పరాన్నజీవుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) - Parasitic Infections in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 23, 2018

March 06, 2020

పరాన్నజీవుల సంక్రమణలు
పరాన్నజీవుల సంక్రమణలు

పరాన్నజీవుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) అంటే ఏమిటి?

వివరణ ప్రకారం, పరాన్నజీవి అనేది ఒక వేరే జాతికి చెందిన జీవి మీద లేదా లోపల (దాని హోస్ట్ [host]) నివసిస్తుంది మరియు వాటి నుండి పోషణను/పోషకాలను పొందుతుంది లేదా గ్రహిస్తుంది.

హోస్ట్ శరీరంలో అంటువ్యాధులకు ఈ  పరాన్నజీవులు కారణమవుతాయి, మరియు ఈ ఇన్ఫెక్షన్లను/సంక్రమణలను పరాన్నజీవుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) అని పిలుస్తారు. అనేక రకాలైన పరాన్నజీవులు, ఏకకణ (unicellular) నుండి బహుకణ (multicellular) రకాల వరకు ఉన్నాయి. అవి మానవులలో సంక్రమణలకు కారణమవుతాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పరాన్నజీవులు శరీరం యొక్క ఏ భాగంలోనైనా అంటువ్యాధులకు కారణం కావచ్చు. జీవి రకం మరియు సంక్రమణ యొక్క మార్గం మీద ఆధారపడి, సంకేతాలు మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి, అవి ప్రధానంగా వీటిని కలిగి ఉంటాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే కొన్ని పరాన్నజీవులు ప్రోటోజోవా (protozoa, ఏకకణ జీవులు) మరియు హెల్మిన్త్స్ (helminths, పాముల వంటి చిన్న పురుగులు).
 • వివిధ మార్గాల ద్వారా పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించవచ్చు. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం అనేది మానవులలో సంక్రమణ కలిగే అతి సాధారణమైన మార్గం.
 • ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధాలు కూడా సంక్రమణకు కారణమవుతాయి.
 • వ్యాధి సోకిన రక్తం మరియు కలుషితమైన దుస్తులు లేదా గృహ వస్తువులకు బహిర్గతం/గురికావడం కూడా ఈ సంక్రమణలకు కారణం కావచ్చు.
 • పరిశుభ్రతలేని, రద్దీగా ఉండే ప్రదేశాలలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి.
 • అభివృద్ధి చెందని దేశాలకు చెందిన వలసదారులు మరియు తరచూ ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ సంక్రమణల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 • దోమలు మరియు ఇతర కీటకాలు కూడా మానవులలో వ్యాధులను కలిగించవచ్చు, ఉదాహరణకు మలేరియా.
 • కొన్ని ఇతర సమస్యల కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులలో కూడా సంక్రమణను అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్, హెచ్ఐవి (HIV) మరియు మధుమేహం వంటి సమస్యలు కొన్ని ఉదాహరణలు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

 • ఒక వ్యక్తి శరీరంలో ఒక సంక్రమణ ఉన్నప్పుడు, రక్త పరీక్షలో రక్త కణాల సంఖ్య మరియు సంక్రమణ యొక్క ఇతర సూచికల సంఖ్యలలో మార్పు కనిపిస్తుంది.
 • అదనంగా, మూత్రం మరియు మలం నమూనాలను కూడా సేకరించి మరియు పరాన్నజీవుల ఉనికి కోసం మైక్రోస్కోప్ ద్వారా పరీక్షించవచ్చు.
 • ఇమేజింగ్ పరీక్షలు అంతర్గత అవయవాలు లేదా కణజాలాలకు ఏవైనా హాని  కలిగితే వాటిని తనిఖీ చేయడంలో సహాయం చేస్తాయి. వీటిలో ఎక్స్-రేలు, సిటి (CT) స్కాన్లు, అల్ట్రాసౌండ్లు మరియు ఎంఆర్ఐ (MRI) ఉంటాయి.
 • జీర్ణశయాంతర ప్రేగు యొక్క ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి, ఒక ఎండోస్కోపీ లేదా కొలోనోస్కోపీని నిర్వహించవచ్చు.

ఇన్ఫెక్షన్ల/సంక్రమణల చికిత్స కోసం మందులు ముఖ్యమైనవి. ఆవి:

 • పరాన్నజీవిని నిర్మూలించడానికి నిర్దిష్ట యాంటీమైక్రోబియాల్స్ (antimicrobials) సూచించబడతాయి. ఔషధం/మందు యొక్క రకం సంక్రమణకు కారణమైన జీవిపై ఆధారపడి ఉంటుంది.
 • తీవ్రమైన బలహీనతతో పాటు శరీరం నుండి ద్రవాల నష్టం కూడా ఉంటే, ద్రవం యొక్క భర్తీ సూచించబడుతుంది.
 • సంక్రమణ ఉన్న వ్యక్తులకు మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి మరియు శుభ్రమైన పరిసరాలలో సరిగా వండిన ఆహారాన్ని తీసుకోవటానికి సలహా ఇస్తారు.వనరులు

 1. Norman FF et al. Parasitic infections in travelers and immigrants: part I protozoa. Future Microbiol. 2015;10(1):69-86. PMID: 25598338
 2. Cambridge University Press [Internet]; United Kingdom. Parasitic infections in relation to practices and knowledge in a rural village in Northern Thailand with emphasis on fish-borne trematode infection.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Parasitic Diseases.
 4. Varki A et al. Parasitic Infections. Essentials of Glycobiology. 2nd edition. Cold Spring Harbor (NY): Cold Spring Harbor Laboratory Press; 2009. Chapter 40.
 5. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Parasitic Infections of the Gastrointestinal Tract.

పరాన్నజీవుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పరాన్నజీవుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) కొరకు మందులు

Medicines listed below are available for పరాన్నజీవుల సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.