యాంటిత్రోంబిన్ లోపం - Antithrombin Deficiency in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

March 06, 2020

యాంటిత్రోంబిన్ లోపం
యాంటిత్రోంబిన్ లోపం

యాంటిత్రోంబిన్ లోపం అంటే ఏమిటి?

యాంటిత్రోంబిన్ రక్తంలో ఉండే ఒక ప్రోటీన్ రకం. ప్రాధమికంగా, అది రక్తాన్ని పల్చబరచడంలో పనిచేస్తుంటుంది మరియు రక్తం ఎక్కువగా గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. పనిపరంగా, ఇది రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్, త్రోమ్బిన్ కు వ్యతిరేకం.

ఒక వ్యక్తి కి యాంటిత్రోంబిన్ ప్రోటీన్ యొక్క లోపం ఉంటే రక్తనాడులలోని గడ్డలు అభివృద్ధి చేసే ప్రమాదముంది (venous thrombosis).

యాంటిత్రోంబిన్ లోపం వారసత్వంగా లేదా సాధారణంగా సంభవించవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

యాంటిత్రోంబిన్ లోపం ఉన్న వ్యక్తులు రక్తనాడుల లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. దానిని వీనస్ త్రోంబోసిస్ (venous thrombosis) అని పిలుస్తారు. అలాంటి వ్యక్తులలో, రక్తం మొదటి సారిగా గడ్డకట్టడం 40 సంవత్సరాల వయసు లోపులోనే సంభవించవచ్చు, ఈ సమయంలో రక్త గడ్డలు రక్తనాడుల యొక్క అంతర్గత గోడకు అతుక్కుని ఉంటాయి. సాధారణంగా, వీనస్ త్రోంబోసిస్ క్రింది కాళ్లలో సంభవిస్తుంది. అందువల్ల, ప్రభావిత కాళ్లలో క్రింది లక్షణాలను గుర్తించవచ్చు:

కాళ్ళ నుండి ఊపిరితిత్తులకు గడ్డలు చేరినప్పుడు, సాధారణంగా కనిపించే లక్షణాలు,

యాంటిత్రోంబిన్ లోపం యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

సాధారణంగా వచ్చే యాంటిత్రోంబిన్ లోపమునకు ఈ కింది కారణాలు ఉండవచ్చు:

  • కాలేయ నష్టం (liver cirrhosis)
  • మూత్రపిండ వ్యాధులు (kidney disorders)
  • తీవ్రమైన గాయాలు
  • తీవ్రమైన కాలిన గాయాలు
  • కీమోథెరపీ (chemotherapy)

యాంటిత్రోంబిన్ లోపం కూడా వారసత్వంగా సంభవించవచ్చు. పురుషులు మరియు మహిళలు సమానంగా ఈ జన్యుపరమైన లోపానికి లోనవుతారు. అసాధారణ జన్యువులు ఉండడం అనేది రక్తంలో తక్కువ శాతం యాంటిత్రోంబిన్ ప్రోటీన్ కు దారితీస్తుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఈ సమస్య యొక్క రోగ నిర్ధారణ రోగి యొక్క భౌతిక లక్షణాలను పరిశీలించి మరియు ఇతర ఆరోగ్య సమస్యల సాధ్యతను తీసివేసి అంచనా వేయబడింది. తర్వాత, వైద్యులు రక్త పరీక్షను సిఫారసు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తం తక్కువ శాతంలో యాంటిత్రోంబిన్ను కలిగి ఉన్నదా అని నిర్ణయించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, ఇతర కారకాల వలన కూడా తక్కువ యాంటిత్రోంబిన్ స్థాయిలు ఉంటాయి. అందువల్ల, అంతర్లీన కారణాన్ని నిర్ధారించడానికి మరియు వారసత్వ యాంటిత్రోంబిన్ లోపం సాధ్యతను తొలగించడానికి పునరావృత పరీక్షలు అవసరమవుతాయి.

యాంటిత్రోంబిన్ లోపం అనేది ప్రాథమికంగా రక్తాన్ని పలుచబర్చే మందుల ద్వారా చికిత్స చేయబడుతుంది, వాటిని యాంటీ-కోగ్యులెంట్స్ అని కూడా పిలుస్తారు. అయితే, ఈ మోతాదు మరియు ఎన్నిసార్లు మందు తీసుకోవాలనేది వ్యక్తి వ్యక్తికి మారుతుంది మరియు దానిని ఖచ్చితమైన నియంత్రణలో ఉంచాలి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Congenital antithrombin III deficiency
  2. National Organization for Rare Disorders. Antithrombin Deficiency. US; [Internet]
  3. National Blood Clot Alliance. ANTITHROMBIN DEFICIENCY. Gaithersburg. [internet]
  4. U.S. Department of Health & Human Services. Hereditary antithrombin deficiency. National Institutes of Health. [internet]
  5. National Centre for Advancing Translational Sciences. Hereditary antithrombin deficiency. U.S. Department of Health & Human Services. [internet]

యాంటిత్రోంబిన్ లోపం వైద్యులు

నగర వైద్యులు Hematologist వెతకండి

  1. Hematologist in Surat