షార్ట్ బౌల్ సిండ్రోమ్ - Short Bowel Syndrome in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

April 10, 2019

March 06, 2020

షార్ట్ బౌల్ సిండ్రోమ్
షార్ట్ బౌల్ సిండ్రోమ్

షార్ట్ బౌల్ సిండ్రోమ్ (చిన్న ప్రేగు రుగ్మత) అంటే ఏమిటి?

చిన్న పేగు  రుగ్మత అనేది ఓ అరుదైన వ్యాధి. ఈ పేగు రుగ్మతలో చిన్న ప్రేగులు పోషకాలను సరిగ్గా గ్రహించి శోషించుకోవడంలో విఫలమవుతాయి.  ఈ రుగ్మత తరచూ ఓ తీవ్రమైన వ్యాధి కారణంగా సంభవిస్తుంది లేదా చిన్న ప్రేగులో కొంత భాగం లేదా మొత్తం తొలగించడంవల్ల వస్తుంది. పెద్ద ప్రేగు పనిచేయక పోవడాన్ని కూడా  కొన్నిసార్లు “చిన్నపేగు రుగ్మత గా సూచిస్తారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అత్యంత సాధారణ లక్షణాలు:

ఇతర లక్షణాలు:

  • తిమ్మిరి
  • అలసట
  • బలహీనత
  • ఉబ్బరం
  • గుండెల్లో మంట (heartburn)
  • పేలవమైన మలం (pale stools)
  • పిల్లల్లో పెరుగుదల మరియు అభివృద్ధి కుంటుపడడం
  • ఐరన్ మరియు జింక్ లోపం

విటమిన్ లోపంతో సంబంధం కలిగి ఉన్న వ్యాధి లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సాధారణ కారణాలు:

  • శస్త్రచికిత్స ద్వారా చిన్న ప్రేగులలో కొంత భాగాన్ని లేదా చిన్నపేగులు మొత్తాన్ని తొలగించిన సందర్భంలో: ఈ శస్త్రచికిత్స కణాంతర శోధము (నెక్రోటైసింగ్ ఎంట్రోకోలిటిస్), క్రోన్'స్ వ్యాధి, ప్రేగు మరియు క్యాన్సర్ యొక్క వైకల్యం
  • చిన్న పేగు వైఫల్యం

ఇతర కారణాలు:

  • అఘాతం కారణంగా ప్రేగు గాయం
  • హిర్ష్స్ప్రాంగ్స్ వ్యాధి (Hirschsprung’s disease)
  • రేడియేషన్ ఎంటెరిటీస్
  • తగినంత రక్తప్రవాహం లేని కారణంగా ప్రేగులకు నష్టం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

చిన్నపేగు రుగ్మత నిర్ధారణలో వ్యక్తి వైద్య చరిత్ర, పరీక్షలు మరియు పరిశోధనలు సహాయపడతాయి.

ఇందుకు వైద్య పరిశోధనలు ఇలా ఉంటాయి:

  • రక్త పరీక్షలు: ఖనిజ మరియు విటమిన్ స్థాయిలు తెలుసుకునేందుకు
  • మలం పరీక్షలు
  • చిన్నపేగు మరియు పెద్ద ప్రేగు రెండిండి X- రే
  • ప్రేగుల సిటి (CT) స్కాన్

చిన్న ప్రేగు సిండ్రోమ్ చికిత్స దెబ్బతిన్న ప్రేగు మరియు వ్యాధి యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

పోషకాహార లోపాలను అధిగమించడానికి మీ డాక్టర్ నోటి రీహైడ్రేషన్ (oral rehydration) అలాగే విటమిన్ మరియు ఖనిజ అనుబంధకాహార పదార్ధాల గురించి సలహా ఇస్తారు.

వేగంగా చేతరించుకునేందుకు ఇంట్రావీనస్ ద్రవాలు నిర్వహించబడవచ్చు.

కొన్ని సందర్భాల్లో, ముక్కు లేదా నోటి ద్వారా ప్రవేశించే ట్యూబ్ ద్వారా నేరుగా కడుపులోకి ‘ఎంటరల్ ఫీడింగ్’ అవసరం కావచ్చు. రోగికి తక్కువ-తక్కువ ప్రమాణాల్లో తరచుగా ఆహారాన్ని తినబెట్టాలి.

ఈ రుగ్మత చికిత్సలో శస్త్రచికిత్స కీలక పాత్ర పోషిస్తుంది మరియు తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరమవుతుంది.

చక్కెర, ప్రోటీన్ (మాంసకృత్తులు) మరియు కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను నివారించండి.



వనరులు

  1. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. [Internet]. U.S. Department of Health & Human Services; Short Bowel Syndrome.
  2. National Organization for Rare Disorders [Internet]; Short Bowel Syndrome.
  3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Short Bowel Syndrome.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Short bowel syndrome.
  5. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Mechanisms of Adaptation in Human Short Bowel Syndrome.