మాస్టోసైటోసిస్ - Mastocytosis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 05, 2018

March 06, 2020

మాస్టోసైటోసిస్
మాస్టోసైటోసిస్

మాస్టోసైటోసిస్ అంటే ఏమిటి?

ప్లీహము, కణజాలము లేదా ఎముక మజ్జ వంటి చర్మం లేదా అంతర్గత అవయవాలలో అధిక మోతాదులో కూపక కణాలు (mast cells) చేరడాన్ని “మాస్టోసైటోసిస్” అంటారు. కూపక కణాలు (మాస్ట్ సెల్స్) కొన్ని ఎముకల యొక్క ఖాళీ కేంద్రాలలో ఉత్పత్తి చేయబడతాయి మరియు అంటువ్యాధులకు ప్రతిస్పందనగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడానికి ఈ కణాలు బాధ్యత వహిస్తాయి. అయితే, మాస్టోసైటోసిస్ రుగ్మత (డిజార్డర్) ఉన్న వ్యక్తిలో, మాస్ట్ కణాలు అసంబద్ధంగా సక్రియం అవుతాయి లేదా అధిక సంఖ్యలో పెరిగి శరీరంలో గుమిగూడి తద్వారా మాస్టోసైటోసిస్ రుగ్మతకు కారణమవుతాయి.

మస్స్టోసైటోసిస్ రెండు రకాలు:

  • చర్మసంబంధమైన మాస్టోసైటోసిస్: ఈ రకంలో, చర్మం ప్రభావితమవుతుంది. ఇది సాధారణంగా పిల్లల్లో గమనించవచ్చు.
  • దైహిక మాస్టోసైటోసిస్: ఒకటి కంటే ఎక్కువ అవయవాలను దెబ్బతీస్తుందిది, మరియు ఈ రకమైన రుగ్మతను సాధారణంగా పెద్దలలో గమనించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మాస్టోసైటోసిస్ వ్యాధిలక్షణాలు ఈ రుగ్మత ఏ అవయవానికి సోకిందనే దానిపై ఆధారపడి ఉంటాయి. మాస్టోసైటోసిస్ రకాన్ని బట్టి క్రింది లక్షణాలను గమనించవచ్చు:

  • చర్మసంబంధ (క్యుటేనియస్) మాస్టోసైటోసిస్: అసాధారణమైన పెరుగుదల మరియు కొన్నిసార్లు చర్మంపై బొబ్బలు, శరీరం అంతటా వ్యాప్తి చెందుతుంది.
  • సిస్టమిక్ మాస్టోసైటోసిస్: కొందరు వ్యక్తులు 15-30 నిమిషాల తీవ్ర లక్షణాలను ఎదుర్కొంటారు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మాస్టోసైటోసిస్ యొక్క కారణాలు ఇంకా తెలియవు, కానీ జన్యు మార్పులు మరియు జన్యు పరివర్తనలు రుగ్మతతో పాత్రను పోషిస్తాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మాస్టోసైటోసిస్ వ్యాధి నిర్ధారణ క్రింది విధంగా ఉంటుంది:

  • చర్మగత మాస్టోసైటోసిస్: చర్మము యొక్క దైహిక పరీక్ష రోగనిర్ధారణలో మొదటి అడుగు. చర్మవ్యాధి నిపుణుడు ఎర్రబడడం, వాపు మరియు దురదను తనిఖీ చేయటానికి వ్యాధిప్రభావితమైన ప్రదేశాన్ని రుద్దుతాడు. చర్మం బయాప్సీ (జీవానుపరీక్ష) రోగ నిర్ధారణ చేస్తుంది.
  • సిస్టమిక్ మాస్టోసైటోసిస్: దీన్ని గుర్తించేందుకు కింద పేర్కొన్న బహుళ పరీక్షలను కలిగి ఉంటుంది:
    • రక్త పరీక్షలు: రక్తంలో మొత్తం బ్లడ్ కౌంట్ మరియు ట్రీప్టాస్ స్థాయిల తనిఖీకి
    • ద్వంద్వ-శక్తి X- రే అబ్సార్ప్టియోమెట్రీ (DEXA) స్కాన్: ఎముక సాంద్రత కొలిచేందుకు
    • అల్ట్రాసౌండ్ స్కాన్: ప్లీహము మరియు కాలేయము యొక్క విస్తరణ వంటి భౌతిక మార్పులను పరిశీలించుటకు
    • ఎముక మజ్జ బయాప్సీ: రోగనిర్ధారణను ఖాయపరిచేందుకు

ఈ రుగ్మత పరిస్థితికి ఎటువంటి నివారణ అందుబాటులో లేనప్పటికీ, లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు వాంఛనీయ రక్షణ (optimum care) సహాయపడుతుంది. చికిత్స మాస్టోసైటోసిస్ రకం మరియు ఆ రుగ్మతపరిస్థితి యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

  • చర్మగత మాస్టోసైటోసిస్ (కటానిస్ మాస్టోసైటోసిస్): పైపూతగా ఉపయోగించే  స్టెరాయిడ్ క్రీమ్ మరియు యాంటి అలర్జీ మందులు చర్మసంబంధ మాస్టోసైటోసిస్ లక్షణాలను ఉపశమనం చేస్తాయి.
  • దైహిక మాస్టోసైటోసిస్: సంబంధిత రక్త రుగ్మతకు చికిత్స చేయడం ద్వారా దైహిక మాస్టోసైటోసిస్ యొక్క లక్షణాలను తగ్గించొచ్చు.



వనరులు

  1. Cleveland Clinic. [Internet]. Euclid Avenue, Cleveland, Ohio, United States; Mastocytosis.
  2. National Health Service [Internet] NHS inform; Scottish Government; Overview - Mastocytosis.
  3. National Organization for Rare Disorders. [Internet]. Danbury; Mastocytosis.
  4. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Systemic mastocytosis.
  5. National Center for Advancing and Translational Sciences. [Internet]. U.S. Department of Health and Human Services; Mastocytosis.