గాయం వలన కలిగిన మచ్చలు - Scars in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 05, 2019

March 06, 2020

గాయం వలన కలిగిన మచ్చలు
గాయం వలన కలిగిన మచ్చలు

గాయం వలన కలిగిన మచ్చలు అంటే ఏమిటి?

గాయాలు నయం అయ్యిన తర్వాత చర్మంపై కనిపించే శాశ్వత మచ్చలను గాయం వలన కలిగిన మచ్చలు అని అంటారు. చర్మం తెగినప్పుడు కానీ, గోకినప్పుడు లేదా చర్మం కాలినప్పుడు, ఆ గాయాలు మానిన తర్వాత మచ్చలు ఏర్పడతాయి; అవే కాక పొంగు చూపడం/అమ్మవారు (చికెన్ పాక్స్) మరియు మోటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గిన/మానిన తర్వాత కూడా మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు గులాబీ రంగులో లేదా ఎర్రటి రంగులో ఉంటాయి మరియు చర్మం పై స్పష్టంగా కనిపిస్తాయి మరియు సాధారణంగా చర్మంపై కొద్దిగా పైకి ఉబికి ఉంటాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రకం, గాయం ప్రభావం, మరియు గాయాలు యొక్క తీవ్రత పై ఆధారపడి, ఈ మచ్చలు వివిధ ఆకారాలు, పరిమాణాలు మరియు రూపాన్ని కలిగి ఉంటాయి.

  • హైపర్ ట్రోఫిక్ మచ్చలు (Hypertrophic Scars)
    • చర్మం మీద ఉబ్బినట్టు ఉంటాయి
    • ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి
    • గాయానికి చుట్టూ లేదా దగ్గరలోనే ఉంటాయి
  • కెలాయిడ్లు (Keloids)
    • చర్మం మీద ఉబ్బినట్టు ఉంటాయి
    • ముదురు గోధుమ రంగులో ఉంటాయి
    • సాధారణ చర్మంపై కూడా విస్తరిస్తాయి/వ్యాపిస్తాయి
  • మొటిమల మచ్చలు (Acne Scars)
    • తీవ్రమైన మోటిమలు ఏర్పడిన తర్వాత మచ్చలు అలాగే ఉండిపోతాయి
  • ముడుచుకుపోయిన మచ్చలు (Contracture Scars)
    • కాలిన గాయాలు నయం అయ్యిన తర్వాత ఇవి ఏర్పడతాయి
    • చర్మం గట్టిగా మారి మరియు ముడుచుకుపోతుంది
    • ప్రభావిత  భాగం మీద కదిలికలు తగ్గిపోతాయి మరియు కండరాలు మరియు నరాలను కూడా ప్రభావితంచేయవచ్చు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఏదైనా గాయం అయినప్పుడు, చర్మం మరియు కణజాలం తెగుతుంది, అప్పుడు కొల్లాజెన్ అనే ప్రోటీన్ విడుదలై గాయం జరిగిన స్థానం వద్ద ఎక్కువగా చేరుతుంది/పోగవుతుంది. ఇది గాయాన్ని/పుండుని నయం చేస్తూ, రక్త గడ్డలను బలపరుస్తుంది. ఒకవేళ గాయం పెద్దగా ఉంటే, ఈ కొల్లాజెన్ ఫైబర్స్ యొక్క ఏర్పాటు మరియు నిక్షేపణ (deposition) అనేక రోజులు కొనసాగవచ్చు, మరియు అది మందముగా, పైకి ఉబ్బినట్టు, ఎరుపు రంగులో, ఒక గడ్డలా కనిపిస్తుంది.

ఈ మచ్చలకు ఎటువంటి ప్రత్యేకమైన కారణాలు లేవు, అయితే అవి పెద్ద గాయాలు, తెగిన గాయాలు, కాలిన గాయాలు, కొన్నిసార్లు శస్త్రచికిత్సల తర్వాత ఏర్పడతాయి. ముసలివాళ్ళు లేదా లేత రంగు చర్మం ఉన్న వ్యక్తులలో మచ్చలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

సాధారణంగా, ఖచ్చితమైన ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకోవడం మరియు సరైన వైద్య పరీక్ష రోగ నిర్ధారణకు సహాయం చేస్తాయి. అలాగే అది ఏ రకమైన మచ్చ అని తీసుకోవడానికి కూడా సహాయపడతాయి. అయినప్పటికీ, కొన్నిసార్లు నిర్ధారణను దృవీకరించడానికి చర్మ బయాప్సీని (మచ్చ ఉన్న కణజాలం యొక్క బయాప్సీ) కూడా నిర్వహిస్తారు.

ఈ మచ్చలను పూర్తిగా తొలగించటం కష్టం, కానీ వాటిలో చాలా మచ్చలు కొన్ని సంవత్సరాలలో వాటికవే తగ్గిపోతాయి. కొన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి అవి ముందుగా ఈ మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి లేదా వాటిని (మచ్చలను) తక్కువగా కనిపించేలా చూస్తాయి:

  • మచ్చ మీద సిలికాన్ జెల్లును పూయడం
  • మచ్చల యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి మచ్చ కణజాలం మీద మరియు దాని చుట్టూ స్టెరాయిడ్లను ఇంజెక్ట్ చెయ్యడం (ఎక్కించడం)
  • శస్త్రచికిత్స చేసి, మచ్చ కణజాలాన్ని తొలగించడం లేదా చర్మాన్ని అంటుకట్టడం (skin grafting) వంటివి చేయవచ్చు
  • లేజర్ థెరపీ (వాస్క్యులార్ లేజర్) ను నిర్వహించి మచ్చలను సరిచేయడం మరియు కొన్నిసార్లు వాటిని తొలగించడానికి అబలేటివ్ లేజర్ థెరపీను నిర్వహించడం.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Scars.
  2. Moetaz El-Domyati et al. Microneedling Therapy for Atrophic Acne Scars An Objective Evaluation . J Clin Aesthet Dermatol. 2015 Jul; 8(7): 36–42. PMID: 26203319
  3. American Academy of Dermatology. Rosemont (IL), US; Scars
  4. A Bayat et al. Skin scarring . BMJ. 2003 Jan 11; 326(7380): 88–92. PMID: 12521975
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Scars

గాయం వలన కలిగిన మచ్చలు వైద్యులు

Dr Shishpal Singh Dr Shishpal Singh Dermatology
5 Years of Experience
Dr. Sarish Kaur Walia Dr. Sarish Kaur Walia Dermatology
3 Years of Experience
Dr. Rashmi Aderao Dr. Rashmi Aderao Dermatology
13 Years of Experience
Dr. Moin Ahmad Siddiqui Dr. Moin Ahmad Siddiqui Dermatology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గాయం వలన కలిగిన మచ్చలు కొరకు మందులు

Medicines listed below are available for గాయం వలన కలిగిన మచ్చలు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.