కోలెస్టాసిస్ వ్యాధి - Cholestatic Liver Diseases in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

July 31, 2020

కోలెస్టాసిస్ వ్యాధి
కోలెస్టాసిస్ వ్యాధి

కోలెస్టాసిస్ వ్యాధి అంటే ఏమిటి?

కోలెస్టాసిస్ అని కూడా పిలువబడే కాలేస్టాటిక్ కాలేయ వ్యాధిలో, కాలేయం నుండి పైత్యరసము (bile) స్రవించడం తగ్గిపోతుంది లేదా నిరోధించబడుతుంది. ఇది తీవ్రముగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది మరియు అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతుంది. కాలేయం లోపల సంభవించే ఇంట్రాహెపటిక్ కొలెస్టాసిస్ మరియు కాలేయం వెలుపల సంభవించే ఎక్సట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ అని రెండు రకాలుగా దీనిని వర్గీకరించవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కోలెస్టాసిస్ యొక్క లక్షణాలు హెపటైటిస్ లాగా ఉంటాయి, కోలెస్టాసిస్ అనేది హెపటైటిస్ కారణాలలో ఒకటి. ఈ క్రింది కొన్ని కోలెస్టాసిస్ యొక్క లక్షణాలు:

  • వికారం
  • ముదురు రంగు మూత్రం
  • తెల్లని లేదా మట్టి రంగు మలం
  • దురద
  • ఉదరం పై భాగంలో నొప్పి
  • చర్మం మరియు కళ్ళు పసుపుగా మారడం
  • కొన్ని ఆహార పదార్దాలను జీర్ణం చేసుకోవడంలో సమస్యలు (మరింత సమాచారం: అజీర్ణం చికిత్స)

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కోలెస్టాసిస్ యొక్క కారణాలు వివిధ వయసుల వారి బట్టి ఉంటాయి:

  • శిశువులు మరియు పిల్లల్లో కోలెస్టాస్ యొక్క కారణాలు
    • జింక్ నిల్వ రుగ్మత వంటి జన్యు కారణం
    • సిర్హ్న్ జీన్ (cirrhn gene) అని పిలువబడే జన్యువు యొక్క మార్పు
    • బైలర్స్ సిండ్రోమ్ (Byler’s syndrome, ఒక జన్యుపరమైన ఆటోసోమల్ రెసిసివ్ డిజార్డర్)
  • పెద్దలలో కోల్లెస్టాస్ యొక్క కారణాలు
    • ప్రిస్క్రిప్షన్ మందులు
    • మూలికల చికిత్సలు (హెర్బల్ ట్రీట్మెంట్స్)
    • ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్

కొలెస్టాస్ యొక్క స్థానం ఆధారమైన కారణాలు:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒక వ్యక్తికీ కొలెస్టాసిస్ ఉంది అని అనుమానం ఉంటే వైద్యులు ఈ కింది పరీక్షలను సూచిస్తారు:

  • కాలేయ పనితీరు పరీక్ష(Liver function test): ఇది బైల్ మరియు సీరం ఆల్కలీన్ ఫాస్ఫాటేస్ (serum alkaline phosphatase) స్థాయిలు పెరుగుదలను తెలుపుతుంది.
  • కాలేయ స్థితిని అంచనా వేయడానికి ఇమేజింగ్ పరీక్షలు ఉన్నాయి, అవి:
    • ఉదరం యొక్క ఎంఆర్ఐ(MRI)
    • ఉదరం యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ (Ultrasound imaging)
    • మీ ఉదరం యొక్క సిటి (CT) స్కాన్
    • ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలాంజియోపేంక్రియాటోగ్రఫీ (ERCP)

కాలేస్టాటిక్ కాలేయ వ్యాధి చికిత్స అనేది అంతర్లీన కారణం గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది. కోలెస్టాసిస్ చికిత్సలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • లక్షణాల బట్టి చికిత్స: పృరిటస్ (దురద లేదా గోకడం కోసం కోరిక) అనేది ఒక సాధారణ లక్షణం, ఇది నిద్రకు ఆటంకం కలిగించవచ్చు అందువలన దానిని నియంత్రించవలసిన అవసరం ఉంది. కోలిస్టైరమైన్ (cholestyramine) వంటి  అనియెన్ ఎక్స్ఛేంజ్ రెసిన్ (Anion exchange resin) సాధారణంగా పృరిటస్ చికిత్సకు సూచించబడుతుంది.  పృరిటస్ చికిత్సకు యాంటిబయోటిక్స్ రెండవ మార్గం.
  • ప్రత్యేక చికిత్స: కారణాల బట్టి వివిధ యాంటిబయోటిక్ మరియు కార్టికోస్టెరాయిడ్  మందుల చికిత్సను ప్రారంభించవచ్చు.

(మరింత సమాచారం: కాలేయ వ్యాధుల రకాలు)



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cholestasis
  2. Heathcote EJ. Diagnosis and management of cholestatic liver disease.. Clin Gastroenterol Hepatol. 2007 Jul;5(7):776-82. PMID: 17628332
  3. Hofmann AF. Cholestatic liver disease: pathophysiology and therapeutic options.. Liver. 2002;22 Suppl 2:14-9. PMID: 12220297
  4. Pollock G et al. Diagnostic considerations for cholestatic liver disease.. J Gastroenterol Hepatol. 2017 Jul;32(7):1303-1309. PMID: 28106928
  5. U.S. National Library of Medicine. Evaluating the Genetic Causes and Progression of Cholestatic Liver Diseases (LOGIC) (LOGIC). U.S. National Institutes of Health; [Internet]

కోలెస్టాసిస్ వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for కోలెస్టాసిస్ వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.