావనను పొందరు కాబట్టి, ఇది మరింత పరిశుభ్రమైనది మరియు ఆరోగ్యకరమైనది.
  • టాంపూన్లతో పోలిస్తే ఇన్ఫెక్షన్లు తక్కువగా సంభవిస్తాయి.
  • ఇంట్రా యుటిరైన్ డివైజ్ (ఐయుడి) ఉపయోగించే మహిళలు కూడా దీనిని  ఉపయోగించవచ్చు.
  • దీనిని లోపలికి అమర్చడం మరియు తొలగించడం సురక్షితం.
  • దీనిని శుభ్రపరచడం సులభం.
  • మెన్స్ట్రువల్ కప్పులు మళ్ళి తిరిగి ఉపయోగించవచ్చు కాబట్టి ప్రయాణించేటప్పుడు మీరు సానిటరీ ప్యాకెట్లను కూడా మర్చిపోకుండా తీసుకువెళ్లే ఆందోళన చెందనవసరం లేదు.

(మరింత సమాచారం: మూత్ర మార్గ సంక్రమణ చికిత్స)

మెన్స్ట్రువల్ కప్పుల ఉపయోగానికి సంబంధించిన ప్రతికూలతలు ఈ క్రింద వివరించబడ్డాయి:

  • ముఖ్యంగా మొదటిసారి ఉపయోగించే వారికీ, వాటిని అమర్చడం మరియు తీసివేయడం కష్టం అవుతుంది.
  • అవి మురికిగా మరియు శుభ్రం చేయడానికి సమస్యగా/చిరాకుగా అనిపించవచ్చు. కొంతమందికి అది అసహ్యంగా కూడా అనిపించవచ్చు.
  • ఇది ఋతు కప్పుల సరైన అమరికను కనుగొనడం కష్టం.
  • ఇది యోనిలో చికాకు కలిగించవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో, మెన్స్ట్రువల్ కప్పు తయారీలో ఉపయోగించే సిలికాన్ పదార్థం కారణంగా అలెర్జీ ప్రతిచర్య కూడా కలుగవచ్చు.
  • చాలా అరుదుగా, అది లీక్ కావచ్చు లేదా ఎక్కువ గంటలు ధరిస్తే అసౌకర్యం కలిగించవచ్చు.

సాధారణంగా దీని వినియాగం సురక్షితమైనదిగా భావించినప్పటికీ, మెన్స్ట్రువల్ కప్పులు క్రింద పేర్కొన్న కొన్ని ప్రమాదాలను కలిగి ఉంటాయి:

  • ఇది ఋతుక్రమ రక్తాన్ని సేకరిస్తుంది కాబట్టి, 12 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు దానిని ధరించి ఉండడం సురక్షితం కాదు. ఇది బ్యాక్టీరియా పెరుగుదల మరియు సంక్రమణకు మాధ్యమంగా మారుతుంది.
  • మెన్స్ట్రువల్ కప్పును ఉపయోగించడం వలన ఒక మహిళకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ సంభవించినట్లు ఒక అధ్యయనం నివేదించింది. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ హానికరమైన టాక్సిన్లను విడుదల చేసే బ్యాక్టీరియా పెరుగుదల వలన ఏర్పడుతుంది, కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమవుతుంది.
    అనేక ఇతర అధ్యయనాలు కూడా మెన్స్ట్రువల్ కప్పుల వాడకంతో టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రమాదం గురించి సూచించాయి మరియు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఫార్సు చేసాయి.
    'అప్లైడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయోలజీ'లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, ఈ టాక్సిక్ లక్షణాలకు కారణమైన బాక్టీరియా మెన్స్ట్రువల్ కప్పును కడిగిన తరువాత కూడా దానిలోనే ఉంటుందని పేర్కొంది.
  • మెన్స్ట్రువల్ కప్పును తొలగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనట్లు మరియు వైద్య సహాయం అవసరమైనట్లు కొన్ని కేసులు నివేదించబడ్డాయి. కాబట్టి, మీరు సరైన కప్పు రకాన్ని ఎంచుకోవడం మరియు దానిని సురక్షితంగా అమర్చుకోవడం ముఖ్యం.

వనరులు

  1. New South Wales Government. Menstrual Cups. [Internet]
  2. Barbara B. North, Michael J. Oldham. Preclinical, Clinical, and Over-the-Counter Postmarketing Experience with a New Vaginal Cup: Menstrual Collection . J Womens Health (Larchmt). 2011 Feb; 20(2): 303–311. PMID: 21194348
  3. Courtney Howard et al. FLOW (finding lasting options for women). Can Fam Physician. 2011 Jun; 57(6): e208–e215. PMID: 21673197
  4. Jane Juma et al. Examining the safety of menstrual cups among rural primary school girls in western Kenya: observational studies nested in a randomised controlled feasibility study . BMJ Open. 2017; 7(4): e015429. PMID: 28473520
  5. Wiebe ER, Trouton KJ. Does using tampons or menstrual cups increase early IUD expulsion rates? Contraception. 2012 Aug;86(2):119-21. PMID: 22464406
  6. Michael A Mitchell et al. A confirmed case of toxic shock syndrome associated with the use of a menstrual cup . Can J Infect Dis Med Microbiol. 2015 Jul-Aug; 26(4): 218–220. PMID: 26361491
  7. National Health Service [Internet]. UK; Toxic shock syndrome.
  8. Nonfoux L et al. Impact of Currently Marketed Tampons and Menstrual Cups on Staphylococcus aureus Growth and Toxic Shock Syndrome Toxin 1 Production In Vitro. Appl Environ Microbiol. 2018 May 31;84(12). pii: e00351-18. PMID: 29678918
Read on app