వ్యాలీ జ్వరం (కాక్సిడియోడిమైకోసిస్) - Valley Fever (Coccidioidomycosis) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

March 06, 2020

వ్యాలీ జ్వరం
వ్యాలీ జ్వరం

కాక్సీడియోడోమికోసిస్ (Coccidioidomycosis) లేదా వాలీ జ్వరం అంటే ఏమిటి?

కాక్సీడియోడోమికోసిస్ (Coccidioidomycosis) లేదా వాలీ ఫీవర్ అనేది అనేది కొక్సీడియోడెస్ (Coccidioides) శిలీంధ్రం  ద్వారా దాపురించే శ్వాసకోశ సంక్రమణం . ఇది ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నైరుతి రాష్ట్రాలలో, మెక్సికో యొక్క కొన్ని భాగాలు, మరియు సెంట్రల్ మరియు దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. “వాలీ ఫీవర్” అనేది ఉత్తర భారతదేశంలో దిగుమతి కాబడ్డ ఏకైక కేసుగా మొదట కన్పించింది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన 1-3 వారాల తర్వాత బయట పడుతాయి, అటుపై కొన్ని వారాలు లేదా నెలలవరకూ ఈ వ్యాధి బాధిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి:

ఈ వ్యాధి సోకిన వారిలో 5% -10% మంది ఊపిరితిత్తుల సమస్యలకు లోనవుతుంటారు. . దీర్ఘకాలిక కేసులు క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి:

 • తక్కువ స్థాయిలో జ్వరం
 • ఛాతి నొప్పి
 • బరువు నష్టం
 • రక్తంతో కూడిన కఫం

సంక్రమణ వ్యాపిస్తే, క్రింది వ్యాధి లక్షణాలు పెరగొచ్చు:

 • చర్మంపై బుడిపెలు (nodules), గడ్డలు పెరుగుతాయి.
 • పుర్రె మరియు ఇతర ఎముకలలో నొప్పి గాయాలు.
 • బాధాకరమైన వాపుతో కూడిన కీళ్ళు.
 • మెనిన్జియల్ ఇన్ఫెక్షన్ ( మెదడు మరియు వెన్నుపాము చుట్టూ రక్షణ కణజాల సంక్రమణ).

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది ప్రధానంగా శిలీంధ్రాల బీజాణువులను పీల్చడం వలన కలుగుతుంది. ఈ బీజాణువులు దుమ్ము కణాల ద్వారా గాలిలోకి బదిలీ చేయబడుతాయి, అక్కడినుండి ఈ బీజాణువులు శరీరంలోకి ప్రవేశిస్తాయి, దీనివల్ల సంక్రమణ దాపురిస్తుంది.  అయితే, ఇది ఒకరి నుండి ఒకరికి అంటుకొనే వ్యాధి కాదు.

ప్రమాద కారకాలు:

 • పరిసరాలకు బహిర్గతం: పరిసరాలు, ఇంటి లోపలి ప్రదేశాలలో లేదా పని చేసే చోట, కార్యాలయాల సమీపంలో శిలీంధ్రాల బీజాణువులను పీల్చడం (inhalation of spores) .
 • గర్భధారణ: మూడవ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు మరింత దుర్బలంగా ఉండి సంక్రమణకు లోనవచ్చు.
 • బలహీన రోగనిరోధక శక్తి: HIV- పాజిటివ్ లేదా ఎయిడ్స్ ఉన్న రోగులు సంక్రమణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 • వయస్సు: వయసు పైబడ్డ వ్యక్తులు మరింతగా ఈ వ్యాధికి గురవుతారు
 • మానవజాతి: ఫిలిపిన్ దేశస్తులు మరియు ఆఫ్రికన్ ప్రజలు ఈ సంక్రమణకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కేవలం వాలీ ఫీవర్ వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలను తనిఖీ చేయడం ద్వారా పూర్తిగా రోగ నిర్ధారణ చేయడం కష్టం గనుక, క్రింది పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు కోరుతారు :

 • చర్మ పరీక్ష.
 • కఫ పరీక్ష (sputum smears)
 • పూర్తి రక్త గణన (complete blood count), ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ వంటి రక్త పరీక్షలు.

చికిత్స కిందివాటిని కలిగి ఉంటాయి:

 • యాంటీ ఫంగల్ ఏజెంట్ల వాడకం: అవి దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు, కానీ చికిత్స నిలిపివేయబడిన తర్వాత అవి తగ్గుతాయి.
 • రోగ నిరోధకతను తగ్గించే మందుల యొక్క జాగ్రత్త వాడకం.

స్వీయ రక్షణ చిట్కాలు:

 • తగినంత విశ్రాంతి అవసరం.
 • తగినంతగా ద్రవాహారాల్ని తీసుకోవడం ముఖ్యం.
 • దుమ్ము-గాలులతో లేదా గాలులతో ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం ఆపండి.
 • ప్రతికూల వాతావరణం సమయంలో ఇంట్లోనే ఉండండి.
 • మీ గది లోపల గాలి వడపోతను ఉపయోగించండి మరియు శ్వాసకోశ ముసుగుల్ని ఉపయోగించండి.
 • సంక్రమణను నివారించడానికి యాంటిసెప్టిక్స్ తో గాయాల్ని శుభ్రం చేయండి.

అవసరమైన చర్యల్ని అనుసరించినట్లయితే వాలీ ఫీవర్ అనే ఈ వ్యాధిని ను సులభంగా నిరోధించవచ్చు. వ్యాధి సంకేతాలు లేదా లక్షణాలు నియంత్రణను మించి ఉంటే, వెంటనే మీ వైద్యుడుని సంప్రదించండి, తద్వారా, మరింతగా విషమించి పరిణామాల్ని తప్పించవచ్చు .

(మరింత సమాచారం: ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్స)వనరులు

 1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Diagnosis and Testing for Valley Fever (Coccidioidomycosis)
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Valley Fever
 3. Vikram Narang, Bhavna Garg, Neena Sood, Sukhjot Kaur Goraya. Primary Cutaneous Coccidioidomycosis: First Imported Case in North India. Indian J Dermatol. 2014 Jul-Aug; 59(4): 422. PMID: 25071284
 4. Neil M. Ampel. The treatment of coccidioidomycosis. Rev Inst Med Trop Sao Paulo. 2015 Sep; 57(Suppl 19): 51–56. PMID: 26465370
 5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Valley Fever (Coccidioidomycosis)

వ్యాలీ జ్వరం (కాక్సిడియోడిమైకోసిస్) వైద్యులు

Dr. Kirti Anurag Dr. Kirti Anurag Psychiatry
8 Years of Experience
Dr. Anubhav Bhushan Dua Dr. Anubhav Bhushan Dua Psychiatry
13 Years of Experience
Dr. Alloukik Agrawal Dr. Alloukik Agrawal Psychiatry
5 Years of Experience
Dr. Sumit Shakya Dr. Sumit Shakya Psychiatry
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు