అల్జిమర్స్ వ్యాధి - Alzheimer's Disease in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 21, 2018

March 06, 2020

అల్జిమర్స్ వ్యాధి
అల్జిమర్స్ వ్యాధి

అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి?

అల్జీమర్స్ వ్యాధి (AD) ఒక క్షీణత వ్యాధి, ఇది పూర్వస్థితికి చేరని మరియు పురోగమించే స్వభావమైన వ్యాధి. ఇది మెదడు పనితీరు యొక్క శాశ్వత వైకల్యంతో సంబంధం ఉన్న అన్ని పరిస్థితులకు సంబంధించిన మిశ్రమ పదం, ఇది చిత్తవైకల్యం (dementia) (జ్ఞాపక శక్తి నష్టం) యొక్క ఒక రకం, ఇది సాధారణ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా సామర్ద్యాన్ని తగ్గిస్తుంది. భారతదేశంలో చిత్తవైకల్యం యొక్క ప్రాబల్యం 4 మిలియన్లకు పైగా ఉంది.ఇది ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్య, మొత్తం ప్రపంచంలో కనీసం 50 మిలియన్ల మంది చిత్తవైకల్యం కలిగి ఉంటారు.

అల్జీమర్స్ వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అల్జీమర్స్ వ్యాధి (AD) యొక్క ప్రారంభం 30 మరియు 60 ఏళ్ల వయసు మధ్య ఆరంభం చెందుతుంది, మరియు ఆలస్య ప్రారంభ రకం మధ్య 60 లలో కనిపిస్తుంది. వ్యాధి పురోగతి చెందేటప్పటికీ, మెదడుకు మరింత నష్టం సంభవిస్తుంది, మరియు దాని పురోగతి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ మారవచ్చు.

ఇది మూడు దశల ద్వారా జరుగుతుంది:

  • తేలికపాటి (mild)
    ఒక వ్యక్తి సాధారణంగా పనిచేయవచ్చు కానీ ప్రాంతాలను మరచిపోవాడం లేదా తెలిసిన పదాలు మర్చిపోవడం వంటి జ్ఞాపక శక్తి లోపాలను అనుభవించవచ్చు. పేర్లను గుర్తుతెచ్చుకోవడంలో అసమర్థత, ఇటీవలి కలుసుకున్నవారిని కూడా మర్చిపోవటం, వస్తువులను పోగొట్టుకోవడం లేదా తప్పుగా పెట్టడం మరియు ప్రణాళికలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి.
  • మోస్తరు (moderate)
    అప్పుడే జరిగిన సంఘటనలను లేదా వ్యక్తిగత వివరాలు మర్చిపోవడం, గందరగోళ స్థితి, సామాజిక ఉపసంహరణ, కొందరు వ్యక్తులు మూత్రము మరియు మూలము కదలికలను నియంత్రించులేకపోవడం మరియు పరిసరాలను లేదా వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోవటం వంటివి ఉంటాయి ఇది ఎక్కువ కాలం ఉంటుంది.
  • తీవ్రము (severe)
    పర్యావరణ ప్రేరేపకాలు మరియు సాధారణ సంభాషణలకు ప్రతిస్పందించడంలో వైఫల్యం, ఇతరులపై పూర్తి ఆధారపడటం.

అల్జీమర్స్ వ్యాధి యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

కారణాలు తెలియవు; శాస్త్రవేత్తలు అల్జీమర్స్ తో బాధపడుతున్న ప్రజల మెదడులో అధిక మోతాదులో ప్రోటీన్లు ఉండడాన్ని కనుగొన్నారు. ఈ అదనపు ప్రోటీన్లు సాధారణ మెదడు కణ క్రియలతో జోక్యం చేసుకోని మరియు చివరకు మరణానికి దారి తీయవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెరుగుతున్న వయస్సు అనేది అల్జీమర్స్ వ్యాధి యొక్క ముఖ్యమైన ప్రమాద కారకంగా పరిగణించబడుతుంది. వయస్సు-సంబంధిత నరాల నష్ట మార్పుల గురించి (కొన్ని మెదడు భాగాల క్షిణత, వాపు మరియు స్వేచ్ఛా రాశుల (Free radicles) ఉత్పత్తి) మరియు అల్జీమర్స్ యొక్క పురోగతి గురించి వివిధ అధ్యయనాల ద్వారా పరిశోధన దశలో ఉండడం వలన మరింత సమాచారం గురించి తెలియవలసి ఉంది. చిన్న వయసులోనే ప్రారంభమైయ్యే అల్జీమర్స్ రకం ఎక్కువగా జన్యుపరమైన ప్రభావంతో ఉంటుంది మరియు సాధారణంగా అరుదుగా ఉంటుంది, అయితే వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ రకం జన్యుపరమైన, జీవనశైలి మరియు పర్యావరణ కారకాల మిశ్రమం కారణంగా ఉంటుంది మరియు అది సాధారణమైనది.

అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించడం ఎలా మరియు చికిత్స ఏమిటి?

అల్జీమర్స్ వ్యాధి మానసిక సామర్ధ్యాలు మరియు ఇతర మెదడు నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్షల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. వాటిలో ఇవి ఉంటాయి:

  • ప్రవర్తన మరియు వ్యక్తిత్వంలో మార్పులతో సహా మునపటి ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం.
  • మూత్రం, రక్తం మరియు వెన్నెముక ద్రవ (spinal fluid) పరీక్షలు వంటి వైద్య పరీక్షలు.
  • మెదడు స్కాన్లు (CT స్కాన్ లేదా MRI).

అల్జీమర్స్ ఇప్పటీ వరకు పూర్తిగా నయం కాని వ్యాధిలానే ఉంది, కానీ చిత్తవైకల్యం (dementia) యొక్క లక్షణాలు కొన్ని మందుల ద్వారా నిర్వహించబడతాయి. అల్జీమర్స్ యొక్క మూల కారణం తెలుసుకొని ఈ వ్యాధి ఆలస్యం కావడానికి లేదా నిరోధించడానికి ఒక మార్గం నిర్ణయించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

సంభావ్య చికిత్సల్లో ఇవి ఉంటాయి:

  • గుండె జబ్బులు మరియు టైప్ 2 మధుమేహం వంటి అల్జీమర్స్ కు సంబంధించిన వ్యాధుల చికిత్స.
  • మెరుగైన ఆలోచన ప్రక్రియలు మరియు ఆత్రుత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ, మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ (Cognitive training).
  • హైపర్ టెన్షన్ను ఆపడానికి సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే మధ్యధరా ఆహార విధానం వంటి ప్రత్యేకమైన ఆహార విధానం.
  • వ్యాయామం.
  • పరిమళ చికిత్స.
  • సంగీతం లేదా నృత్యంలో మునిగిపోవడం.
  • జంతు సహాయక చికిత్స.
  • ఒక ఉపశాంతి అయినా మర్దన.
  • బహుళ జ్ఞాన ప్రేరణ.

ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణలో నిర్వహించాలి.



వనరులు

  1. Alzheimer's Association. Alzheimer's and Dementia in India. Michigan Ave., Fl. 17, Chicago. [internet]
  2. Alzheimer's Association. What Is Alzheimer's?. Michigan Ave, Chicago. [internet]
  3. National Institute of Aging. Alzheimer's Disease Fact Sheet. National Institutes of Health; US Department of heath and services. [internet]
  4. National Institute of Health. Fight Alzheimer’s. National institute of Medicine. [internet]
  5. Alzheimer's Research UK. Treatments available. 3 Riverside Granta Park Cambridge. [internet]
  6. University of California San Francisco. What Causes AD?. Memory and Aging centre. [internet]
  7. Alzheimer's Association. Adopt a Healthy Diet. Michigan Ave. Floor 17 Chicago. [internet]

అల్జిమర్స్ వ్యాధి వైద్యులు

Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
Dr. Muthukani S Dr. Muthukani S Neurology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

అల్జిమర్స్ వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for అల్జిమర్స్ వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.