ఎరిథీమా మల్టీఫార్మే - Erythema Multiforme in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

March 06, 2020

ఎరిథీమా మల్టీఫార్మే
ఎరిథీమా మల్టీఫార్మే

ఎరిథీమా మల్టీఫార్మే అంటే ఏమిటి?

ఎరిథీమా మల్టీఫార్మే (EM) అనేది అంటువ్యాధులు లేదా మందుల వలన కలిగే  హైపర్ సెన్సిటివ్ (తీవ్రసున్నితత్వ) రుగ్మత. ఇది చర్మ బొబ్బల వలె కనిపిస్తుంది. ఎరిథీమా మల్టీఫార్మే సాధారణంగా పిల్లల్లో మరియు యువకులలో సంభవిస్తుంది మరియు మహిళల్లో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో జరిపిన అధ్యయనంలో, ఎరిథీమా మల్టీఫార్మే చర్మ బొబ్బల ప్రాబల్యం 25% -30%గా గుర్తించబడింది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఎరిథీమా మల్టీఫార్మే (EM) రెండు రకాలుగా సంభవిస్తుంది:

  • ఒక రకం తేలికపాటిది  ప్రధానంగా చర్మం మరియు నోటి పుళ్ళకు  కారణమవుతుంది
  • మరొక రకం అరుదైనది, చర్మం మరియు నోటితో పాటు శరీరంలోని ఇతర భాగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది

లక్షణాలు:

ఈ సమస్య సాధారణంగా 2-4 వారాలలో తగ్గిపోతుంది, కానీ మరలా సంభవించవచ్చు. మొదటి సారి ఈ రుగ్మత సంభవించిన తర్వాత చాలా సంవత్సరాల వరకు సంవత్సరానికి 2-3 సార్లు పునరావృత్తమవుతుంటుంది.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ సమస్యకి ఖచ్చితమైన క్రియావిధానం (mechanism) స్పష్టంగా తెలియలేదు, అయితే ప్రధాన కారకాలు హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (Herpes simplex virus,HSV)  టైపు1 మరియు 2 మరియు మైకోప్లాస్మా న్యుమోనియే (Mycoplasma pneumoniae). 50% కేసుల్లో, ఇది యాంటీ ఎపిలెఫ్టిక్స్ (antiepileptics), సల్ఫోనామైడ్స్ (sulphonamides), గౌట్ వ్యతిరేక (anti-gout) ఔషధాలు, నొప్పి నివారణ మందులు మరియు యాంటీబయాటిక్స్ వంటి మందుల కారణంగా సంభవిస్తుందని కనుగొనబడింది. కొంతమంది రోగులలో, ఈ పరిస్థితి వారసత్వంగా సంభవిచవచ్చు.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

ఎరిథీమా మల్టీఫార్మే (EM) ను ఎక్కువగా వైద్యపరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. బొబ్బ యొక్క రకం, పరిమాణం మరియు రంగును విశ్లేషించడం ద్వారా వైద్యులు ఈ సమస్యను నిర్ధారిస్తారు. చర్మ జీవాణుపరీక్ష (బయాప్సీ) ఇతర సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి ఆదేశించబడవచ్చు, కానీ ఎరిథీమా మల్టీఫార్మే (EM)కు ఇది నిర్దిష్టమైనది కాదు. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV) సంక్రమణను సంభావ్యతను నిర్ములించడానికి ప్రయోగశాల పరీక్షలు జరపాలి. బేధాత్మక రోగ నిర్ధారణలో (Differential diagnosis) చర్మ దద్దుర్లు, హైవ్స్ (దద్దుర్ల వాలే ఉండే చర్మ సమస్య), వైరల్ ఎక్స్పాంథమ్స్ (ఒక రకమైన జ్వరం) మరియు ఇతర రకాల హైపర్ సెన్సిటివ్ లోపాలు ఉంటాయి.

ముందుగా అనుమానిత అంటువ్యాధికి/సంక్రమణకి  చికిత్స చేయాలి లేదా అనుమానిత మందుల వాడకాన్ని ఆపివేయాలి. ఎరిథీమా మల్టీఫార్మే యొక్క తేలికపాటి రకం సాధారణంగా చికిత్స లేకుండా కొన్ని వారాలలో తగ్గిపోతుంది. యాంటిసెప్టిక్స్ (antiseptics), యాంటిహిస్టామైన్లు (antihistamines)  మరియు మౌత్ వాషులతోపాటు, లక్షణాల ఉపశమనం కోసం సమయోచిత మందులను వాడవచ్చు. నొప్పిని నిర్వహించడానికి మందులు ఇవ్వవచ్చు. పొరలుగా ఉండే లేదా బొబ్బలుగా ఏర్పడే గాయాలు మరియు వొరిసిపోయే గాయాలు కోసం, తడి కాపడాలను ఉపయోగించవచ్చు. ఇతర చికిత్సలలో ఇవి ఉంటాయి:

  • సంక్రమణల (ఇన్ఫెక్షన్)  కోసం యాంటీబయాటిక్స్
  • వాపు నియంత్రించడానికి స్టెరాయిడ్లువనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Erythema multiforme
  2. National Organization for Rare Disorders. [Internet]. Fairfield County, Connecticut, United States; Erythema Multiforme.
  3. American Academy of Family Physicians. [Internet]. Leawood,Kansas, United States; Erythema Multiforme.
  4. Dr Amanda Oakley. [Internet]. Dermnet, Hamilton, New Zealand 1997; Erythema Multiforme.
  5. Hafsi W, Badri T. Erythema Multiforme. [Updated 2019 May 2]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.