దద్దుర్లు (హైవ్స్) - Hives in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 06, 2018

March 06, 2020

దద్దుర్లు
దద్దుర్లు

దద్దుర్లు (హైవ్స్) అంటే ఏమిటి?

దద్దుర్లను యూట్రికేరియా (urticaria) అని కూడా పిలుస్తారు, ఇది రాషెస్ లా చర్మంపై ఎర్రటి బొబ్బలు లేదా బొడిపెలు కలిగించే ఒక చర్మ సమస్య. సాధారణంగా ఇవి అలెర్జీ ప్రతిస్పందనగా ప్రేరేపించబడతాయి, దద్దుర్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి మరియు కొన్ని రోజుల పాటు ఉండవచ్చు లేదా వెంటనే మాయమైపోవచ్చు (తగ్గిపోవచ్చు). తగ్గడానికి 6 వారాల సమయం పడితే వాటిని తీవ్రమైన దద్దుర్లుగా పరిగణించవచ్చు. చాలా దద్దుర్లు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. అయినప్పటికీ, చికిత్స లేకుండా దీర్ఘకాల దద్దుర్లు (chronic hives) 6 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • దద్దుర్లు యొక్క సాధారణ లక్షణం చర్మం పై బొబ్బలు ఏర్పడడం.
 • ఈ బొబ్బలు ఎరుపు, గులాబీ లేదా చర్మం రంగులో ఉంటాయి.
 • బొబ్బల చుట్టూ కొంత దురద లేదా మంట సంభవించవచ్చు.
 • దద్దుర్లు స్పాంటేనియస్గా (వాటికవే) ఏర్పడతాయి మరియు మాయం అవుతాయి
 • బ్లాంచింగ్ (Blanching) అనే పదాన్ని చర్మం మీద దద్దుర్లను నొక్కినప్పుడు కనిపించే తెల్లటి రంగును సూచించడానికి ఉపయోగిస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • దద్దుర్లు అత్యంత సాధారణ కారణం అలెర్జీ. వివిధ రకాలైన అలెర్జీ కారకాలు అలెర్జీలను కలిగిస్తాయి.
 • దద్దుర్లను  కలిగించే ఆహార పదార్దాలు చేపలు, పాలు, చాక్లెట్లు,నట్స్,నత్తలు, గుల్ల ఉండే జీవులు మొదలైనవి.
 • పురుగుల కాటులు (Insect bites) లేదా సల్ఫా (sulfa) మందుల వంటి కొన్ని మందులు కూడా యూటిటారియాను కలిగించవచ్చు.
 • హెపటైటిస్ మరియు క్యాన్సర్ వంటి సిస్టమిక్ వ్యాధులు దీర్ఘకాలిక దద్దుర్లకు కారణమవుతాయి.
 • సూర్యకాంతి, చలి, వేడి, మొదలైన వాటికి అధికంగా గురికావడం కూడా దద్దుర్లకు  కారణమవుతాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

దద్దుర్లకు ప్రత్యేకమైన నిర్దారణ పరీక్ష ఏది లేదు. లక్షణాల ఆధారంగా, వైద్యులు ఇటీవలి అలవాట్లు, ఆహారం, వ్యక్తి యొక్క తెలిసిన అలెర్జీల గురించి తెలుసుకుంటారు. అలెర్జీ కారణం యొక్క నిర్ధారణకు కావడానికి కొంత సమయం పట్టవచ్చు. సంక్రమణ/ఇన్ఫెక్షన్ అనుమానం ఉన్నట్లయితే, రక్త పరీక్ష ఆదేశించబడవచ్చు. దద్దుర్లు యొక్క అలెర్జీ స్వభావాన్ని నిర్ధారించడానికి, IgE రక్త పరీక్షలను కూడా వైద్యులు ఆదేశించవచ్చు.

కారణాన్ని గుర్తించిన తర్వాత, ఆహారం నుండి అలెర్జీ (దద్దుర్ల) కారకాన్ని తొలగించడం లేదా దానికి గురికావడాన్ని తప్పించడం ద్వారా దద్దుర్లకు చికిత్స చేయాలి. యాంటీ-హిస్టామైన్లు వంటి మందులు లక్షణాల నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడతాయి. తీవ్రమైన సందర్భాల్లో దద్దుర్ల చికిత్సకు , అడ్రినలిన్ (adrenaline) ఇంజక్షన్లు ఇవ్వబడతాయి. దద్దుర్లు ఇతర వ్యాధులు లేదా అంటురోగాలు/ఇన్ఫెక్షన్లతో ముడిపడి ఉంటే, ఆ వ్యాధికి చికిత్స చేస్తే దదుర్లు సాధారణంగా పరిష్కరించబడతాయి.వనరులు

 1. Singleton R, Halverstam CP. Diagnosis and management of cold urticaria.. Cutis. 2016 Jan;97(1):59-62. PMID: 26919357
 2. The New England Journal of Medicine. [Internet]. Massachusetts Medical Society. Chronic Urticaria and Angioedema.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hives.
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hives.
 5. S J Deacock. An approach to the patient with urticaria. Clin Exp Immunol. 2008 Aug; 153(2): 151–161. PMID: 18713139

దద్దుర్లు (హైవ్స్) కొరకు మందులు

Medicines listed below are available for దద్దుర్లు (హైవ్స్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.