రెబ్డోమియోసర్కోమా - Rhabdomyosarcoma in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 24, 2018

March 06, 2020

రెబ్డోమియోసర్కోమా
రెబ్డోమియోసర్కోమా

రెబ్డోమయోసార్కోమా అంటే ఏమిటి?

రెబ్డోమయోసర్కోమా (RMS) అనేది కండరాల కణాల యొక్క ప్రారంభ రూపాల క్యాన్సర్.  సాధారణంగా శరీర భాగాల కదలికలను నియంత్రించే అస్థిపంజరానికి (స్వచ్ఛంద) సంబంధించిన రేఖా కండరాలను బాధించే ఓ కంతి క్యాన్సర్ ఇది. ఈ కంతి క్యాన్సర్ శరీరంలో ఎక్కడైనా (అస్థిపంజర కండరాలు లేని భాగాల్లో కూడా) గుర్తించబడుతున్నప్పటికీ ఇది ప్రధానంగా తల మరియు మెడ ప్రాంతం, మూత్ర అవయవాలు మరియు జననేంద్రియాలు, చేతులు మరియు కాళ్ళు మరియు మొండెం భాగాల్లో సంభవిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రెబ్డోమయోసర్కోమా (RMS) యొక్క సంకేతాలు మరియు లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి మరియు దాని పరిమాణం, విస్తృతి మరియు స్థానం ఆధారంగా ఈ వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు ఉంటాయి. కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

రెబ్డోమయోసర్కోమా యొక్క ప్రధాన కారణం తెలియకపోయినా, ఇది జన్యు పరివర్తనాల (మ్యుటేషన్ల)తో సంబంధం కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు ఏవైనా గడ్డల తనిఖీ కోసం సంపూర్ణ భౌతిక పరీక్ష చేసింతర్వాత పూర్తిస్థాయి వ్యాధి లక్షణాల చరిత్రను వ్యక్తి నుండి తెలుసుకుంటాడు. ఇంకా, వైద్యుడు ఈ క్రింది పరీక్షలను చేయించమని సలహా చేయవచ్చు:

  • వీటిలో రక్త పరీక్షలు ఉన్నాయి:
    • సంపూర్ణ రక్త గణన (CBC)
    • బ్లడ్ కెమిస్ట్రీ
  • కణితి ఉన్నట్లయితే దాని యొక్క పరిధిని కనుగొని చికిత్స ప్రభావాన్ని పర్యవేక్షించడానికి ఇమేజింగ్ పరీక్షలు. ఈ పరీక్షలు:
  • ఎక్స్-రే 
  • అల్ట్రాసౌండ్
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
  • మాగ్నెటిక్ రెసోనాన్స్ ఇమేజింగ్ (MRI)
  • ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ (EUS)
  • PET (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్
  • వివిధ రకాలైన జీవాణుపరీక్షలను కలిగి ఉన్న హిస్టోపాథాలజీ:
    • కోర్ సూది బయాప్సీ
    • ఫైన్ నీడిల్ (సూది) యాస్పిరేషన్ (FNA) జీవాణుపరీక్ష
    • ఎముక మజ్జ ఆస్పిరేషన్ మరియు బయాప్సీ
  • నడుము పంక్చర్ (వెన్నెముక ట్యాప్) పరీక్ష

రెబ్డోమయోసర్కోమా చికిత్స కణితి యొక్క పరిమాణం మరియు స్థానం మరియు వ్యక్తి వయస్సు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వివిధ చికిత్స పద్ధతులు:

  • వివిధ చికిత్సా ఏజెంటులను ఉపయోగించి కెమోథెరపీ.
  • కణితి లేదా బాధిత భాగాన్ని తొలగించే శస్త్రచికిత్స.
  • రేడియోథెరపీ లేదా ప్రోటాన్ బీమ్ థెరపీ.



వనరులు

  1. American Cancer Society [Internet] Atlanta, Georgia, U.S; What Is Rhabdomyosarcoma?
  2. Kaseb H, Babiker HM. Cancer, Rhabdomyosarcoma. [Updated 2019 Mar 21]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  3. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Childhood Rhabdomyosarcoma Treatment (PDQ®)–Patient Version.
  4. Shern JF, Yohe ME, Khan J. Pediatric Rhabdomyosarcoma. Crit Rev Oncog. 2015;20(3-4):227-43. PMID: 26349418
  5. American Cancer Society [Internet] Atlanta, Georgia, U.S; About Rhabdomyosarcoma.