myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) లేదా లూ జెహ్రిగ్స్ (Lou Gehrig’s) వ్యాధి అంటే ఏమిటి?

లూస్ గెహ్రిగ్స్ వ్యాధి అని పిలువబడే అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) , ఒక నరాల సంబంధ వ్యాధి. ఇది కాలంతో పాటు మరింత బలహీనపడుతుంది. ఈ వ్యాధి నరాల కణాలను నాశనం చేసి వైకల్యం కలిగిస్తుంది. ఈ వ్యాధి చిన్నచిన్న లక్షణాలతో ప్రారంభమయ్యి, అచలత్వం (immobility) మరియు శ్వాస పీల్చుకోవడంలో అసమర్థత వరకు దారితీస్తుంది. ఇది చివరకు మరణానికి దారితీస్తుంది.

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) యొక్క లక్షణాల ప్రారంభ దశలలో చాలా చిన్నవిషయంగా అనిపించవచ్చు కానీ వ్యాధి పురోగతి చెందుతున్నప్పుడు మరింత తీవ్రమవుతుంది. సమస్య ముందు కాళ్లు,చేతులతో మొదలవుతుంది తర్వాత ఇతర శరీర భాగాలకు నెమ్మదిగా వ్యాపిస్తుంది. ఇది నమలడం మరియు మ్రింగడం, ఊపిరి తీసుకోవడం మరియు మాట్లాడటం వంటి సామర్ధ్యాలను పాడుచేస్తుంది. సాధారణ లక్షణాలు ఈ క్రింది విధంగా:

 • తరచుగా అదుపు తప్పి పడిపోవడం .
 • కండరాల బలహీనత.
 • అవయవాల మధ్య సమన్వయం లేకపోవడం.
 • అస్తవ్యస్తంగా లేదా ఇబ్బందికరముగా ఉండటం.
 • చీలమండ మరియు పాదములతో సహా క్రింది కాళ్లలో బలహీనత.
 • అస్పష్ట మాట్లాడడం.
 • కండరాల తిమ్మిర్లు.
 • భంగిమను నిర్వహించడం లేదా తల పైకి ఎత్తడంలో సమస్య.
 • మింగడంలో కష్టం
 • కండరాలలో రంధ్రాలు ఏర్పడడం.

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) వ్యాధి యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

ఖచ్చితమైన కారణాల గురించి కొంచెం సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. రోగుల్లో 10 శాతానికి పైగా వారసత్వంగా పొందినప్పటికీ, మిగిలిన కారణాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. తెలుసుకున్న కొన్ని కారణాలు:

 • మార్పు చెందిన లేదా మార్చబడిన (mutated) జన్యు నిర్మాణాలు.
 • గ్లుటామెట్ (glutamate) ( ఇది నరాల నుండి కండరాలకు సందేశాలను పంపే ఒక రసాయనం) స్థాయిలలో అసమతుల్యత, ఇది కణాలు విషపూరితం అయ్యేలా చేస్తుంది.
 • నాడి కణాలలో ఆటో ఇమ్యూన్ (auto immune) చర్య.
 • నాడీ కణాలలో ప్రోటీన్లు లేదా ఏవైనా అసహజ పదార్దాలు అధిక మోతాదులో చేరిక, ఇది నాడీ కణాల నాశనానికి దారి తీస్తుంది.
 • విషపూరితమైన ఉత్పత్తులకు బహిర్గతం కావడం.
 • తీవ్రమైన శారీరక శ్రమ.

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) నిర్ధారణ మరియు చికిత్స ఏమిటి?

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS), దాని ప్రారంభ దశలలో, ఇతర నాడీ సంబంధిత రుగ్మతలలా భ్రమపెట్టవచ్చు. ఇతర పరిస్థితుల అవకాశాలని తీసివేయడం దాని నిర్ధారణకు కీలకం. వాటిని తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉన్నాయి:

 • ఇతర నాడికండర వ్యాధుల చర్యలను తనిఖీ చేయడానికి EMG లేదా ఎలక్ట్రోమియోగ్రామ్ (electromyogram).
 • ప్రేరణ ప్రసారం (impulse trasmission) తనిఖీ చేయడం కోసం నరాల ప్రసరణ పరీక్షలు, ఇది నరాల నష్టాన్ని లేదా కండరాల వ్యాధులను తెలుపుతుంది.
 • వెన్నెముక లేదా హెర్నియేటెడ్ డిస్కులలో కణితులని పరిశీలించడానికి MRI.
 • ఇతర పరిస్థితులు తనిఖీ కోసం మూత్ర మరియు రక్త పరీక్షలు.
 • పరీక్ష కోసం సెరెబ్రోస్పైనల్ (cerebrospinal) ద్రవాన్ని పొందటానికి లుంబార్ పంక్చర్(Lumbar puncture).
 • మరింత విశ్లేషణ కోసం కండరాల జీవాణు పరీక్ష (biopsy).

 అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ (ALS) ను నివారించడానికి లేదా వెనక్కి తీసుకురావడానికి చికిత్స అందుబాటులో లేదు. అయినప్పటికీ, ఆ వ్యక్తికి సౌకర్యవంతంగా ఉండడానికి మరియు వ్యాధి యొక్క పురోగతిని ఆలస్యం చేయడానికి చికిత్స పద్ధతులు ఉన్నాయి. అవి:

 • మందులు
  రెండు ప్రధాన మందుల విధానాలు సాధారణంగా సూచించబడతాయి:
  • రోజువారీ కార్యకలాపాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా నిరోధించడానికి ఎడరావోన్ (Edaravone). ఇది అలెర్జీ ప్రతిస్పందనలు, శ్వాస ఆడకపోవడం లేదా వాపు వంటి దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు.
  • గ్లూటామేట్ స్థాయిలు తగ్గించడానికి మరియు ఆలస్యంగా వ్యాధి పురోగమించడానికి చూపించిన రిలుజోల్ (Riluzole). కాలేయ పనితీరు సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇబ్బంది మరియు మైకము వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.
  • తిమ్మిరి, మలబద్ధకం, అలసట, నిరాశ, నిద్రలేమి, నొప్పి, రద్దీ మరియు లాలాజలం వంటి వాటి కోసం మందులు సూచించబడవచ్చు.
 • సహాయక చికిత్సలు
  ఇవి వ్యక్తి యొక్క పరిస్థితిని సమతుల్యం చేయడానికి మరియు మంచి పనితీరును మరియు నియంత్రణను అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పనిచేస్తాయి:
  • తినడం, రోజువారీ పనితీరును నిర్వహించడం, దుస్తులు ధరించడం, కాళ్ళు చేతులలో బలహీనత ఉన్నప్పటికీ నడవడం వంటి వాటిలో వృతి చికిత్స (Occupational therapy) సహాయం చేస్తుంది.
  • శ్వాసను మెరుగుపరచడానికి సహాయపడే శ్వాసకొస పద్ధతులు, ప్రత్యేకంగా రాత్రి మరియు నిద్రించు సమయంలో వ్యాధి పురోగమిస్తూ ఉంటుంది. చివరికి యాంత్రిక శ్వాస సహకారం అవసరం కావచ్చు.
  • నొప్పి నివారణ, సంతులనం, కదలిక మరియు సర్దుబాటు కోసం భౌతిక చికిత్స. ఇది శరీరాన్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది, అయినప్పటికీ వ్యక్తి చివరికి ఒక వీల్ చైర్ను ఉపయోగించడానికి అలవాటు పడాలి.
  • స్పష్టంగా మరియు ప్రభావవంతంగా మాట్లాడడానికి సహాయం చేసే వాక్ చికిత్స (స్పీచ్ థెరపీ).
  • సామాజిక మరియు భావోద్వేగ సహకారం ఎందుకంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి అసాధ్యం.
 1. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ కొరకు మందులు
 2. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ వైద్యులు
Dr. Virender K Sheorain

Dr. Virender K Sheorain

Neurology
19 वर्षों का अनुभव

Dr. Vipul Rastogi

Dr. Vipul Rastogi

Neurology
17 वर्षों का अनुभव

Dr. Sushil Razdan

Dr. Sushil Razdan

Neurology
46 वर्षों का अनुभव

Dr. Susant Kumar Bhuyan

Dr. Susant Kumar Bhuyan

Neurology
19 वर्षों का अनुभव

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ కొరకు మందులు

అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లేరోసిస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Albumed खरीदें
Aminofusion खरीदें
Aminosteril खरीदें
Aminoven Infant खरीदें
Aminowel खरीदें
Kanzomin खरीदें
Aravon खरीदें
Carevon खरीदें
Edakem खरीदें
Edarabid खरीदें
Edastar खरीदें
Edavit खरीदें
Edinova खरीदें
Edvo खरीदें
Ezycut खरीदें
Fraseda खरीदें
Edasure खरीदें
Rilutor खरीदें
Kabiven खरीदें
Kabiven Peripheral खरीदें
Hermin खरीदें

References

 1. Daniel Murrell. All about amyotrophic lateral sclerosis (ALS). Healthline Media UK Ltd, Brighton, UK. [internet]
 2. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Neurological Diagnostic Tests and Procedures Fact Sheet
 3. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Amyotrophic Lateral Sclerosis (ALS) Fact Sheet
 4. U.S. Department of Health & Human Services USA. National Amyotrophic Lateral Sclerosis (ALS) Registry. Centres for Disease Control and Preventiobn
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Amyotrophic Lateral Sclerosis
और पढ़ें ...
ऐप पर पढ़ें