స్థానిక మత్తుమందు (లోకల్ అనస్థీషియా) - Local Anesthesia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 03, 2019

March 06, 2020

స్థానిక మత్తుమందు
స్థానిక మత్తుమందు

స్థానిక అనస్థీషియా (లోకల్ అనస్థీషియా) అంటే ఏమిటి?

స్థానిక అనస్థీషియా అనేది శరీరంలో ఎక్కడైనా ఒక చిన్న స్థిరమైన భాగంలో తిమ్మిరిని ఉత్పత్తి చేయడానికి నిర్వహించే ఓ సాధారణమైన వైద్య విధానం. చర్య యొక్క యంత్రాంగం పరిధీయ నరాలలో ప్రసరణను నిరోధించడం లేదా నరాల ముగింపులోని ఉత్తేజాన్ని అణచిపెట్టడం, తద్వారా జ్ఞానాన్ని (స్పర్శజ్ఞానం) పోగొట్టడం.

మత్తుమందు ఇవ్వడమనేది ఎందుకు జరుగుతుంది?

క్రింది కారణాలకుగాను మన శరీరంలోని ఓ చిన్న భాగానికి తిమ్మిరెక్కించడానికి మత్తుమందును (అనస్థీషియా) మన శరీరంలోని ఓ చిన్న ప్రదేశానికి లేదా భాగానికి  ఉపయోగిస్తారు:

 • మీరు మెలుకువగా ఉన్నప్పుడే నొప్పిరహిత శస్త్రచికిత్సను మీకు నిర్వహించడానికి, అలా శస్త్ర చికిత్స జరిగేటప్పుడు మీరు ప్రశాంతతతో ఉండి అసౌకర్యాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి మత్తుమందిస్తారు.
 • ప్రసవ సమయంలో కలిగే వేదన, నొప్పి, గడ్డలు, పూతలు, ఆకస్మిక గాయాల నొప్పి నుండి ఉపశమనం కల్పించేందుకు మత్తు మందిస్తారు.
 • నరాలకు తేలికగా మత్తు మందును వాడేందుకు వీలున్నప్పుడు స్థానిక మత్తుమందులను స్ప్రేలు, ఆయింట్మెంట్లు, లేదా సూది మందుల రూపంలో ఉపయోగించబడతాయి.

మత్తు మందు ఎవరికి అవసరం అవుతుంది?

కొన్ని శస్త్రచికిత్సా విధానాలలో చికిత్స పొందుతున్న రోగులకు స్థానిక అనస్థీషియా అవసరం వస్తుంది:

 • జ్ఞాన దంతాలు లేదా తీవ్రంగా దెబ్బ తిన్న దంతాలను తొలగించేందుకు లేదా లోతుగా పుచ్చిన లేదా పుప్పిపట్టిన దంతాల పునరుద్ధరణకు మత్తు మందిస్తారు.
 • కంటిశుక్లం శస్త్రచికిత్సలు లేదా ఇతర రకాల కంటి శస్త్రచికిత్సలకు మత్తు మందిస్తారు.
 • మచ్చలు (మోల్స్) లేదా పులిపిర్లు, మొటిమలను తొలగించే చిన్న శస్త్రచికిత్సలకు మత్తుమందిస్తారు.
 • జీవాణుపరీక్ష మరియు ఆంజియోగ్రఫీ వంటి పరిశోధనలలో మత్తుమందిస్తారు.
 • మెదడు శస్త్రచికిత్సలో మాదిరిగానే, రోగి మేల్కొని ఉండాల్సిన శస్త్రచికిత్సలు జరిపేటపుడు (రోగికి) మత్తు మందిస్తారు.
 • సాధారణ అనస్థీషియా కింద చేసిన ఒక పెద్ద శస్త్రచికిత్స అనంతరం స్వస్థత చేకూరే సమయంలోనూ స్థానిక మత్తు మందు ఉపయోగిస్తారు.

మత్తు మందు ఇవ్వడమనేది ఎలా జరుగుతుంది?

స్థానిక అనస్థీషియాను నిర్వహించే పలు పద్ధతులు ఉన్నాయి:

 • పైపూత (topical)గా స్థానిక అనస్థీషియా
  శరీరంలోని ఏభాగానికి మత్తు (తిమ్మెర)ను కల్పించాలో ఆ భాగానికి చర్మం ఉపరితలంపై మత్తుమందును (అనస్థీషియా) ఇవ్వడం జరుగుతుంది. జెల్, క్రీమ్, స్ప్రే లేదా పాచ్ రూపంలో స్థానిక మత్తుమందును ఉపయోగిస్తారు.
 • ఉప-చర్మసంబంధమైన స్థానిక అనస్థీషియా
  మత్తును ఏభాగానికి కల్గించాలో అక్కడ రక్తం సరఫరా చేసే నరాలకు (చర్మం మరియు పొర ఉపరితలం క్రింద) మత్తు ఇంజక్షన్ ను ఇస్తారు.
 • ప్రాంతీయ అనస్థీషియా
  ప్రాంతీయ అనేస్తేషియా (మత్తుమందు) ప్రక్రియ మరింత సాధారణమైన అనస్తీషియా రూపాన్ని అందిస్తుంది మరియు క్రింది రకాలను కలిగి ఉంటుంది:
  • ఎపిడ్యూరల్ అనస్థీషియా 
   ఒక స్థానిక మత్తుమందును వెన్నుపూసను రక్షించే ద్రవంతో నిండిన తిత్తి పరిసరాల్లోకి ప్రవేశపెట్టబడుతుంది. ఇది ప్రధానంగా దిగువ పొత్తికడుపు మరియు కింది భాగంలోని అవయవాలకు చేసే శస్త్రచికిత్సలలో ఉపయోగించబడుతుంది.
  • వెన్నెముక అనస్థీషియా
   ఒక స్థానిక మత్తుమందు వెన్నెముక చుట్టూ ద్రవంతో నింపబడిన తిత్తిలోకి చొచ్చుకుపోతుంది, తద్వారా ఆ ప్రాంతానికి తిమ్మెరను కల్గిస్తుంది.
  • పెరిఫెరల్ నెర్వ్ బ్లాక్ అనస్థీషియా
   నరాల మరియు దాని శాఖల ద్వారా సరఫరా చేయబడిన మరియు ఉద్దీపన చేయబడిన నిర్దిష్ట ప్రాంతాలకు తిమ్మెరను కల్గించేందుకు ప్రధాన నరాల (ట్రంక్ యొక్క) ప్రాంతంలో స్థానిక మత్తుమందును ఇవ్వడం జరుగుతుంది.వనరులు

 1. American Pregnancy Association. Local Anesthesia. [Internet]
 2. Department of Health. Local anaesthetic. The State of Queensland; [Internet]
 3. American Society of Anesthesiologists. Local Anesthesia. U.K; [Internet]
 4. Radiological Society of North America. Anesthesia Safety. America; [Internet]
 5. National Health Service [Internet]. UK; Local anaesthesia

స్థానిక మత్తుమందు (లోకల్ అనస్థీషియా) కొరకు మందులు

స్థానిక మత్తుమందు (లోకల్ అనస్థీషియా) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।