myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

గురక అంటే ఏమిటి?

నిద్రిస్తున్న సమయంలో గాలి (ఊపిరి) యొక్క అనుకూల కదలికలకు అడ్డంకి ఏర్పడినప్పుడు గురక సంభవిస్తుంది. తరచుగా గురక పెట్టేవారికి వారి యొక్క గొంతు/కంఠం మరియు నాసికా కణజాలం పెద్దగా/అధికంగా ఉంటుంది, అది కంపించి (vibrate) ప్రత్యేకమైన గురక శబ్దానికి దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గురక వలన నిద్ర లేమి లేదా తగ్గడం, పగటి వేళా మత్తుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం మరియు లైంగిక కోరిక తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మానసిక సమస్యల మరియు గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గురక అనేది చాలా సాధారణం మరియు సాధారణంగా అది ఏవిధమైన ఆందోళనకరమైన పరిస్థితులను కలిగించదు. మనం నిద్రిస్తున్నపుడు, మన నాలుక, గొంతు, నోరు, శ్వాస మార్గాలు మరియు ఊపిరితిత్తులు సేదతీరుతాయి మరియు కొంచెం సన్నగా/ఇరుకుగా మారుతాయి. శ్వాసించేటప్పుడు ఈ భాగాలు వైబ్రేట్ (కంపిస్తే) ఐతే, అది గురకకు దారితీస్తుంది. గురక యొక్క కొన్ని సాధారణ కారణాలు:

 • అలెర్జీ లేదా సైనస్ ఇన్ఫెక్షన్.
 • ముక్కు దూలం (nasal septum) పక్కకు ఒరిగిపోవడం లేదా నేసల్ పోలీప్ కారణంగా అవరోధం/అడ్డంకి ఏర్పడడం వంటి ముక్కు వైకల్యాలు.
 • ఊబకాయం.
 • మందమైన నాలుక.
 • గర్భం.
 • జన్యు కారకాలు.
 • మద్యపానం మరియు ధూమపానం.
 • టాన్సిల్స్ మరియు అడినాయిడ్లు విస్తరించడం .
 • కొన్ని రకాల మందులు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఏవైనా గురక యొక్క కారణాలను తనిఖీ చెయ్యడానికి వైద్యులు ముక్కు మరియు నోటిని పరిశీలిస్తారు. వ్యక్తి యొక్క గురక విధానాన్ని గురించి వైద్యులకు తెలియజేయడానికి వ్యక్తి భాగస్వామి ఉత్తమమైన వారు. కారణం స్పష్టంగా తెలియనట్లయితే వైద్యులు నిపుణుడిని సూచించవచ్చు. వైద్యులు ఇంటిలో నిద్ర పరీక్షను (in-home sleep test) లేదా తీవ్ర కేసులలో లాబ్ లో నిద్ర పరీక్ష (in-lab sleep test) ను ఆదేశించవచ్చు.

నిద్ర అధ్యయనం (sleep study) లో, సెన్సార్లు శరీరంలోని వివిధ భాగాలలో పెడతారు అవి మెదడు, హృదయ స్పందన మరియు వ్యక్తి యొక్క శ్వాస నమూనా నుండి సంకేతాలను రికార్డు చేస్తాయి. సాధారణంగా పాలీసోమ్నోగ్రఫీ (polysomnography) అని పిలువబడే ఇంటిలో నిద్ర పరీక్ష సహాయంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా గుర్తించబడుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కాకుండా ఇతర నిద్ర రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్) స్టడీ సెంటర్లో (అధ్యయన కేంద్రంలో) ఇన్-లాబ్ నిద్ర అధ్యయనం ద్వారా నిర్దారించబడతాయి.

నిద్ర అధ్యయనాలు కారణాన్ని నిర్దారించలేకపొతే, గురక యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి చెస్ట్ ఎక్స్-రే, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్ వంటి ఇతర పరీక్షలు నిర్వహించవచ్చు.

ఒకే నిర్దిష్టమైన చికిత్స ద్వారా గురకను పూర్తిగా తాగించలేరు కాని కొన్ని చికిత్సలు అడ్డంకులని తొలగించటం ద్వారా శ్వాసలోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

నిద్రపోయే ముందు సెడేటివ్ మందుల ఉపయోగాన్ని నివారించడం, ధూమపానం మరియు మద్యపానం విడిచిపెట్టడం వంటి జీవనశైలి మార్పులు. నేసల్ స్ప్రేలు, స్ట్రిప్లు (strips)  లేదా క్లిప్లు (clips), ఓరల్ ఉపకరణాలు (oral appliances), యాంటీ- స్నోర్ (anti-snore) దిండ్లు మరియు వస్త్రాల వంటి వాటి వినియోగం అనేది గురకని తగ్గిస్తుంది.

వైద్యులు ఈ కింది సవరణలను సలహా ఇస్తారు:

 • కొంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (CPAP) [నిరంతర సానుకూల వాయు పీడనం]
 • లేజర్-అసిస్టెడ్ యువలోపలటోప్లాస్టీ (LAUP, Laser-assisted uvulopalatoplasty)
 • పలెటల్ ఇంప్లాంట్లు (Palatal implants)
 • సోమ్నోప్లాస్టీ (Somnoplasty) - అధిక కణజాలాలను తీసివేసేందుకు రేడియో తరంగాలను (radiofrequency) తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారు
 • కస్టమ్-ఫిట్టేడ్ డెంటల్ పరికరాలు (Custom-fitted dental devices) లేదా కింది దవడ-పొజిషనర్లు (lower jaw-positioners)
 • యువాలోపలటోఫారింగోప్లాస్టీ (UPPP, uvulopalatopharyngoplasty), థర్మల్ అబ్లేషన్ పాలటోప్లాస్టీ (TAP, thermal ablation palatoplasty), టాన్సిలెక్టోమీ (tonsillectomy) మరియు అడెనోయిడైక్టోమీ (adenoidectomy) వంటి శస్త్రచికిత్సా విధానాలు

వెల్లకిలా పడుకోవడం కాకుండా ఒక పక్కకి పడుకోవడం వలన గురకకు తగ్గించవచ్చు మరియు ఒక యాంటీ స్నోరింగ్ నోటి వస్తువును (anti-snoring mouth appliance) ఉపయోగించవచ్చు.

 1. గురక కొరకు మందులు
 2. గురక వైద్యులు
Dr. Gaurav Chauhan

Dr. Gaurav Chauhan

सामान्य चिकित्सा

Dr. Sushila Kataria

Dr. Sushila Kataria

सामान्य चिकित्सा

Dr. Sanjay Mittal

Dr. Sanjay Mittal

सामान्य चिकित्सा

గురక की जांच का लैब टेस्ट करवाएं

Thyroid Function Test ( T3 - T4 - TSH )

20% छूट + 10% कैशबैक

Lipid Profile

20% छूट + 10% कैशबैक

గురక కొరకు మందులు

గురక के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
ArmodArmod 150 Mg Tablet210
WaklertWaklert 100 Mg Tablet114
ModafilModafil 100 Mg Tablet Md83
ModalertModalert 100 Mg Tablet114
ModatecModatec 100 Mg Tablet48
ProvakeProvake 100 Mg Tablet66
WellmodWellmod 100 Mg Tablet54

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Health Service [Internet]. UK; Snoring.
 2. American Academy of Sleep Medicine [Internet] Illinois, United States Home Sleep Apnea Testing - Overview
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Snoring
 4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Snoring
 5. B Kotecha, J M Shneerson. Treatment options for snoring and sleep apnoea . J R Soc Med. 2003 Jul; 96(7): 343–344. PMID: 12835447
 6. Simranjeet Kaur et al. Snoring: An Annoyance or a Serious Health Problem (Obstructive Sleep Apnea)? Indian J Community Med. 2015 Apr-Jun; 40(2): 143–144. PMID: 25861179
 7. healthdirect Australia. How to stop snoring. Australian government: Department of Health
और पढ़ें ...