పుట్టుకతో వచ్చే గుండె జబ్బు - Congenital Heart Disease (Defect) in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

పుట్టుకతో వచ్చే గుండె జబ్బు
పుట్టుకతో వచ్చే గుండె జబ్బు

పుట్టుకతో వచ్చే గుండె జబ్బు అంటే ఏమిటి?

పుట్టుకతో వచ్చే గుండె  వ్యాధులు లేదా పుట్టుకతో వచ్చే గుండె లోపాలు అనేవి గుండె లేదా దాని రక్తనాళాల అభివృద్ధికి సంబంధించిన సాధారణ నిర్మాణ లోపాలుగా ఉంటాయి. గుండె  గదుల మధ్య రంధ్రం (సెప్టాల్ గోడలో లోపము), గుండె యొక్క ప్రధాన రక్త నాళము (బృహద్ధమని) ఇరుకైపోవడం, మరియు శ్వాసకోశ సిర (pulmonary vein), ఇరుకైపోవడం (narrowing of the vein of the lung ) అనేవి పుట్టుకతో వచ్చే కొన్ని సాధారణ గుండె లోపాలు.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బు  ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పెద్దల్లో చికిత్స చేయకుండా వదిలేసిన పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బులు ఇప్పటికీ కొనసాగుతున్నట్లైతే కింద పేర్కొన్నా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు:

అనేక సందర్భాల్లో, ఈ రుగ్మతలతో ఉండే రోగులు చాలా తక్కువగా వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలను బహిర్గతం చేస్తుంటారు.
వ్యాధి యొక్క తీవ్రమైన సందర్భాల్లో కనిపించే సంకేతాలు మరియు లక్షణాలు:

 • వడి వడి గా శ్వాస తీసుకోవడం
 • అధికంగా చెమట పట్టుట
 • ఛాతి నొప్పి
 • సైనోసిస్ - గుండె బాగాపనిచేయనందున ప్రాణివాయువు తక్కువై శరీరము నీలివర్ణమవాటాన్ని సైనోసిస్ అంటారు. చర్మం, పెదవులు మరియు వేలుగోళ్లు నీలం రంగులోకి మారి పోతాయి
 • అలసట
 • అసాధారణ రక్త ప్రసరణ
 • పెరుగుదలలో వైఫల్యం
 • శ్వాసావరోధం (డిస్పొనోయా) కారణంగా పిల్లలు తక్కువగా తినడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దీనికి అత్యంత సాధారణ కారణాలేవంటే తల్లి గర్భంలో గర్భస్థ శిశువు యొక్క ప్రారంభ అభివృద్ధి సమయంలో అంతర్గత వాతావరణంలో జరిగే తొందర్లు. ఆ కారకాలు ఇలా ఉంటాయి:

 • అంటువ్యాధులు
 • గర్భవతి అయిన తల్లి హానికరమైన రసాయనాలకు గురి కావడం
 • గర్భిణి తల్లి పొగ తాగడం, మద్యంపానం చేయడంవల్ల (పిండానికి హాని)
 • సామాజిక-జనాభా మరియు పర్యావరణ అంశాలు

ఇతర కారణాలు:

 • తప్పుడు జన్యువులు మరియు క్రోమోజోములు
 • పుట్టుకతో వచ్చే గుండె లోపాల కుటుంబ చరిత్ర
 • తల్లిదండ్రుల అనారోగ్యాలు కూడా పుట్టుకతో వచ్చే గుండె లోపాలలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి

ఈ పుట్టుకతో వచ్చే గుండె వ్యాధుల్ని ఎలా నిర్ధారణ చేసేది మరియు వీటికి చికిత్స ఏమిటి?

 • గర్భధారణ సమయంలో :
  • గర్భస్థ శిశువులో పుట్టుకతో వచ్చే గుండె లోపాలను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో, గర్భస్థ శిశువులోని గుండెలోపాల్నీ పిండం యొక్క 20 వారాల వయసులోగానే గుర్తించవచ్చు. (మరింత సమాచారం: గర్భధారణ అల్ట్రాసౌండ్ పరీక్షలు)
  • గర్భస్థ శిశువులో పుట్టుకతో వచ్చే గుండె లోపాలను గుర్తించడంలో యాంటెనాటల్ (పిండం) ఎఖోకార్డియోగ్రఫీ కూడా ఉపయోగపడుతుంది.
 • బాల్యదశలో:

పుట్టుకతో వచ్చే గుండ జబ్బుల సరైన రోగ నిర్ధారణకు కింది పరీక్షలతో సహా రోగి యొక్క సంపూర్ణ వైద్య చరిత్ర మరియు భౌతిక పరీక్షలు అవసరం:

 • ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ECG)
 • ఛాతీ ఎక్స్-రే
 • ఎఖోకార్డియోగ్రామ్
 • స్క్రీనింగ్ కోసం పల్స్ ఆక్సిమెట్రి
 • వయోజన దశలో:

పెద్దలలో గుండెల్లో లోపాలను గుర్తించడంలో శారీరక పరీక్షతోపాటు అనేక రోగనిర్ధారణ పరీక్షలు  వైద్యుడికి సహాయపడతాయి. వీటితొ పాటు కింది పరీక్షల్ని వైద్యుడు నిర్వహిస్తారు :

 • ఎఖోకార్డియోగ్రామ్
 • ట్రాన్స్-ఓసోఫాజీయల్ ఎఖోకార్డియోగ్రామ్
 • ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ (IVUS)
 • కార్డియాక్ కాథెటరైజేషన్
 • ఛాతీ ఎక్స్-రే
 • ECG
 • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI)
 • పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్

పుట్టుకతో వచ్చే గుండె  లోపాలతో ఉన్న రోగులకు చేసే చికిత్స వారికున్న గుండె లోపం యొక్క తీవ్రతపై నిర్ణయించబడుతుంది. అట్టి పరిస్థితిలో కింది చర్యలుంటాయి:

 • చికిత్స లేదు
 • గుండె జబ్బుల నిపుణుడి చే (కార్డియాక్ స్పెషలిస్ట్) ఎప్పటికప్పుడు తనిఖీలు
 • ప్రోఫీలాక్సిస్ (prophylaxis) తో పాటు ఎండోకార్డిటిస్ కి మందులు
 • గుండె లోపాల్ని సరి చేసేందుకు, (రంధ్రాలను) మూసివేయడం లేదా మరమ్మత్తు చేయడం కోసం ఇన్వెసివ్ శస్త్రచికిత్స (Invasive surgery)వనరులు

 1. American Heart Association, American Stroke Association [internet]: Texas, USA: Care and Treatment for Congenital Heart Defects
 2. British Heart Foundation. Congenital heart disease. England & Wales. [internet].
 3. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Heart Disease: Adult Congenital Heart Disease: Management and Treatment
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Heart Health Tests
 5. National Heart, Lung, and Blood Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Congenital Heart Defects

పుట్టుకతో వచ్చే గుండె జబ్బు కొరకు మందులు

Medicines listed below are available for పుట్టుకతో వచ్చే గుండె జబ్బు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.