హెపటైటిస్ బి - Hepatitis B in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 19, 2018

September 11, 2020

హెపటైటిస్ బి
హెపటైటిస్ బి

సారాంశం

హెపటైటెస్ – బి  కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది హెపటైటెస్ – బి  వైరస్ ( హెచ్ బి వి) కారణంగా వస్తుంది. ఈ జబ్బు రెండు రకాలుగా ఉంటుంది. అవి అక్యూట్ ( తీవ్రమైన సంక్రమణం) ఇన్ఫెక్షన్ . ఇది అకస్మాత్తుగా ఎదురవుతుంది. చికిత్స జరిపితే తక్కువ వ్యవధిలో నయమవుతుంది) మరొకటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ . ఒకసారి ఇన్ఫెక్షన్ చేరితే అది శరీరంలో ద్రవాలలో మరియు స్రావములలో నిలిచిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో  హెచ్ బి వి ప్రధానంగా అరక్షిత లైంగిక చర్యల ద్వారా మరియు ఇంట్రావెనస్ మందుల ద్వారా సోకుతుంటుంది. అక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పులు, పొత్తికడుపులో అసౌకర్యం, శరీరం నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారాలు, తర్వాత చర్మం మరియు కళ్లు కామెర్ల కారణంగా పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కామెర్లు హెచ్చయితే వమనాలు మరియు డయారియా ప్రబలుతాయి.

దీర్ఘకాలిక హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్  కాలేయమును పాడుచేస్తుంది. పైగా లీవర్ కేన్సర్ కు దారి తీస్తుంది. తీవ్రమైన హెపటైటెస్ బి  ఇన్ఫెక్షన్ కు సాధారనంగా హెచ్చు మోతాదులో విశ్రాంతి,  హెచ్చు స్థాయిలో ద్రవ రూపంలోని ఆహారం  సేవించడం, ఆరోగ్యకరమైన ఆహారం సేవించడం మంచిది.  దీర్ఘకాలిక హెపటైటెస్ బి కు కాలేయం జబ్బు లక్షణాలకు  క్రమంగా సరిచూసుకోవడం అవసరం. అవసరమైతే మౌఖికంగా తీసుకొనే అంటివైరల్  ఔషధాలను సేవించాలి. ఒక మారు ఆంటి వైరల్ మందులు ప్రారంభిస్తే  జబ్బుమనిషి జీవిత పర్యంతం మందులను వాడుతూ ఉండాలి.  చికిత్స కొనసాగించకపోతే హెచ్ బి వి ఇన్ఫెక్షన్  లీవరు ను చేరుకొని  లీవర్ కేన్సరుకు దారితీస్తుంది

హెపటైటిస్ బి యొక్క లక్షణాలు - Symptoms of Hepatitis B in Telugu

జబ్బు తీవ్రమైనదా లేదా దీర్ఘకాలికమైనదా అనే అంశాన్ని బట్టి జబ్బు లక్షణాలు వైవిధ్యం కలిగి ఉంటాయి.

తీవ్రమైన హెపటైటెస్ బి

తీవ్రమైన హెపటైటెస్ బి  లక్షణాలు కనబడితే అవి ఇలా ఉంటాయి :

దీర్ఘకాలిక హెపటైటెస్ బి 

దీర్ఘకాలిక హెపటైటెస్ బి  జబ్బుతో బాధ పడేవారు ఏలాంటి ప్రత్యేకమైన చిహ్నాలు లేదా లక్షణాలను కలిగి ఉండరు. ఏళ్ల తరబడి జబ్బు లక్షణాలు లేకుండా కొనసాగుతారు. లక్షణాలు కనిపించినప్పుడు అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ జబ్బుగా వెల్లడవుతుంది. ఈ లక్షణాలలో తరచు ఆహారానికి  సిగరెట్లకు విముఖత, కొద్దిపాటి నుండి తేలిక అయిన కుడివైపు పొత్తికడుపులో నొప్పి,. ఈదశలో లీవర్ విధులకు సంబంధించిన కొన్ని పరీక్షలు  హెచ్చు విలువలను సూచిస్తాయి.

హెపటైటిస్ బి యొక్క చికిత్స - Treatment of Hepatitis B in Telugu

చికిత్స :  తీవ్రమైన హెపటైటెస్ బి.

తీవ్రమైన ఇన్ఫెక్షన్ దశలో జబ్బుకి చికిత్స  నిర్వహణ మద్దతు ప్రక్రియతో కూడి ఉంటుంది. చికిత్స లక్ష్యం  వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం కల్పించడం. సాధారణంగా ఔషధాలు సూచింప బడవు.  డాక్టర్లు అవసరమైన మోతాదులో పోషకాహార సమతౌల్యత, హెచ్చుగా నీరు త్రాగడం మరియు విశ్రాంతి సూచిస్తారు.

దీర్ఘకాలిక హెపటైటెస్ బి
దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కు సాధారణంగా మౌఖికంగా ఉపయోగించే  ఆంటివైరల్ ఔషధాలు ( టెనోఫోవిర్ లేదా ఎంటేకావిర్ వంటివి) సూచింపబడతాయి. చికిత్స సిరోసిస్ పెరగడాన్ని  అదుపుచేయడం లేదా నిదానంగా ప్రభావం చూపేలా చేయడం లక్ష్యంగా ఉంటుంది. తద్వారా లివర్ కేన్సర్ హెచ్చయ్యే అవకాశాన్ని అదుపు చేస్తారు. చికిత్స  వైరస్  ప్రతికృతిని దాచిపెడుతుంది. ఇది జబ్బును నయం చేయదు. దీనితో ఎక్కువ మంది రోగులు యావజ్జీవం చికిత్స పొందుతుంటారు.

జీవన సరళి/ విధానం నిర్వహణ

జీవన విధానంలో జరిపే పెక్కు మార్పులు  రోగులలో హెపటైటెస్ బి ని మరింత  సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం చేస్తాయి. క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడినాయి:

  • మద్యపానం మరియు ధూమపానం రెండూను  కాలేయాన్ని పాడుచేస్తాయి. ఈ కారణంగా వాటిని వదలివేయండి.  వీటివల్ల వచ్చిన హెచ్ బి వి ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన హెపటైటెస్ బి తో లీవర్ ఇప్పటికే దెబ్బతిని ఉన్నది
  • మీరు మూలికల ఆధారంగా తయరయిన ఔషధాలను తీసుకొనే పక్షంలో మీ డాకతరును సమ్ప్రతించదం అవసరమ్ ఎందుకంటే ఈ ప్రత్యామ్నాయ మందులు లీవర్ ను పాడుచేస్తాయి లేదా మీరు తీసుకొనే డాక్తర్లు సూచించిన ఇతర ఔషధాలపై వాటి ప్రభావం చూపుతాయి.
  • మందుల దుకాణంలో లభించే ఓవర్ ది కౌంటర్ మందులను  మీ దాక్తరు సలహా లేకుండా తీసుకొనకండి.  ( ఉదా: పారాసెటమోల్). ఎందుకంటే ఇట్టి మందులలో పెక్కు మందులు లీవర్ పై దెబ్బతీస్తాయి.
  • స్కాలోప్స్, మసెల్స్ లేదా క్లామ్స్ వంటి  షెల్ ఫిష్  చేపల రకాలను తినడ మానండి అవి లీవరుకు విషపూరితమయ్యే విబ్రియో వల్నిఫిలస్ జీవులతో కూడిన బాక్టీరియాతో కూడి ఉంటాయి.
  • పెయిట్ థిన్నర్స్, ఇంటిలో శుభ్రపరచే వస్తువులు, నెయిల్ పాలిష్ రిమూవర్ల వంటి వాటిని పీల్చకండి. ఎందుకంటే అవి విషపూరితమైనవి
  • హెచ్చు స్థాయిలో కూరగాయలు, పళ్లు, తృణధాన్యాలు, క్యాబేజి, బ్రోకలీ, కాలీ ఫ్లవర్ లతో కూడినట్టి  ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవించండి. ఇవి కాలేయంపై రక్షణ చర్య కల్పిస్తుంది
  • కార్న్, వేరుసెనగ, జొన్న, తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు వాటిపై  బూజును పరిశీలించండి. బూజు ఉన్నట్లయితే అది లీవర్ కు చెడు కలిగిస్తుంది.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • జబ్బు తీవ్రతను బట్టి ప్రోటీన్లు, ద్రవం ,ఉప్పు మోతాదును అదుపులో ఉంచవలసి ఉంటుంది. ఇవి లీవర్ లో మంటను కల్పించని స్థాయిలో వీటిని సేవించాలి.
Wheatgrass Juice
₹449  ₹499  10% OFF
BUY NOW

హెపటైటిస్ బి అంటే ఏమిటి? - What is Hepatitis B in Telugu

హెపటైటెస్ జబ్బు అనగా కాలేయము (లీవర్ ) లో వాపు లేదా మంట కలిగి ఉండటం, లీవరులో మంట ప్రారంభమయితే దాని పెక్కు పనులు నిలిచిపోతాయి. ఎందుకంటే కాలేయము చేసే పనులు ఒకటితో మరొకటి ముడిపడి ఉంటాయి.  హెపటైటెస్ బి లీవరు పై ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తే  ఈ దుస్థితిని .  హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ అంటారు.

ప్రపంచవ్యాప్తంగా హెపటైటెస్ బి వైరస్ (హెచ్ బి వి)  ఇన్ఫెక్షన్  చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యు హెచ్ ఓ )  పొందుపరచిన పరిశీలనలో  కోట్లాది మంది  హెపటైటెస్ బి కి గురవుతున్నారని వెల్లడవుతున్నది. వీరిలో సుమారు 24 కోట్లమంది  దీర్ఘకాలిక హెపటైటెస్ తో బాధ పడుతున్నారు. ప్రతి ఏటా తీవ్రమైన లేదా దీర్ఘకాలిక హెపటైటెస్ బి జబ్బుతో 7,70,000 మంది మరణిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో ఐదోభాగం మంది ఇండియాలో ఉన్నారు. దీనితో ఇండియాలోని జనాభాలో హెచ్చుమంది ప్రపంచ బాధితులలో ఉన్నారు. ప్రపంచంలోని హెచ్ బి వి బాధితులలో 10- -15 శాతం మంది ఇండియాలో ఉన్నారు. ఇండియాలో 4 కోటమంది హెచ్ బి వి రొగులు ఉన్నట్లు పరిశీలనలు అంచనా వేస్తున్నాయి.



వనరులు

  1. Ray G. Current Scenario of Hepatitis B and Its Treatment in India. Journal of Clinical and Translational Hepatology. 2017;5(3):277-296. doi:10.14218/JCTH.2017.00024. PMID: 28936409
  2. Gautam Ray. Current Scenario of Hepatitis B and Its Treatment in India. J Clin Transl Hepatol. 2017 Sep 28; 5(3): 277–296. PMID: 28936409
  3. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Hepatitis B.
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Viral Hepatitis
  5. Lavanchy D. Hepatitis B virus epidemiology, disease burden, treatment, and current and emerging prevention and control measures. J Viral Hepat. 2004 Mar;11(2):97-107. PMID: 14996343
  6. Goldstein S.T., Zhou F., Hadler S.C., Bell B.P., Mast E.E., Margolis H.S. A mathematical model to estimate global hepatitis B disease burden and vaccination impact. Int J Epidemiol. 2005; 34:1329–1339. PMID: 16249217
  7. Dutta S. An overview of molecular epidemiology of hepatitis B virus (HBV) in India.. Viral J. 2008; 5:156. PMID: 19099581
  8. Am Fam Physician. 2004 Jan 1;69(1):75-82. [Internet] American Academy of Family Physicians; Hepatitis B.
  9. National Health Service [Internet]. UK; Hepatitis B.
  10. Shiffman ML. Management of acute hepatitis B.. Clin Liver Dis. 2010 Feb;14(1):75-91; viii-ix. PMID: 20123442

హెపటైటిస్ బి కొరకు మందులు

Medicines listed below are available for హెపటైటిస్ బి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.