శ్వాస అందకపోవుట - Shortness of Breath in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 19, 2018

March 06, 2020

శ్వాస అందకపోవుట
శ్వాస అందకపోవుట

సారాంశం

వైద్యరంగంలో డిస్ప్నియా పేరుతో పేర్కొనబడుతున్న ఆయాసం లేదా ప్రయాసతో శ్వాస తీసుకొనే ప్రక్రియ సాధారణమైన ఆరోగ్య సమస్య. ఒక వ్యక్తి అనుభవించే లేదా అనుభూతి చెందే శ్వాస ఇబ్బందిని ఇది వ్యక్తం చేస్తుంది. కొన్ని అనుభవాలకు ఒక  వ్యక్తి యొక్క ఉద్వేగం దశ ప్రభావకారిగా ఉంటుంది. శ్వాసక్రియ ఇబ్బందికి దోహదం చేసే పెక్కు కారణాలు ఉన్నందున ఖచ్చితమైన కారణం కనుగొనేందుకు నిర్ధారణ పరీక్ష జరుపుతారు. జబ్బు నిర్ధరణ ప్రక్రియలో వస్తున్న మార్పులు, ప్రగతి ఫలప్రదమైన నిర్వహణకు విమర్శనాత్మకంగా పరిణమిస్తుంది. కొన్ని సందర్భాలలో ఒకటి కంటేహెచ్చు కారణాలు ఎదురైనప్పుడు ఆయాసానికి, ఇబ్బందితో శ్వాస తీసుకోవదనికి గల కారణాన్ని నిర్ధారించడం చాలా కష్టంగా పరిణమిస్తుంది. ఊపిరి తీసుకోవడానికి కష్టమైనప్పుడు దానికి ఎదురయ్యే కారణాలు గుండెజబ్బు, న్యుమోనియా, హార్ట్ ఫెయిల్యూర్,  తీవ్రమైన గుండెజబ్బు. అనీమియా, ఊబకాయం మరియు మానసిక రుగ్మతలు వంటివని చెబుతారు

శ్వాస అందకపోవుట అంటే ఏమిటి? - What is Shortness of Breath in Telugu

శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే ఆయాసం లేదా డిస్ప్నియా సర్వసాధారణంగా సుమారు  25 శాతం మందిలో ఉంటుంది. ఎమర్జన్సీ చెక్-అప్ కు ఇది దారితీస్తుంది తద్వార వైద్య చికిత్స పొందడానికి వీలుకల్పిస్తుంది. ఎదురవుతున్న పెక్కు కారణాల వల్ల ఆయాసం కనిపిస్తుంది . కొన్ని సందర్భాలలో ఈ జబ్బు ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఆయాసానికి చికిత్స పొందదానికి ఖచ్చితంగా ఆస్పత్రులను సందర్శించే వ్యక్తుల వివరాలు కొద్దిగా లభిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా వ్యాయామం తర్వాత , ఎక్కువ ఎత్తు పైకి ఎక్కే  సందర్భంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండవచ్చు. విభిన్నమైన ఉష్ణోగ్రతలలో లేదా ఊబకాయం వల్ల కూడా ఆయాసం ఎర్పడుతుంది. ఇతర కారణాల వల్ల ఆయాసం ఎదురైతే  సాధారణ వైద్యుని లేదా నిపుణుని సలహా తీసుకోవడం అవసరం. డిస్పియా

డిస్ప్నియా ( శ్వాసక్రియకు అంతరాయం ) అంటే ఏమిటి?

అమెరికా తొరాసిక్ సొసైటీ ప్రకారం డిస్ప్నియా అంటే శ్వాస సందర్భంగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదా అసౌకర్యంగా అనుభూతి చెందడం, వివిధ తీవ్రలకు గురికావడం. డిస్ప్నియాను ‘షార్ట్ నెస్ ఆఫ్ బ్రీత్ ‘ అని పేర్కొంటారు. ఈ జబ్బు వివిధ కారణాల వల్ల ఎదురవుతుంది. ఊపిరి తీసుకోవడం, అంటే బ్రాంకియల్ ఆస్త్మా నుండి శ్వాసక్రియలోపం వరకు ఉంటాయి.  డయాబెటిక్ కేటోఆసిడోసిస్  కూడా ఒక కారణం కావచ్చు. ఆస్త్మా అటాక్ సందర్భంగా ఒక వ్యక్తి లేదా ఊపిరి తీసుకోవడంలో వైఫల్యం కూడా డిస్ప్నియాకు దారితీయవచ్చు. డిస్ప్నియాకు ఖచ్చితమైన కారణం నిర్ధారించడానికి కొంత ఎక్కువ వ్యవధి పట్టవచ్చు. విధానం కూడా శ్రమతో కూడినది. వివిధ అవయవాల పరీక్ష అవసరమయినపుడు ఇట్టి శ్రమ ఎదురవుతుంది.

Cough Relief
₹719  ₹799  10% OFF
BUY NOW

శ్వాస అందకపోవుట యొక్క లక్షణాలు - Symptoms of Shortness of Breath in Telugu

డిస్ప్నియా లక్షణాలలో  ఉన్నపళంగా ( తీవ్రమైనట్టి) జబ్బు రావడం లేదా క్రమేపీ నొప్పి పెరగడం ( దీర్ఘకాలిక) వంటివి ఉంటవి. తీవ్రమైన శ్వాసక్రియకు ఇబ్బంది  కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకు ఉంటుంది. అది ఇతర లక్షణాలైన దగ్గు, జ్వరం, ఎద నొప్పి వంటివాటితో కూడి ఉంటుంది.  దీర్ఘకాలిక జబ్బు క్రింద  రొగి దైనందిన పనులైన ఒక గది నుండి మరొక గదికి నడిచి వెళ్లేటప్పుడు,  కూర్చొన్న దశ నుండి లేచి నిలుచున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం కొన్ని సందర్భాలలో వేగంగా ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. లేదా శరీరం స్థితి మారేటప్పుడు శ్వాసక్రియకు ఇబ్బంది ఏర్పడుతుంది.  ఇతర లక్షణాలు ఇలా ఉంటాయి :

  • శ్వాసకు ఇబ్బంది పడటం
  • ఎదలో గట్టితనం అనుభూతి
  • హెచ్చుగా ఊపిరి తీసుకోవాలనే కోరిక
  • దీర్ఘంగా ఊపిరి తీసుకోవడానికి వీలుకాకపోవడం
  • శ్వాసక్రియ శబ్దంతో కూడి ఉండటం
  • వేగంగా మరియు నిస్సారవంతమైన శ్వాసక్రియలు
  • శ్వాసలో గురక
  • చర్మం లేదరంగుతో, శీతలంగా లేదా తేమతో కూడి ఉండటం
  • శ్వాస క్రియకు మెడ మరియు ఎద పైభాగంలోని కండరాలను ఉపయోగించడం
  • ఆందోళన లేదా భయానక దాడులు

శ్వాస అందకపోవుట యొక్క చికిత్స - Treatment of Shortness of Breath in Telugu

డిస్ప్నియాకు గల కారణాలను అనుసరించి చికిత్స జరుగుతుంది.. కొన్ని సందర్భాలలో  ఎదురైన కారణానికి పూర్తి చికిత్స జరుగుతుంది. అయితే శ్వాసక్రియకు ఇబ్బంది లక్షణాలు పూర్తిగా నయం కాదు. కొన్ని ఔషధాలు  ఉత్తరోత్తరా ఎదురయ్యే దుష్ఫలితాలు (సైడ్ ఎఫెక్ట్స్)  కలిగి ఉంటాయి. ఈ కారణంగా  జబ్బుకు చికిత్స గురిమ్చి దాక్తరుతో సంప్రతించడం ఉత్తమం.  చికిత్స విధానాలలో ఇవి చేరి ఉంటాయి

  • నెబ్యులైజెషన్, ఇన్ హేలర్లు మరియు ఆక్సిజన్ థెరపీ:
    బ్రాంకోడైలేటర్ ఏరోసొల్ ను తయారు చేసే ఒక పరికరాన్ని ఉపయోగంలో ఉంచుతారు ఇంటిలో ఉపయోగించేనెబ్యులైజర్ కిట్లు లభిస్తున్నాయి. వాటిని దాక్తరు సూచన మేరకు ఉపయోగించాలి. ఆక్సిజన్ ఆస్పత్రిలో గానీ, ఇంటిలో గాని సిలిండర్ ద్వారా పొందుపరచుకొనవచ్చు. ఇది శ్వాసక్రియను సులభ పరుస్తుంది. తీవ్రమైన ఆస్త్మా సోకినప్పుడు , మందులతో కూడిన ఇన్ హేలర్ వాడటం మంచిది. ఈ ప్రక్రియ ఊపిరి మార్గాన్ని తెరచిశ్వాసక్రియ లోపాన్ని వెంటనే చక్కబరుస్తుంది.
  • మందులు
    దగ్గుకు, ఎదనొప్పికి కారకమైన ఇన్ఫెక్షన్లకు చికిత్సకై ఆంటీబయాటిక్స్ సూచిస్తారు. కఫాన్ని తొలగించే ఔషధాలు శ్లేష్మాన్ని నివారించడంలో పనిచేస్తాయి. ఓపియం ఆధ్హరితమైన కొన్ని బాధానివారిణులు శ్వాసక్రియను సరిపరుస్తాయి. అవి శ్వాస రేటును తగ్గించి నిద్రకు ఉపక్రమిస్తాయి. కొన్ని ఔషధాలు స్రావాలను తగ్గిస్తాయి మరియు శ్వాసమార్గాన్ని సుగమం చేస్తాయి. అయితే అన్ని మమ్దులను దాక్తరు సలహా మేరకు మాత్రమే తీసుకోవాలనె విషయాన్ని పాటించాలి.
  • ద్రవాలను తొలగించడం
    ప్ల్యూరల్ మరియు పెరికార్డియల్ ఎఫ్లూషన్ల స్థితిగతులలో  పేరుకుపోయిన ద్రవాన్ని తొలగించాలి. ఇది శ్వాసను సులభం చేస్తుంది.
  • రేడియో థెరపీ
    శ్వాస మార్గంలో ఎదయినా గడ్డ ఉంటే అది డిస్ప్నియాకు కారకమవుతుంది. రేడియోథెరపీ  శ్వాసకు అడ్డుపడే పదార్థం స్థాయిని తగ్గిస్తుంది..
  • లేజర్
    బాగా ముదిరిన ఊపిరితిత్తుల కేన్సర్ విషయంలో  తరచుగా లేజర్ శస్త్ర చికిత్స సిఫార్సు చేస్తారు. ఈ ప్రక్రియ  శ్వాసకు అడ్దుపడే పదార్థాన్ని తొలగిస్తుంది..

జీవన సరళి నిర్వహణ

శ్వాసక్రియకు ఇబ్బంది పడే వ్యక్తులు వారి ఆరోగ్య పరిరక్షణకై క్రింది చర్యలను తీసుకొనవచ్చు :

  • పొగత్రాగడం వదలివేయండి
    పొగత్రాగడం మానివేయడం వల్ల  ఊపిరితిత్తుల మరియు గుండెజబ్బుల, కేన్సర్ ఒడిదుడుకులను చాలావరకు తగ్గించవచ్చు. ధూమపాన వ్యసనాన్ని తొలగించే క్లినిక్కులను సందర్శించండి. ఇవి పొగత్రాగడాన్ని తగ్గించడనికి సహకరిస్తాయి. నికోటిన్ గమ్స్, ప్యాచెస్ వాదకం కూడా ఈ వ్యసనాన్ని దూరం చేస్తాయి.
  • హానికరమైన కాలుష్యాలకు దూరంగా ఉండండి
    శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే  ఏ దుష్ప్రభానికైనా దూరంగా ఉండటం మంచిది. కాలుష్యాల కాలంలో కాలుష్యం వాటిల్లకుండా, సోకకుండా జాగ్రత్త పడండి. లేదా అలర్జీ కలిగించేవాటికి, వాయువులకు, విషపూరితమైనవాటికి, పర్యావరణ విషపూరితాలకు, డిస్ప్నియాకు దోహదం చేసేవాటికి దూరంగా ఉండండి.
  • బరువు తగ్గడం
    ఊబకాయం కూడా  శ్వాసక్రియ చక్కగా జరగదానికి ఆటంకం కలిగిస్తుంది. ఏమాత్రం అలసట కలిగినా  ఒక వ్యక్తికి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది .హైపోథైరాయిడిజం  వంటి వైద్య స్థితిగతులు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. తద్వారా డిస్ప్నియా కు వీలు కలుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం  బరుబు సమతుల్యతకు వీలు కల్పిస్తుంది మరియు శ్వాసక్రియ సులభం చేస్తుంది.
  • ఎత్తయిన ప్రదేశాలలో అలసట చెందకుండా చర్యలు తీసుకోండి
    5000 అడుగుల కంటె ఎక్కువ ఎత్తు గల ప్రదేశాలలో వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది.  దీనితో సాధారణ వ్యక్తులు శ్వాసక్రియ బలవంతంగా జరపవలసి వస్తుంది. అట్టి ఎత్తయిన ప్రాంతాలకు ట్రిప్పులకు వెళ్ళడం మానుకోవాలని సిఫార్సు చేయబడింది..
  • అదనపు ఆక్సిజన్
    ఒక వ్యక్తి క్రమం తప్పకుండా అదనపు ఆక్సిజన్ పై ఆధారపడినప్పుడు, అవసరమైనప్పుడు ఖాళీ సిలిండరును మార్చి ఆక్సిజన్ నింపిన సిలిండరును సిద్ధంగా ఉంచుకోవాలి. అది చక్కగా పనిచేసే స్థితిలో ఉందాలి.
Eucalyptus Oil
₹395  ₹439  10% OFF
BUY NOW


వనరులు

  1. Dominik Berliner, Nils Schneider,Tobias Welte, Johann Bauersachs. [link]. Dtsch Arztebl Int. 2016 Dec; 113(49): 834–845. PMID: 28098068
  2. Mukerji V. Dyspnea, Orthopnea, and Paroxysmal Nocturnal Dyspnea. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 11.
  3. Am Fam Physician. 2012 Jul 15;86(2):173-180. [Internet] American Academy of Family Physicians; Causes and Evaluation of Chronic Dyspnea.
  4. Berliner D, Schneider N, Welte T, Bauersachs J. The differential diagnosis of dyspnea. Deutsches Ärzteblatt International. 2016 Dec;113(49):834. PMID: 28098068
  5. Merck Manual Professional Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Dyspnea
  6. Abernethy AP, Currow DC, Frith P, Fazekas BS, McHugh A, Bui C. Randomised, double blind, placebo controlled crossover trial of sustained release morphine for the management of refractory dyspnoea. . Bmj. 2003 Sep 4;327(7414):523-8. PMID: 12958109

శ్వాస అందకపోవుట కొరకు మందులు

Medicines listed below are available for శ్వాస అందకపోవుట. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for శ్వాస అందకపోవుట

Number of tests are available for శ్వాస అందకపోవుట. We have listed commonly prescribed tests below: