ముక్కులోనుండి రక్తస్రావం - Nosebleed in Telugu

Dr. Abhishek GuptaMBBS

June 07, 2019

ముక్కులోనుండి రక్తస్రావం
ముక్కులోనుండి రక్తస్రావం

సారాంశం

ముక్కు నుండి రక్తము కారడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. ఇది సాధారణంగా ప్రమాదకరమైనది కాదు మరియు చాలా మందిలో మరింత తీవ్రమైన పరిస్థితి కాదు. ఇది పిల్లలలో మరియు 50 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తుల్లో సాధారణంగా ఉంటుంది. హేమోఫిలియా వంటి రక్తస్రావం మరియు గడ్డ కట్టిన లోపాలు ఉన్నవారిలో తప్ప, ముక్కులో రక్తం కారడం అనేది యుక్తవయస్సు తర్వాత చాలా అరుదుగా కనిపిస్తుంది. ముక్కు నుండి రక్తం కారడం అనేది సాధారణంగా ముక్కు చివర (ముందరి ప్రాంతం) దగ్గరి ముక్కు లోపలి నుండి వస్తుంది.

ముక్కు ఎండిపోవడం; శీతాకాలం వంటి చల్లని పొడి గాలికి బహిర్గతం; తరచుగా ముక్కు పీల్చడం ద్వారా కలిగిన గాయం, ముఖ్యంగా పిల్లల్లో; గాయం; సైనసిటిస్; మరియు నాసల్ పాలిప్స్ (ముక్కు లోపల కండరపు ముద్ద) అనేవి ముక్కు నుండి రక్తము కారడం యొక్క కొన్ని సాధారణ కారణాలు. అధిక రక్తపోటు; కణితి, ముక్కు లోపల విభజన గోడలో అసాధారణత (ఉదాహరణకు: నాసికా సెపల్ట్ లోపం); ఎముక వైకల్యం; హేమోఫిలియా A మరియు B వంటి రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన  జన్యుపరమైన వారసత్వ లోపాలు, మరియు వాన్ విల్లబ్రాండ్ వ్యాధి కలిగి ఉన్న తక్షణ వైద్య చికిత్సకు అవసరమైన ఇతర తక్కువ సాధారణ, దైహిక లేదా లోతుగా పాతుకుపోయిన కారణాలు. వంశానుగత హెమోర్రేజిక్ టెలాంగీటిసియా అని పిలవబడే ఇతర అరుదైన జన్యు పరిస్థితి (స్వల్ప గాయానికి రక్తస్రావం జరగడానికి సున్నితమైన రక్త నాళాలు) ముక్కు నుండి రక్తం కారడంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. తగ్గిన స్థితిస్థాపకత లేదా రక్త నాళాల గోడలలో మంటతో కొన్ని పరిస్థితులు ముక్కు నుండి రక్తం కారడంతో ఉంటాయి (ఉదాహరణకు ధమనికాఠిన్యం, కొల్లాజెన్ డిజార్డర్). 

గాయంతో సంబంధం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం అనేది సాధారణంగా నొప్పిలేనిది. అధిక రక్తపోటు, రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం లేదా గాయం కారణంగా ముక్కు నుండి రక్తం రావడం సంభవించినప్పుడు తలనొప్పి, నొప్పి మరియు ఇతర లక్షణాలు ఉండవచ్చు. ఒక ఖచ్చితమైన కారణం లేకుండా ఎక్కువ మంది ముక్కు నుండి రక్తం కారే వారికి మందులు అవసరం లేదు మరియు సంప్రదాయ చికిత్సతో మాత్రమే పరిష్కరించవచ్చు. వైద్యులు సాధారణంగా ముక్కును గిల్లడం (ముక్కు దూలములు క్రింద), నాసికా ప్యాక్లు, మరియు సెలైన్ సొల్యూషన్ల ద్వారా ఒత్తిడిని ఉపయోగించి ముక్కు నుండి రక్తం కారడాన్ని నిర్వహిస్తారు. రక్తస్రావం ఆపడానికి నాసికా ప్యాకింగ్ మరియు ఇతర సంప్రదాయ చికిత్స చర్యలు విఫలం అయినప్పుడు రక్త స్రావాన్ని ఆపేందుకు కండరాన్ని ఘనీభవింపచేస్తారు. అంతర్లీన కారణాలను చికిత్స చేయడానికి ఒక ప్రత్యేక కారణం వలన ముక్కు నుండి రక్తము కారుటకు మందులు అవసరం (ఉదాహరణకు అధిక రక్తపోటు). వైద్యపరమైన మరియు సాంప్రదాయిక చికిత్సలు చేసిన తర్వాత ముక్కు నుండి రక్తం కారడం అనేది విఫలం అయినప్పుడు మరియు ముక్కుకు రక్తం సరఫరా చేసే పెద్ద ధమనుల నుండి రక్తస్రావం సంభవించినప్పుడు శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది.

ముక్కులోనుండి రక్తస్రావం యొక్క చికిత్స - Treatment of Nosebleed in Telugu

ముక్కు నుండి రక్తం కారడానికి సంబంధించిన చికిత్సలో రక్తస్రావం నియంత్రించటం తరువాత అంతర్లీన కారణం యొక్క చికిత్స చేరి ఉంటుంది.

రక్తస్రావ నియంత్రణ

ముక్కు నుండి రక్తస్రావం అనేది వైద్య సహాయం తీసుకోవడానికి ముందు ఇంట్లో తీసుకున్న కొద్దిపాటి దశలతో సాధారణంగా నిలిచిపోతుంది. నేరుగా కూర్చున్నప్పుడు ముక్కు కొనను 5 నుండి 10 నిమిషాల వరకు గిల్లడం ద్వారా ఉపయోగించే ఒత్తిడి ఇందులో ఉంటాయి. గాలి-పైపులోకి తిరిగి రక్తం ప్రవహించవచ్చు గనుక కూర్చున్నప్పుడు తలను వెనక్కి వంచకూడదు. ముక్కును 20 నిముషాలు గిల్లిన తర్వాత రక్తస్రావం ఆగిపోకపోతే వైద్య సహాయం అవసరం. అదనంగా, ముక్కుపై ఐస్ ప్యాక్ ను ఉంచడం కూడా రక్తస్రావం నియంత్రించడంలో సహాయపడుతుంది.

మునుపటి చర్యలు రక్తస్రావం ఆపడానికి విఫలమైతే వైద్యుడి ద్వారా క్రింది చర్యలు తీసుకోవచ్చు:

  • ఎపినాఫ్రిన్ ద్రావణం (రక్త నాళాలు సంకోచనంకు కారణమయ్యే ఒక వాసోకాన్టిక్టర్) మరియు అనస్థెటిక్ ఏజెంట్ (లిడోకైన్) తో ఒక పత్తి వలగుడ్డను (వైద్య డ్రెస్సింగ్ కోసం ఉపయోగించే పత్తి పీచులతో చేసిన మంచి వస్త్రం) రక్తస్రావం జరిగే స్థానంలో ఒత్తిడి ఉపయోగించి ఉంచాలి. ప్రత్యామ్నాయంగా, ఒక శోషించదగిన జెలాటైన్ ఫోమ్ లేదా ఆక్సిడైస్ సెల్యులోజ్ ను రక్తస్రావాన్ని ఆపడానికి నాసికా కుహరం ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తారు. ముందు నుండి రక్తం కారే చాలా సందర్భాల్లో ఇది రక్తస్రావాన్ని  నిలిపివేస్తుంది.
  • సిల్వర్ నైట్రేట్ అని పిలవబడే రసాయనాన్ని రక్తస్రావం జరిగే ప్రాంతాన్నిమూసి రక్తస్రావం ఆపడానికి వర్తించబడుతుంది. ఈ పద్దతిని రసాయన వాతపెట్టుట అంటారు.
  • పైన పేర్కొన్న చర్యలు రక్తస్రావం ఆపడానికి విఫలమైనప్పుడు ఒక నాసికా ప్యాకింగ్ ను నిర్వహిస్తారు. ఇందులో, ఒక రిబ్బన్ గుడ్డను పెట్రోలియం జెల్లీ లేదా యాంటీ బ్యాక్టీరియా లేపనంతో నానబెడతారు మరియు నాసికా కుహరాన్ని నింపడానికి పొరల రూపంలో ముక్కు లోపల ఉంచుతారు.బాగా ఏర్పడిన గుడ్డ ఏర్పాటు చేయబడిందని మరియు రక్తస్రావం పూర్తిగా నిలిపివేయబడిందని నిర్ధారించడానికి గట్టిగా నొక్కిన నాసికా ప్యాక్ మూడు నుంచి ఐదు రోజుల పాటు ముక్కు లోపల ఉంచబడుతుంది.
  • ఇదే రకమైన నాసికా ప్యాక్ ను కాథెటర్ ఉపయోగించి అన్నవాహికలో ఉంచవచ్చు.
  • ముక్కు వెనుకభాగంలో రక్తస్రావం ఆపడానికి ప్రత్యేకమైన బెలూన్ పరికరాలను ఉపయోగించవచ్చు.
  • నొప్పి మరియు ఇతర అసౌకర్య లక్షణాలను తగ్గించడానికి ముక్కు వెనుక భాగంలో నిరంతరంగా వేడి నీటిని పంపించవచ్చు.
  • పెద్ద రక్త నాళాల (అంతర్గత దవడ ఎముక లేదా ఎత్మోయిడల్ ధమని) నుండి రక్తస్రావం నిర్ధారించిన తర్వాత శస్త్రచికిత్స చేయబడుతుంది. శస్త్రచికిత్స విధానాలలో ధమని బంధనం (రక్త ప్రవాహాన్ని ఆపడానికి ధమనిని ముడివేయడం) మరియు ఆంజియోగ్రాఫిక్ ధమని ఎంబోలాసియేషన్ (ధమని లోపల గుడ్డ లేదా ప్రత్యేకమైన చిన్న రేణువులను చేర్చడం ద్వారా ధమని లోపల రక్త ప్రవాహాన్ని ఆపడం) ఉన్నాయి.
  • హేమరేజిక్ టాలాంగీటిసియా వంటి నయం కాని జన్యు రక్తస్రావ వ్యాధులలో నొప్పిని తగ్గించడానికి లేజర్ చికిత్స, ఈస్ట్రోజెన్ థెరపీ, ఎంబోలైజేషన్, మరియు సెప్టోడర్మటోప్లాస్టీ (నాసికా రంధ్రంపై శ్లేష్మ పొరను అంటుకట్టుట) నిర్వహించబడవచ్చు.
  • దైహిక కారణాల కోసం చికిత్స
    • ముక్కు నుండి రక్తం కారడానికి కారణమయ్యే అధిక రక్తపోటును చికిత్స చేయడానికి సరైన మందులు.
    • అలెర్జీలను చికిత్స చేయడానికి యాంటిహిస్టామైన్లు మరియు ఇతర ప్రతికూల అలెర్జీ మందులు.
    • సైనస్ లో సంక్రమణను తొలగించడంలో తగిన యాంటీబయాటిక్లు సహాయపడతాయి.

జీవనశైలి నిర్వహణ

ఎక్కువమంది ప్రజలలో ముక్కులో నుండి రక్తం రావడాన్ని నిర్వహించడం సులభం. స్థానిక గాయం కారణంగా లేదా మొదటిసారి ముక్కు నుండి రక్తస్రావం రావడానికి చికిత్స కోసం పరిశోధనలు మరియు ఆసుపత్రిలో చేరడం అవసరం లేదు. ఇవి స్వీయ-సంరక్షణ తో ఇంట్లోనే సులభంగా నిర్వహించబడతాయి. అయితే, క్రింద తెలిపినవి ఏవైనా ఉంటే వైద్యుడిని సంప్రదించడం అవసరం:

  • ముక్కుపై ఒత్తిడి (ముక్కు గిల్లడం) ఉంచిన తర్వాత ముక్క నుండి రక్తస్రావం ఆగదు మరియు 20 నిమిషాల వరకు కొనసాగుతుంది.
  • ముక్కు నుండి రక్తం కారుటంతో రక్తం లేదా ముదురు రంగు వాంతి కనిపిస్తుంది.
  • మైకము, పాలిపోవడం, నీరసం, శ్వాసలో ఇబ్బంది, మరియు తలనొప్పితో మీరు ముక్కు నుండి రక్తం కారడాన్ని అనుభవిస్తారు.
  • ముక్కు నుండి రక్తం కారడం ఆగిపోతుంది మరియు తరచుగా కనిపిస్తుంది.
  • ముక్కు నుండి రక్తం కారడం 2 ఏళ్ల లోపు పిల్లలో కనిపిస్తుంది.

పునరావృతంగా ముక్కు నుండి రక్తం కారే నిర్వహణలో సహాయపడే కొన్ని పద్ధతుల్లో క్రింద తెలిపినవి ఉన్నాయి:

  • ముఖ్యంగా మీరు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ముక్కు నుండి రక్తం కారే సందర్భంలో ఒక కార్య ప్రణాళికను సిద్ధం చేసుకోండి. రక్తస్రావాన్ని నియంత్రించడానికి ఉపయోగించగలిగే క్లాంప్స్, శుభ్రమైన వస్త్రం తొడుగులను తీసుకెళ్లండి.
  • ఇంట్లో ఐస్ ప్యాక్ ను సిద్ధంగా ఉంచుకోండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ముక్కు నుండి రక్తం కారే సమయంలో దాన్ని ముక్కుపై పెట్టుకోవచ్చు.
  • ముక్కులోకి సులభంగా చొప్పించగల చిన్న వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచండి.
  • వారి ముక్కును గట్టిగా లాగకుండా లేదా కొట్టకుండా పిల్లలకు శిక్షణ ఇవ్వండి అది ముక్కులో నుండి రక్తం రావడానికి కారణం కావచ్చు.
  • బలమైన వాటికి బదులుగా ఆధునిక వ్యాయామాలను ఎంచుకోండి.
  • మళ్ళీ మళ్ళీ ముక్కు నుండి రక్తస్రావం వచ్చేవారు వారి ఇళ్లలో ఒక చల్లని మరియు తేమతో కూడిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి.


వనరులు

  1. Adil Fatakia, Ryan Winters, Ronald G. Amedee. Epistaxis: A Common Problem. Ochsner J. 2010 Fall; 10(3): 176–178. PMID: 21603374
  2. Tabassom A, Cho JJ. Epistaxis (Nose Bleed). [Updated 2019 Jan 30]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  3. National Health Service [Internet]. UK; Nosebleed.
  4. Am Fam Physician. 2005 Jan 15;71(2):305-311. [Internet] American Academy of Family Physicians; Management of Epistaxis.
  5. Abrich V, Brozek A, Boyle TR, Chyou PH, Yale SH. Risk factors for recurrent spontaneous epistaxis.. Mayo Clin Proc. 2014 Dec;89(12):1636-43. PMID: 25458126
  6. National Health Service [internet]. UK; https://www.ouh.nhs.uk/patient-guide/leaflets/files/11490Pnosebleeds.pdf
  7. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; Nosebleeds
  8. National Hemophilia Foundation. Nosebleed. New York [Internet]
  9. Mr Gerald W McGarry. Nosebleeds in children. BMJ Clin Evid. 2008; 2008: 0311. PMID: 19450311

ముక్కులోనుండి రక్తస్రావం కొరకు మందులు

Medicines listed below are available for ముక్కులోనుండి రక్తస్రావం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.