వెన్ను కండరాల వాపు - Spondylitis in Telugu

Dr. Ayush PandeyMBBS

November 27, 2018

March 06, 2020

వెన్ను కండరాల వాపు
వెన్ను కండరాల వాపు
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

వెన్నుకండరాల వాపు  అంటే ఏమిటి? 

వెన్నుకండరాల వాపు (spondylitis) అనేది వెన్నెముకకు సంబంధించిన ఆర్థ్రయిటిస్ . ఇందులో ఈ వెన్నుపూసలు (లేక కశేరుకలు, ఇవే వెన్నెముకను ఏర్పరచే ఎముకలు) మరియు కటివలయం (పొత్తికడుపు) మధ్య ఉన్న కీళ్ళలో వాపు దాపురిస్తుంది. ఈ వెన్నెముక  దరిదాపుల్లో ఉండే నరాలు, మరియు కండర బంధనాల్లో కూడా వాపు, నొప్పి ఉంటుంది. సాధారణంగా వెన్నునొప్పి పురుషులకే ఎక్కువగాను మరియు తీవ్రమైందిగానూ వస్తుంటుంది. అప్పుడప్పుడు, వెన్నుతో పాటు ఇతర కీళ్ళు కూడా వాపుదేలి నొప్పి పెట్టడం జరుగుతుంది.

కొత్త వర్గీకరణ ప్రకారం, వెన్నునొప్పిని “యాక్సియల్ స్పాండిలో ఆర్తరైటిస్” (axial spondyloarthritis) (వెన్నెముకను మరియు కటివలయాన్ని బాధించేది ) మరియు పరిధీయ వెన్ను-కీళ్లనొప్పి (peripheral spondyloarthritis) గా వర్గీకరించారు. ఈ రెండోరకం వెన్ను నొప్పి ఇతర కీళ్ళను కూడా బాధిస్తుంది.

వెన్నుకండరాల వాపు ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వెన్నుకండరాల వాపు సంకేతాలు మరియు లక్షణాలు:

 • నొప్పి మరియు పెడసరం (బిర్ర బిగుసుకుపోవడం) ఎముకలు, పిరుదులు, పండ్లు, దిగువ వెన్ను, భుజాలు, మరియు మడిమల్లో.  
 • వెన్నెముక యొక్క కదలిక పరిమితంగా ఉంటుంది, ఈ పరిస్థితిలో  చలనశీలతను పరిమితం చేస్తుంది
 • జ్వరం మరియు అలసట
 • కంటి లేదా ప్రేగు యొక్క వాపు
 • అరుదుగా, గుండె లేదా ఊపిరితిత్తులకు కూడా నొప్పి వ్యాపిస్తుంది.
 • శ్లేష్మ పొర, చర్మం, కళ్ళు, మూత్రాశయం, జననేంద్రియాలలో నొప్పి మరియు వాపు.
 • మడమ నొప్పి (ఎఫెసిటిస్), కన్నుగుడ్డువాపు (ఎరిటిస్) మరియు మోకాలు వాపు.

వెన్ను కండరాల వాపు ప్రధాన కారణాలు ఏమిటి?

వెన్ను కండరాల వాపుకి  కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, జన్యు కారకాలు అనుమానించబడుతున్నాయి. ఇది HLA-B27 జన్యువుతో సంబంధం కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు; అయితే, ఇందుకు సంబంధించిన యంత్రాంగం ఇంకా తెలియదు. వెన్నునొప్పిని కలిగించే ఇతర కారణాలు:

 • పర్యావరణ కారకాలు
 • రోగ నిరోధక (ఇమ్యునోలాజికల్) కారకాలు- స్వయం నిరోధకతలో శరీరంలో తన సొంత రోగనిరోధక కణాలు వివిధ కణజాలాలపై దాడి చేస్తాయి, దానివల్ల వాపు, మంట కల్గుతుంది.  
 • దీర్ఘకాలం పాటు ప్రేగుల వాపు

వెన్ను కండరాల వాపుని ఎలా నిర్ధారించడం మరియు దీనికెలా చికిత్స చేయాలి?

వెన్ను కండరాల వాపు యొక్క రోగ నిర్ధారణ వ్యక్తిగత సంకేతాలు మరియు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రోగ నిర్ధారణను ధృవీకరించడానికి వైద్యుడు క్రింది చర్యల్ని నిర్వహిస్తారు:

 • వైద్యుడు భౌతిక పరీక్ష చేసిన తరువాత సంపూర్ణ రుగ్మత చరిత్రను అడిగి తెలుసుకుంటాడు.  
 • X- కిరణాలు, ముఖ్యంగా కటి ప్రదేశపు (సాక్రిలియోక్) కీళ్ళు మరియు వెన్నెముక ను ఎక్స్-రే తీస్తారు, ఇది రోగ నిర్ధారణను ధ్రువపరచగలదు.
 • HLA-B27 జన్యువును పరీక్షించటానికి రక్త పరీక్ష; అయినప్పటికీ, ఈ జన్యువు ఉనికి వ్యాధి నిర్ధారణను చేయలేదు.  

వెన్ను కండరాల వాపుకి చికిత్స 

ప్రస్తుతం, వెన్నునొప్పికి ఎటువంటి చికిత్స లేదు. అందువలన, చికిత్స యొక్క లక్ష్యం వాపు, నొప్పి మరియు పెడసరాన్ని తగ్గించడం, వైకల్యాన్ని నివారించడం మరియు వెన్ను పనితీరును సంరక్షించడం, వ్యాధి యొక్క పురోగతిని నెమ్మదిగా తగ్గించడం మరియు రోగి యొక్క వెన్ను భంగిమను కాపాడుకోవడం. చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి:

 • గూని, హఠాత్తుగా పడిపోవడం వంటి ప్రమాదాల్ని నివారించేందుకు క్రమమైన వ్యాయామాలు, నిగ్గదీసి, నిటారుగా చేసే వ్యాయామాలు, మరియు బలం చేకూర్చేటువంటి వ్యాయామాలు (strengthening exercises), సాధారణ శ్వాస వ్యాయామాలు, దీర్ఘ శ్వాస వ్యాయామాలు, భంగిమ శ్వాస వ్యాయామాలు. వెన్ను నొప్పి ఉన్నవారికి వ్యాయామ నియమాలను క్రమంగా చేసి చూపించే ఒక ఫిజియోథెరపిస్ట్ అవసమవుతాడు. ఫిజియోథెరపిస్ట్ పాత్ర ఇందులో  ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 • మందులతో కూడిన చికిత్స కింది విధంగా ఉంటుంది:
 • వెన్నునొప్పి లక్షణాలను నియంత్రించడానికి ఎక్కువగా ఉపయోగించే నాన్-స్టెరాయిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs).
 • స్టెరాయిడ్ మందులను (స్టెరాయిడ్లను) అరుదుగా ఉపయోగిస్తారు. కార్టిసోన్ లేదా ప్రెడ్నిసోన్ వంటివి.
 • సల్ఫాసలాజిన్ (Sulfasalazine) లేదా మెతోట్రెక్సేట్ (methotrexate) ఉపయోగించవచ్చు, కానీ వెన్నెముక వ్యాధికి తక్కువగా  ఉపయోగపడతాయి.
 • ప్రస్తుతం, ఇన్ఫ్లిక్సిమాబ్, ఎటనార్సెప్ట్ మరియు ఆడాలిమియాబ్ వంటి జీవసంబంధ “యాంటీ-TNF-α ఏజెంట్లు” ఉపయోగంలో ఉన్నాయి. ఇవి వెన్నునొప్పిలక్షణాలను తగ్గించడానికి మరియు నెమ్మదిగా వ్యాధి పురోగతిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మందుల్ని నరాలకు (సిరల్లోకి) ఇస్తారు.

యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ (ankylosing spondylitis) అనబడే వెన్నునొప్పి రకానికి శస్త్రచికిత్స ఎంపికలు పరిమితంగా ఉంటాయి. వెన్నెముకకు ప్రత్యేక శస్త్రచికిత్సలు లేవు. అయితే, తీవ్రమైన సందర్భాల్లో భుజం లేక తుంటి (హిప్) భర్తీ (replacement శస్త్రచికిత్స ప్రయోజనకరంగా ఉంటుంది.వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Ankylosing Spondylitis
 2. Cleveland Clinic. Spondylitis: Management and Treatment. Euclid Avenue. [internet[
 3. Spondylitis Association of America. Overview of Types of Spondylitis. US; [internet]
 4. Canadian Spondylitis Association. Spondylitis. Canada; [internet]
 5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Ankylosing spondylitis

వెన్ను కండరాల వాపు వైద్యులు

Dr. Tushar Verma Dr. Tushar Verma Orthopedics
5 वर्षों का अनुभव
Dr. Urmish Donga Dr. Urmish Donga Orthopedics
5 वर्षों का अनुभव
Dr. Sunil Kumar Yadav Dr. Sunil Kumar Yadav Orthopedics
3 वर्षों का अनुभव
Dr. Deep Chakraborty Dr. Deep Chakraborty Orthopedics
10 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

వెన్ను కండరాల వాపు కొరకు మందులు

వెన్ను కండరాల వాపు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।