మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి - Kidney transplant in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 05, 2018

March 06, 2020

మూత్రపిండ మార్పిడి
మూత్రపిండ మార్పిడి

మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి అంటే ఏమిటి?

మూత్రపిండ/ కిడ్నీ మార్పిడి అనేది దెబ్బతిన్న మూత్రపిండాన్ని (గ్రహీతకు) ఒక ఆరోగ్యకరమైన మూత్రపిండముతో (దాత నుండి) భర్తీ చేసే ఒక ప్రక్రియ. భారతదేశంలో మూత్రపిండ మార్పిడి అవసరమయ్యే  చివరి దశ మూత్రపిండ వ్యాధి (ESRD, End-stage renal disease) రోగులు ఒక మిలియన్ జనాభాకు 151-232 మందిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం 2 మిలియన్ల మందికి మూత్రపిండ మార్పిడి మరియు డయాలసిస్ విధానాలు అవసరం అవుతున్నాయని నివేదించబడింది.

ఇది ఎందుకు జరుగుతుంది?

చివరి దశ మూత్రపిండ వ్యాధి (ESRD) రోగులలో మూత్రపిండాల పనితీరును పునరుద్ధరించడానికి ఆరోగ్యకరమైన దాత యొక్క మూత్రపిండంతో మూత్రపిండ/కిడ్నీ మార్పిడి అవసరమవుతుంది. కిడ్నీ మార్పిడి ప్రధానంగా చివరి దశ మూత్రపిండ వ్యాధి (ESRD) ఉన్న వ్యక్తులలో సూచించబడుతుంది. మార్పిడి యొక్క అవసరాన్ని గుర్తించడంలో సహాయపడే ముఖ్య లక్షణాలు:

ఎవరికి అవసరం?

చికిత్స చేయకుండా విడిచిపెట్టిన కొన్ని సమస్యలు చివరకు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి మరియు వాటికి తక్షణమే మూత్రపిండ మార్పిడి అవసరం కావచ్చు, అవి:

  • మందులు వాడుతున్నప్పటికీ నియంత్రణలో లేని రక్తపోటు పెరుగుదల
  • మందులు వాడుతున్నప్పటికీ నియంత్రణలో లేని రక్త గ్లూకోస్ స్థాయిలు (మరింత సమాచారం: మధుమేహా నివారణ)
  • పాలిసిస్టిక్ మూత్రపిండ వ్యాధి (Polycystic kidney disease)
  • అధిక రక్తపోటు కారణంగా నెఫిరోస్లెరోసిస్ (ఒక రకమైన మూత్రపిండ రుగ్మత, మూత్రపిండాల అర్టరీలు గట్టిపడి మూత్రపిండాలకు రక్తసరఫరా తగ్గించే ఒక వ్యాధి)
  • గ్లామెరులోనెఫ్రైటిస్ (glomerulonephritis) వంటి గ్లూమెరులర్ వ్యాధులు (కిడ్నీ వ్యాధుల రకం)
  • ప్రత్యేకంగా మూత్రపిండాల వ్యాధులను కలిగించే రక్తనాళ సమస్యలు

ఇది ఎలా జరుగుతుంది?

బ్రతికి ఉన్న దాత నుండి లేదా మరణించిన వ్యక్తి/దాత  నుండి మూత్రపిండాలను తీసుకోవడం ద్వారా కిడ్నీ మార్పిడి జరుగుతుంది. సరిపోని మార్పిడిని (mismatch) నివారించడానికి దాత మరియు గ్రహీత మధ్య అనుకూలతను తనిఖీ చేయడానికి రక్తం రకం (Blood type) పరీక్షించబడుతుంది. ఈ ప్రక్రియను అనస్థీషియా ప్రభావంతో (ఉపయోగించి) నిర్వహిస్తారు. పూర్తి ప్రక్రియ 2-4 గంటల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. ప్రక్రియ సజావుగా జరుగడానికి, సమస్యల పట్ల జాగ్రత్త తీసుకోవాలి/వహించాలి.

ప్రక్రియ తర్వాత, గ్రహీత కడుపులో దాత మూత్రపిండాల యొక్క సమానతను నిర్వహించడానికి, స్టెరాయిడ్స్ వంటి తిరస్కరణ వ్యతిరేక (anti-rejection) మందులు అవయవ తిరస్కరణను నివారించడానికి ఇవ్వవచ్చు.

విజయవంతమైన మూత్రపిండ మార్పిడి తరువాత, రోగికి సాధారణంగా పెరిటోనియాల్ (peritoneal) లేదా హిమోడయాలసిస్ (haemodialysis) లతో చికిత్స అవసరం ఉండదు. అయితే, మార్పిడి విఫలమయిన సందర్భాలలో, రోగులకు మళ్ళీ డయాలసిస్ అవసరం ఉంటుంది.



వనరులు

  1. National Kidney Foundation. GLOBAL FACTS: ABOUT KIDNEY DISEASE. New York; [Internet]
  2. Sunil Shroff. Current trends in kidney transplantation in India. Indian J Urol. 2016 Jul-Sep; 32(3): 173–174. PMID: 27555672
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Kidney Transplant
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Kidney Transplantation
  5. G. Garcia-Garcia et al. The global role of kidney transplantation. Indian J Nephrol. 2012 Mar-Apr; 22(2): 77–82. PMID: 22787305

మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి కొరకు మందులు

Medicines listed below are available for మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.