జెయింట్ సెల్ ఆర్టెరిటిస్ - Giant Cell Arteritis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

March 06, 2020

జెయింట్ సెల్ ఆర్టెరిటిస్
జెయింట్ సెల్ ఆర్టెరిటిస్

జెయింట్ సెల్ ఆర్టెరిటిస్ అంటే ఏమిటి?

జెయింట్ సెల్ ఆర్టెరిటీస్ (GCA) అనేది వాపుతో కూడిన స్థితి, ప్రధానంగా ఇది  శరీరం ఎగువ భాగాల్లోను మరియు తల యొక్క ధమనులను బాధించే వాపు రుగ్మత. తలకు ఇరుపక్కలా ఉండే  ధమనులు (తల, మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులు) ఈ రుగ్మతలో ఎక్కువగా బాధింపబడతాయి కాబట్టి దీన్నే టెంపోరల్ (కణత) ఆర్టెరిటిస్ లేదా క్రేనియల్ (కాపాలానికి సంబంధించిన) ఆర్టెరిటీస్ అని పిలుస్తారు. ఈ రుగ్మత తలనొప్పులు మరియు  వస్తువులు రెండుగా (డబుల్ విజన్) కనిపించడడం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. ఈ రుగ్మత వ్యక్తమైన వెంటనే చికిత్స చేయించడం చాలా అవసరం, అలా చికిత్స చేయిస్తేనే అఘాతాలు (స్ట్రోక్ లు), అంధత్వం , లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.  

దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

జెయింట్ సెల్ ఆర్టెరిటిస్ (GCA) తో బాధపడుతున్న వ్యక్తులు క్రింది లక్షణాల్లో కొన్ని లేదా దాదాపు అన్నింటినీ అనుభవిస్తూ బాధపడుతుంటారు:

  • కణత, నెత్తిపై సున్నితత్వం మరియు తీవ్ర నొప్పి (దీనితోపాటు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడం) మరియు జుట్టు దువ్వుకునేటప్పుడు లేదా గడ్డం (షేవింగ్ చేసుకునేప్పుడు) గీసుకునేటపుడు కణత, నెత్తిపై నొప్పి పుడుతుంది.  
  • అలసట
  • వినికిడి సమస్యలు
  • నొప్పి, సున్నితత్వం మరియు పెడసరం (పట్టేసినట్లుండే సమస్య) తుంటిభాగంలో, కాళ్ళు, చేతులు, మరియు భుజం కండరాల్లో ఉదయం వేళల్లో ఎక్కువగా రావడం సంభవిస్తూ ఉంటుంది.
  • ఫ్లూ-వంటి లక్షణాలు, అంటే రాత్రిళ్లు చెమటలు పట్టడం, లేదా జ్వరం రావడం
  • బరువు నష్టం
  • తలనొప్పి
  • నమలినప్పుడు దవడ లేదా నాలుకలో నొప్పి కలగడం, దీన్నే క్లాడికేషన్ అంటారు.
  • పెద్ద ధమనులు దెబ్బతినడంవల్ల పిక్కల్లో (calves) నొప్పి, దాని  కారణంగా సరిగ్గా నడవలేకపోవడం లేదా కుంటడం.
  • ఆకస్మికంగా మరియు ప్రధానంగా పాక్షిక (కొన్నిసార్లు పూర్తిగా) దృష్టి నష్టం, ఇది ప్రారంభ దశల్లో అరుదైనది సంభవిస్తుంది, కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే శాశ్వత దృష్టి నష్టం ప్రమాదానికి దారితీస్తుంది
  • వస్తువులు రెండుగా కనిపించడం (డబుల్ దృష్టి)
  • ఆఘాతాలు లేదా సన్నపాటి ఆఘాతాలు అరుదుగా సంభవిస్తాయి (strokes or mini strokes)
  • కుంగుబాటు (డిప్రెషన్)

వైద్యుడి దృష్టికి తక్షణం తీసుకెళ్లాల్సిన అవసరమున్న ప్రధాన లక్షణాలు ఏవంటే

  • కంటి దృష్టికి తొందర ఏర్పడ్డం లేదా దృష్టి సమస్యలు
  • దవడ లేదా నాలుకలో నొప్పి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

జెయింట్ సెల్ ఆర్టెరిటిస్ యొక్క ఖచ్చితమైన కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ, జెయింట్ సెల్ ఆర్టెరిటిస్ కి దారితీయడానికి అనుమానించబడుతున్న కొన్ని కారకాలు:

  • వృద్ధాప్యం
  • జెనెటిక్స్
  • కొన్ని వైరల్ లేదా బ్యాక్టీరియల్ అంటువ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు
  • కుటుంబంలో హృదయ వ్యాధి చరిత్ర
  • శరీరంలో స్వయంప్రేరక రోగనిరోధక వ్యవస్థ (autoimmunity) లో ధమనుల వాపును స్వయం ప్రతిరక్షకమే కల్గిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా, రోగ నిర్ధారణను ధృవీకరించడానికి వైద్యుడు క్రింది సలహాలను ఇస్తారు:

  • వైద్య చరిత్రను తెల్సుకున్న తరువాత వైద్యులు భౌతిక పరీక్ష చేస్తారు.  
  • బాధిత కణజాలపు జీవాణుపరీక్ష (పరీక్ష నిమిత్తం శస్త్రచికిత్సతో చిన్న శరీర భాగపు నమూనాను తొలగించి తీసుకుంటారు.)
  • రక్త పరీక్ష, ఎర్ర రక్త కణ అవక్షేప రేటు (ESR) ను కనుగొనేందుకు
  • అయస్కాంత ప్రతిధ్వని యాంజియోగ్రఫీ (MRA)
  • డాప్లర్ అల్ట్రాసౌండ్
  • పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET)

చికిత్స చేయని GCA అంధత్వం మరియు అఘాతాలు (స్ట్రోక్) (కళ్ళు మరియు మెదడుకు బలహీనమైన రక్త ప్రసరణ ఫలితంగా) వంటి తీవ్రమైన సంక్లిష్టతలకు దారితీస్తుంది. జెయింట్ సెల్ ఆర్టెరిటిస్ కి తక్షణం చికిత్సక చేయించుకోవడం అవసరమని సలహా ఇవ్వబడుతొంది. GCAకు చికిత్స పద్ధతులు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ప్రిడ్నిసోన్, కార్టికోస్టెరాయిడ్, చికిత్స యొక్క ప్రధాన మార్గం
  • కంటి చూపు (దృశ్య ఆటంకాలు) దోషాల  విషయంలో రోజువారీగా 100 mg యాస్పిరిన్ మందును సిఫార్సు చేయబడింది
  • కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్లను కూడా ప్రిడ్నిసోన్ యొక్క దీర్ఘకాలిక వాడకం యొక్క దుష్ప్రభావాలను తగ్గించటానికి ఇవ్వబడతాయి
  • జీర్ణశయాంతర ప్రతికూల ప్రభావాల విషయంలో ప్రోటాన్ పంప్ నిరోధకం (ఓమెప్రజోల్) ను ఉపయోగించవచ్చు.



వనరులు

  1. J. Alexander Fraser et al. The Treatment of Giant Cell Arteritis. Rev Neurol Dis. Author manuscript; available in PMC 2011 Jan 4. PMID: 18838954
  2. Thomas Ness et al. The Diagnosis and Treatment of Giant Cell Arteritis. Dtsch Arztebl Int. 2013 May; 110(21): 376–386. PMID: 23795218
  3. National Centre for Advancing Translatinal Science. Giant cell arteritis. U.S Department of Health and Human Services; [Internet]
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Eyes - giant cell arteritis
  5. American College of Rheumatology. Giant Cell Arteritis. [Internet]