ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా - Idiopathic Thrombocytopenic Purpura (ITP) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 10, 2018

March 06, 2020

ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా
ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా

ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా అంటే ఏమిటి?

ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా (ఐటిపి) అనేది ఒక రక్తానికి సంభందించిన రుగ్మత  దీనిలో ప్లేట్లెట్ల (platelet) సంఖ్య తగ్గిపోతుంది. ఈ వ్యాధి సంభవించడానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ రుగ్మత ప్లేట్లెట్ల సంఖ్యను మాత్రమే ప్రభావితం చేస్తుంది వాటి పనితీరును ప్రభావితం చెయ్యదు. ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురాలో, శరీరం ప్లేట్లెట్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది; అందువల్ల ఇది ఒక ఆటో ఇమ్మ్యూన్ డిసార్డర్(స్వయం ప్రతిరక్షక రుగ్మత).

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రక్తస్రావాన్ని ఆపడానికి ప్లేట్లెట్లు అవసరమవుతాయి కాబట్టి, ఐటిపి (ITP) యొక్క లక్షణాలు ప్రాథమికంగా అధిక రక్తస్రావంతో ముడిపడి ఉంటాయి. లక్షణాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఐటిపి యొక్క  కారణం తెలియకపోయినా, ఈ వ్యాధి రెండు ప్రక్రియలను కలిగి ఉంటుంది, వాటి ఫలితంగా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది, అవి:

 • మొదటిది - ప్లేట్లెట్లను  యాంటీబాడీలు నాశనం చేస్తాయి
 • రెండవది - యాంటీబాడీలు ఎముక మజ్జలో ప్లేట్లెట్లను -ఉత్పత్తి చేసే కణాలను కూడా నాశనం చేస్తాయి. ప్లేట్లెట్ల ఉత్పత్తికి త్రాంబోపోయిటిన్ (TPO, thrombopoietin) అనే ప్రోటీన్ అవసరం అవుతుంది. అయితే, ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినప్పుడు త్రాంబోపోయిటిన్  స్థాయి పెరగదు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు పూర్తి భౌతిక పరీక్షను నిర్వహించి దానిని వ్యక్తి యొక్క ఆరోగ్య చరిత్రతో పోల్చి చూస్తారు. వైద్యులు ప్లేట్లెట్ల సంఖ్యను తనిఖీ చెయ్యడానికి పూర్తి రక్త గణన (CBC) కోసం కూడా ఆదేశించవచ్చు మరియు ఏదైనా సంక్రమణ తనిఖీ కోసం మూత్ర పరీక్ష మరియు రక్తస్రావ సమయ అంచనా పరీక్షను (assess bleeding time) కూడా సూచించవచ్చు. ఎముక మజ్జలో అసాధారణతల సంభావ్యతను నిర్మూలించడానికి బోన్ మారో ఆస్పిరేషన్ (Bone marrow aspiration) చేస్తారు.

చికిత్స యొక్క లక్ష్యం రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడం.

 • కార్టికోస్టెరాయిడ్లను వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు మరియు ఇమ్యునోగ్లోబిలిన్లను ప్లేట్లెట్ల సంఖ్య పెంచడానికి ఉపయోగిస్తారు.
 • ప్లేట్లెట్ల నిర్ములన రేటును నియంత్రించడానికి స్ల్పీనెక్టమీ (Splenectomy) నిర్వహిస్తారు.
 • తీవ్రమైన సందర్భాలలో ప్లేట్లెట్లను ఎక్కించడం అవసరం.
 • రిటుక్సన్ (Rituxan [rituximab] )అని పిలిచే ఒక మందును దీర్ఘకాలిక ఐటిపి (ITP) చికిత్స కోసం ఉపయోగిస్తారు.వనరులు

 1. MedlinePlus Medical: US National Library of Medicine; Immune thrombocytopenic purpura (ITP)
 2. L.Kayal, S.Jayachandran, Khushboo Singh. Idiopathic thrombocytopenic purpura. Contemp Clin Dent. 2014 Jul-Sep; 5(3): 410–414. PMID: 25191085
 3. Children’s Hospital of Philadelphia. Idiopathic Thrombocytopenic Purpura (ITP) Causes, Symptoms and Treatment. The Children’s Hospital of Philadelphia, USA. [internet].
 4. Blood. How I treat idiopathic thrombocytopenic purpura (ITP). American Society of Hematology; Washington DC, USA. [internet].
 5. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Immune Thrombocytopenia

ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా కొరకు మందులు

ఇడియోపెథిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।