పచ్చకామెర్లు - Jaundice in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

March 10, 2017

March 06, 2020

పచ్చకామెర్లు
పచ్చకామెర్లు

సారాంశం

కామెర్లు అనేది ఒక వ్యాధి, దీనిలో మొత్తం సీరం బైలిరూబిన్ (TSB) యొక్క స్థాయి 3 mg/dL కంటే ఎక్కువగా ఉంటుంది. దీని లక్షణాలు మీ చర్మం, మీ కళ్ళ యొక్క తెల్లని భాగం, మరియు శ్లేష్మ పొరలు (నోటి వంటి అంతర్గత మృదువైన అవయవాల యొక్క లైనింగ్) పసుపు రంగులో ఉంటాయి. నవజాత శిశువులు సాధారణంగా కామెర్లు కలిగి ఉంటారు, కానీ పెద్దలు కూడా బాధపడుతుంటారు. పెద్దలలో, కడుపు నొప్పి, ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం మొదలైన ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. పిల్లలలో, ఫోటో థెరపీ మరియు రక్తమార్పిడి చేయబడుతుంది, పెద్దలలో అయితే, ఇది రోగ కారకం తొలగింపు, మందులు మరియు కొన్నిసార్లు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. చికిత్స చేయకుండా వదిలివేస్తే, అది బిడ్డ యొక్క మెదడును ప్రభావితం చేస్తుంది మరియు సెప్సిస్, కాలేయం మరియు మూత్రపిండాల వ్యాధులు లేదా వైఫల్యం వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది.

బైలిరూబిన్ యొక్క జీవక్రియ

మన శరీరం కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది (RBCs) మరియు పాత వాటిని కాపాడుతుంది. ఈ ప్రక్రియలో, పాత RBC ల లోపల ఉన్న హేమోగ్లోబిన్ అనేది గ్లోబిన్, ఐరన్ మరియు బైలివర్డిన్­లుగా విడిపోతుంది. కొత్తగా హెమోగ్లోబిన్­ని ఉత్పత్తి చేయడానికి గ్లోబిన్ మరియు ఐరన్ మన ఎముక మజ్జలో తిరిగి వినియోగించబడుతున్నాయి, అయితే బైలివర్బిన్ విడిపోయి బైలిరూబిన్ అని పిలవబడే ఒక ఉప ఉత్పత్తిగా మారుతుంది. మన కాలేయం ఈ బైలిరూబిన్­ని దాని జీవక్రియ కోసం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో తయారైన బైలిరూబిన్ పిత్త వాహిక ద్వారా ప్రవహిస్తుంది మరియు ప్రేగులోకి ప్రవేశిస్తుంది. ప్రేగులు కూడా దీనిని యూరోబైలినోజెన్ మరియు స్టెర్కోబైలినోజెన్ లోకి వేరుచేస్తాయి. యూరోబైలినోజెన్ రక్త ప్రసరణ లోకి విడుదల కోసం మళ్లీ శోషించబడుతుంది, దీనిలో కొంత మన కాలేయంలోకి తిరిగి ప్రవేశిస్తుంది మరియు మిగిలినది మూత్రపిండాలు ద్వారా మూత్రంగా తొలగించబడుతుంది. స్టెర్కోబైలినోజెన్ మలం ద్వారా విసర్జించబడుతుంది.

పచ్చకామెర్లు యొక్క లక్షణాలు - Symptoms of Jaundice in Telugu

శిశువులలో

  • నవజాత లేదా శారీరక సంబంధిత కామెర్లు
    చాలావరకు, ఆరోగ్యకరమైన శిశువులలో కామెర్లు అనేది స్వల్పoగా ఉండవచ్చు లేదా ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ, మీ నవజాత శిశువు తక్కువ బరువు కలిగివుంటే లేదా సమయానికి ముందే ప్రసవం అయి ఉంటే, మీ శిశువు కామెర్లు యొక్క విలక్షణమైన లక్షణాలను చూపిస్తుంది. మీ బిడ్డ శరీరంలో ఈ లక్షణాలు కనిపించడానికి ఒక వారం వరకు సమయం పట్టవచ్చు మరియు దాదాపు మూడు వారాలు నుండి ఒక నెల వరకు అది ఉండవచ్చు. మీ శిశువు యొక్క చర్మం, నోటి లోపలి మృదువైన లైనింగ్, కళ్ళలోని తెలుపు భాగాలు, అరచేతులు మరియు అరికాళ్ళు పసుపు రంగులోకి మారుతాయి, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది, మరియు సమయoతో పాటు పాలిపోయిన రంగులో మల విసర్జన అవుతుంది. చర్మం యొక్క పసుపు రంగు మీ శిశువు యొక్క తల మరియు ముఖం నుండి ప్రారంభమవుతుంది మరియు కొన్ని రోజులలో మిగిలిన శరీర భాగాలకు వ్యాపిస్తుంది. మీ శిశువు పాలు త్రాగుటలో కూడా ఇబ్బంది ఎదుర్కోవచ్చు, బలహీనమైన మరియు నిద్రపోతున్న అనుభూతిని పొందును మరియు గట్టిగా ఏడవడం జరుగుతుంది.
  • హిమోలిటిక్ కామెర్లు
    ఒక Rh- పాజిటివ్ (Rh అంటే రీసస్ RBC లలో ప్రోటీన్ ఉన్న ప్రోటీన్. ఒక వ్యక్తి ఈ ప్రొటీన్­ను కలిగి ఉన్నట్లయితే, అతను/ఆమె Rh పాజిటివ్ అవుతారు) Rh-నెగటివ్ గల తల్లికి జన్మించిన శిశువు (ఆమె యొక్క RBCలలో Rh ప్రోటీన్ లేదు), RBC ల నాశనం అధిక మోతాదులో జరుగుతుంది. Rh- పాజిటివ్ రక్తం ఒక D- యాంటిజెన్­ను కలిగి ఉంటుంది, ఇది తల్లి యొక్క రోగనిరోధక వ్యవస్థకు ఒక ఫారిన్ బాడీ వలే పనిచేస్తుంది. తల్లి యొక్క రోగనిరోధక వ్యవస్థలో ఈ యాంటిజెన్ అనుకూలంగా ఉంటుంది మరియు యాంటీ-D ప్రతిరోధకాలు (D- యాంటిజెన్లను గుర్తించి అలాంటి RBC లను చంపే ప్రోటీన్లు) ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరోధకాలు ఆమె యొక్క ప్లాసెంటా (లేదా బొడ్డు నాబి) ను దాటి, పిండం యొక్క D-యాంటిజెన్లు కలిగిన RBC లను నాశనం చేస్తాయి. హెమోలిసిస్ సీరంలో TSB స్థాయిని పెంచుతుంది మరియు కామెర్లు ఏర్పడుటకు కారణమవుతుంది. ఈ పరిస్థితిని నవజాత లేదా ఎరిత్రోబ్లాస్టోసిస్ ఫెటలిస్ యొక్క హెమోలిటిక్ వ్యాధిగా కూడా పిలువబడుతుంది. ఈ లక్షణాలు, నవజాత శిశువులలో కనిపించే కామెర్ల లక్షణాల వలే ఉంటాయి. మీ శిశువు అనుభవించే ఇతర లక్షణాలు:
    • కడుపు నొప్పి.
    • రక్తహీనతకు దారితీసే రక్తoలోని హిమోగ్లోబిన్ యొక్క స్థాయిలో తగ్గింపు.
    • రక్త ప్రసరణ ఆగిపోవుటచే గుండె ఆగిపోవడం (గుండె ఆగిపోవుట).

పెద్దలలో

పెద్దలలో కూడా చర్మం, కళ్ళు యొక్క తెల్లని భాగం మరియు శ్లేష్మ పొర పసుపు రంగులోకి మారిపోవడం వంటి కామెర్ల యొక్క విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటారు. వీటితో పాటు, పెద్దలలో కామెర్లు యొక్క ఇతర లక్షణాలు అనగా కడుపు ఎగువ భాగంలో కుడి వైపున కడుపు నొప్పి రావడం, మరల అది వెనుక భాగంలో కుడి వైపు, కుడి భుజం, కడుపు దిగువవైపున కుడి భాగం వంటి శరీరం యొక్క ఇతర భాగాలకు వ్యాపించడంతో సహా దురద, అరచేతులు మరియు అరికాళ్ళు పాలిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జ్వరం, ముదురు పసుపు రంగులో మూత్రం మరియు లేత పసుపు రంగులో మల విసర్జన కావడం.

పచ్చకామెర్లు యొక్క చికిత్స - Treatment of Jaundice in Telugu

కామెర్లు యొక్క రకాన్ని బట్టి, దీని చికిత్స కోసం వివిధ పద్ధతులు అనుసరిస్తారు. కొన్ని చికిత్సా పద్ధతులు ఈ క్రింద వివరించబడ్డాయి:

శిశువులలో

  • నవజాత శిశువులలో వచ్చే కామెర్లు
    ​మీ శిశువు యొక్క లక్షణాలు 2-4 వారాలలో తగ్గిపోవచ్చు, కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది మరియు సామర్థ్యం పెంపొందించుకొంటుంది మరియు అదనపు బైలిరూబిన్ తయారు చేసుకోగలుగుతుంది. అయినప్పటికీ, మీ శిశువు యొక్క సీరంలో తీవ్రమైన కామెర్లు మరియు TSB స్థాయి ఎక్కువగా ఉంటే, చికిత్స అవసరమవుతుంది. చికిత్సలో ఫొటోథెరపీ, రక్త మార్పిడి మొదలైనవి.
  • ఫోటో ధెరపీ
    ఫోటో థెరపిలో, మీ శిశువు వీలైనంత ఎక్కువ కాంతి ప్రభావానికి గురవుతుంది. కాంతి మరియు ఆక్సిజన్ కలిసి ఫోటో-ఆక్సీకరణకు కారణమవుతాయి, ఇందులో బైలిరూబిన్­కు ఆక్సిజన్ జోడించబడుతుంది, తద్వారా అది నీటిలో కరిగిపోతుంది మరియు మీ శిశువు యొక్క కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేసి శరీరం నుండి బయటకు తొలగిస్తుంది. తల్లి తన శిశువుకు పాలు త్రాగించుట కోసం ప్రతీ 3-4 గంటల తర్వాత 30 నిమిషాలు పాటు చికిత్స నిలిపివేయబడుతుంది. మీ శిశువు యొక్క TSB స్థాయి 1-2 రోజుల్లో సాధారణ స్థితికి రానట్లయితే, ఫోటో థెరపీ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించవచ్చు. 
  • రక్త మార్పిడి
    ఫోటో థెరపీ అనేది సమర్థవంతమైనది కానప్పుడు మరియు మీ శిశువు యొక్క బైలిరూబిన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటే రక్త మార్పిడికి సిఫారసు చేయబడుతుంది. రక్తం సరైన దాత (అదే రక్తం గ్రూపుతో మరియు ఎలాంటి రోగాలు లేదా అంటువ్యాధులు లేని వారు) నుండి తీసుకోబడుతుంది మరియు శిశువు రక్తాన్ని నెమ్మదిగా మార్చడం జరుగుతుంది. కొత్త రక్తంలో ఎక్కువ బైలిరూబిన్ లేనట్లయిన శిశువు యొక్క సీరం బైలిరూబిన్ స్థాయి వేగంగా తగ్గిపోతుంది. ఈ ప్రక్రియ అంతటా శిశువుని పర్యవేక్షిoచాలి మరియు బైలిరూబిన్ స్థాయిని తనిఖీ చేయడానికి రక్తమార్పిడి అయిన రెండు గంటల తర్వాత కూడా పర్యవేక్షిoచాలి.
  • నవజాత శిశువు యొక్క హిమోలిటిక్ వ్యాధి (ఎరిత్రోబ్లాస్టోసిస్ఫెటాలిస్)
    స్వల్పoగా ఉన్న సందర్భాలలో సాధారణంగా ఏ చికిత్సా అవసరం లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఫోటో థెరపీతో పాటుగా, రక్త మార్పిడికి సిఫారసు చేయబడవచ్చు లేదా శిశువు యొక్క పరిస్థితిని ఇమ్యునోగ్లోబ్యులిన్స్ (శరీర రోగ నిరోధక వ్యవస్థ ఫారిన్ బాడీస్­కు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది) ఇది శిశువు యొక్క RBC లను మరింతగా విచ్ఛిన్నం కాకుండా చేస్తుంది మరియు TSB స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

పెద్దలలో
పెద్దలలో, కామెర్లు యొక్క చికిత్స అంతర్లీన కారణం మీద మరియు దాని తొలగింపుపై ఆధారపడి ఉంటుంది. కామెర్లు మరియు సంబంధిత చికిత్సలో అంతర్లీన కారణాల యొక్క ఉదాహరణలు ఇలా ఉన్నాయి:

  • రక్తహీనత
    RBC ల విచ్చిన్నతను నిరోధించడానికి మీ డాక్టర్ ఐరన్ సప్లిమెంట్లను సూచించవచ్చు
  • అంటువ్యాధి (ఉదా., హెపటైటిస్)
    యాంటివైరల్ లేదా యాంటీబయాటిక్ ఔషధాల ద్వారా దీనికి చికిత్స చేయవచ్చు
  • దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లేదా ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి వలన కాలేయo పాడవడం
    మీ వైద్యుడు మీ కాలేయ పనితీరును మెరుగుపర్చడానికి మద్యం తీసుకోవటం విడిచిపెట్టమని మరియు మరింతగా పాడవకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోమని సలహా ఇస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, ఒక కాలేయ మార్పిడి చేయవలసియన అవసరం ఉండవచ్చు
  • పిత్త వాహికలో అవరోధం కలుగట
    పిత్త వాహిక వాపు, పాంక్రియాటిక్ క్యాన్సర్, ట్యూమర్లు మొదలైన వాటి ఒత్తిడి వలన అవరోధానికి గువుతుంది. శస్త్రచికిత్స ద్వారా అవరోధం తొలగించటం జరుగుతుంది.
  • కామెర్లు కలిగించే జన్యు సంబంధిత వ్యాధులు
    చికిత్సలో కామెర్లను తగ్గించే కొరతబడ్డ కారకాలను శరీరంలోకి ద్రవరూపంలో ఎక్కించడం.

స్వీయ రక్షణ

చికిత్స వలే స్వీయ రక్షణ కూడా ముఖ్యమైనది. మితముగా, సమతుల్యముగా మరియు తక్కువ కొవ్వుగల ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ద్రవాలు, తాజా రసాలు, మందులు మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు భారీగా, స్పైసీగా మరియు అంగడిలో దొరికే ఆహారాన్ని తినకూడదని సూచించబడ్డారు. తెలియని వనరుల నుండి లభించే నీరు త్రాగవద్దు మరియు వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించాలి.



వనరులు

  1. Stillman AE. Jaundice. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 87.
  2. National Health Service [internet]. UK; Treatment Newborn jaundice
  3. p S, Glicken S, Kulig J, et al. Management of Neonatal Hyperbilirubinemia: Summary. 2002 Nov. In: AHRQ Evidence Report Summaries. Rockville (MD): Agency for Healthcare Research and Quality (US); 1998-2005. 65.
  4. Wan A, Mat Daud S, Teh SH, Choo YM, Kutty FM. Management of neonatal jaundice in primary care. Malays Fam Physician. 2016 Aug 31;11(2-3):16-19. PubMed PMID: 28461853; PubMed Central PMCID: PMC5408871.
  5. National Health Service [internet]. UK; Kernicterus
  6. National Health Service [Internet]. UK; Jaundice

పచ్చకామెర్లు కొరకు మందులు

Medicines listed below are available for పచ్చకామెర్లు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for పచ్చకామెర్లు

Number of tests are available for పచ్చకామెర్లు. We have listed commonly prescribed tests below: