కీళ్లనొప్పులు - Arthritis in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

January 31, 2019

March 06, 2020

కీళ్లనొప్పులు
కీళ్లనొప్పులు

సారాంశం

కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) అంటే మన శరీరంలోని అన్ని కీళ్ళు, మోకాళ్లు,  మోచేతులు, తుంటి, మరియు చీలమండలాల్లో వాపులతో కూడిన నొప్పితో బాధిస్తూ ఉండడం. నొప్పి, వాపు ఉన్న చోట ఎరుపురంగుదేలి ఉండడం కూడా కీళ్ళనొప్పుల లక్షణం. కీళ్లనొప్పులు అనేవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కణాలను మరియు ఉపాస్థి (కీళ్లలో గట్టినరాలు’ లేదా ‘cartilages) నరాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. ఇలా కీళ్ళు, వాటిసమీప ప్రాంతాలపై కీళ్లనొప్పులు దాడి జరిపి రోగిని నొప్పిస్తాయి. కదలినప్పుడల్లా కీళ్లలో తీవ్ర నొప్పిని కలుగజేసి కష్టాలు తెచ్చి పెడతాయి. కీళ్లనొప్పులు పలు రకాలు. కానీ కీళ్లనొప్పుల్లో  ‘రుమటాయిడ్’ నొప్పులు, బాల్యపు కీళ్లనొప్పులు మరియు ఆస్టియోఆర్థరైటిస్ అనే రకాలు అత్యంత ప్రబలమైనవి. కీళ్ళనొప్పులకు ఎటువంటి శాశ్వత పరిహారం లేదు కానీ ఈ సంకటం దాపురించినపుడు తగిన జాగ్రత్తలతో దీన్ని నిర్వహించకోవడం వలన నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇంకా, అలా జాగ్రత్తలు తీసుకోవడం మూలాన కీళ్లనొప్పులతో ముడిపడి ఉన్న హృదయకండరాల జబ్బులు మరియు తీవ్రమైన కీళ్లనష్టాలను నిరోధించకోవచ్చు.

 

కీళ్ళనొప్పుల రకాలు - Types of Arthritis​ in Telugu

కీళ్ళనొప్పుల రకాలు

కీళ్లనొప్పులు కనీసం 100 వేర్వేరు రకాలుగా ఉన్నాయని వైద్య పరిశోధకులు విశ్వసిస్తున్నారు. మేము ఇక్కడ ప్రధానంగా చాలా మందికి సామాన్యంగా దాపురించే కీళ్ళనొప్పుల రకాలను వివరిస్తున్నాం. కీళ్లనొప్పులను (ఆర్థరైటిస్) ప్రధానంగా క్రింది వర్గాలుగా విభజించవచ్చు

  • ‘రుమటాయిడ్’ కీళ్లనొప్పులు
    రుమటాయిడ్  కీళ్ళనొప్పి అనేది ఒక స్వయం ప్రతిరక్షక స్థితి. ఈ స్థితిలో శరీరం యొక్క సొంత కణాలు ఆరోగ్యకరమైన కణాలను విదేశీ దండయాత్రలుగా పొరబాటుగా భావించి దాడి చేస్తాయి. కీళ్లనొప్పి వేళ్లలో, మోకాళ్లలో, మోచేతుల్లో మరియు చీలమండలాల్లోని కీళ్ళలో వచ్చే వాపును బట్టి వర్గీకరించబడుతుంది. ‘రుమటాయిడ్’ అనే ఈ పరిస్థితి పురుషులు కంటే, పిల్లలు మరియు స్త్రీలకు ఎక్కువగా దాపురిస్తుందని వైద్య పరిశోధకులు సూచించారు.
     
  • కీళ్ల బాధ లేక ఆస్టియో ఆర్థరైటిస్కీ
    ళ్ల బాధ లేక ‘ఆస్టియో ఆర్టరైటిస్’ 30-50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో కనిపించే కీళ్ళతొందర. కీళ్లమధ్యలో ఉండే కీలకమైన ‘గట్టి నరాలు’ లేక ‘కార్టిలేజ్’ అనే మృదువైన ఎముకలు (మృదులాస్థి) మిక్కిలి శ్రమకు లేదా అరుగుదలకు గురై ఇటువంటి కీళ్ల బాధ ఏర్పడుతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ‘కార్టిలేజ్’ గట్టినరాలకు దెబ్బలు తగలడం లేదా వాపు ఏర్పడడం మూలాన కీళ్లలో అవయవాల్ని కదిపినప్పుడల్లా విపరీతమైన నొప్పి కల్గుతుంది. 
      
  • బాల కీళ్లనొప్పులు (జువెనైల్ ఆర్థరైటిస్)  
    బాల (జువెనైల్) కీళ్లనొప్పులు 16 సంవత్సరాల లోపు వయసున్న పిన్న వయస్కుల్లో కీళ్లలో నొప్పి, వాతశూల మరియు వాపు వలన సంభవిస్తుంది. ఇది ‘రుమటిక్ ఆర్థరైటిస్’ అనే కీళ్లనొప్పి రకాల్లో ఒకటని చెప్పబడింది. పిన్నవయస్కుల్లో వచ్చే బాల్య కీళ్లనొప్పి లక్షణాలు ఏవంటే కీళ్లు ఎరుపురంగులోకి మారడం, వెచ్చదనం, కీళ్ళ నొప్పి, చిన్న పిల్లల అవయవాల కదలికలలో విపరీతమైన నొప్పి కష్టాలు ఉంటాయి.
     
  • సాంక్రామిక కీళ్ళవ్యాధి (ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్)
    సాంక్రామిక కీళ్ళవ్యాధినే (ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్) ‘సెప్టిక్ కీళ్లవ్యాధి’ అని కూడా అంటారు. కీళ్ళ చుట్టూ స్రవించే రాసి ద్రవాల కారణంగా, దానిలోంచి వచ్చే బ్యాక్టీరియా మరియు విషక్రిముల కారణంగా ఈ సాంక్రామిక కీళ్ళవ్యాధి సంభవిస్తుంది. కీళ్ళ చుట్టూ స్రవించే ద్రవాలను ‘సైనోవియల్ ద్రవం’ అని పిలుస్తారు. ఏ వయస్కులకైనా ఈ రకం కీళ్లవ్యాధి  సంభవించవచ్చు మరియు ఈ అంటువ్యాధికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియవు. అయినప్పటికీ, ఇది ఎక్కువగా అంటువ్యాధిగానే గుర్తించబడుతోంది. బాహ్య గాయాలు, శస్త్రచికిత్స సమయంలో లేదా కొన్ని మందుల ద్వారా ఈ సాంక్రామిక కీళ్ళవ్యాధి (ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్) శరీరంలోకి ప్రవేశిస్తుంది. 
     
  • కీళ్లవాతం (Gout)
    కీళ్లవాతం (గౌట్) అనేది రక్తంలో ‘యూరిక్ యాసిడ్’ కారణంగా సంభవిస్తుంది. ఇది కీళ్ళనొప్పులకు, వాపులకు కారణమవుతుంది. వాపు, నొప్పిని కలిగించే ఈ కీళ్ళ అంటువ్యాధి, వ్యాదున్న కీళ్లప్రాంతం ఎరుపు రంగులోకి మారుతుంది. చాక్ పీస్ స్పటికాలు వంటివి, సూది వంటి స్ఫోటకాలు కీళ్ల మధ్యలో పొడజూపడం వల్లనే ఈ కీళ్ల పోటు, ఎర్రబారిపోవడమనేది జరుగుతుంటుంది, అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి కూడా కలుగుతుంటుంది.  
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

కీళ్లనొప్పి (ఆర్థరైటిస్) అంటే ఏమిటి? - What is Arthritis?​ in Telugu

సామాన్యంగా ‘కీళ్లనొప్పి’ అనే పదంతో కీళ్ళకు సంబంధించిన అన్ని కీళ్ల వ్యాధులను సూచిస్తుంటాం. కీళ్లనొప్పులు సాధారణంగా ఏ వయసు వారికైనా, ఆడ వాళ్ళకైనా మగవారికైనా రావచ్చు. కీళ్లనొప్పుల రుగ్మత 50 సంవత్సరాలు, అంతకు పైబడిన వయస్సువారిలో మాత్రమే వస్తుందని గతంలో శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే ఇటీవలి అధ్యయనాల ప్రకారం, కీళ్లనొప్పులు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా దాపురించి బాధించవచ్చు.  వాస్తవానికి, ఈ కీళ్ళనొప్పుల వ్యాధి సామాజిక-ఆర్థిక సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది, ఎందుకంటే కీళ్లనొప్పి, మనిషి చలనశక్తి (locomotion)కి అంతరాయం కలిగించిందని ప్రముఖంగా తెలుస్తోంది.

కీళ్లవాపు లక్షణాలు - Arthritis Symptoms​ in Telugu

అన్ని రకాల కీళ్ల వాపులు 4 సాధారణ లక్షణాలను కల్గి ఉంటాయి.

  • నొప్పి మరియు వాపు
  • మీరు కీళ్ళలో బిర్ర బిగుసుకుపోవడం (దృఢత్వం) మరియు చాలా మృదులతను కల్గి ఉండచ్చు.
  • మీకు  సాధారణ జ్వరం రావచ్చు
  • కీళ్లనొప్పి ఉన్న చోట ఎర్రబడడాన్ని మీరు గమనించొచ్చు.

చిన్న పిల్లల్లో వచ్చే కీళ్ళనొప్పుల లక్షణాలు

  • మీ బిడ్డ/శిశువు కండరాల బలహీనతతో సతమతమవుతూ ఉండచ్చు.
  • మీ బిడ్డ/శిశువు సరిగ్గా వివరించలేనటువంటి చర్మదద్దుర్లు (rashes) పొందవచ్చు
  • మీ బిడ్డ/శిశువు ఎల్లప్పుడూ అలసిపోతుండడం జరుగుతూ ఉండచ్చు.
  • కీళ్లలో నిరంతర నొప్పి మరియు బిర్ర బిగుసుకుపోయే (దృఢత్వం లేక stiffness)  తత్త్వం కారణంగా మీ బిడ్డ/శిశువు సరిగా నిద్రపోకుండా బాధపడుతుంటారు.

‘రుమటాయిడ్’ కీళ్ళనొప్పుల లక్షణాలు

  • మీ చేతులు, వేళ్లు, కీళ్ళు, మరియు పాదాలు కొంత పరిమితమైన పరిధిలో మాత్రమే కదపడానికి వీలవుతుండవచ్చు.
  • మీరు రక్తహీనతతో బాధపడుతుంటారు (రక్తహీనత అనేది శరీరంలో ఇనుము యొక్క స్థాయిలు పడిపోయినపుడు వస్తుంది.)
  • మీరు తీవ్ర అలసటను అనుభవిస్తారు.     
  • మీరు మానసికంగా (డిప్రెషన్) బాధపడుతూ ఉండవచ్చు (న్యూనతాభావంతో,  ప్రేరణారహితులై ఉండడం)
  • మీకు తెలియక పోవచ్చు కానీ మీరు నడిచేటప్పుడు (ప్రగతిశీల ఆర్థరైటిస్ కేసులలో) మీ బలహీనమైన నడకను లేక కుంటటాన్ని ఇతరులు గుర్తించవచ్చు.
  • రుమటాయిడ్ కీళ్ళనొప్పుల కారణంగా మీరు కీళ్లలో వైకల్యాన్ని అనుభవించవచ్చు.

ఆస్టియోఆర్థరైటిస్ యొక్క లక్షణాలు

  • మీరు ఉదయం నిద్ర లేవగానే వెంటనే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పిని అనుభవించవచ్చు.
  • మీరు మీ కీళ్ల నుండి “టప్” మనే విరుపుల శబ్దాలను వినవచ్చు.  
  • మీరు మీ కీళ్ళలో మరియు వాటి చుట్టుపట్ల వాపులు, ఉబ్బులు రావడం గమనించవచ్చు.  
  • రోజులో చివరికి మీరు మీ కండరాలు మరియు కీళ్లలో నొప్పిని అనుభవించవచ్చు, లేదా మీరు విశ్రాంతిగున్నపుడు కూడా కీళ్లనొప్పులు, కండరాల నొప్పి మిమ్మల్ని బాధించవచ్చు.

కీళ్ళవాతం  (గౌట్స్) లక్షణాలు

  • మీరు వాపుతో పాటు తాకితే చాలు నొప్పి పుట్టే మృదులత్వ లక్షణంతో వ్యధపడొచ్చు.  
  • కీళ్లనొప్పి తీవ్రంగా ఉన్న చోట మీరు ఉడుకుతోందా అన్నటువంటి బాధాకరమైన అనుభూతిని లేదా వేడిని ఎదుర్కొంటారు.
  • కీళ్లనొప్పి సమయంలో మీ చర్మం సామాన్యంగా ఎరుపు రంగులోకి, లేదా పసుపు రంగులోకి మారొచ్చు. చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది.
  • కీళ్లనొప్పి ఉన్నచోట ఆ మీ బాధిత ప్రాంతాన్ని తాకినప్పుడు తీవ్రంగా, చాలా  బాధాకరమైనదిగా ఉంటుంది.​​
  • మీరు వైద్యుడ్ని ఎపుడు కలవాలి?​
  • మీరు మీ కీళ్లలో నిరంతరం నొప్పిని, బిర్రబిగుసుకు పోయినట్లుండే బాధ-అసౌకర్యాన్ని అనుభవిస్తూ ఎలాంటి పనులూ చేయలేని స్థితిలో ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సిందిగా మీకు హెచ్చిన రీతిలో సిఫారసు చేయడమైనది. అశ్రద్ధ చేస్తే ఇది జీవితాంతం బాధించే సమస్య కాబట్టి జాగు చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించి చికిత్స చేయించుకోండి. ఎంత త్వరగా వైద్యుడి చేత చికిత్స చేయించుకుంటే అంత మంచిది.

కీళ్లనొప్పితో ఉన్నవాళ్లు డాక్టర్ ని ఎపుడు  చూడాలి

మీకు మీ కీళ్ళలో నొప్పి మరియు బిర్రబిగుసుకుపోయే (stiffness) తత్త్వం ఏర్పడి, నొప్పితో ఏమీ చేయలేని స్థితిని ఎదుర్కొంటున్నప్పుడు డాక్టర్ను కలిసి మీ జీవితకాలపు తొందరను వివరించాలని మీకు సిఫార్సు చేయడమైంది. ఆలస్యం చేయకుండా ఎంత ముందుగా మీరు వైద్య సహాయాన్ని పొందితే అంత మంచిది.  

కీళ్ళనొప్పులకు కారణాలు, ప్రమాద కారకాలు - Causes & Risk Factors of Arthritis​ in Telugu

కీళ్ళనొప్పులకు (ఆర్థరైటిస్) ఖచ్చితమైన కారణాలను వైద్య పరిశోధకులు ఇంకా నిర్ధారించలేదు. ఏమైనప్పటికీ, వంశపారంపరిక కారణాలు మరియు కొన్ని వ్యాధులు కారణంగా కీళ్ళనొప్పలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకుల భావన.  అనువంశికంగా మీ కుటుంబంలో కీళ్ళనొప్పులు తరతరాలుగా వస్తున్నట్లయితే, మీ తల్లిదండ్రుల నుండి మీకూ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. కీళ్ళనొప్పుల జన్యువులున్నవారు ఆ వ్యాధిని వారు తమ సంతానానికి కూడా అందిస్తారని, కనుక సాధ్యమైనంత తొందరగా ఈ వ్యాధిని నివారించడమొక్కటే పరిష్కారమని అగ్ర పరిశోధకులు సూచిస్తున్నారు.

మన శరీరంలోని మడతబంద కీళ్లకు కొన్ని గాయాలు గాని, లేదా వాటిపై ప్రభావవంతమైన ఒత్తిళ్లు ఏర్పడినపుడు కీళ్లనొప్పులు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన శరీరంపై ఆకస్మిక గాయాల కారణంగా ఏర్పడ్డ వాపుల్ని ఉపేక్షించడమో లేదా నిర్లక్ష్యం చేయడమో చేస్తే ఆ వాపులే కీళ్లనొప్పులుగా మారే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అంటువ్యాధులు కీళ్లనొప్పుల యొక్క పురోగతిని మరింత ఉసిగొల్పుతాయి. ఉదాహరణకు, శరీరంలోని బాక్టీరియ విషక్రిములు మరియు ఇతర సూక్ష్మజీవుల దాడి కారణంగా రుమటాయిడ్ రకం కీళ్లనొప్పులు సంభవించవచ్చు.

చాలా సమయం నిలబడి పని చేయడమో, రోజువారీగా ఎక్కువ దూరం అనివార్యంగా నడక సాగిస్తుండడమో లేదా ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వృత్తి ఉద్యోగాలైతే కూడా కీళ్లనొప్పులను తెచ్చిపెడతాయి. వృత్తినిపుణులైన (ప్రొఫెషనల్ గైడ్) మార్గదర్శకుల యొక్క పర్యవేక్షణ లేకుండా వ్యాయామాలు చేయడం కూడా మృదులాస్థి మరియు కీళ్లపై దెబ్బపడే ప్రమాదం ఉంది. ధూమపానం కూడా కీళ్లు బిర్రబిగుసుకుపోవడానికి దారితీస్తుందని, తద్వారా కీళ్లనొప్పులు విపరీతమయ్యే అవకాశముందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అందువల్ల మీ వంశంలో గాని, కుటుంబంలో గాని కీళ్లనొప్పులు తరతరాలుగా అందరికీ వస్తున్నట్లైతే, మీకు ధూమపానం చేసే అలవాటుంటే వెంటనే దాన్ని విడిచిపెట్టడం సురక్షితమైనది మరియు కీళ్లనొప్పుల్ని తప్పించుకునేందుకు ధూమపానాన్ని వదిలేయడం ఓ సులభమయిన మార్గం.

ప్రమాద కారకాలు:

మీరు కింద తెలిపిన పరిస్థితులు మరియు అవస్తల్లో ఉంటే లేక అనారోగ్యకర అలవాట్లను కలిగివున్నామీరు కీళ్ళనొప్పులకు లోనయ్యే  అవకాశాలు రెట్టింపు కావచ్చు.

  • ఊబకాయం
  • పెద్ద వయస్సు
  • సారాయి మరియూ పొగాకు వినియోగం
  • పోషకాహారలోపం
  • క్రీడల గాయాలు మరియు అయిన గాయాలను నిర్లక్ష్యం చేస్తున్నా.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

కీళ్ళనొప్పుల నివారణ - Prevention of Arthritis​ in Telugu

కీళ్లనొప్పులను నివారించడం ఎలా?

"నయం చేయడం కంటే నివారణ ఉత్తమమైంది" అనే పలుకుబడి (లోకోక్తి) ఒకటి ఉంది. కీళ్లనిప్పులు వంశపారంపర్యంగా కలిగి ఉన్నవారికి ఈ వ్యాధిని నివారించడం కష్టమని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. కానీ, మనం కీళ్లనొప్పి నివారణకు తప్పక ప్రయత్నించాలి. ఈ క్రింద తెలిపిన అంశాలను పాటించినట్లైతే కీళ్ళనొప్పుల తాకుదల (onset) ను వాయిదా వేస్తూ పోవచ్చు లేక పూర్తిగా నివారించనూవచ్చు.

  • సరైన మరియూ సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించండి. కదలికల్లో, నడకలో మరియూ పరుగులో సరైన పాదరక్షలు ధరించని కారణంగా తప్పుడు నిలుపుదలల (గేర్లు) కు గురై, కీళ్ల అరుగుదల ఏర్పడి, తద్వారా కీళ్ళనొప్పులకు దారి తీస్తుంది.  
  • కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. ‘సాల్మొన్’ రకం చేపలు మరియు భూమి మీద సరస్సులవంటి మంచినీటిలో లభించే చేపలు ‘ఒమేగా -3’ కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కల్గిఉంటాయి. కాల్షియం అధికంగా ఉండే ఆహారం కూడా కీళ్ళనొప్పుల నివారణకు సిఫార్సు చేయబడింది.
  • మీరు మీ శరీరం యొక్క ఆరోగ్యకరమైన బరువును సదా నిర్వహించుకోండి. ఎముకలు శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తున్న కొలదీ కీళ్లలోని నరాలు కూడా ఎక్కువ అరుగుదలకు గురయ్యే అవకాశం ఉంది.
  • ప్రత్యేకంగా, మోకాలు, మోచేతులు మరియు ఇతర కీళ్ళు గాయాలకు గురైనపుడు, నిర్లక్ష్యం చేయకుండా వెంటన డాక్టర్ కు చూపించండి.  
  • ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండేందుకు మీకు శారీరక శ్రమ చాలా అవసరం.  ప్రధానంగా, కీళ్ళు సక్రమంగా పని చేసేటందుకు పనికొచ్చే యోగ, జిమ్మింగ్, ఈత వంటి దేహ సంబంధ వ్యాయామాలు చేయండి.
  • ఆరోగ్యకరమైన కీళ్లు మరియూ ఎముకలు కోసం ధూమపానం మానండి, సారా తాగడం గణనీయంగా తగ్గించండి.

కీళ్ళనొప్పుల వ్యాధి నిర్ధారణ - Diagnosis of Arthritis​ in Telugu

కీళ్ళనొప్పుల (ఆర్థరైటిస్) నిర్ధారణ సులభం కాదు. కీళ్ళనొప్పుల వ్యాధిని నిర్ధారించడంలో పరిణితుడైన వైద్యుడి సహాయం తీసుకోవలసిందిగా మీకు సిఫార్సు చేస్తున్నాము. మీ వైద్యుడు నిర్ధారించేంతవరకూ మీకు కీళ్ళనొప్పులు ఉన్నాయన్న భావనను రానీయకండి.కీళ్లనొప్పి నిర్ధారణ నిమిత్తం మీరు పలు వైద్య పరీక్షలు మరియు భౌతిక పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ డాక్టర్ మిమ్మల్ని మొదటిసారి భౌతికంగా పరీక్షిస్తాడు. వాపు మరియు నొప్పి ఉన్న భాగాలను వైద్యుడు పరీక్షిస్తాడు. కీళ్లనొప్పి, వాపున్న భాగాన్ని మీ వైద్యుడు మెత్తగా నొక్కి చూస్తాడు. దీన్నిబట్టి వైద్యుడు మీకున్న కీళ్లనొప్పి, దాని యొక్క తీవ్రత, ఎరుపు, వాపు, వాపుతో ద్రవం చేరడం మరియు కీళ్ల కదలిక శ్రేణిని అంచనా వేయవచ్చు. డాక్టర్ తన ప్రాధమిక పరిశీలన (స్క్రీనింగ్) ఆధారంగా మరి కొన్ని పరీక్షలను చేయించుకొమ్మని మీకు సిఫారసు చేస్తాడు.

  • రక్త పరీక్ష
    కీళ్ళనొప్పుల నిర్ధారణలో ‘ESR పరీక్ష’ (ఎరిథ్రోసైట్ అవక్షేపణా పరీక్ష) వంటి కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. ఇది కీళ్ళలో వాపును నిర్ణయిస్తుంది. ఈ పరీక్షలో ఎక్కువ వాపులున్నాయని తేలితే కీళ్ళనొప్ప్పులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. సిఆర్పి (సి-రియాక్టివ్ ప్రోటీన్) పరీక్ష అనేది ఉత్తమమైన పరీక్షల్లో ఒకటి. సిఆర్పై టెస్ట్ ఓ నిర్దిష్టమైన మాంసకృత్తుల రకాన్ని గుర్తిస్తుంది. కీళ్ళనొప్పుల కారణంగా శరీరంలో వాపులు ఉన్నప్పుడు, వాటి కారణంగా పెరిగిన ఆ నిర్దిష్టమైన మాంసకృత్తులను సిఆర్పై టెస్ట్ గుర్తిస్తుంది.
     
  • మూత్ర పరీక్ష 
    రక్త పరీక్షలు కీళ్లనొప్పుల్ని గుర్తించలేకపోయినప్పుడు మూత్ర పరీక్షలు ఉపయోగపడతాయి. కాబట్టి మూత్రపరీక్షలో మూత్రం నమూనాల్ని విశ్లేషించి, ఎర్ర రక్త కణాలు, చీము కణాలు (అంటువ్యాధులు), మరియు మాంసకృత్తుల ఉనికిని తనిఖీ చేసి కీళ్ల నొప్పులు ఉన్నదీ, లేనిదీ నిర్ధారిస్తారు.
     
  • ఎక్స్-రే స్కాన్ 
    కీళ్ళవ్యాధి నిర్ధారణకు ఒక ప్రామాణిక X- రేని వైద్యులు సిఫార్సు చేస్తారు. ఎక్స్-రే ఒక సాధారణ పరీక్ష. ఎక్స్-రే కిరణాలు ఉపయోగించి డాక్టర్ విరిగిన ఎముకలను  లేదా కాల్షియం నిక్షేపాలను స్పష్టంగా చూడవచ్చు. X- రే చేయడం ద్వారా డాక్టర్ కీళ్లనొప్పి వ్యాధి యొక్క తీవ్రతను అర్థం చేసుకోగలడు.
     
  • ఎంఆర్ఐ (MRI) స్కాన్ 
    మీ డాక్టర్ మీకు MRI ను కూడా సిఫారసు చేయవచ్చు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కీళ్లనొప్పుల్ని గుర్తించడానికి X- రే సరిపోదు. కీళ్ల నష్టాలను గుర్తించడంలో MRI స్కాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చీలమండలం, వెన్నెముక, మోకాలు  లేదా భుజం ఎముకలకు గాని కీళ్ళకు గాని దెబ్బలు తగిలి గాయాలేర్పడ్డాయా అన్న సంగతిని మరి స్కాన్ ద్వారా డాక్టర్ను పూర్తిగా అంచనా వేయడానికి సహాయపడుతుంది. మీ వైద్యుడు పూర్తి శరీరాన్ని లేదా బాధిత భాగాన్ని MRI స్కాన్ పరీక్షకు సిఫారసు చేయవచ్చు ఆర్నెల్ల తర్వాత మళ్ళీ ఈ MRI స్కాన్ చేయించమని డాక్టర్ చెప్పవచ్చు. ఎందుకంటే దీనిద్వారా రోగసంబంధ పురోగతిని తనిఖీ చేయవచ్చు గనుక. 
     
  • అల్ట్రాసౌండ్ 
    మీ డాక్టర్ అల్ట్రాసౌండ్ పరీక్షను కూడా సిఫారస్ చేయవచ్చు. ఆల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో అంతర్గత అవయవాలను చూడటం వీలవుతుంది. రుమటోయిడ్ కీళ్లనొప్పితో బాధపడేవారికి వేడిని వాళ్ళ కీళ్ళకు వర్తింపచేసి చికిత్స చేయడం అనేది ఒక ముఖ్యమైన విధానం.

కీళ్ళనొప్పులకు చికిత్స - Treatment of Arthritis​ in Telugu

ఇప్పటికి కీళ్ళనొప్పులను ఖచ్చితంగా నయం చేసే ఖచ్చితమైన చికిత్స ఒకటంటూ  లేదు. అలాగని కీళ్ళనొప్పులకు చికిత్స అవసరం లేదని మాత్రం కాదు. అనేకమంది కీళ్ళనొప్పుల రోగులు నొప్పినివారణా మందులను వాడి స్వయంగా చికిత్స చేసుకుంటున్నారు. ఇలాంటి  స్వయంచికిత్సల వల్ల రోగి ఈ వ్యాధిని మరింత విపరీతం చేసుకుంటున్నాడు. రుమటోయిడ్ రకం కీళ్ళనొప్పుల విషయంలో రోగులు కీళ్లనొప్పిని నయం చేయడంలో నిపుణులైన ‘ఆర్థోపెడిక్’ లేదా రుమటాలజిస్ట్ ను  సంప్రదించాలి.

వివిధ రకాలైన కీళ్ళనొప్పుల చికిత్సకు, ప్రత్యేకించి ‘కీళ్లవాపు’ (ఆస్టియో ఆర్థరైటిస్), ‘కీళ్ళవాతం’ (రుమటాయిడ్ ఆర్త్ర్రిటిస్) చికిత్స కోసం, వైద్యులు ఔషధాలను సిఫారసు చేస్తారు. కీళ్ళనిప్పి బాధిత ప్రాంతంలో ఎరుపురంగుదేలినదాన్ని, సలుకుల నొప్పితో ఉన్నా గాని వీటికి చికిత్స చేయడానికి వేడి మరియు చల్లని కాపడా (సంపీడనం) లను ఉపయోగిస్తారు. కీళ్ళనిప్పి వ్యాధి ప్రగతిశీల దశలో ఉన్న కొందరు రోగులు దిననిత్యకృత్యాలైన నడక, సైకిల్ తొక్కడం, వేగవంతమైన గమనం (వాకింగ్, సైక్లింగ్, జాగింగ్) మరియు చాలా గంటలు నిలబడి ఉండడం వంటి పనుల్ని చేయడం చాలా కష్టంగా ఉందని చెబుతున్నారు. అలాంటివారు ఏరోబిక్స్, యోగాభ్యాసం, ఈత వంటి ఏదైనా ఒక దైహిక చర్యను చేపట్టమని డాక్టర్లు ప్రోత్సహించి చెబుతున్నారు. ఉదహరించిన దైహిక చర్యలు కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలుగజేస్తుంది మరియు కదలిక (మోషన్) పరిధిని కూడా నిర్ధారిస్తుంది.

కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ‘భౌతికచికిత్స’ (ఫీజియోథెరపీ) అనేది ఒక ముఖ్యమైన చికిత్సాపరమైన అంశం. కాస్త ముదిరిన కీళ్లనొప్పి వ్యాధి వివిధ వైకల్యాలకు మరియు ఎముకలో అదనపు అవాంఛితమైన పెరుగుదలకు దారి తీయవచ్చు.  దానివల్ల మనిషి చలనశీలత మరియు గమనశక్తి (లోకోమోషన్) కష్టతరం అవుతుంది. కనుక, ఫిజియోథెరపీ వ్యాయామాల సహాయంతో కీళ్లనొప్పి ఉన్నవారు తమ చలన స్థాయిని పునరుద్ధరించడమే కాక, అవయవాల్లో వంగుడు (flexibility) గుణాన్ని కూడా సాధించగలరు. మీ డాక్టర్ కూడా మిమ్మల్ని నొప్పి మరియు స్నాయువు (ligament)కు సంబంధించిన  ఆదుర్దా నుండి మీరు ఉపశమనం పొందడానికి ‘అల్ట్రాసోనిక్ తరంగాల’ చికిత్సను సిఫార్సు చేయవచ్చు. రుమటాయిడ్ రకం కీళ్లనొప్పులతో బాధపడేవారు తమ కీళ్ళకు వేడి కాపడం పెట్టడం ద్వారా కండర ఉద్రిక్తతలు మరియు కీళ్లనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి ఒకింత తీవ్రమైన వేడిని కీళ్ల నొప్పులున్న భాగాలకు కాపడం పెట్టడం ద్వారా రిలాక్స్ పొందవచ్చు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

కీళ్లనొప్పులతో ఉపద్రవాలు (కష్టాలు) - Complications of Arthritis​ in Telugu

తీవ్రమైన  సందర్భాలలో కీళ్లవాపు కొన్ని రకాల సమస్యలను కలిగిస్తుంది. కానీ అది ఎప్పుడు అలానే జరుగుతుందని కాదు. కొన్ని సమస్యలు ఈ క్రింద ఉన్నాయి:   

  • గుండె వ్యాధులు
    గుండె కండరాలకు సంబంధించిన వ్యాధులైన స్ట్రోకులు మరియు గుండెపోటు వంటివి   తరచుగా రుమటోయిడ్ ఆర్థరైటిస్ వ్యాదున్న (RA) వ్యక్తులతో ముడిపడి ఉంటాయి. ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల దగ్గర నొప్పి మరియు రక్త నాళాల్లో ఒత్తిడి (వాస్కులైటిస్) కూడా కీళ్లనొప్పులతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల కీళ్ళనొప్పులు వచ్చినప్పుడు హృదయకండరాలకు వ్యాధుల భారిన పడే అధిక ప్రమాద కారకం ఉంది. గుండె-సంబంధమైన రోగాలను దరి చేరనీయకూడదని మీరు అనుకుంటే వెంటనే మీరు పొగ త్రాగటం మానేయాలని సిఫారస్ చేయడమైనది. ఇంకా, సారాయి, తత్సంబంధమైన ఆల్కహాల్ డ్రింక్స్  తీసుకోవడం తగ్గించండి మరియు హృదయ సంబంధిత సమస్యలను నివారించడానికి కొన్ని రకాల దైహిక శ్రమతో కూడిన ఉత్సాహపూరితమైన కసరత్తుల్ని చేపట్టండి.
     
  • డయాబెటిస్ 
    కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారు ఉద్యోగరీత్యా ఎక్కువసేపు కూర్చుండి పనిచేసే అనివార్య పరిస్థితి కారణంగా వారి శరీరంలో హార్మోన్ల అసమానతలు ఏర్పడి డయాబెటిస్ (జీవితకాల పరిస్థితి) వ్యాధికి దారితీసే అవకాశం లేకపోలేదు.
     
  • కార్పల్ టన్నెల్
    కీళ్ళనొప్పుల వలన, కొన్ని నరాల సంపీడనాలు మరియు నష్టాలు సంభవిస్తాయి మరియు చికాకు అనుభూతికి దారితీస్తుంది. మణికట్టు, వేళ్లు, బ్రొటనవేళ్లు వంటి ప్రదేశాలను ప్రభావితం చేస్తుందిది. ఇది తీవ్రంగా వచ్చినప్పుడు, శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.
     
  • కీళ్ల నష్టం
    కీళ్ళల్లో వచ్చే నొప్పులే ప్రపంచంలోని అత్యధిక రోగుల కీళ్లహానికి కారణమవుతున్నాయి.      కీళ్లనొప్పిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయకపోతే, ఈనోప్పి స్నాయువులకు, నరాలకు మరియు గట్టి నరాలకు (మృదులాస్థులకు) నష్టం కలిగిస్తాయి, తద్వారా, కీళ్ళకు శాశ్వత నష్టం ఏర్పడి, ఇంకెప్పటికీ నయం చేయలేని శాశ్వత అంగవైకల్యానికి దారి తీయచ్చు.

 



కీళ్లనొప్పులు కొరకు మందులు

Medicines listed below are available for కీళ్లనొప్పులు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.