పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి - PAD (Peripheral artery disease) in Telugu

Dr. Ayush PandeyMBBS

December 16, 2020

December 16, 2020

ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు
పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి
सुनिए ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి అంటే ఏమిటి?

పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి (PVD) అనేది శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో కొవ్వులు పేరుకుపోవడంవల్ల రక్తనాళాల లోపలి ద్వారాలు (రక్తప్రసరణకు  అవరోధమేర్పడుతూ) ఇరుకైపోతాయి. ఈ వ్యాధి వల్ల కాళ్ళు మరియు పొత్తికడుపు యొక్క ధమనులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ రుగ్మతకు వెంటనే చికిత్స చేయకపోతే ఇది గుండెపోటు లేదా హృదయాఘాతానికి స్ట్రోక్) దారితీసి ప్రాణాంతకమవుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చాలా తరచుగా లక్షణాలు కనిపించవు. కానీ కొన్ని సందర్భాల్లో క్రింది లక్షణాలను అనుభవించవచ్చు:

 • కాళ్ళలో తిమ్మిరి మరియు నొప్పి
 • కాళ్ల గాయాలు మానడంలో గమనించదగ్గ జాప్యం లేదా కొన్నిసార్లు గాయాలు మానకుండానే ఉండే పరిస్థితి
 • పాలిపోయిన లేదా నీలి రంగులోకి మారిన చర్మం
 • తగ్గిన కాలి బొటనవేలి గోరు పెరుగుదల
 • కాళ్ళపై తగ్గిన జుట్టు పెరుగుదల
 • రెండు కాళ్ళ ఉష్ణోగ్రతలో తేడా
 • అంగస్తంభన లోపం 

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

రక్తనాళాల్లో కొవ్వులు (కొలెస్ట్రాల్) పేరుకుపోవడానికి కారణమయ్యే పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి (PVD) కి ముఖ్య కారణం రక్తనాళాలు గట్టిపడడమే (ఎథెరోస్క్లెరోసిస్). PVDకి దారితీసే ఇతర కారకాలు:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు  మరియు దీనికి చికిత్స ఏమిటి?

పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి నిర్ధారణ క్రింది విధంగా ఉంటుంది:

 • ప్రాథమిక పరీక్షలు
 • వివరణాత్మక వైద్య చరిత్ర అధ్యయనం
 • శారీరక పరీక్ష, ఉదా., చీలమండ బ్రాచీ ఇండెక్స్
 • మరిన్ని పరీక్షలు: మడమ-చిట్కా ట్రెడ్మిల్ వ్యాయామం పరీక్షలు
 • అయస్కాంత ప్రతిధ్వని యాంజియోగ్రఫీ
 • కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఆంజియోగ్రఫీ
 • పరిధీయ ఆంజియోగ్రామ్
 • డాప్లర్ అల్ట్రాసౌండ్

చికిత్స జీవనశైలి మార్పులు, మందులు లేదా రెండూ కలిపి కూడా ఉంటుంది. మందులు పని చేయని స్థితికి వ్యాధి ముదిరితే శస్త్రచికిత్సను సూచించవచ్చు.

జీవనశైలి మార్పులు:

 • ధూమపానాన్ని విడిచిపెట్టడం
 • క్రమం తప్పకుండా వ్యాయామం
 • ఒత్తిడి నిర్వహణ
 • మనస్సును సాధన చేయడం
 • డయాబెటిస్ మేనేజ్మెంట్
 • రక్తపోటు నిర్వహణ

సూచించిన మందులు:

 • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే మందులు
 • రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడానికి యాంటీప్లేట్లెట్స్ (Antiplatelets)
 • అధిక రక్తపోటును నిర్వహించడానికి మందులు

పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి చికిత్సకున్న శస్త్రచికిత్స పద్ధతులు:

 • అథెరెక్టోమీ - ఫలకాల్ని లేదా గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడం
 • బైపాస్ - ఒక ఆరోగ్యకరమైన రక్తనాళాన్ని అంటుకట్టుట ద్వారా రక్తం సరఫరా కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గం సృష్టించడం
 • బెలూన్ యాంజియోప్లాస్టీపెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి వైద్యులు

Dr. Peeyush Jain Dr. Peeyush Jain Cardiology
34 वर्षों का अनुभव
Dr. Dinesh Kumar Mittal Dr. Dinesh Kumar Mittal Cardiology
15 वर्षों का अनुभव
Dr. Vinod Somani Dr. Vinod Somani Cardiology
27 वर्षों का अनुभव
Dr. Vinayak Aggarwal Dr. Vinayak Aggarwal Cardiology
27 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు