మూత్రాశయ క్యాన్సర్ - Bladder Cancer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 28, 2018

March 06, 2020

మూత్రాశయ క్యాన్సర్
మూత్రాశయ క్యాన్సర్

మూత్రాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?

మూత్రాశయ క్యాన్సర్ అనేది 50 నుంచి 70 ఏళ్ల వయస్సులో ఉన్న పెద్దవారిలో వచ్చే క్యాన్సర్లలో ఒక సాధారణ రకం. ఇది భారతదేశంలో సర్వసాధారణంగా వచ్చే క్యాన్సర్లలో ఆరవ స్థానంలో ఉంది. మూత్రాశయ క్యాన్సర్ మూత్రాశయ గోడ కణాల యొక్క అసాధారణ పెరుగుదల. పొగాకు వాడకం వల్ల సంభవించే క్యాన్సర్ కేసుల్లో సుమారు 15% మంది మూత్రాశయ క్యాన్సర్ సంభవిస్తుంది. మూత్రాశయం నుండి కణితిని తొలగించడం (మూత్రాశయ కణితి యొక్క ట్రాన్స్యురేథ్రల్ రిసెక్షన్స్ (transurethral resection of bladder tumour) లేదా TURBT) చాలా మూత్రాశయ క్యాన్సర్ కేసుల్లో తగ్గుదలను చూపాయి. అయినప్పటికీ, ఈ క్యాన్సర్ 50% కంటే ఎక్కువ కేసులలో పునరావృతమవుతుంది, మరియు వాటిలో 20% లో, క్యాన్సర్ మూత్రాశయ పరిసర కణజాలానికి వ్యాపిస్తుంది (కండరాల-ఇన్వాసివ్ మూత్రాశయ క్యాన్సర్muscle-invasive bladder cancer). TURBT, కెమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ క్యాన్సర్ స్థాయి ఆధారంగా సాధారణంగా ఉపయోగించే చికిత్స ఎంపికలు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కింది సంకేతాలు మరియు లక్షణాలి ఉంటె మూత్రాశయ క్యాన్సర్ అనుమానించబడుతుంది :

 • మూత్రంలో రక్తం లేదా హేమటూరియా, సాధారణంగా నొప్పితో ముడిపడి ఉండదు. మూత్రం ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపిస్తుంది
 • మూత్రవిసర్జన యొక్క తరచుదనం పెరుగుతుంది (మరింత సమాచారం: తరచూ మూత్రవిసర్జన చికిత్స)  
 • మూత్రవిసర్జన యొక్క ఆకస్మిక కోరిక
 • మూత్రం విసర్జిస్తున్నపుడు నొప్పి లేదా మంట సంభవిస్తుంది
 • క్యాన్సర్ మూత్రాశయము మించి వ్యాపిస్తే నడుము నొప్పి, ఎముకల నొప్పి, కాళ్ళ ఎడెమా లేదా వాపు కాలు సంభవిస్తాయి

హేమాటూరియా (మూత్రంలోని రక్తం) యొక్క ఇతర కారణాలు:

ప్రధాన కారణాలు ఏమిటి?

మూత్రాశయ క్యాన్సర్ అభివృద్ధికి కారణాలు:

 • పొగాకు వినియోగం
 • రంగులు, వస్త్రాలు, రబ్బరు, ప్లాస్టిక్లు మొదలైన వాటి తయారీలో ఉపయోగించే అనీలిన్ డైస్ (aniline dyes) మరియు బెంజిడిన్ (benzidine) వంటి రసాయనాలకు బహిర్గతం కావడం.
 • ప్రేగు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక చికిత్స
 • కీమోథెరపీలో ఉపయోగించే మందులు
 • కొన్ని ఇతర కారణాలలో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు (స్కిస్టోసోమియాసిస్, schistosomiasis), మధుమేహం, దీర్ఘకాల కాథెటరైజేషన్ (catheterisation) మరియు 45 సంవత్సరాలకు ముందు రుతువిరతి (menopause)

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వివరణాత్మక చరిత్ర మరియు శారీరక పరీక్షతో పాటు, మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ ఈ క్రింది పరిశోధనల ఆధారంగా చేయబడుతుంది:

 • మూత్రాశయం లోపల కణితిని చూడడానికి సిస్టోస్కోపీ (Cystoscopy) చేయబడుతుంది.
 • సిస్టోస్కోపీ సమయంలో తీసిన కణిత కణజాలం క్యాన్సర్ యొక్క దశ మరియు స్థాయిని గుర్తించడానికి సూక్ష్మదర్శిని (microscope) క్రింద పరీక్షించబడుతుంది.
 • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (Computed tomography) స్కాన్ మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (magnetic resonance imaging) లు కణితి యొక్క వివరణాత్మక చిత్రాన్ని ఇస్తాయి.
 • కణితిని గుర్తించడానికి, మూత్ర మార్గము ద్వారా రంగు ప్రవహించే ఇంట్రావీనస్ యూరోగ్రామ్ (Intravenous urogram) మూత్రాశయం యొక్క X- రే చిత్రాన్ని ఇస్తుంది.
 • మూత్రంలో క్యాన్సర్ కణాలు గుర్తించడానికి సూక్ష్మదర్శిని (microscope) ద్వారా మూత్రం యొక్క నమూనా పరిశీలించబడుతుంది.
 • క్యాన్సర్ కణాలు స్రవించే ప్రోటీన్లు లేదా యాంటిజెన్స్ గుర్తించడానికి కణితి మార్కర్ పరీక్ష(Tumour marker test) (మూత్రాశయ కణితి యాంటిజెన్) చేయబడుతుంది.

మూత్రాశయం లోపలికి మాత్రమే పరిమితం ఐన మూత్రాశయ క్యాన్సర్ను నాన్ మసిల్ ఇన్వేసివ్ బ్లాడర్ క్యాన్సర్ (non–muscle-invasive bladder cancer) అని పిలుస్తారు, అయితే క్యాన్సర్ మూత్రాశయ లోపలి పొరలకు (కండర పొర, కొవ్వు మరియు కోనేక్టీవ్ కణజాలం ద్వారా) మరియు ఇతర మూత్రాశయము చుట్టూ అవయవాలకు వ్యాపిస్తే దానిని కండరాల-ఇన్వాసివ్ మూత్రాశయ క్యాన్సర్ అంటారు (muscle-invasive bladder cancer). గ్రేడింగ్ క్యాన్సర్ వ్యాప్తిని విశ్లేషించడంలో సహాయపడుతుంది. తక్కువ- స్థాయి క్యాన్సర్తో పోలిస్తే ఎక్కువ- స్థాయి క్యాన్సర్ అధికంగా వ్యాప్తి చెందుతుంది.

మూత్రాశయ క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ దశ మరియు స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. చికిత్స సాధారణంగా వీటిని కలిగి ఉంటుంది:

 • టి యూ ఆర్ బి టి (TURBT)
 • క్యాన్సర్ మూత్రాశయం యొక్క ఉపరితల పొరకు మాత్రమే పరిమితం అయినప్పుడు కణితిని తొలగించేందుకు శస్త్ర చికిత్స చేయబడుతుంది. తక్కువ-స్థాయి నాన్ మసిల్ -ఇన్వాసివ్ క్యాన్సర్లు (non–muscle-invasive cancers) ఈ శస్త్రచికిత్సకు అనుకూలంగా స్పందిస్తాయి.
 • కీమోథెరపీ: పునరావృత్తం అవ్వడాన్ని నిరోధించడానికి కెమోథెరపీ మందులను TURBT తర్వాత నేరుగా మూత్రాశయంలోకి పంపిస్తారు. క్యాన్సర్ దశ పై ఆధారపడి తక్కువ ప్రమాద క్యాన్సర్ కు తక్కువ స్థాయిలో కీమోథెరపీని వైద్యులు సూచిస్తారు.
 • రేడియేషన్ థెరపీ: అధిక-స్థాయి మూత్రాశయ క్యాన్సర్కు కెమోథెరపీకి అదనంగా రేడియోధార్మిక చికిత్స అవసరమవుతుంది.
 • ఇమ్యునోథెరపీ: ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్ యొక్క కొన్ని కేసులలో TURBT తర్వాత BCG టీకా (vaccine) ను మార్పు చేసిన రూపంలో చికిత్స కోసం ఇస్తారు.
 • BCG చికిత్సకు స్పందించడంలో క్యాన్సర్ విఫలమైతే, మూత్రాశయంలోని భాగాన్ని లేదా మొత్తం మూత్రాశయాన్ని శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు.వనరులు

 1. Sanjeev Sharma. Diagnosis and Treatment of Bladder Cancer. Am Fam Physician. 2009 Oct 1;80(7):717-723. American Academy of Family Physicians
 2. National Health Service [Internet]. UK; Symptoms - Bladder cancer
 3. National Health Service [Internet]. UK; Bladder cancer
 4. National Cancer Institute. Bladder Cancer Symptoms, Tests, Prognosis, and Stages (PDQ®)–Patient Version. U.S. Department of Health and Human Services. [internet]
 5. Sudhir Rawal. Bladder cancer: A difficult problem?. Indian J Urol. 2008 Jan-Mar; 24(1): 60. PMID: 19468361

మూత్రాశయ క్యాన్సర్ కొరకు మందులు

మూత్రాశయ క్యాన్సర్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।