myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

బర్సిటీస్ (కాపు తిత్తుల వాపు) అంటే  ఏమిటి?

బర్సిటీస్ (కాపు తిత్తుల వాపు) లేక ‘భస్త్రిక కండరాల వాపు’ అనేది, బర్సా అనే భస్త్రిక యొక్క వాపు. భస్త్రిక అనేది శరీరంలోని  కీళ్లలో ఎముక-కండరానికి మధ్యలో ద్రవంతో నిండిన ఓ తిత్తిలాంటిది. కీళ్లలో కండరాలు మరియు ఎముకకు మధ్య మెత్తని (పరిపుష్టిని-cushion) ఏర్పరుస్తుందిది. భస్త్రికలనేవి, మోచేయి, తుంటి మరియు మోకాలి కీళ్ళు, మరియు మడమలోని అఖిలిస్ కండరబంధనాల్లో రాపిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అందుకే భస్త్రిక తన “మెత్త” (cushion) తనంతో కీళ్లలో కదలికను సరళతరం చేస్తుంది. భస్త్రికల వాపు లేక కాపు తిత్తుల వాపు తాత్కాలిక నొప్పిని మరియు అసౌకర్యాన్ని కలిగించవచ్చు కానీ శాశ్వత వైకల్యానికి కారణం కాదు.

కిందిచ్చినవి కొన్ని కాపు తిత్తుల వాపు రకాలు. ఏఏ భస్త్రిక వాచింది అనే దాన్ని బట్టి ఈ భస్త్రికల రకాల్ని తెలపొచ్చు :

 • రెట్రోమల్లెయోలార్ (Retromalleolar) స్నాయువు భస్త్రిక వాపు
 • తుంటి (హిప్) బర్స్టిస్
 • మోకాలి కాపు తిత్తుల వాపు
 • మోకాలి చిప్ప వాపు (శోథ)
 • పృష్ఠ అఖిలిస్ టెండన్ బర్సిటీస్
 • ఎల్బౌ బొర్సిటిస్

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కాపు తిత్తుల వాపు యొక్క సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు:

 • నొప్పి - ఇది కాపు తిత్తుల వాపు యొక్క అత్యంత సాధారణ లక్షణం. భస్త్రాలో కాల్షియం డిపాజిట్లు ఉన్నట్లయితే ఇది మరింత తీవ్రమవుతుంది .
 • స్తంభించుకుపోయిన (బిర్రబిగుసుకుపోయిన) భుజంలో లాగా ఈ రుగ్మతకు గురైన కీలు కేవలం పరిమితంగానే కదలికల్ని కలిగి ఉంటుంది.
 • రుగ్మత సోకిన కీళ్లలో  సున్నితత్వం
 • సుదీర్ఘమైన కొలిమి తిత్తుల వాపు కీళ్ల కదలికల క్షీణతకు దారితీయవచ్చు.

కాపు తిత్తుల వాపు యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

కీళ్ళకు అయిన బాధాకరమైన గాయం ‘కాపు తిత్తుల వాపు’ కి దారి తీయవచ్చు. కీళ్ల యొక్క మితిమీరిన వాడకం వాపు-మంటకు దారి తీస్తుంది.

కాపు తిత్తుల వాపు తరచుగా మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, దైహిక ముఖచర్మ వ్యాధి, ఎరిథమాటోసస్ (SLE), రోగనిరోధక లోపం మరియు పార్శ్వగూనితో సంబంధం కలిగి ఉంటుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వివరణాత్మక వైద్య చరిత్ర మరియు పూర్తి శారీరక పరీక్ష చేసిన తర్వాత, మీ డాక్టర్ కింద కనబర్చిన కొన్ని పరీక్షలు సూచించవచ్చు-

 • ఎక్స్-రే  
 • ఎం ఆర్ ఐ (MRI)
 • సి టి (CT) స్కాన్
 • అల్ట్రాసౌండ్
 • “కల్చర్ అండ్ ఎనాలిసిస్” పరీక్ష కోసం భస్త్రిక నుండి ద్రవం యొక్క సేకరణ
 • ‘కంప్లీట్ బ్లడ్ కౌంట్’ వంటి రక్త పరీక్షలు, సి-రియాక్టివ్ ప్రోటీన్, యురిక్ యాసిడ్ మరియు ఇతర పరీక్షలు.  

కీళ్ల పై ఒత్తిడి తగ్గించకపోయినట్లయితే, కాపు తిత్తుల వాపు వ్యాధి పునరావృతమవుతుంది. అయితే, కాపు తిత్తుల వాపు కింది పద్ధతులలో చికిత్స చేయవచ్చు -

 • నొప్పి నివారణ మందులు
 • శారీరక విశ్రాంతి
 • రుగ్మతకుగురైన కీళ్లకు బద్దలుపెట్టి కట్టు కట్టడం (splinting )
 • నొప్పి మరియు వాపును తగ్గించడానికి భస్త్రిక (బర్సా) లోపలికి కార్టికోస్టెరాయిడ్స్ను ఇంజెక్షన్ చేయడం.
 • ఇన్ఫెక్షన్ విషయంలో యాంటీబయాటిక్స్
 • బర్సెక్టోమి అని పిలువబడే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా రుగ్మతకు గురైన ద్రవాది పదార్థాలను భస్త్రికలోనుండి తొలగించడం.

కాపు తిత్తుల వాపును నిరోధించడానికి మీరు క్రమమైన వ్యాయామాలతో బలం పెంచుకోవడం ప్రారంభించాలి. అధికమైన శారీరక శ్రమకు గురి కాకండి. ముఖ్యంగా, శారీరక శ్రమలో  రుగ్మతకు గురైన కీలు అధిక శ్రమకు గురి కాకుండా ఉండేట్లు చూసుకోవాలి. రుగ్మత కీలు ప్రాంతానికి మంచును అద్దడం వలన నొప్పి మరియు వాపును నియంత్రించవచ్చు. శారీరక చికిత్స (physical therapy) రుగ్మతకు గురైన కీలు యొక్క చైతన్యం పెంచేందుకు మరొక మార్గం. కాపు తిత్తుల వాపు కోసం చికిత్స యొక్క నిర్దిష్ట సమయం లేదు.

 1. బర్సిటీస్ (కాపు తిత్తుల వాపు) కొరకు మందులు

బర్సిటీస్ (కాపు తిత్తుల వాపు) కొరకు మందులు

బర్సిటీస్ (కాపు తిత్తుల వాపు) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
TricortTricort 10 Mg Injection47
WysoloneWysolone 10 Tablet DT14
KenacortKenacort 0.1% Oral Paste50
Espra XnESPRA XN 500MG TABLET 10S104
Low DexLow Dex Eye/Ear Drops8
DexacortDexacort Eye Drop13
Dexacort (Klar Sheen)Dexacort (Klar Sheen) 0.1% Eye Drop14
4 Quin Dx4 Quin Dx Eye Drop13
SolodexSolodex 0.1% Eye/Ear Drops5
Apdrops DmApdrops Dm 0.5% W/V/1% W/V Eye Drop103
Lupidexa CLupidexa C Eye Drop7
Dexcin MDexcin M Eye Drop59
Ocugate DxOcugate Dx Eye Drop8
Mfc DMfc D Eye Drop84
Mflotas DxMflotas Dx 0.5%W/V/0.1%W/V Eye Drop78
Mo 4 DxMo 4 Dx Eye Drop64
Moxifax DxMoxifax Dx Eye Drop52
Moxitak DmMoxitak Dm Eye Drops16
MyticomMyticom Eye Drop72
Occumox DmOccumox Dm 0.5%/0.1% Eye Drop0
Mflotas DMflotas D Eye Drop0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. University of Rochester Medical Center. Bursitis. Rochester, New York. [internet].
 2. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; What is bursitis?
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Bursitis
 4. National institute of aging. [internet]: US Department of Health and Human Services; Bursitis
 5. Healthdirect Australia. Bursitis. Australian government: Department of Health
और पढ़ें ...