తీవ్రమైన నిస్పృహ - Bipolar Disorder in Telugu

Dr. Ayush Pandey

November 28, 2018

March 06, 2020

తీవ్రమైన నిస్పృహ
తీవ్రమైన నిస్పృహ

తీవ్ర నిస్పృహ లేక బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి ?

తీవ్ర నిస్పృహ లేక బైపోలార్ డిజార్డర్ అనేది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్య పరిస్థితి. దీనిలో వ్యక్తి తీవ్ర ఆనందం మరియు నిరాశ యొక్క మనోభావాలు మారుతూ ఉంటాయి. ఇలాంటి మానసిక స్థితినే “తీవ్ర నిస్పృహ” లేక  “మ్యానిక్ డిప్రెషన్” అంటారు. ఈ స్థితికి గురైన ఆ వ్యక్తి యొక్క రోజువారీ జీవితం దీనివల్ల బాధింపబడుతుంది.  

తీవ్ర నిస్పృహ యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? 

ఒక వ్యక్తి అధిక శక్తి స్థాయిలు ఉన్న మానసిక స్థితినే ఉన్మాదం (మానియా) అని పిలుస్తారు.

  • ఈరకమైన మానసికస్థితిలో, వారు ఉదాసీనమైన బహుమతి లేదా అధిక బరువు కలిగిన షాపింగ్ వంటి యాదృచ్ఛిక కార్యక్రమాలలో మునిగిపోతూ, అధిక ఆనందాన్ని మరియు అనుకూలతను ప్రదర్శిస్తారు.
  • ఈ స్థితిలో, దీనికి గురైన వారు మండిపడుతూ ఉంటారు. మరియు భ్రాంతులకు లోనవుతూ  అవాస్తవ విషయాలపట్ల నమ్మకం పెంచుకుంటూ ఉంటారు.

ఈ మానసిక స్థితికి వ్యతిరేకస్థితి విషాదకరమైన మానసిక స్థితి. ఈ స్థితిలో వ్యక్తి విషాదకరంగా బాధపడుతుంటారు, చింతగా వుండే స్థితి ఇది. మూతి ముడుచుకొని అన్ని విషయాల్లోనూ అనాసక్తి, నిర్లిప్తతను కల్గి ఉంటారు.

  • ఈ నిరుత్సాహకర దశ వైద్యపర విషాదాన్ని పోలి ఉంటుంది, ఇక్కడ ఆ వ్యక్తి ఇతరులతో సంభాషించదానిక్కూడా ఇష్టపడరు, లేదా సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనరు కూడా.
  • ఈ స్థితికి లోనైనవారు ఆత్మహత్య ఆలోచనల్ని కూడా కలిగి ఉండవచ్చు.

ఈ మనోభావాల మధ్యలో, బైపోలార్ డిజార్డర్ ఉన్న రోగి సాధారణ ప్రవర్తనను  ప్రదర్శిస్తారు. దీనికి ఓ పంథా అంటూ ఏమీ లేదు. ప్రతి దశ వారాల నుండి నెలల వరకు ఉంటుంది.

బైపోలార్ డిజార్డర్ యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ తీవ్ర నిస్పృహ (బైపోలార్ డిజార్డర్కు) కు ఎటువంటి కారణం లేదు. ఇంకా దీనిపై కొనసాగుతున్న పరిశోధన చాలా ఉంది, కానీ ఇప్పటివరకూ ప్రమాద కారకాలను మాత్రమే  గుర్తించారు.

  • మెదడు యొక్క నిర్మాణం ఈ పరిస్థితిని ప్రభావితం చేసే కారకాలలో ఒకటిగా చెప్పబడుతోంది.
  • తలిదండ్రుల్లో ఒకరుగాని అవ్వాతాతల్లో ఒకరుగాని బైపోలార్ డిజార్డర్ కు గురై  ఉన్నట్లయితే, పిల్లలు దాని బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • బైపోలార్ డిజార్డర్కు దోహదం చేసే ఇతర అంశాలు ఏవంటే తీవ్ర మానసిక ఒత్తిడి, గాయం అవడం లేదా శారీరక అనారోగ్యం.

దీన్ని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

తీవ్ర నిస్పృహ (బైపోలార్ డిజార్డర్) అనేది శారీరక రోగ లక్షణాలతో ఉండని కారణంగా దీన్ని గుర్తించడం కష్టం. మానసిక స్థితులు మనిషి మనిషికీ మారుతుంటాయి కూడా కాబట్టి దీన్ని గుర్తించడం కష్టం.

  • ఒక మనోరోగ వైద్యుడు వివిధ కార్యకలాపాలు మరియు పనులు ద్వారా ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం యొక్క సమగ్ర పరిశీలనను నిర్వహిస్తాడు. రోగి నిర్వహించిన “మూడ్ జర్నల్” కూడా రోగ నిర్ధారణతో సహాయపడుతుంది.
  • మానసిక లక్షణాల ఆధారంగా బైపోలార్ డిజార్డర్ని నిర్ధారించడానికి అనేక మానసిక ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
  • ఇతర అనారోగ్యాలు లేవని నిర్ధారించేందుకు వైద్యుడు శారీరక పరీక్షను మరియు రక్త పరీక్షలను నిర్వహిస్తాడు.

తీవ్ర నిస్పృహకు చికిత్స మందులు, మరియు జీవనశైలి మార్పులు ద్వారా మనోభావాలను మార్చడం.

  • సూచించిన ఔషధాలు యాంటీ-డిప్రెసంట్స్ మరియు యాంటీ-సైకోటిక్ మందులు.
  • చికిత్సా పద్దతులు ఇంటర్-పర్సనల్ థెరపీని కలిగి ఉంటాయి. ఇక్కడ నిద్ర మరియు తినడం వంటి సాధారణ అలవాట్లను నియంత్రించడం పై దృష్టి పెట్టడం ఉంటుంది.
  • జ్ఞాన చికిత్స అనేది మనోరోగ వైద్యుడు రోగి ఆలోచనా ప్రక్రియలో మార్పుల్ని తేవడం, తద్వారా అతని / ఆమె ప్రవర్తనను నియంత్రించటం గురించి ఒక రోగితో మాట్లాడే పద్ధతి.

ఇతర స్వీయ రక్షణ పధ్ధతుల్లో తనకు ఇష్టమైనవారి మద్దతును స్వీకరిస్తూనే స్థిరమైన రోజువారీ విధుల నిర్వహణ, తన మానసిక వ్యత్యాసాల్ని గుర్తించడం మరియు నిపుణుల సహాయంతో వాటిని నియంత్రించడం కోసం ప్రయత్నించడం.



వనరులు

  1. Millman ZB,Weintraub MJ,Miklowitz DJ. Expressed emotion, emotional distress, and individual and familial history of affective disorder among parents of adolescents with bipolar disorder. Psychiatry Res. 2018 Dec;270:656-660. PMID: 30384286
  2. Holder SD. Psychotic and Bipolar Disorders: Bipolar Disorder. FP Essent. 2017 Apr;455:30-35. PMID: 28437059
  3. Miller TH. Bipolar Disorder. Prim Care. 2016 Jun;43(2):269-84. PMID: 27262007
  4. Grande I,Berk M,Birmaher B,Vieta E.Bipolar disorder .Send to Lancet. 2016 Apr 9;387(10027):1561-72. PMID: 26388529
  5. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Bipolar Disorder. National Institutes of Health; Bethesda, Maryland, United States

తీవ్రమైన నిస్పృహ కొరకు మందులు

Medicines listed below are available for తీవ్రమైన నిస్పృహ. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.