myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

హెర్పిస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ అంటే ఏమిటి?

హెర్పిస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది అరుదుగా వచ్చే వ్యాధి అయినప్పటికీ, దీనివల్ల కలిగే మరణాల రేటు మరియు వ్యాధిగ్రస్తత (morbidity) రేటు అధికంగా ఉంటోంది. ఇది ‘హెర్పెస్ సింప్లెక్స్ వైరస్’ వల్ల సంభవిస్తుంది. జ్వరం, అధిక చురుకుదనం (హైపర్యాక్టివిటీ), మగత లేదా సాధారణ బలహీనత వంటివి హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి లక్షణాలు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • ప్రారంభ లక్షణాలు:
  • తలనొప్పి
  • జ్వరం (ఫీవర్)
  • మూర్చ
  • సాధారణ బలహీనతతో కూడిన మగత
  • గందరగోళం
  • స్థితి నిర్ధారణ రాహిత్యము (స్థితిభ్రాంతి)
 • తర్వాతి లక్షణాలు:
  • మాట్లాడ్డం లేదా రాయడం ద్వారా తెలియజెప్పడంలో వ్యక్తికి సమస్య
  • వాసన శక్తిని కోల్పోవడం
  • జ్ఞాపకశక్తి నష్టం
  • అధిక చురుకుదనం
  • భ్రాంతితో కూడిన ప్రవర్తన
 • అదనపు తీవ్ర లక్షణాలు:
  • మార్పు చెందిన ప్రతిక్రియ చర్యలు
  • స్పృహ కోల్పోవడం
  • భ్రాంతులు
  • పాక్షిక పక్షవాతం
  • రెటీనా యొక్క వాపు

ప్రధాన కారణాలు ఏమిటి?

 • హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ వ్యాధికి అత్యంత సాధారణ కారణం హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఒకటో టైప్ ఇన్ఫెక్షన్.
 • ఇతర అసాధారణ కారణాలు:
  • హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ రెండోరకం (టైప్ II) సంక్రమణ (నవజాత శిశువులలో మరింత సాధారణం).
  • హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ యొక్క కొన్ని లక్షణాలు, మెదడులోని హేమోరేజిక్ నెక్రోసిస్ (కణజాలం మరణం) తో సంబంధం ఉన్న కణజాల క్షీణత ఫలితంగా సంభవించవచ్చు.
  • ఒత్తిడి లేదా గాయం ఫలితంగా నరాల కణజాలంలో అప్పటివరకూ అసమర్థంగా మరియు నిద్రాణమైన హెర్పెదీనికి స్ సింప్లెక్స్ వైరస్ ప్రతిక్రియ దశకొచ్చినపుడు హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి సంభవిస్తుంది. వైరస్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ప్రాథమికంగా బహిర్గతం అయిన కొన్ని సంవత్సరాలకు గుప్త దశ నుండి తేరుకుని తిరిగి క్రియాశీలం కాగల శక్తిని కలిగి ఉంటుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి నిర్ధారణ క్లినికల్ పరీక్ష మరియు పరిశోధనల ఆధారంగా ఉంటుంది.

పరిశోధనలు కిందివిధంగా ఉంటాయి:

 • రక్త పరీక్ష
 • సెరెబ్రోస్పానియల్ ద్రవం పరీక్ష
 • ఎలక్ట్రోఎన్సుఫలోగ్రం పరీక్ష
 • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI)
 • బ్రెయిన్ బయాప్సీ పరీక్ష

హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్ నుండి కోలుకోవడానికి యాంటీవైరల్ మందులతో ప్రారంభదశలోనే చికిత్స చేయడం ప్రయోజనకరమైనదిగా నీరూపించబడింది.

అవసరమైతే వైద్యుడు ఓ 14-రోజుల అసిక్లోవర్ (acyclover) కోర్సును సూచించవచ్చు.

పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి, డాక్టర్ ఇంట్రావీనస్ అసిక్లోవర్ ను నిర్వహిస్తారు.

హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటిస్తో సంబంధం ఉన్న మూర్ఛల విషయంలో యాంటికోన్వల్సెంట్స్ మందుల అవసరం ఉంటుంది.

తలను పైకెత్తి పెట్టి ఉంచడం, మనిటిల్ లేదా గ్లిసరాల్ మందులివ్వడం మరియు హైపర్వెంటిలేషన్ (శ్వాసక్రియను జోరుగా జరపడం) లను తగ్గిన కార్బన్ డయాక్సైడ్ యొక్క నరాల పాక్షిక ఒత్తిడిని నిర్వహించడానికి సూచించవచ్చు.

 1. హెర్పిస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటీస్ కొరకు మందులు

హెర్పిస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటీస్ కొరకు మందులు

హెర్పిస్ సింప్లెక్స్ ఎన్సెఫాలిటీస్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
HerpexHerpex 100 Mg Tablet64
Lysatone PlusLysatone Plus Syrup61
ClovirClovir 5% Ointment29
OpthovirOpthovir 3% Ointment36
SetuvirSetuvir 5% Cream28
ToxinexToxinex 3% Eye Ointment52
ViraVira Eye Ointment30
VirinoxVirinox 3% W/W Eye Ointment34
VirucidVirucid 3% Eye Ointment39
YavirYavir 3% Eye Ointment30
AcyclovirAcyclovir 5% W/W Eye Ointment53
ClovidermCloviderm 5% Ointment0
EyevirEyevir 3% Eye Ointment36
Primacort PlusPrimacort Plus 5% Cream52
LycypLycyp Syrup50
Peritol GPeritol G Drop12
Acicet TabletAcicet 200 Mg Tablet Dt39
AciherpinAciherpin 200 Mg Tablet45
AcivexAcivex 200 Mg Tablet Dt62
AxovirAxovir 250 Mg Injection224
Lovir (Eli Lilly)Lovir 400 Mg Tablet99
NeoclovirNeoclovir 250 Mg Injection174
TriclovirTriclovir 400 Mg Tablet96

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Organization for Rare Disorders. Encephalitis, Herpes Simplex. [Internet]
 2. Sköldenberg B. Herpes simplex encephalitis.. Scand J Infect Dis Suppl. 1996;100:8-13. PMID: 9163027
 3. P G E Kennedy, A Chaudhuri. Herpes simplex encephalitis . Neurology, Neurosergery and Psychiatry; [Internet]
 4. R Whitley. Diagnosis and Treatment of Herpes Simplex Encephalitis. Vol. 32:335-340 (Volume publication date February 1981); [Internet]
 5. Michael J. Bradshaw, Arun Venkatesan. Herpes Simplex Virus-1 Encephalitis in Adults: Pathophysiology, Diagnosis, and Management. Neurotherapeutics. 2016 Jul; 13(3): 493–508. PMID: 27106239
और पढ़ें ...