గజ్జల్లో దురద - Jock Itch in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 03, 2018

March 06, 2020

గజ్జల్లో దురద
గజ్జల్లో దురద

గజ్జల్లో దురద అంటే ఏమిటి?

“గజ్జల్లో దురద” రుగ్మత అనేది గజ్జలు (లేక గజ్జ)  ప్రదేశంలోని చర్మానికి, వృషణాల మీది చర్మానికి సంభవించే ఓ బూజుకారక (fungal infection) సంక్రమణం. దీన్నే “తామర” చర్మవ్యాధి అని లేదా వైద్యపరంగా టైనియా క్రురిస్ (Tinea cruris) అని అంటారు. ఇదో సాధారణ చర్మ సంక్రమణవ్యాధి. గజ్జలు ప్రదేశంలోని చర్మానికి తీవ్రమైన బురదతో కూడిన ఈ సంక్రమణం సంభవిస్తుంది. ఈ రుగ్మత ప్రాణాంతకమైనది కాదు, కానీ పరిగణించతగ్గ అసౌకర్యం మరియు సాంఘిక సంకటాన్ని(social embarrassment) కల్గిస్తుంది.  

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గజ్జల్లో దురద రుగ్మత గజ్జ చుట్టూ ఉండే చర్మాన్ని బాధించే ఒక ఫంగల్ సంక్రమణ. అయితే, ఈ దురద జబ్బు అంతర్గత తొడలు, పిరుదులు మరియు కొన్ని సందర్భాల్లో ఉదరం వరకు వ్యాపించవచ్చు. జననాంగాలు సాధారణంగా ఈ దురద జబ్బుకు గురి కావు. ఇది అథ్లెట్లు లేదా ఊబకాయం వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. కింది సంకేతాలు మరియు లక్షణాలు గజ్జ దురదను సూచిస్తాయి:

  • గజ్జల్లో దురద రుగ్మతకు గురైన చర్మం రంగులో మార్పు, సాధారణంగా, రోగబాధిత చర్మం ఎరుపుదేలి కనిపిస్తుంది.
  • గజ్జల్లో దురద రుగ్మత దద్దుర్లు లాగా, ఆకారంలో వృత్తాకారాన్ని పోలి ఉంటుంది. (మరింత చదువు: చర్మ దద్దుర్లకు చికిత్స )
  • గాయం (దురద గాయం) యొక్క సరిహద్దులు స్పష్టంగా విభజించబడి ఉంటాయి.
  • వ్యాధిప్రభావిత ప్రాంతం యొక్క కేంద్రీకృత వలయాలలో సాధారణ చర్మం కూడా ఉండవచ్చు
  • గాయం ఉబికి ఉండడం కనిపిస్తుంది
  • దురద గాయాలు బొబ్బలతో పాటుగా ఉండవచ్చు
  • దురద మరియు అసౌకర్యం సాధారణంగా కనిపిస్తాయి
  • వ్యాయామం చేయడంవల్ల వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి

ఇది పునరావృత సంక్రమణం మరియు గతంలో గజ్జల్లో దురదతో బాధపడి ఉండినట్లయితే, భవిష్యత్తులో మళ్ళీ ఈ దురదజబ్బుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు, గజ్జల్లోనే కాకుండా ఈ దురద సంక్రమణం పాదాలకు కూడా సోకడం కనిపిస్తుంది.

గజ్జల్లో దురదకు ప్రధాన కారణాలు ఏమిటి?

ఇది బూజులవల్ల కలిగే “ఫంగల్ ఇన్ఫెక్షన్.” ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. తడిగా మరియు వెచ్చగా ఉండే చర్మం ఉపరితలంపై శిలీంధ్రాలు పెరుగుతాయి. అందువల్ల, చాలా బిగుతుగాను తడిగా ఉండే లోదుస్తులు ధరించటంవల్ల ఈవ్యాధికి కారకంగా ఉండవచ్చు. గజ్జల్లో చర్మం రాపిడికి గురయ్యే అవకాశమున్నఅధిక బరువు కల్గిన వ్యక్తులు ఈ వ్యాధిబారిన పడే ప్రమాదం ఉంది. గజ్జల్లో దురద వ్యాధిసోకిన తువ్వాళ్లు, పడకలు మొదలైన వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధి అయినందున, ఇది మీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ దురదరోగం స్త్రీల కంటే పురుషునే ఎక్కువగా బాధిస్తుంది. జాక్ దురద కలిగించే శిలీంధ్రాలు ఎపిడెర్మోఫిటన్ ఫ్లోక్కోసం మరియు ట్రిచోఫిటన్ రుబ్రం.

గజ్జల్లో దురద రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

గజ్జల్లో దురద రోగ నిర్ధారణ రోగి యొక్క వైద్య చరిత్రను ఉపయోగించి మరియు వ్యాధి సోకిన గజ్జలు ప్రదేశాన్ని పరిశీలించడం ద్వారా చేయవచ్చు. అయినప్పటికీ, వ్యాధికారక శిలీంధ్రాల రకాన్ని గుర్తించేందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH) స్లయిడ్ ను తయారు చేయబడుతుంది. దీని ద్వారా 4-6 వారాలలో శిలీంధ్రం రకాన్ని గుర్తించవచ్చు. “టినియా క్రురిస్” రకం గజ్జ దురద తేలికపాటి సంక్రమణం. దీనికి సాధారణంగా పైపూత యాంటీ ఫంగల్ మందుల్ని రోజుకు 2-3 సార్లు పూయడం జరుగుతుంది. సాధారణంగా 3-4 వారాలలో సంక్రమణ పూర్తిగా నయమవుతుంది. వ్యాధి సోకిన గజ్జ ప్రదేశాన్ని పొడిగా ఉంచడానికి మరియు మంచి పరిశుభ్రత విధానాలను నిర్వహించడానికి జాగ్రత్త తీసుకోవాలి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Jock itch.
  2. National Health Service [Internet] NHS inform; Scottish Government; Ringworm.
  3. TeensHealth. [Internet]. The Nemours Foundation, Jacksonville, Florida. Jock Itch.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Tinea Infections.
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Treatment for Ringworm.

గజ్జల్లో దురద కొరకు మందులు

Medicines listed below are available for గజ్జల్లో దురద. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.