జోము (టెటని) - Tetany in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 11, 2019

March 06, 2020

జోము
జోము

జోము (టెటని) అంటే ఏమిటి?

జోము అనేది శరీర కండరాలలో బాధాకరమైన తిమ్మిరికి సంబంధించిన ఓ లక్షణాల సమూహం. ఇది కాల్షియం స్థాయిని తగ్గించే హైపోపరాథైరాయిడిజం వంటి ఎండోక్రైన్ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది. తగ్గిన కాల్షియం స్థాయి జోము పట్టడానికి (టెటనీ)  దారి తీస్తుంది.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

జోము యొక్క ప్రధాన సంబంధిత లక్షణాలు:

జోముకు అనుసంధానించబడిన అదనపు లక్షణాలు:

జోముకు సంబంధించిన అత్యంత తీవ్రమైన లక్షణాలు స్వరపేటిక మరియు శ్వాసనాళాల  (బ్రోంకి) యొక్క కండరాల నొప్పులు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

జోముకు కారణాలు:

  • తగ్గిన కాల్షియం స్థాయిలు (హైపోకాల్సీఏమిటా కెక్కామియా)
  • తగ్గించిన మెగ్నీషియం స్థాయిలు (హైపోమాగ్నేసెమియా)
  • తగ్గించిన పొటాషియం స్థాయిలు (హైపోకలైమియా)
  • శరీరంలో యాసిడ్-బేస్ బ్యాలెన్స్ నష్టం (ఆల్కలాసిస్)

సాధారణంగా, పారాథైరాయిడ్ హార్మోన్ల తగ్గిన స్థాయిలు లేదా పారాథైరాయిడ్ గ్రంథి యొక్క తొలగింపు లేదా పారాథైరాయిడ్ గ్రంథికైన గాయం తగ్గిన కాల్షియం స్థాయిలు మరియు అల్కలాసిస్ జోముకు దారితీసే ప్రధాన కారకాలు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు  మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగనిర్ధారణ సాధారణంగా వ్యక్తి అనుభవించే వ్యాధి లక్షణాలను పరిశోదించడమనేది  ఉంటుంది. సీరం ఎలెక్ట్రోలైట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం స్థాయిలను పరీక్షించడానికి డాక్టర్ రక్త పరీక్షను సిఫారసు చేయవచ్చు మరియు రోగ నిర్ధారణను రూఢి చేసుకుంటారు .

వ్యాధికి ప్రాధమిక కారణం కాల్షియం లోపం అయినందున, దీనికి ఉత్తమ చికిత్స 100 నుంచి 200 mg మోతాదులో మౌళిక కాల్షియం రూపంలో ఇంట్రావీనస్ కాల్షియంను భర్తీ చేయడం ఉంటుంది. మెజారిటీ వైద్యకేసుల్లో, కాల్షియం చికిత్సతో పాటు విటమిన్ D ని శరీరానికి ఇవ్వడమనేదుంటుంది, ఎందుకంటే విటమిన్ D శరీరంలో కాల్షియం శోషణకు అవసరమవుతుంది. మెగ్నీషియం లోపం వల్ల ప్రేరేపించబడే జోము విషయంలో, మెగ్నీషియం భర్తీ అవసరం అవుతుంది. చికిత్స జోము యొక్క అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది.



వనరులు

  1. Ito N, Fukumoto S. Symptoms and management of tetany]. [Article in Japanese] . Clin Calcium. 2007 Aug;17(8):1234-9. PMID: 17660621
  2. National Organization for Rare Disorders [Internet], Hypoparathyroidism
  3. Jacob J, De Buono B, Buchbinder E, Rolla AR. Tetany induced by hypokalemia in the absence of alkalosis. Am J Med Sci. 1986 Apr;291(4):284-5. PMID: 3706394
  4. Gärtner R. [Tetany]. . Internist (Berl). 2003 Oct;44(10):1237-42. PMID: 14689085
  5. Williams A, Liddle D, Abraham V. Tetany: A diagnostic dilemma. J Anaesthesiol Clin Pharmacol. 2011 Jul;27(3):393-4. PMID: 21897517

జోము (టెటని) కొరకు మందులు

Medicines listed below are available for జోము (టెటని). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹956.0

Showing 1 to 0 of 1 entries