myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

డిస్టోనియా అంటే ఏమిటి?

డిస్టోనియా అనేది వివిధ కండరాల లోపాలకు సమగ్రంగా  ఇచ్చిన ఒక పేరు, ఇది పునరావృతమయ్యే అసంకల్పిత (involuntary) కండర కదలికలు మరియు అసాధారణ భంగిమలను దారితీస్తుంది. ఈ కండరాల కదలిక అనేది శరీరంలో ఒక కండరం యొక్క కదలిక, లేదా  కండరాల సమూహం యొక్క కదలిక లేదా అన్ని శరీర కండరాలను కలిగి ఉంటుంది. కదలికలు పునరావృతమవుతూ ఉంటాయి అవి తిమ్మిరి నుండి కండరాల మెలిక మరియు కండరాల బెణుకు వరకు మారుతూ ఉంటాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కండరాల అసాధారణ చురుకుదనం అనేది డిస్టోనియా యొక్క ప్రధాన సంకేతం. శరీరంలో ఏ భాగంలోనైనా మరియు ఏ వయస్సులోనైనా ఈ లక్షణాలు తలెత్తవచ్చు (కనిపించవచ్చు). ఈ వ్యాధి సాధారణంగా నిలకడగా ఉంటుంది లేదా మరింత అధ్వాన్నంగా మారుతుంది, కానీ చాలా అరుదుగా తిరిగి మాములు పరిస్థితికి చేరుకుంటుంది. డిస్టోనియాతో ముడిపడి ఉన్న కొన్నిసాధారణ లక్షణాలు:

 • తిమ్మిరి మరియు పాదం లాగడం
 • మెడలో ఆకస్మిక కుదుపులాంటి కదలికలు
 • ఒకటి లేదా రెండు కళ్ళ రెప్పలు తరచుగా కొట్టుకోవడం లేదా కళ్ళు మూసే సమయంలో బిగుతుదనం
 • చేతుల అసంకల్పిత కుదుపు కదలికలు
 • మాట్లాడటం మరియు నమలడం లో ఇబ్బంది

ఈ లక్షణాల యొక్క ఒక ముఖ్యమైన గుర్తు అవి ఆరంభంలో తేలికపాటివిగా ఉంటాయి.ఒత్తిడి లేదా అలసట కారణంగా ప్రేరేపించబడతారు, అయితే వ్యాధి ముదిరేకొద్దీ, అవి తరచుగా సంభవించి మరియు గుర్తించదగినవిగా మారవచ్చు. అవి శరీర అసాధారణ భంగిమకు కూడా కారణమవుతాయి.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

డిస్టోనియా యొక్క క్లినికల్ లక్షణాలు కారణాన్ని గుర్తించడానికి సహాయం చేస్తాయి, మరియు ఖచ్చితమైన కారణం తెలిస్తే, చికిత్సను సూచించవచ్చు. అయితే, చాలా సందర్భాలలో, ఖచ్చితమైన కారణం తెలియదు. ఈ క్రింద ఉన్న కారకాలు కూడా డిస్టోనియాకు దారి తీయవచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

డిస్టోనియా వ్యాధి నిర్ధారణలో పరిగణించదగిన అంశాలు కుటుంబ చరిత్ర, రోగి యొక్క వయస్సు, ప్రభావిత శరీరం భాగం మరియు డిస్టోనియా ఒక్కటే ఉందా లేక అది మరొక కదలిక రుగ్మతతో కలిసి ఉందా అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రభావిత ప్రాంతం యొక్క భౌతిక పరీక్ష డిస్టోనియా ఉనికిని సూచించవచ్చు.అయినప్పటికీ, డిస్టోనియా వ్యాధిని నిర్ధారించడానికి మరియు ఇలాంటి లక్షణాలతో ఇతర వ్యాధుల సంభావ్యతను నిర్మూలించడానికి, ఈ క్రింది పరీక్షలు అవసరం:

 • ఎంఆర్ఐ (MRI) ని ఉపయోగించి న్యూరోఇమేజింగ్ చెయ్యడం
 • జన్యు పరీక్షలు
 • నరాల ప్రసరణ పరీక్ష (nerve conduction test)  మరియు సొమటోసెన్సియరీ ఎవోక్డ్ పొటెన్షియల్ టెస్ట్ (somatosensory evoked potential test) వంటి న్యూరో ఫిజియోలాజికల్ పరీక్షలు
 • నేత్ర పరీక్ష
 • రక్త పరీక్షలు
 • కణజాల జీవాణుపరీక్ష (టిష్యూ బయాప్సీ)

డిస్టోనియాను నిర్ధారించిన తర్వాత, చికిత్సను నిర్ణయించవచ్చు. డిస్టోనియా చికిత్స ఈ క్రింది విధంగా ఉంటుంది:

 • శారీరక మరియు వృత్తి చికిత్స (Physical and occupational therapy): రోగులకు అనుకూలమైన వ్యాయామాలు అనేవి సహాయకరంగా ఉంటాయి.
 • ఓరల్ ఔషధాలు:
  • యాంటికొలినేర్జిక్స్ (Anticholinergics)
  • కండరాల విశ్రామకాలు (Muscle relaxants)
  • డోపమినేర్జిక్స్ (Dopaminergics)
  • గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్-ఎర్జీక్స్ (GABAergics)
 • బోట్యులినమ్ న్యూరోటాక్సిన్: బోట్యులినమ్  టాక్సిన్ ఇంజెక్షన్ యొక్క ప్రభావం 3-4 నెలల పాటు, తరువాత తదుపరి షాట్ (ఇంజెక్షన్) కోసం ఆసుపత్రికి  తిరిగి వెళ్ళాలి.
 • శస్త్రచికిత్స:
  • నూరోమోడ్యులేషన్ (Neuromodulation)
  • అబ్లేటివ్ పద్ధతులు (Ablative approaches)
  • క్రమాంత శస్త్రచికిత్సలు (Peripheral surgeries)
 • వ్యాధి గురించి తెలియజేయడం మరియు సలహాలు ఇవ్వడం : పైన ఇచ్చిన చికిత్సలు చాలావరకు నివారణగా పనిచేయవు, అందువల్ల ఈ పరిస్థితి గురించి తెలియజేయడం  మరియు సలహాలు ఇవ్వడం అనేది సమస్యను అధిగమించడానికి సహాయపడతాయి.

 1. డిస్టోనియా కొరకు మందులు

డిస్టోనియా కొరకు మందులు

డిస్టోనియా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Swidril खरीदें
Kufma CR Syrup खरीदें
Becoryl खरीदें
Bjain Lolium temulentum Dilution खरीदें
Schwabe Lolium temulentum CH खरीदें
Tuspel खरीदें
Caladryl खरीदें
Meladryl खरीदें
Coryl Tablet खरीदें
Exil खरीदें
Cofryl खरीदें
Dif खरीदें
Gercodryl खरीदें
Zendryl खरीदें
Aldryl खरीदें
Kuffdryl Syrup खरीदें
Endryl खरीदें

References

 1. H. A. Jinnah. Diagnosis and treatment of dystonia.. Neurol Clin. 2015 Feb; 33(1): 77– 100.doi: [10.1016/j.ncl.2014.09.002]
 2. Victor S C fung et al. Assessment of patients with isolated or combined dystonia: an update on dystonia syndromes.. Mov Disord. 2013 Jun 15; 28(7): 889–898. doi: [10.1002/mds.25549
 3. H.A.Jinnah. The Focal Dystonias: Current Views and Challenges for Future Research. Mov Disord. 2013 Jun 15; 28(7): 926–943. doi: [10.1002/mds.25567]
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Dystonia
 5. National Institutes of Health. [Internet]. U.S. Department of Health & Human Services; Dystonia.
और पढ़ें ...
ऐप पर पढ़ें