ఆహార వ్యసనం (ఫుడ్ అడిక్షన్) - Food Addiction in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

March 06, 2020

ఆహార వ్యసనం
ఆహార వ్యసనం

ఆహార వ్యసనం (ఫుడ్ అడిక్షన్) అంటే ఏమిటి?

ఆహార వ్యసనం అనేది ఒక తీవ్రమైన సమస్య, దీనిలో వ్యక్తులు వారు తినే ఆహారాన్ని నియంత్రించలేరు, అనగా, వారు ఆహారానికి బానిస అయ్యిపోతారు. ఆహార వ్యసనం మానసికంగా ప్రభావితం చేస్తుంది, అంతేకాక మొత్తం శరీరం పై కూడా ప్రభావం చూపుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

  • వ్యక్తి  తాను శారీరక  అసౌకర్య అనుభూతి పొందేవరకు లేదా అనారోగ్య అనుభూతి పొందేవరకు వరకు తింటూ ఉంటాడు.
  • ఒక నిర్దిష్ట సమయంలో వారికి కావలసిన ఆహారాన్ని పొందకపోతే ఆ వ్యక్తి  తొందర, చిరాకు, మరియు సామాజిక ఉపసంహరణలు వంటి కొన్ని సంకేతాలను చూపుతాడు.
  • అధికంగా తినడం వలన వచ్చిన బద్దకంతో వ్యక్తి లోని పనితనం యొక్క సమర్థత తగ్గిపోతుంది. అలాగే ఇది ఊబకాయ లక్షణాలను కూడా చూపిస్తుంది.
  • ఆహార వ్యసనం బాధితులు తరచుగా తమ ఆహారాన్ని ఇతరుల నుండి దాచిపెడతారు, లేదా వారు ఆహారం తినడానికి అవివేక సాకులు చెబుతారు.
  • అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు ఆహారం ప్రణాళికను నిర్వహించడంలో విఫలమవుతారు, లేదా ఒక నిర్దిష్ట పరిమాణంలో ఆహారాన్ని తినడంలో విఫలమవుతారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఆహార వ్యసనం యొక్క కారణాలు అనేకం మరియు ఒక వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లను అవి ఎలాగోలా ప్రభావితం చేస్తాయి.

  • సాంఘిక ఒంటరితనం (social isolation), కుటుంబ సమస్యలు లేదా ఒంటరితనం వంటి మానసిక అంశాలు అనేవి తృప్తి లేదా సంతోషం కోసం వ్యక్తిని ఆహారం అధికంగా తినేలా చేయవచ్చు.
  • జీవక్రియలో లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, మెదడులో అసాధారణాలు లేదా కొన్ని మందులు వంటి ఆరోగ్య సంబంధ కారణాలు ఉండవచ్చు.
  • అందువల్ల, మానసిక ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఆరోగ్య  సమస్యల ఫలితంగా ఆహార వ్యసనం సంభవిస్తుంది. కొన్నిసార్లు, ఇది ఆ రెండింటి కలయిక వలన కూడా కావచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి ?

ఈ పరిస్థితి నిర్ధారణలో ఇవి ఉంటాయి:

  • ఆహారం వ్యసనాన్ని గుర్తించడం అనేది రోగి మొదట సమస్య ఉన్నదని ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదలవుతుంది. రోగి ఆహార వ్యసనాన్ని తీవ్రంగా పరిగణించి చికిత్స తీసుకోవాలని కోరుకున్నప్పుడు మాత్రమే, వైద్యుడు లేదా మానసిక వైద్యుడు(psychiatrist) చికిత్స చేయగలడు.
  • ఒక రోగి యొక్క ప్రవర్తన మరియు ఇతర లక్షణాల ఆధారంగా, ఆహార వ్యసనం నిర్ధారణ అవుతుంది. ఈ పరిస్థితికి  ఖచ్చితమైన పరీక్షలు లేవు, అయినప్పటికీ దీనిని సులువుగానే గుర్తిస్తున్నారు.

ఈ పరిస్థితి యొక్క  చికిత్సలో ఇవి ఉంటాయి:

  • ఆహార వ్యసన చికిత్స అనేది ఇతర వ్యసన  కంటే వేరుగా ఉంటుంది, వేరే వాటిలా ఆహారాన్ని పూర్తిగా వదిలిపెట్టలేము ఎందుకంటే అంది మనుగడకి వ్యక్తికి ఆహరం చాలా అవసరం.
  • ఈ కారణం ఒక ఆరోగ్య సమస్యగా గుర్తించబడినట్లయితే, ఇది కొన్ని మందులు మరియు జీవనశైలి మార్పులతో చికిత్సను పొందవచ్చు.
  • అతను / ఆమె ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను పరిష్కరించడానికి రోగికి కౌన్సెలింగ్ మరియు చికిత్సను సూచిస్తారు.
  • అలసట మరియు బద్దకాన్ని తగ్గించడానికి వ్యాయామం చేయడం కూడా ముఖ్యం.
  • భోజనాన్ని ఒక  నిర్దిష్ట సమయంలో తినడం, అనారోగ్యకరమైన ఆహారాల నుండి దూరంగా ఉండటం, మరియు అతిగా తినడాన్ని నివారించడానికి క్రమమైన ఆహార పట్టికలను (food charts) ఏర్పాటు చేసుకోవడం వంటి ఆహార విధాన మార్పులు చేసుకోవాలి.



వనరులు

  1. The Journal of Nutrition. Food Addiction in Humans. Oxford University Press. [internet].
  2. Science Direct (Elsevier) [Internet]; Food Craving and Food “Addiction”: A Critical Review of the Evidence From a Biopsychosocial Perspective
  3. Science Direct (Elsevier) [Internet]; Refined food addiction: A classic substance use disorder
  4. Dimitrijevic I, Popovic N, Sabljak V, Skodric-Trifunovic V, Dimitrijevic N. Food addiction-diagnosis and treatment.. Psychiatr Danub. 2015 Mar;27(1):101-6. PMID: 25751444
  5. Volkow ND, Wang GJ, Tomasi D, Baler RD. Pro v Con Reviews: Is Food Addictive?. Obes Rev. 2013 Jan;14(1):2-18. PMID: 23016694

ఆహార వ్యసనం (ఫుడ్ అడిక్షన్) కొరకు మందులు

Medicines listed below are available for ఆహార వ్యసనం (ఫుడ్ అడిక్షన్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.